Pages

Labels

Popular Posts

Sunday 28 August 2011

వసకొమ్ము,Acorus calamus



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


వస ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం అకోరస్ కెలామస్ (Acorus calamus). ఇది అకోరేసి (Acoraceae) కుటుంబానికి చెందినది. పూర్వం మనదేశంలో అన్ని పల్లెసీమలలో పుట్టిన ప్రతి బిడ్డకు పురిట్లోనే వస కొమ్మును చనుబాలతో అరగదీసి పట్టేవారు. ఇప్పటికీ ఈ సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతునేయున్నది. దీని వలన గొంతులోని కఫం పోవడమే గాక ఉత్తరోత్తరా మాటలు స్పస్టంగా రావడానికి ఉపకరిస్తుందని భావిస్తారు.

ప్రాంతీయ నామములు

* ఇంగ్లీషు : స్వీట్ ఫ్లాగ్ (Sweet fag)
* సంస్కృతం : వచ, ఉగ్రగంధ, షడ్గ్రంధ
* హిందీ : గుడ్ బచ్
* కన్నడం : బజేగిడా
* మళయాళం : బవంబు
* పార్శి : అగరేతుర్కీ
*ల్యాటిన్: అకోరస్ కలమస్.

ఉపయోగపడే భాగం: వస దుంప (రైజోమ్).--వసకొమ్ముతో తయారయ్యే ఔషధాలు--వచాది ఘృతం, వచాది చూర్ణం, సారస్వత చూర్ణం.

ఆధునిక ప్రయోగ ఫలితాలు
* నర్వైన్ టానిక్ (నరాలను శక్తివంతం చేస్తుంది)-* హైపోటెన్సివ్ (రక్తపోటును తగ్గిస్తుంది)-* ట్రాంక్విలైజర్ (నిద్రకు సహాయపడుతుంది)-* సెడెటివ్ (మత్తును కలిగిస్తుంది)-* అనాల్జెసిక్ (నొప్పినితగ్గిస్తుంది)-* స్పాస్మోలైటిక్ (కడుపునొప్పి, బహిష్టునొప్పి వంటి అంతర్గత నొప్పులను తగ్గిస్తుంది)-* యాంటీ కన్వల్సెంట్ (మూర్ఛలను నియంత్రిస్తుంది)-* యాంటీ కెటారల్ (కఫాన్ని పలుచన చేసితగ్గిస్తుంది)-* యాంటీడయేరల్ (అతిసారాన్ని ఆపుతుంది)-* యాంటిడిసెంటిరిక్ (జిగట విరేచనాలను తగ్గిస్తుంది)

ఆయుర్వేద గృహ చికిత్సలు
అతిసారం (నీళ్ల విరేచనాలు) : వస కొమ్ములు, తుంగముస్తల గడ్డలు, పసుపు, శొంఠి కొమ్ములు కచ్చాపచ్చాగా దంచి నీళ్లకు కలిపి మరిగించి కషాయం కాచి తీసుకోవాలి. (చరక సంహిత చికిత్సాస్థానం,అష్టాంగ హృదయం, అష్టాంగ సంగ్రహం చికిత్సాస్థానం)

మూర్ఛలు (ఎపిలెప్సీ) : బ్రాహ్మీ రసం, వస కొమ్ము, చెంగల్వకోష్టు వేరు, శంఖపుష్పి (వేరు, ఆకులు)లను పాత నెయ్యికి కలిపి ఘృతపాకం విధానంలో ఘృతం తయారుచేసి వాడితే ఉన్మాదం, మూర్ఛలు తదితర రుగ్మతలు తగ్గుతాయి. (చరకసంహిత చికిత్సా స్థానం),* వసకొమ్ము పొడిని తేనెతో కలిపి తీసుకుంటే మూర్ఛలు తగ్గుతాయి. దీనితోపాటు వెల్లుల్లి వేసి తయారుచేసిన నువ్వుల నూనెను అనుపానంగా తీసుకుంటే మంచిది. ఈ చికిత్సాకాలంలో పాలను ఆహారంగా తీసుకోవాలి. మూర్ఛవ్యాధి ఎంత మొండిదైనా, దీర్ఘకాలంనుంచి వేధిస్తున్నా దీనితో ఫలితం కనిపిస్తుంది. (చరక సంహిత చికిత్సాస్థానం, వృందమాధవ, వంగసేన సంహిత అపస్మార అధికరణం, సిద్ధ్భేషజమణిమాల)

శరీరపు వాపు : వసకొమ్ముల పొడిని ఆవనూనెతో కలిపి బాహ్యంగా ప్రయోగిస్తే శరీరపు వాపు తగ్గుతుంది.-

ఎసిడిటీ (ఆమ్లపిత్తం) :
వస చూర్ణాన్ని తేనె, బెల్లంతో కలిపి తీసుకుంటే ఆమ్లపిత్తంలో హితకరంగా ఉంటుంది.ఎసిడిటి తగ్గుతుంది,

చర్మవ్యాధులు : వసకొమ్ములు, చెంగల్వకోష్టు వేరు, విడంగాలను మెత్తగా నూరి, నీళ్లు కలిపి ముద్దచేసి బాహ్యంగా ప్రయోగిస్తే చర్మవ్యాధుల్లో హితకరంగా ఉంటుంది. మొటిమలు * వసకొమ్ముల గంధం, లొద్దుగచెక్క గంధం, ధనియాల పొడిని కలిపి ముఖంమీద ప్రయోగిస్తే యవ్వనంలో వచ్చే మొటిమలు తగ్గుతాయి.

తలనొప్పి (అర్ధశిరోవేదన) : పచ్చి వస కొమ్మును దంచి, రసం పిండి పిప్పళ్లు పొడిని గాని ఇప్ప పువ్వుల రసాన్ని గాని కలిపి తేనె కూడా చేర్చి ముక్కులో నస్యం రూపంలో బిందువులుగా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ముఖ్యంగా సూర్యావర్తం, అర్ధావభేదం వంటి తలనొప్పుల్లో ఇది అమితమైన ఫలితాన్ని చూపిస్తుంది.

జుట్టు ఊడటం : వసకొమ్ము, దేవదారు వేరు పట్ట లేదా గురవింద గింజలను ముద్దగా నూరి జుట్టు ఊడినచోట లేపనం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. దీనికి ముందు సిరావ్యధనం ద్వారా రక్తమోక్షణం చేయాల్సి ఉంటుంది.

గాయాలు, అభిఘాతాలు, దుష్టవ్రణాలు : వస కొమ్ము వేసి కాచిన నీళ్లతో వ్రణాన్ని కడిగి శుభ్రంచేస్తే త్వరితగతిన మానుతుంది. పసిపిల్లల్లో కళ్లు అతుక్కుపోవటం వంటివి తగ్గుతాయి.-* వసకొమ్ము పొడిని తేనెతో కలిపి గాని లేదా మదనఫలాన్ని ఇప్ప పువ్వులతో కలిపి ముద్దగా నూరి గాని పిల్లలకు నాకించి వాంతిని కలిగిస్తే కళ్లు పుసులుకట్టి అతుక్కుపోవటం తగ్గుతుంది.* వసకొమ్ములను వేసి ఘృతపాక విధానంలో నెయ్యిని తయారుచేసి, వందసార్లు ఆవర్తం చేసి దీర్ఘకాలంపాటు వాడితే శరీరం వజ్ర సమానంగా తయారవుతుంది. వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

మంచి జ్ఞాపకశక్తి, చక్కని కంఠస్వరంకోసం : వసకొమ్ములను పాలలోవేసి మరిగించి కనీసం ఒక నెలపాటు తీసుకుంటే మంచి జ్ఞాపకశక్తి, కోకిల లాంటి కంఠస్వరం, మంచి శరీర కాంతి సిద్ధిస్తాయి. సూక్ష్మజీవులు దాడి చేయకుండా ఉంటాయి. వస కొమ్ములను ఆవునెయ్యికి కలిపి ఘృతపాక విధానంలో నెయ్యిని తయారుచేసి కూడా వాడుకోవచ్చు.

కడుపునొప్పి : వస కొమ్ములు, సౌవర్చల లవణం, ఇంగువ, చెంగల్వకోష్టు వేరు, అతి విష వేరు, కరక్కాయలు, కొడిశపాల గింజలు వీటిని కలిపి తీసుకుంటే కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది.

అర్శమొలలు : వసకొమ్ములను, సోంపు గింజలను కలిపి నూరి ముద్దగాచేసి అర్శమొలల మీద ప్రయోగించాలి. దీనికి ముందు నువ్వుల నూనెను వేడిచేసి బాహ్యంగా ప్రయోగిస్తే ఉపశమనంగా ఉంటుంది


- డా. చిరుమామిళ్ల మురళీమనోహర్--August 28th, 2011 , ఆంధ్రభూమి .ఆదివారము

  • ====================================
Visit my Website - Dr.Seshagirirao

Saturday 27 August 2011

గురివింద గింజ ,



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

గురివింద గింజను విషపదార్థంగా భావిస్తారు ప్రతివారు. అయితే ఈ గింజను శుద్ధిచేసి ఉపయోగిస్తే ఔషధంగా కూడా వాడవచ్చు. ఈ గింజలు ఎరుపు, తెలుగు రంగుల్లో లభిస్తాయి. తెలుగు రంగు గింజలు మాత్రమే ఔషధంగా ఉపయోగపడుతాయి. ఈ గింజలనే కాక లేత ఆకులను, వేళ్ళను కూడా వైద్యానికి ఉపయోగిస్తారు. ఆయుర్వేద వైద్యంలో తెల్లగురివింద గింజలు వాడబడుతున్నాయి.

ఆయుర్వేద వైద్యంలో వీటి ఉపయోగాలు :
  • లేత గురివింద ఆకులను నమిలితే గొంతు శ్రావ్యంగా ఉంటుంది. ఎక్కువ సేపు ప్రసంగించే వక్తలు, మిమిక్రీ కళాకారులు, సంగీత విద్వాంసులు, హరికథలు, బుర్రకథలు వినిపించేవారు ఈ ఆకులను నమిలితే మంచి ప్రయోజనం కలుగుతుంది.
  • తెల్లబట్టతో బాధపడే స్ర్తిలు పరిశుద్ధం చేయబడిన గురివింద గింజలను మెత్తగా పొడికొట్టి, ఆ పొడిలో తేనెను కలిపి పుచ్చుకుంటే నివారణ కలుగుతుంది.
  • ఈ గింజలు లేదా ఆకుల కషాయాన్ని తాగితే సుఖప్రసవమవుతుంది.
  • గురివిందగింజలను కాలిస్తే వచ్చే పొగ దోమలను నిర్మూలిస్తుంది.
  • చెవిపోటువస్తే గురివిందగింజ ఆకును నూరి ఆ పసరుపోస్తే తగ్గిపోతుంది .
  • పేనుకొరుకుడుతో బాధపడుతున్నారా..గురివిందగింజతోవైద్యం --గురివింద గింజని బాగా అరగదీసి గంధం తీసి పేనుకొరికిన చోట రాయండి. ఇలా నాలుగైదురోజులు రాస్తే వెంట్రుకలు మళ్ళీ తిరిగి వస్తాయి.
ఆయుర్వేద డాక్టరు సలహా ప్రకారంగానే ఈ గింజల ఔషధాన్ని వాడాలి. పరిశుద్ధం చేయని గురివింద గింజలను ఔషధంగా వాడినట్లయితే దాని విషతత్వంవల్ల ఎన్నో అనారోగ్యాలు ఏర్పడే ప్రమాదముంది.

-కె.నిర్మల
  • =============================================
Visit my Website - Dr.Seshagirirao

Friday 26 August 2011

మెంథాల్ (పిప్పరమెంటు పువ్వు)పుధీనా, Menthol,Mint,peppermint





  • -పుదీనా ఆకు .




పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



పుదీనా నుండి మెంథాల్ తయారు చేస్తారు. పుదీనానుంచి మెంథాల్‌ను లేదా మెంథా-ఆయిల్‌ను డిస్టిలేషన్ విధానం ద్వారా తీస్తారు. ఇది ఆవిరయ్యే తత్వం కలిగినది. నీళ్ల మాదిరిగా కనిపిస్తుంది. సింథెటికల్ ప్రోసెస్ ద్వారా కూడా మెంథాల్ ను తయారు చేయుచున్నారు . ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన వాసనతో ఉంటుంది. ప్రయోగానంతరం చల్లదనాన్ని ప్రసాదిస్తుంది.

మన పరిసరాలలో దొరికే ఎంతో విలువైన మొక్కల్లో పుదీనా ఒకటి. దీని శాస్త్రీయనామం మిన్‌థా లామియేసి. ఇది మెంథా స్పైకాటా జాతికి చెందిన మొక్క. సంస్కృతంలో పూతిహ అంటారు. పూతి అంటే వాసన చూసేది అని అర్ధం. తెలుగులో పుదీనా అనీ, ఇంగ్లీష్‌లో మింట్‌ అని, లాటిన్‌లో మెంతా పైపరేటా అనీ పిలుస్తారు.

ఇది చూడడానికి ఎంతో విలక్షణంగా ఉండి, దీని ఆకులు మందంగా, కొసలు రంపం ఆకారంలో ఉండి, చాలా మృధువుగా ఉంటుంది. మంచి వన్నె గల ఆకుపచ్చని రంగులో ఉండి, సంవత్సరమంతా ఆకుపచ్చ గానే ఉంటుంది. దీనికి పువ్వులు, ఫలాలు ఎండాకాలం తరువాత నుంచే ఏర్పడతాయి. వీటి ఫలాలు చాలా చిన్నవిగా ఉంటాయి.

అనేక ప్రయోజనాలు కలిగిన పుదీనా నుండి చమురు తీసి దానిని వైద్య పరంగా వినియోగిస్తున్నారు. చాలా రకాల వ్యాధులకి తయారు చేసే ఔషధాల్లో పుదీనా (మింట్‌) ఎక్కువ శాతం వాడకంలో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో డిమాండ్‌ ఉంది. అందువల్లనే దీనిని వ్యవసాయ పద్ద తుల్లో తగిన విధంగా తోటలు వేసి వ్యవసా యదారులు తగిన రాబడిని, లాభాలని అందుకుంటున్నారు. పుదీనా మొక్కలో ప్రతి భాగం ఉపయోగపడేదే. ఔషధతత్వాలు కలిగివున్నదే. ఒక కంపెనీ ఉత్పత్తి చేస్తున్న 'పుదీన్‌ హర' అనే ఔషధం దీనికి నిదర్శనం.

 



ఔషధ గుణాలు



  • పుదీనా పూర్తి ఔషధ గుణాలు కలిగివున్న మొక్క. చికిత్సా విధానాల్లో దీనిని జీర్ణ సంబం ధవ్యాధులకి ఉపయోగిస్తారు. పుదీనా ఆకుల రసంలో అల్లంరసం, కలబంద గుజ్జు, ఏలకు లు, దాల్చిన చెక్క కలిపి నూరి, ప్రతి రోజూ, 2-3 చెంచాలు సేవిస్తూవుంటే అరుగుదల పెరుగుతుంది. జీర్ణకోశ వ్యాధులకి, కడుపు నొప్పికి, పుదీనా గింజలు కొన్ని నమిలి తిన్న తరువాత గ్లాసుడు వేడినీళ్ళు తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది.



  • కొన్ని పుదీనా ఆకుల్ని గ్లాసుడు నీళ్లతో మరిగించి, ఆ కషా యాన్ని సేవిస్తే, జ్వరం తగ్గిపోవడమే కాక కామెర్లు, ఛాతిమంట, కడుపులో మంట, మూత్ర సంబంధవ్యాధులు సమసిపోతాయి.



  • నెల తప్పిన స్త్రీలు ఒక చెంచాడు పుదీనా రసంలో చెంచాడు నిమ్మరసం, చెంచాడు తేనె కలిపి, ఆరారగా చేతిలో వేసుకుని సేవిస్తూ వుంటే, వాంతులు, ఎసిడిటీ, వంటి వికారా లు తగ్గుతాయి.



  • అలాగే నిద్రలేమికి, మానసిక వత్తిడికి, నోటి వ్యాధులకి కొన్ని పుదీనా ఆకులు గ్లాసుడు వేడి నీటిలో వేసి, మూతపెట్టి అర్ధగంట తరువాత తాగితే చాలా ఉపశమనం కలగజేస్తుంది. మంచి నిద్ర పడు తుంది.



  • పుదీనా ఆకులు అరచేతిలో బాగా నలిపి ఆరసాన్ని కణతలకి, నుదుటికి రాసుకుంటే, తలనొప్పి తగ్గిపోయి, చల్లదనా న్నిస్తుంది.



  • చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌కి తాజా పుదీనా ఆకులు కొన్ని రసం తీసి దూది ని ఆరసంలో ముంచి, ముక్కులోను, చెవి లోను డ్రాప్స్‌గా వేసుకుంటే వీటి సమస్య తక్ష ణం పరిష్కారమవుతుంది.



  • పుదీనా ఆకులు ఎండబెట్టి చూర్ణం చేసి, అందులో తగినంత ఉప్పు చేర్చి ప్రతినిత్యం దంతధావనం చేస్తే చిగుళ్ళు గట్టిపడి, దంత వ్యాధులు కుండా అరికడుతుంది. అంతేకాక నోటి దుర్వాసనని కూడా అరికడుతుంది.



  • ఇక శరీరం మీద ఏర్పడే దురద, దద్దుర్లకి కొన్ని పుదీనా ఆకు ల్ని గ్లాసుడు నీటిలో మరగబెట్టి, తగినంత పటిక బెల్లం పొడిని కలిపి తీసుకుంటే ఈ సమస్యనుంచి త్వరగా బయటపడవచ్చు.



  • చిన్న పిల్లలు కడుపునొప్పి ఉప్పరంతో బాధపడుతుంటే గోరువేచ్చని నీటిలో ఐదు ఆరుచుక్కలు పుదీనా రసం కాచి తాగించడం వలన కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తగ్గుతుంది.



  • చిన్న పిల్లలకు జలుబు చేస్తే పుదీనా నుండి తయారయ్యే మెంథాల్ ముద్ద కర్పూరాన్ని .... కొబ్బరినూనెను కొంచెం తీసుకొని మిశ్రమం చేసి ఛాతికీ వీపునకు రాస్తే జలుబు తగ్గుతుందని ఆయుర్వేద వేద్యం సూచిస్తోంది.



  • పుదీనా ఆకులను టీతో కలిపి తాగితే రుచుగా ఉండడామే కాక కంఠస్వరం బాగుంటుంది. గాయకులు, డబ్బింగ్ చెప్పేవారు పుదీనా రసం తాగితే కంఠస్వరం మృధువుగా మధురంగా తయారవుతుంది.



  • ఇవే కాక, ఆహార పదార్ధాల తయారీలో, కాస్మోటిక్స కంపెనీల్లో, బబుల్‌ గమ్స్‌ తయారీలో, మందుల్లో, మరి కొన్ని ఉత్పత్తులో ఈ పుదీనా వాడకం ఎంతో ఉంది.



  • క్రిమి సంహారక గుణాలు కూడా ఇందులో పుష్కళంగా ఉన్నాయి. కనుకనే, దీనిని అఫ్గ్‌నిస్ధాన్‌ ప్రజలు అత్యధికంగా వాడుతున్నారు. అంతేకాక అక్కడ ఇళ్ళలో కూడా దీనిని విస్తారంగా పెంచుతారు. గ్రీకు , సౌత్‌ అమెరికా, ఆస్త్రేలియా, మొదలైన దేశాలలో కూడా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది.



  • సిగరెట్‌ తయారీ కంపెనీలలో కూడా దీనిని వినియోగించి మెంథాల్‌ సిగరెట్లు తయారు చేస్తున్నారు. సిగరెట్‌ అలవాటు ఉన్నవారికి కొంత వరకూ గొంతు సమస్యలు అరికడుతుంది కనుక దీనికి మరింత ప్రాముఖ్యత ఏర్పడింది.



  • సబ్బుల తయారీలో కూడా వాడుతున్నారు. పుదీనా ఫ్లేవర్‌తో తయారైన ఏ ప్రొడక్టకైనా ప్రపంచవ్యాప్తంగా వినియోగం అధిక సంఖ్యలో ఉందనడం అతిశయోక్తికాదు.



  • దీనిలో కేలరీలు ఏమీ లేకపోడంతో అందరూ పుదీనాని ఎంతైనా వినియోగించుకోవచ్చు. ఇంతటి విలువలు ఉన్న పుదీనాని ప్రతి వారు ఇంట్లో పెంచి తాజాగా వాడుకుంటూ వుండడం ఎంతైనా శ్రేయస్కరం.


ఇది చిన్న కుండీలలో కూడా పెరగగల మొక్క. కనుక స్థలాభావం దీనికి ఉండదు. పెంపకానికి ఎంతో అనువుగా ఉంటుంది.


మూలము : Test book for Students of BAMS.



  • ==========================================


Visit my Website - Dr.Seshagirirao.

సపోటా ,Sapodilla - Manilkara zapota








పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



సపోటా (Sapodilla - Manilkara zapota), ఒక సతత హరితమైన చెట్టు. ఇది ఉష్ణ మండల ప్రాంతాలలో పెరుగుతుంది. భారత ఉపఖండం, మెక్సికో ప్రాంతాలలో ఎక్కువగా సపోటా తోటలను పండ్లకోసం పెంచుతారు. స్పానిష్ పాలకులు ఫిలిప్పీన్స్‌లో ఈ పంటను ప్రవేశపెట్టారు.


సపోటా చెట్టు 30-40 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. గాలికి తట్టుకోగలదు. చెట్టు బెరడు తెల్లగా జిగురు కారుతూ ఉంటుంది. (gummy latex called chicle.) ఆకులు ఒకమాదిరి పచ్చగా, నునుపుగా ఉంటాయి. అవి 7-15 సెంటీమీటర్ల పొడవుంటాయి, . తెల్లటి, చిన్నవైన పూలు గంట ఆకారంలో ఆరు రేకలు గల corolla తో ఉంటాయి.


సపోటా పండు కాస్త సాగదీసిన బంతిలా, 4-8 సెంటీమీటర్లు వ్యాసంతో ఉంటుంది. ఒకో పండులో 2 నుండి 10 వరకు గింజలు ఉంటాయి. పండులోని గుజ్జు పసుపు, గోధుమ రంగుల మధ్యగా, కొంచెం పలుకులుగా ఉంటుంది. సపోటా పండు చాలా తీయగా ఉంటుంది. కాయగా ఉన్నపుడు గట్టిగా ఉండే గుజ్జు భాగం పండినపుడు బాగా మెత్తగా అవుతుంది. పచ్చి కాయలలో సపోనిన్ అనే పదార్ధం ఎక్కువగా ఉంటుంది. ఇది tannin లాంటి పదార్ధమే. ఇది తింటే నోరు ఎండుకుపోతుంది. (తడి ఆరుతుంది) గింజలు కొంచెం పొడవుగా ఉండి, ఒక ప్రక్క ములుకుదేరి ఉంటాయి.

సపోటా చెట్లు సంవత్సరానికి రెండు కాఫులు కాస్తాయి. పూవులు సంవత్సరం పొడవునా ఉంటాయి. పచ్చి కాయలో latex (జిగురు లేదా పాలు అంటారు.) ఎక్కువ ఉంటుంది. ఈ కాయలు చెట్టున ఉన్నపుడు పండవు. కోశిన తరువాతనే పండుతాయి.

ఇదివరకు సపోటా (Sapodilla)ను Achras sapota అనేవారు కాని ఇది సరైన పేరు కాదు. భారతదేశంలో "చిక్కూ" లేదా "సపోటా' అంటారు . బెంగాల్ ప్రాంతంలో "సొఫెడా" అంటారు. దక్షిణాసియా, పాకిస్థఅన్‌లలో "చికో" అని, ఫిలిప్పీన్స్‌లో "చికో" అని, ఇండినేషియాలో "సవో" (sawo) అని, మలేషియాలో "చికు" అని అంటారు. వియత్నాంలో hồng xiêm (xa pô chê) అని, గుయానాలో "సపోడిల్లా' అని, శ్రీలంకలో "రత-మి"అని, థాయిలాండ్‌, కంబోడియాలలో లమూత్ (ละมุด) అంటారు. కొలంబియా, నికరాగ్వే వంటి దేశాలలో níspero అని, క్యూబా వంటి చోట్ల nípero అని, Kelantanese Malayలో "sawo nilo" అంటారు ..



 సపోటా చెట్టు ఆకూ, కాయా, కొమ్మా, రెమ్మా ఏది తుంపినా పాలు వస్తాయి. సపోటా రుచి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. దీనితో పాటు విలువైన పోషక పదార్థాలు కూడా ఇస్తుంది. ఇందులో కొలెస్ట్రాల్‌ వుండదు. ఆ మాటకొస్తే కొవ్వు పదార్థాలూ చాలా తక్కువే. విటమిన్లూ, ఖనిజాలూ పుష్కలం. తాజా సపోటాలో విటమిన్‌ సి, కాల్షియం అధికంగా వుంటాయి. మగ్గిన సపోటాను తింటే వుండే రుచి అనుభవించాలే గానీ చెప్పతరం కాదు! నోట్లో కరిగిపోతూ, కాస్త గరుకుగా, కాస్త మృదువుగా మొత్తానికి అద్భుతంగా అనిపిస్తుంది. మన దేశంలో సపోటాలు విరివిగా కాస్తాయి. అవి ఇక్కడ ఎంత ప్రాచుర్యం పొందాయంటే అసలవి ఇక్కడే పుట్టాయేమో అన్నంతగా! పంతొమ్మిదవ శతాబ్దంలో సపోటా జిగురును ఆంటోనియో లోపెజ్‌ అనే అతను తన కుమారుడు థామస్‌ ఆడమ్స్‌కి ఇచ్చాడు. ఆడమ్స్‌ ఆ తరువాత దానిలో ఇతర పదార్థాలు కలిపి 'చికిల్స్‌' తయారు చేశాడు.

ఆ తరువాత చికిల్స్‌ చిక్లెట్స్‌ గానూ, బబుల్‌ గమ్‌ గానూ ప్రాచుర్యం పొందాయి. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితమే మలయన్లు ఈ సపోటా జిగురును వాడేవారని తెలుస్తోంది. సపోటా చెట్టు ఆకూ, కాయా, కొమ్మా, రెమ్మా ఏది తుంపినా పాలు వస్తాయి.

 



రకాలు :
మన రాష్ట్రంలోని సపోటా కొనుగోలుదారులు పాల రకాన్ని బాగా ఇష్టపడతారు. మహారాష్ట్రలో కాలి పత్తి రకాన్ని, కర్ణాటకలో క్రికెట్ బాల్ రకాల్ని ఇష్టంగా తింటారు. పాల రకంలో దిగుబడి ఎక్కువ. పండు కోలగా, చిన్నదిగా ఉంటుంది. పలచని తోలుతో కండ మృదువుగా ఉంటుంది. పండ్లు బాగా తీయగా ఉంటాయి. అయితే ఈ పండ్లు నిల్వకు, రవాణాకు, ఎగుమతికి అనుకూలంగా ఉండవు. క్రికెట్ బాల్ రకం సపోటా పండ్లు గుండ్రంగా, పెద్దగా ఉంటాయి. ఒక మోస్తరు తీపి కలిగి ఉంటాయి. సముద్ర మట్టం నుండి వెయ్యి అడుగుల ఎత్తు వరకూ ఉన్న ప్రాంతాల్లోనూ, పొడి వాతావరణంలోనూ దిగుబడి బాగా వస్తుంది. కాలి పత్తి రకం పండ్లు కోలగా, మధ్యస్త పరిమాణంలో ఉంటాయి. తోలు మందంగా, కండ తీయగా ఉంటుంది. ఈ రకం పండు నిల్వ, రవాణా, ఎగుమతికి అనుకూలమైనది. అయితే ఈ రకం సపోటాలో దిగుబడి తక్కువ. ఇవి కాక ద్వారపూడి, కీర్తి బర్తి, పీకేయం-1, 3, డీహెచ్‌యస్ 1, 2 రకాలు కూడా అనువైనవే. వీటిలో డీహెచ్‌యస్ 1, 2 హైబ్రిడ్ రకాలు.



 వైద్యపరముగా ఉపయోగాలు :
శరీరంలో నిస్సత్తువ ఆవహించినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు రెండు లేదా మూడు సపోటా పండ్లను తింటే.. నిమిషాల తేడాతో శరీరం మళ్లీ శక్తి పుంజుకుంటుంది. పెరటి పండు అయిన సపోటాలో సమృద్ధిగా లభించే ఫ్రక్టోస్ శరీరం త్వరగా శక్తి పుంజుకునేలా చేస్తుంది. ఈ పండు గుజ్జులో అధికంగా లభించే పీచు, పై పొట్టులో ఉండే కెరోటిన్లు మలవిసర్జన సాఫీగా జరిగేలా చూస్తాయి. కాబట్టి మలబద్ధకంతో బాధపడేవారు సపోటాలను వాడవచ్చును .

సపోటా పండ్లలో మాంసకృత్తులు, కెరోటిన్లు, నియాసిన్, పిండి పదార్థాలు, ఇనుము, సి విటమిన్, కొవ్వు, పీచు, థయామిన్, క్యాల్షియం, రైబోఫ్లేవిన్లు, శక్తి, ఫ్రక్టోస్ షుగర్లు ఎక్కువగా లభిస్తాయి. ఈ పండ్లు పాలిఫినోలిక్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్.. యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పారాసిటిక్(Anti parasitic) సుగుణాలను మెండుగా కలిగి ఉన్నాయి. ఇవి హానిచేసే సూక్ష్మక్రిములను శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేస్తాయి.

ఇక పోషకాల విషయానికి వస్తే.. విటమిన్‌ 'ఏ 'కంటిచూపును మెరుగుపరుస్తుంది. విటమిన్‌ 'సీ 'శరీరంలోని హానికర ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. తాజా పండులోని పొటాషియం, రాగి, ఇనుము, లాంటి పోషకాలు.. ఫోలేట్‌, నియాసిన్‌, పాంథోయినిక్‌ ఆమ్లాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి. అందుకే ఎదిగే పిల్లలకు ఈ పండును తినిపించాలి. ఆరోగ్యంతోపాటు బరువూ పెరుగుతారు.

అలాగే.. తక్కువ బరువున్నవారు సపోటాను అవసరమైన మోతాదులో తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది.. గర్భిణులు, వృద్ధులు, రక్తహీనతతో బాధపడేవారు సపోటాలను మితంగా స్వీకరిస్తే రక్తహీనత క్రమబద్ధీకరణ అవుతుంది. బాలింతలు ఈ పండును ఫలహారంగా తీసుకుంటే పిల్లలకు పాలు పుష్కళంగా వృద్ధి చెందుతాయి.

తియ్యగా ఊరిస్తూ, భలే రుచిగా ఉన్నాయికదా అని సపోటా పండ్లను అదేపనిగా తినటం మంచిది కాదు. అలా చేస్తే అజీర్ణంతోపాటు పొట్ట ఉబ్బరం కూడా చేస్తుంది. ఇక గుండె జబ్బులతో బాధపడేవారు మాత్రం రోజుకు ఒక పండును మించి తీసుకోకూడదు. ఒబేసిటీ, మధుమేహంతో బాధపడేవారు వైద్యుని సలహా మేరకే తీసుకోవాల్సి ఉంటుంది.

సపోటా తినటం వల్ల చర్మం సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. తాజాపండ్లను ప్యాక్‌ రూపంలో కాకుండా ఆహారంగా స్వీకరించడం వల్ల విటమిన్లు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా విటమిన్‌- 'ఎ', 'సి' లు చర్మానికి కొత్త నిగారింపునిస్తాయి. అలాగే సపోటా గింజలను మెత్తగా నూరి ముద్దలా చేసి, దానికి కొంచెం ఆముదం నూనె కలిపి తలకు రాసుకోవాలి. మర్నాడు తలస్నానం చేస్తే శిరోజాలు మృదువుగా మారుతాయి. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.

సపోటా పళ్ళు తేనెతో కలిపి తీసుకుంటే శీఘ్రస్ఖలనం తగ్గి, రతి సామర్థ్యం పెరుగుతుందంటున్నారు వైద్యులు.



 ఆహార పోషక విలువలు170g, 1 sapodilla contains :


  • శక్తి - Calories: 141

  • నీరు -Water: 132.60g

  • పిండిపదార్ధము -Carbs: 33.93g

  • మాంసకృత్తులు --Protein: 0.75g

  • పీచుపదార్ధం -Fiber: 9.01g

  • మొత్తం కొవ్వుపదార్ధము -Total Fat: 1.87g

  • సాచ్యురేటెడ్ కొవ్వు -Saturated Fat: 0.33g

  • చెడ్డ కొవ్వు -Trans-fats: Not known (or 0)


ఖనిజలవణాలు -Minerals:



  • కాల్సియం -Calcium: 35.70mg

  • ఐరన్‌-Iron: 1.36mg

  • మెగ్నీషియం -Magnesium: 20.40mg

  • భాష్వరము -Phosphorus: 20.40mg

  • పొటాసియం-Potassium: 328.10mg

  • సోడియం-Sodium: 20.40mg

  • జింక్ -Zinc: 0.17mg

  • కాఫర్ -Copper: 0.15mg

  • మాంగనీష్ -Manganese: Not known

  • సెలీనియం -Selenium: 1.02mcg


విటమిన్లు -Vitamins:



  • విటమిన్‌'ఏ'-Vitamin A: 102.00IU

  • థయమిన్‌-Thiamine (B1): 0.00mg

  • రైబోఫ్లెవిన్‌-Riboflavin (B2): 0.03mg

  • నియాసిన్‌-Niacin (B3): 0.34mg

  • పాంథోనిక్ యాసిడ్-Pantothenic acid (B5): 0.43mg

  • విటమిన్‌ ' బి 6' -Vitamin B6: 0.06mg

  • ఫోలిక్ యాసిడ్-Folic acid/Folate (B9): 23.80mcg

  • సయనోకొబాలమైన్‌-Vitamin B12: 0.00mcg

  • విటమిన్‌ 'సీ'-Vitamin C: 24.99mg

  • విటమిన్‌' ఇ '-Vitamin E (alpha-tocopherol): Not known

  • వి్టమిన్‌' కె ' -Vitamin K (phylloquinone): Not known


Essential Amino Acids:



  • ఐసోలూసిన్‌-Isoleucine: 0.03g

  • లూసిన్‌-Leucine: 0.04g

  • లైసిన్‌-Lysine: 0.07g

  • మితియోనిన్‌-Methionine: 0.01g

  • ఫినైల్ అలమిన్‌-Phenylalanine: 0.02g

  • థియోనిన్‌-Threonine: 0.02g

  • ట్రిప్టోఫాన్‌-Tryptophan: 0.01g

  • వాలిన్‌-Valine: 0.03g


Miscellaneous:



  • ఆల్కహాల్ -Alcohol: 0.00g

  • కెఫిన్‌-Caffeine: Not known





  • Source : Wikipedia.org (అంతర్జాలము).



  • ===============================


Visit my Website - Dr.Seshagirirao

Friday 19 August 2011

జన్యు మార్పిడి ఆహారపదార్ధములు , Genitically Modified foods



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

జన్యు మార్పిడి ఆహారపదార్ధములు , Genitically Modified foods : ఒకప్పుడు చిరుతిళ్లంటే-అమ్మ ఇంట్లో తయారుచేసినవే. కానీ ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల ఆహార పదార్ధాలు. కానీ పిల్లల కోసం విక్రయిస్తున్న ఆహార పదార్ధాలు ఎంతమేరకు సురక్షితమైనవో ఏనాడైనా మనం ఆలోచిస్తున్నామా? రోజుకో కొత్త బ్రాండ్ పేరుతో ఎన్నో రకాల ఆహార పదార్ధాలు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. దిన, వార పత్రికలు, టెలివిజన్లలో అద్భుతమైన ప్రకటనలు ఇవ్వడం ద్వారా అతి సులువుగా ప్రజల మనసులో ఈ ఉత్పత్తులు స్థానం సంపాదించుకుంటున్నాయి. ఫలితంగా సహజ ఆహారానికి ప్రజలు, ముఖ్యంగా పిల్లలు దూరమైపోతూ ప్యాకేజ్డ్ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. దీనితో స్థూలకాయం పిల్లల విషయంలో కూడా ఒక సమస్యగా మారుతోంది. ఇది ఇప్పుడు మనదేశంలో కూడా ఒక ప్రధానమైన సమస్యగా గుర్తింపు పొందుతోంది.

జెనటిక్‌ ఇంజనీరింగ్‌ అంటే?
ఇటీవల కాలంలో ప్రాచుర్యాన్ని పొందిన సరికొత్త టెక్నాలజీ ఇది. ఒక జాతి నుంచి మరొక జాతికి జన్యువులను మార్పిడి చేసే ప్రక్రియ ఇది. ఈ విధానం ద్వారా జంతువు నుంచి మొక్కలకు కూడా జన్యువులను మార్చవచ్చు. జన్యు మార్పిడి ద్వారా కొత్తగా సృష్టించిన జెనటికల్లీ మోడిఫైడ్‌ ఆర్గానిజమ్‌ (జిఎంఓ) తన కొత్త లక్షణాలను తన సంతతికి అందజేస్తుంది. జెనటిక్‌ ఇంజనీరింగ్‌ అభివృద్ధికి, వ్యాప్తికి ప్రధానంగా చేయూత నిస్తున్నది కార్పొరేట్‌ రంగమే. ఇండస్ట్రియల్‌ అగ్రికల్చర్‌లో ఎక్కువగా ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతిక విధానం ద్వారా పండించిన ఆహారాన్ని 'జెనటికల్లీ మోడిఫైడ్‌ లేదా జి.ఎం. ఫుడ్‌'గా పేర్కొంటున్నారు.

జన్యు మార్పిడి ఆహార పంటలు మానవు నిపై దుష్పరిమాణాలు చూపుతాయని పీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె . నిమ్మయ్య తెలిపారు. జన్యు ఆహారం విషతుల్యం? ప్రకృతి ప్రసాదించిన వనరులన్నీ ప్రజలు, సమస్త జీవకోటి సుఖ సంతో షాలతో జీవించడానికే కదా! కానీ సైన్స్‌ పేరుతో కొన్ని విదేశీ కంపెనీలు కోట్లాది రూపాయలు లాభం సంపాదించడానికి నడుం కట్టాయి. ప్రజలను హతమార్చి అయినా సరే తమ లక్ష్యం నెరవేర్చుకోవాలని చూస్తు న్నాయి. ఇందులో భాగంగా జన్యు మార్పిడి ఆహారపదార్థాలను మార్కెట్లో ప్రవేశపెడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి.

ఈ జన్యు మార్పిడి పంటలుఎవరికీ అంతుబట్టని రోగాలను వాపింపచేస్తాయని అమెరి కాకు చెందిన రెస్పాన్సిబుల్‌ టెక్నాలజీ సంస్థ వ్యవస్థాపకులు జెఫ్రీయం స్మిత్‌ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొని సాంకేతిక పరిజ్ఞానం పేరుతో విలయతాండవం చేస్తున్న కంపెనీలను, వాటిని ప్రోత్సహించే వారిని వ్యతిరేకించాలి. ముఖ్యంగా సామాన్యులు అత్యధికంగా తినే బిటి వంకాయలను పూర్తిగా నిషేధించాలి.

-- జన్యుమార్పిడి ఆహారము వలన ఎటువంటి వ్యాధులు వస్తున్నాయో ఇంకా నిర్ధారణ కాలేదు . ఆరోగ్యము పాడవుతందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . ఈవిషములో పరిశోధనలు జరగాల్సి ఉంది . అభివృద్ధిని ఆశ్వాధించాలి కాని అందుకు ఆరోగ్యము ఫణము గా పెట్టకూడదు . భారత దేశంలో తిండి గింజలకు కొరత లేదని అనవసరమైన టమాట, బిటి వంకాయ, విటమిన్‌ ఏ పేరుతో గోల్డేన్‌ రైస్‌ పేరుతో ప్రవేశ పెట్టుటకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరు అంటున్నారు .

జన్యుమార్పిడి ఎలా ? :
అసలు జన్యు పరంగా మార్పిడి చెందిన ఉత్పత్తులు (జిఎం), అలాగే బాసిల్లస్ తురుంజెనిసెస్(బీటీ) ఉత్పత్తులన్నవి ఎంత వరకూ ఆరోగ్య కరమైనవి అన్నది సమాధానం లేని ప్రశ్న . సోయాబిన్, మొక్కజొన్న, ప్రత్తి తదితర ఉత్పత్తులను ఈ రకమైన జన్యుమార్పిడి ద్వారా దిగుబడిని పెంచుకునే విధంగా ఎక్కువ పోషక విలువలు కలిగేలా శాస్తవ్రేత్తలు మార్పులు చేయగలిగారు. అంటే ఈ ఉత్పత్తుల జన్యుమూలం డిఎన్‌ఏలే కొన్ని మార్పులు చేయడం ద్వారా వీటి ఉత్పాదకతను, దిగుబడిని పెంచే ప్రయత్నం చేసారు. అందుకే ఇవన్నీ కూడా జన్యుపరమైన మార్పులకు లోనైన ఉత్పత్తులుగా, పంటలుగా మార్కెట్లోకి వచ్చాయి. ముఖ్యంగా జన్యుపరమైన మార్పిడుల ఫలితంగా మార్కెట్లోకి వస్తున్న ప్రతి ఉత్పత్తులను జిఎం ఉత్పత్తులుగానే పేర్కొంటారు. తాజాగా కొన్ని నేళ్ళ క్రితం దేశంలో తీవ్ర వివాదాన్ని సృష్టించిన బీటీ కాటన్ సమస్య సమసి పోయిందనుకుంటే ఇప్పుడు బీటీ వంకాయ దాన్ని మించిన స్థాయిలో అలజడులకు కారణమైంది. సాంకేతికంగా చెప్పాలంటే నేలల్లో వుండే బాసిల్లస్ తురుంజెనిసిస్ అనే బాక్టీరియాను ప్రత్తి, వంకాయల్లోనూ ప్రవేశపెట్టడం ద్వారా వాటి ఆకారాన్ని, దిగుబడిని గణనీయంగా పెంచవచ్చనేది ఈ ప్రయత్నాల్లో ముఖ్య ఉద్దేశం. ప్రతి జీవీ వౌలిక లక్షణాలు అన్నీ కూడా డిఎన్‌ఏలో నిక్షిప్తమైవుంటాయి. ప్రతి కణ మూలంలోనూ ఈ డిఎన్‌ఏ వుంటుంది. జన్యు పటంగా మనం పేర్కొనే డిఎన్‌ఏను అర్ధం చేసుకోవడం లేదా గుర్తించడం అన్నది ఇటీవలే మానవుడికి సాధ్యమైంది. ఈ డిఎన్‌ఏలో ఉండే జన్యువులే ఒక జీవి శరీరానికి అవసరమైన ప్రక్రియను కొనసాగించడానికి దోహదం చేస్తాయి. ప్రొటీన్లు ఉత్పత్తి చేయాలన్నా, రసాయన ప్రక్రియను నియంత్రించాలన్నా అందుకు ప్రధాన ఆధారం జన్యువులే. అసలు ఏ జన్యువు ఏరకమైన విధులను ఒక జీవి శరీరంలో నిర్వహిస్తుందన్నదిన ఇప్పటికే సోదాహరణగా శాస్తవ్రేత్తలు రుజువు చేసారు. ఇప్పుడు బాసిల్లస్ తురుంజెనిసిస్‌పై పరిశోధలు జరిపిన శాస్తవ్రేత్తలు అందులో ఒక రకమైన ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసే జన్యువువుందని గుర్తించారు. ఆ జన్యువు కొన్ని రకాల చీడపురుగులకు ప్రాణాంతకమవుతుందనే విషయాన్ని గుర్తించారు. ఈరకమైన పురుగులు ప్రత్తి, వంకాయ పంటలను ప్రధానంగా నాశనం చేయడంతో వాటిని వదిలించుకునే ఉద్దేశంతోనే బీటీని ఈ పంటలకు విస్తరింప చేయాలని సంకల్పించారు. ఈ బాసిల్లస్ తురంజెనిసిస్ అనే బాక్టీరియా నుంచి జన్యువును తొలంగించి వాటిని ప్రత్తిలేదా వంకాయ మొక్కల డిఎన్‌ఏలో చేర్చడం ద్వారా వాటి పోషక విలువలను పెంచడంతో పాటు దిగుబడిని ఇనుమడించవచ్చని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.
ఈ రకంగా జన్యుపరంగా సవరించిన కణం ఆ మొక్కలో పెరుగుతుంది. దాని విత్తనాలు కూడా పంటలను ధ్వంసం చేసే చీడలను నిరోధించగలికే శక్తిని సంతరించుకుంది. ఈ మొక్కలను తినడానికి ప్రయత్నించే చీడపురుగులు అందులోని ప్రతికూల బాక్టీరియా సోకి మరణిస్తాయి. ఆ విధంగా పంటకు పంటా వస్తుంది. దిగుబడికి దిగుబడీ వుంటుంది. లాభానికి లాభం వస్తుంది. ఇవీ బీటీ వల్ల, జిఎం ఉత్పత్తుల వల్ల కలిగే ప్రయోజనాలంటూ అంతర్జాతీయ ఉత్పాతదక సంస్థలు, బహుళజాతి సంస్థలు నమ్మబలుకుతున్నాయి. అలాగే సంప్రదాయకంగా మనం ఉపయోగించే బంగాళా దుంపలు మరింత తియ్యగా మారడానికి, బియ్యంలో విటమిన్ ఎ శాతం పెరగడానికి ఈ జన్యుపరమైన మార్పులే దోహదం చేస్తాయని చెబుతున్నారు.

1996లో జిఎం ఉత్పత్తులను ప్రవేశపెట్టినప్పటి నుంచి అనేక దేశాలు ఈ పద్ధతినే అవలంబిస్తూ తన ఆహార, అవసరాలను తీర్చుకుంటున్నాయి. ప్రస్తుతం 26 దేశాల్లో జిఎం విత్తనాల వినియోగం గణనీయంగా పెరిగింది. దాదాపు 125 మిలియన్ హెక్టార్ల నెలలో జిఎం పంటలే పండుతున్నాయంటే పరిస్థితి ఎంతగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా సాగులో ఉన్న 150 బియన్ హెక్టార్ల వ్యవసాయ భూమిలో దాదాపు 8 శాతం ఈ జిఎం పంటలకే పరిమమైందన్న మాట. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ అమెరికాల్లోని అనేక దేశాల్లో ఎక్కువగా ఈ రకమైన పంటలపైనే ఆధారపడ్టాయి. సోయాబిన్, మొక్కజొన్న వంటివి ఇక్కడ వినియోగంలోకి వచ్చిన పంటలు. సగానికి పైగా జిఎం ఉత్పత్తులు అమెరికాలోనే వుండడం గమనార్హం.
ఐరోపా యూనియన్‌లో అయితే కేవలం ఏడు దేశాలు మాత్రమే జిఎం ఉత్పత్తులను అనుమతించాయి. అనియంత్రిత వ్యవసాయ పద్ధతులపై ఐరోపా యూనియన్ నిషేధం కూడా విధించింది. ఆఫ్రికాలో కేవలం మూడు దేశాలు, భారత్, చైనా సహా ఆసియాలో మూడు దేశాలు జిఎం పంటలను అనుమతించాయి. భారత్ విషయానికి వస్తే 7.6 మిలియన్ హెక్టార్ల పంట పొలాలు జిఎం పరిధిలోకి వచ్చాయి. అంటే ఇక్కడ ఎక్కువగా జిఎం పంటలనే పండిస్తున్నారు. అయితే బీటీ కాటన్‌తోపోలిస్తే బీటీ వంకాయకు సంబంధించి అనూహ్యరీతిలో ప్రతిస్పందన వచ్చింది. దీన్ని వాణిజ్యపరమైన వినియోగంలోకి తీసుకొస్తే ప్రమాదకరమన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించడానికి వారాల తరబడి నిరసనలు, ప్రదర్శనలు చేయాల్సి వచ్చింది. బయోటెక్నాలజీని అనుమతించకూడదని ఎవరూ అనరు గానీ సరైన పరిశోధనలు లేకుండా అధ్యయనం లేకుండా బహుళజాతి సంస్థల ఒత్తిళ్ళకు తలొగ్గి ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా క్షమార్హం కాదు. విచక్షణ, వాస్తవికత అన్నది ఏ నిర్ణయానికైనా గీటురాయి కావాలి. బీటీ ప్రత్తి విషయంలో ఇంతగా నిరసనలు తలెత్తపోవడానికి కారణం అది ఆహార పంట కాకపోవడమే. కానీ వంకాయను కూడా వక్రంగా మార్చే ప్రయత్నం చేస్తే ఎవరూ సహించే పరిస్థితి వుండదు. బయోటెక్నాలజీ ప్రజలకు ఉపయుక్తం కావాలి. అప్పుడే దానికి సార్ధకత.

జిఎమ్ పంటలను పరీక్షించే సదుపాయాలు లేవు :
జన్యు మార్పిడి పంటల వల్ల కలిగే మేలు లేదా కీడును అంచనా వేసేందుకు వీలుగా జీవసురక్షిత పరీక్షలు నిర్వహించడానికి వీలైన సదుపాయాలు దాదాపు వంద అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లేవని అమెరికాకు చెందిన మేధావులు అభిప్రాయపడుతున్నారు. మానవుల ఆరోగ్యం, జీవ వైవిధ్యంపై కలిగించే దుష్పరిణామాలను అంచనా వేయడానికి అనువైన సాంకేతిక పరిజ్ఞానం ఆయా దేశాల్లో అందుబాటులో లేదని వారు స్పష్టం చేస్తున్నారు. చాలా దేశాలు జిఎం పంటలు పండించడానికి ముందుకు వస్తున్నప్పటికీ ఈ రంగంలో అభివృద్ధి చాలా నెమ్మదిగా సాగుతున్నదని వారు పేర్కొన్నారు. లాభాలు, ఖర్చులు, ప్రభావాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వివియోగించడం వంటి వాటిల్లో ఆయా దేశాలు తగిన శ్రద్ధ వహించడం లేదని వారు చెబుతున్నారు. ఆయా దేశాలు సరళమైన, సమర్ధవంతమైన జీవ వైవిధ్య నియంత్రణ విధానాలను అనుసరించాల్సిన అవసరం ఎంతైనా వున్నదని వారు అభిప్రాయపడుతున్నారు. బిటి వంకాయపై వివిధ రాష్ట్రప్రభుత్వాలు, ఆరోగ్య కార్యకర్తలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో ఈ నివేదిక వెలువరించడం గమనార్హం.

మూలము :బి. రాజేశ్వరప్రసాద్ -- ఆంధ్రభూమి దినపత్రిక


  • ======================================
Visit my Website - Dr.Seshagirirao

Sunday 14 August 2011

అల్ఫాల్ఫా ,Alfalfa



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


అల్ఫాల్ఫా (మెడికాగో సాటివా L. (Medicago sativa L.) ) గింజల జాతి ఫెబాకే (Fabaceae)లోని పుష్పించే మొక్క, ఇది ప్రధానంగా పశుగ్రాసం పంటగా పండించబడుతుంది. UK, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్లలో దీనిని లుసెర్న్ (lucerne) గానూ మరియు దక్షిణాసియాలో లుసెర్న్ గ్రాస్ (lucerne grass) గానూ పిలుస్తారు. ఇది క్లోవర్ (clover)ను పోలి చిన్న వంకాయ రంగు పువ్వుల గుత్తులను కలిగి ఉంటుంది.

అల్ఫాల్ఫా శీతాకాలపు శాశ్వత లెగ్యూమ్ (legume), ఇది రకం మరియు వాతావరణంబట్టి ఇరవై ఏళ్ళకు పైగా బ్రతుకుతుంది. ఈ మొక్క సుమారు 1 metre (3 ft) ఎత్తు వరకూ పెరుగుతుంది, అంతేకాక లోతైన వ్రేళ్ళవ్యవస్థ కలిగి ఉంటుంది, ఈ వ్యవస్థ కొన్ని సార్లు 15 metres (49 ft)పైగా ఉంటుంది. ఇందువలన ఇది ముఖ్యంగా కరువును తట్టుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది టెట్రాప్లాయిడ్ (tetraploid) జెనోం (genome) కలిగి ఉంటుంది.

ఈ మొక్క ఆటో-టాక్సిసిటీ (autotoxicity) గుణాన్ని కలిగి ఉంటుంది, దీని అర్థం ప్రస్తుతం అల్ఫాల్ఫా పండించే చోట్ల అల్ఫాల్ఫా విత్తనం మొలకెత్తడం కష్టం. కాబట్టి, అల్ఫాల్ఫా పొలాలు తిరిగి విత్తనాలు చల్లేముందు ఇతర మార్పిడి పంటలతో పండించడం నిర్దేశిస్తారు (ఉదాహరణకు, మొక్కజొన్న లేదా గోధుమ). అల్ఫాల్ఫా ప్రపంచ వ్యాప్తంగా ప్రధానంగా పశువులకు గ్రాసంగా పండించబడుతుంది, మరియు తరచూ గడ్డిగానూ, కానీ తిండిగా, పచ్చగడ్డిగానూ పశువులే తినడమో, లేదా వాటికి తినిపించడమో చేయవచ్చు. అల్ఫాల్ఫా అన్ని గడ్డి పంటలలోనూ అత్యధికంగా గ్రాసంగా వాడతారు, తక్కువగా వ్యవసాయ క్షేత్రంలో వాడతారు. అది సరిపోయే నెలల్లో పండించినపుడు, అల్ఫాల్ఫా అత్యధిక దిగుబడి ఇచ్చే పశుగ్రాసపు పంట. దీని ప్రాథమిక ఉపయోగం పాల డెయిరీ పశువులకు గ్రాసంగా ఉపయోగించడం—దీనికి కారణం అది ఎక్కువ ప్రోటీన్ మరియు సులభంగా జీర్ణమయే ఫైబర్ కలిగి ఉండడం-రెండవ ఉపయోగం మాంసానికి ఉపయోగ పడే పశువులు, గుర్రాలు, గొర్రెలు మరియు మేకల కొరకు. మనుష్యులు సైతం అల్ఫాల్ఫా యొక్క మొలకెత్తిన విత్తనాలను సలాడ్లు మరియు సాండ్విచ్ లలో తింటారు. నీరు తీసివేసిన అల్ఫాల్ఫా ఆకు వ్యాపారపరంగా ఆహార ప్రత్యామ్నాయంగా వివిధ రూపాల్లో, మాత్రలు, పౌడర్లు లేదా టీ గా దొరుకుతుంది. కొందరి నమ్మకం ప్రకారం అల్ఫాల్ఫా గాలక్టో-గాగ్ (galactagogue), చనుబాల ఉత్పత్తిని పెంచే పదార్ధం.

వైద్య ఉపయోగాలు

హోమియోపతి మందులలో అల్ఫాఆల్ఫా మందుని " కింగ్ ఆఫ్ హోమియోపతి " (King of Homeopatic medicines) అనే సామెత ఉన్నది .

అల్ఫాల్ఫాలో ఫైటో-ఈస్త్రోజన్లు (Phytoestrogens)--అల్ఫల్ఫా, ఇతర కాయ ధాన్య పంటల లానే, ఫైటో-ఈస్త్రోజన్లు (phytoestrogens) ఉత్పత్తి చేస్తుంది. అల్ఫాల్ఫా తినడం గొర్రెలలో ఉత్పత్తి సామర్థ్యం తగ్గించేదిగా భావింపబడుతుంది.

అల్ఫాల్ఫాను మూలికా ఔషధంగా 1,500 ఏళ్ళకు పైగా వాడేవారు. అల్ఫాల్ఫా ప్రోటీన్, కాల్సియం, మరియు ఇతర ఖనిజాలు, B గ్రూప్ లోని విటమిన్లు, C విటమిన్, E విటమిన్, మరియు K విటమిన్లను సమృద్ధిగా కలిగి ఉంటుంది.

సాంప్రదాయిక ఉపయోగాలు
ప్రారంభ చైనీస్ ఔషధాలలో, వైద్యులు అల్ఫాల్ఫా చిగుర్లను జీర్ణ కోశం మరియు మూత్ర పిండాలకు చెందిన రుగ్మతలను సరిచేయడానికి వాడేవారు. ఆయుర్వేదవైద్యంలో, వైద్యులు ఈ ఆకులను బలం లేని జీర్ణ వ్యవస్థ సరిచేయడానికి వాడేవారు. వారు చల్లబరిచే పిండిని విత్తనాల నుండి తయారు చేసి పుండ్లకు వాడేవారు. అప్పట్లో అల్ఫాల్ఫా కీళ్ళ నొప్పులు మరియు నీరు చేరడంవంటి వాటికీ పనికొస్తుందని నమ్మేవారు
  • ===================================
Visit my Website - Dr.Seshagirirao