Pages

Labels

Popular Posts

Saturday 29 October 2011

వంగ-వంకాయ , Brinjal








పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


వంగ - వంకాయ (Brinjal) - తెలుగు దేశములో చాలా ప్రముఖమైన, విరివిగా పెంచబడుతున్న కూరగాయల రకాలలో ఒకటి. దీని చరిత్ర సరిగ్గా తెలీదు, కానీ హిందూ మత శ్రాద్ధ కర్మలందు దీనిని కూడా నిషేధించి ఉన్నందువల్ల దీనిని భారతదేశమునకు ఇతర దేశములకు వచ్చినదిగా భావింపబడుతున్నది, కానీ ఎప్పుడు ఎలా భారతదేశమునకు వచ్చినదో సరిగ్గా తెలీదు. వంకాయలు రకరకాలుగా - చిన్న వంకాయలు, పొడుగు వంకాయలు, తెల్ల వంకాయలు, ఎర్ర వంకాయలు, గుత్తి వంకాయలు - లభిస్తున్నాయి.

ఆరోగ్యకరమైన ఉపయోగాలు :
వంకాయలో ఎక్కువగగా పొటాషియం ఉంటుంది . బి.పి.తగ్గందేందు ఉపయోగపడును .
Nutritional Value of Brinjal, Medicinal value of brinjal
A 100 grams of brinjal contains the following nutritional value




  • * Total Carbohydrates – 17.8g

  • * Protein – 8g

  • * Saturated Fat – 5.2g

  • * Dietary Fiber – 4.9g

  • * Total Fat – 27.5g

  • * Cholesterol – 16mg

  • * Sugars – 11.4g

  • * Iron – 6mg

  • * Vitamin A – 6.4 mg

  • * Calcium – 525 mg

  • * Sodium – 62mg

  • * Potassium – 618mg



  • స్ప్లీన్‌ వాపు(spleenomegaly)లో వంకాయ అమోఘముగా పనిచేస్తుంది . పచ్చి వంకాయ పేస్టు కి పంచదార కలిపి పరగడుపున తినాలి .

  • వంకాయ కొలెస్టిరాల్ తగ్గించేందుకు సహకరిస్తుంది ,

  • వంకాయ , టమటోలు కలిపి వండుకొని కూర గాతింటే అజీర్ణము తగ్గి ఆకలి బాగా పుట్టించును.

  • వంకాయ ను రోస్టు చేసి తొక్కను తీసేసి కొద్దిగ ఉప్పు తో తింటే " గాస్ ట్రబుల్ , ఎసిడిటీ , కఫము తగ్గుతాయి.

  • వంకాయ ఉడకబెట్టి ... తేనె తో కలిపి సాయంతము తింటే మంచి నిద్ర వస్తుంది . నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి ఆహారవైధ్యము .

  • వంకాయ సూప్ , ఇంగువ , వెళ్ళుల్లి తో తయారుచేసి క్రమము తప్పకుండా తీసుకుంటే కడుపుబ్బరము (flatulence) జబ్బు నయమగును .

  • మధుమేహం ఉన్నవారు వంకాయ వలన అన్నము కొద్దిక తినడము వలం , దీనిలోని పీచుపదార్దము మూలాన చెక్కెర స్థాయిలు అదుపులో ఉండును .

  • కొన్ని ఆఫ్రికా దేశాలలో ఫిట్స్ వ్యాది తగ్గడానికి వాడుతున్నారు .

  • వంకాయ రసము నుండి తయారుచేసిన ఆయింట్ మెంట్లు, టించర్లు , మూలవ్యాధి(Haemorrhoids) నివారణలో వాడుతారు .

  • దీన్ని పేదవారి పోటీన్‌ (మాంసము ) గా నూట్రిషనిస్టులు భావిస్తారు .


జాగ్రత్తలు :



  • ఎసిడిటీ , కడుపులో పుండు (అల్సర్ ) ఉన్నవారు వంకాయ తినకూడదు ,

  • గర్భిణీ స్త్రీలు వంకాయ తినడము మంచిది కాదు ..ఎలర్జీలకు దారితీయును.

  • వంకాయ చాలా మందికి దురద , ఎలర్జీ ని కలిగించును .

  • శరీరముపైన పుల్లు , చర్మ వ్యాధులు ఉన్నవారు వంకాయ తినరాదు .


వంటకములు
వంకాయ వంతి కూర, పంకజం వంటి భార్య, భారతం వంటి కధ ఉండవని ఒక నానుడి. అల్లాగే వంకాయ తో వెయ్యి రకాలు అని కూడా ఒక నానుడి. వంకాయలను చప్పిడి కూరగకానీ, పులుసుపెట్టి కానీ వండి తినవచ్చును. ముదురుకాయలును, గిజరుకాయలను కారము పులుసుపెట్టి వండిననేగాని తిన బాగుండవు. ఇటువంటి కాయలను ముందు ఉడుకబెట్టి వార్చి వేసినచో అందలి గిజరు మరికొంత తగ్గును. లేత కాయలను ముందు ఉడకబెట్టకుండ పోపులోనూనెవేసి మ్రగ్గనీయవచ్చును. లేక చమురులో వేచి పైన మసాలాపొడి చల్లవచ్చును. నిడివిగనుండు నీటివంకాయలను ముచికవద్ద కొంతభాగము విడిచి క్రింది భాగమును నాలుగు లేక ఆరు చీలికలుగ దరిగి యందు మసాలా పొదిని కూరి మువ్వలేక గుత్తివంకాయగ కూడ వండి తినవచ్చును. గుండ్రని మెట్ట వంకాయను కాల్చి అల్లమును చెఏర్చి యిగురు పచ్చడిగగానీ, పులుసు పచ్చడిగ గానీ పెరుగుపచ్చడిగగానీ చేయవచ్చును. వంకాయ ముక్కలను సామాన్యపు పులుసులోనూ, మజ్జిగ పులుసులోనూ కూడ తరచు వేయుచుందురు. వంకాయ ముక్కలను వాంగీభాత్‌ మొదలను చిత్రాన్నములలో కూడా ఉపయోగింతురు. బంగాళాదుంప మొదలగు ఇతర కూరలతో కలిపి వండుటయు కలదు. వంకాయ ముక్కలను పలుచని బిళ్ళలుగ తరిగి సెనగవగైరా పిండితో చేసిన చోవిలో ముంచి చమురులో వేచి బజ్జీలుగ చేయవచ్చు.


మరింత వివరమైన వంకాయ వంటకాల కోసం ఈ క్రింది వివరములు చూడండి.

1. వంకాయ వేపుడు కూర
2. వంకాయ కారం పెట్టి కూర
3. వంకాయ పఛ్ఛి కారం కూర
4. వంకాయ ముద్ద
5. గుత్తి వంకాయ కూర
6. వంకాయ ఇగురు
7. వంకాయ పఛ్ఛి పఛ్ఛడి
8. వంకాయ బండ పఛ్ఛడి
9. వంకాయ పులుసు పఛ్చడి
10. వంకాయ టమాటో కూర
11. సాంబారు
12. వాంగీభాత్‌
13. వంకాయ పచ్చడి
14. మజ్జిగ పులుసు
15. వంకాయ బజ్జీ

ఇలా చాలా రకాలు ఛెయ్యవచ్చు.

"Brinjal ni హిందీలో 'బైంగన్' అంటారు. దాని మూలం 'బేగుణ్'- 'ఎలాంటి మంచి గుణాలూ లేనిది' అని దాని అర్థం! నిజంగానే ఆయుర్వేదం ప్రకారం వంకాయలో మనిషికి హాని చేసే గుణాలున్నై గాని, మంచి గుణం ఒక్కటీ లేదు. వంకాయ పై పరిశోధనలు చేసి, దానిలో మనకు హాని చేసేవి ఏవీ లేవని తేలితే తప్ప, నిజానికి మనం‌ ఎవ్వరమూ వంకాయను తిననే కూడదు!




  •  మూలము : English articles from --http://www.nutrition-and-you.com/




  • ============================


Visit my Website - Dr.Seshagirirao...

Saturday 15 October 2011

లక్ష్మణఫలం , Lakshmana phal Fruit








పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. సీజన్‌ వస్తోందంటే చాలు... కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది. మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తుంది. ఆ కోవకే చెందుతాయి సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలాలు. ఈపేర్లు చూస్తే మన పురాణ పురుషులకు ఇష్టమైన పండ్లేవో అనిపించకమానదు. అంతేకాదు, ఇవి అచ్చంగా మనకి మాత్రమే ప్రత్యేకమైన పండ్లేనేవో అనిపిస్తుంది. కానీ వీటి స్వస్థలం మనదేశం కాదు. దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్‌ దేశాల్లో పెరిగే ఈ వెుక్కల్ని మనదేశానికి తొలిసారిగా పోర్చుగీసువాళ్లు పదహారో శతాబ్దంలో తీసుకొచ్చారట. ఆ తరవాత వీటికా పేర్లు ఎవరు పెట్టారో తెలియదుకానీ మనందరికీ ఇష్టమైన రాముడు, సీత, లక్ష్మణ పేర్లు పెట్టేసి తమ భక్తిని చాటుకున్నారు. మనరాష్ట్రంలో ఎక్కువగా పండే సీతాఫలాలతోనే మనకి అనుబంధం ఎక్కువ. కానీ ఉత్తరాంధ్ర, కొన్ని తెలంగాణా జిల్లాల్లోనూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ రామాఫలాలు, లక్ష్మణఫలాలు ఎక్కువగా పండుతాయి. సూపర్‌మార్కెట్ల పుణ్యమా అని ఇప్పుడిప్పుడు ఇవి అన్ని మార్కెట్లిలోనూ కనిపిస్తున్నాయి.





లక్ష్మణఫలం : దీన్నే కొన్ని ప్రాంతాల్లో హనుమాన్‌ ఫలం అనీ పిలుస్తారు. పనసకాయలకు ఉన్నట్లుగా ముళ్లు ఉండటంతో ముళ్ల సీతాఫలం అనీ అంటారు. పండిన తరవాత కాస్త పుల్లని రుచి కలిగి ఉండటంతో పుల్లపండు అనీ అంటారు. అయితే పూర్తిగా పండిన తరవాత పైనాపిల్‌, స్ట్రాబెర్రీ రుచులతో కూడిన అరటిపండు రుచిని తలపిస్తుంది. గింజలు తక్కువ, గుజ్జు ఎక్కువ ఉండే ఈ పండ్లని జ్యూసులు, చాక్లెట్లు, ఐస్‌క్రీముల తయారీలో ఎక్కువగా వాడతారు. రామాఫలం మాదిరిగానే ఇవి కూడా కరీబియన్‌, మధ్య అమెరికా దేశాల్లోనే ఎక్కువగా పండుతాయి. మనదేశంలో ఆంధ్రప్రదేశ్‌, కేరళ, అసోంలలో ఇవి ఎక్కువ. స్థానికులు వీటి ఆకుల్నీ, గింజల్నీ కూడా అనేక రోగాల చికిత్సలో వాడుతుంటారు. ఈ చెట్టు ఆకుల నుంచి తయారుచేసిన ట్రియామెజాన్‌ అనే మందును అనేక మార్కెట్లలో లైసెన్స్‌ లేకుండానే విక్రయిస్తున్నారు. ఇది కాన్యర్‌కు బాగా పనిచేస్తుందని అనేకమంది నిపుణులు పరిశోధన పత్రాల్నీ రూపొందించారు. అందుకే అమెజాన్‌ అడవుల్లో నివసించేవాళ్లు దీన్ని మిరకిల్‌ ట్రీ అని పిలుస్తారు. ముఖ్యంగా పొట్టలోని నులిపురుగుల నివారణకు ఈ పండు అద్భుతంగా పనిచేస్తుందట. బెరడు, వేళ్లతోచేసే ఈ టీ తాగితే డిప్రెషన్‌ తగ్గుతుందనీ చెబుతారు.


  • పోషకాలు: 100 గ్రా. గుజ్జునుంచి

  • 140 క్యాలరీల శక్తి,

  • 39 గ్రా. పిండిపదార్థాలు,

  • 7.5 గ్రా. పీచు,

  • 2.5గ్రా. ప్రొటీన్లూ లభిస్తాయి. విటమిన్‌-సి, విటమిన్‌ బి1, బి2, పొటాషియం కూడా ఎక్కువగా ఉంటాయి.


ఏడాదిపొడవునా దొరికితే బాగుండు అనిపించే మధురమైన రుచి... ఆపై అద్భుత పోషకాలు... అందుకే ఈ ఫలాలు అమృతఫలాలు!


  • ===========================


Visit my Website - Dr.Seshagirirao

రామాఫలం, Rama phal Fruit



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


సీజన్‌ వస్తోందంటే చాలు... కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది. మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తుంది. ఆ కోవకే చెందుతాయి సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలాలు.

ఈపేర్లు చూస్తే మన పురాణ పురుషులకు ఇష్టమైన పండ్లేవో అనిపించకమానదు. అంతేకాదు, ఇవి అచ్చంగా మనకి మాత్రమే ప్రత్యేకమైన పండ్లేనేవో అనిపిస్తుంది. కానీ వీటి స్వస్థలం మనదేశం కాదు. దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్‌ దేశాల్లో పెరిగే ఈ వెుక్కల్ని మనదేశానికి తొలిసారిగా పోర్చుగీసువాళ్లు పదహారో శతాబ్దంలో తీసుకొచ్చారట.

ఆ తరవాత వీటికా పేర్లు ఎవరు పెట్టారో తెలియదుకానీ మనందరికీ ఇష్టమైన రాముడు, సీత, లక్ష్మణ పేర్లు పెట్టేసి తమ భక్తిని చాటుకున్నారు.

మనరాష్ట్రంలో ఎక్కువగా పండే సీతాఫలాలతోనే మనకి అనుబంధం ఎక్కువ. కానీ ఉత్తరాంధ్ర, కొన్ని తెలంగాణా జిల్లాల్లోనూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ రామాఫలాలు, లక్ష్మణఫలాలు ఎక్కువగా పండుతాయి. సూపర్‌మార్కెట్ల పుణ్యమా అని ఇప్పుడిప్పుడు ఇవి అన్ని మార్కెట్లిలోనూ కనిపిస్తున్నాయి.

రామాఫలం :
గుండ్రంగా హృదయాకారంలో ఎరుపురంగులో ఉండే ఈ పండ్ల తొక్క సీతాఫలంకన్నా నునుపుగా ఉంటుంది. దీన్ని నెట్టెడ్‌ కస్టర్డ్‌ యాపిల్‌, బుల్లక్‌ హార్ట్‌, బుల్‌ హార్ట్‌ అని కూడా పిలుస్తారు. తియ్యని వాసనతో మధురమైన రుచిని కలిగి ఉండే ఈ పండు మధ్య అమెరికా, ఐరోపా దేశాల్లో ఎక్కువగా పండుతుంది. సీతాఫలంతో పోలిస్తే ఇందులో గింజలు తక్కువ. అలసిన శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది ఈ జ్యూస్‌. మిగిలినవాటితో పోలిస్తే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. మలేరియా, క్యాన్సర్‌ వ్యాధులకు కారణమైన కణాలను నివారించే గుణం కూడా ఈ పండుకి ఎక్కువే.

పోషకాలు: వంద గ్రా. రామాఫలం నుంచి 75 క్యాలరీల శక్తి, 17.7గ్రా. కార్బొహైడ్రేట్లు, 1.5గ్రా. ప్రొటీన్లు, 3గ్రా. పీచూ లభ్యమవుతాయి. మిగిలినవాటితో పోలిస్తే ఇందులో విటమిన్ల శాతం ఎక్కువ. సి- విటమిన్‌తో పాటు బి-కాంప్లెక్స్‌లోని పైరిడాక్సిన్‌ ఇందులో సమృద్ధిగా ఉంటుంది. ఈ పైరిడాక్సిన్‌ మెదడు కణాలకు అవసరమైన రసాయనాల్ని స్థిరంగా ఉంచేందుకు దోహదపడుతుంది. నరాల వ్యాధులు, తలనొప్పి వంటివి రాకుండా కాపాడేందుకు తోడ్పడుతుంది.



  • ============================================
Visit my Website - Dr.Seshagirirao

Monday 10 October 2011

దవనం నూనె ,Artimissia.pallense (దవనం)Oil,మాచపత్రి , Artmisia indica




పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



Plant name: (Sanskrit) Machi patram (Telugu)(Davanam(Machapatri)–Botanical name:Artmisia indica (మాచ పత్రి )
A.pallense(Family: Asteraceae) (దవనం)A.Small aromatic herb. In some books it is written as A.Pallens.Medicinal Use: Aromatic, tonic, anti malarial & digestive.

ఇండియన్ మెడిసిన్ అయిన ఆయుర్వేదంలోను, యునాని వైద్యంలోను దవనానికి ఒక ప్రత్యేక స్ధానముంది. దవనం మొక్క మంచి ఔషధ ప్రయోజనాలను కల్పిస్తుంది. సాధారణంగా దీనిని హిందువులు కొన్ని మతపర వేడుకలలో వాడుకోవటమే చాలామందికి తెలుసు , దవనం నూనె వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో పరిశీలిద్దాం.

  • దవనం నూనెను సువాసన కొరకు వాడతారు. ఈ నూనె వాసన ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది.
  • శరీరంపై వచ్చే దద్దుర్లు, పుండ్లు మొదలైనవాటిని దవనం నూనె తగ్గిస్తుంది. మహిళలు తమ కాన్పు తర్వాత పొట్టపై వచ్చే స్ట్రెచ్ మార్కులను పొగొట్టుకోటానికి దవనం నూనెను పొట్ట భాగంపై రుద్దుతారు. రుతుక్రమం సరిగా రావటానికి, తిన్న పదార్ధాలు జీర్ణం కావటానికి కూడా ఈ రకమైన మర్దన చేస్తారు.
  • దవనం నూనె శరీరంలో బ్లడ్ షుగర్ స్ధాయిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. దీనిని షుగర్ వ్యాధి వున్న వారికిచ్చే మందులలో కలుపుతారు.
  • దవనం నూనెను కండరాల నొప్పులకు సడలింపు కు మంచి ఔషధంగా వాడవచ్చు. నూనెను మర్దన చేస్తే అలసటను దూరం చేస్తుంది.
  • వేడి నీటిలో కొద్దిపాటి నూనె చుక్కలను వేసి ఆవిరి పడితే లంగ్స్ శుభ్రపడి శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గుతాయి
  • దురదతో కూడి పెచ్చులు పెచ్చులుగా ఉండే చుండ్రు నివారణకు జిరానియమ్‌, దవనం, జూనిపర్‌, చందనం నూనెలను, రేగు నూనెతో కలిపి రాసినట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది
  • పొడిజుట్టు కు ఉసిరి శీకాకాయ, బ్రాహ్మీ లేక వెచ్చని నువ్వుల నూనెను ఆవశ్యకమైన దవనం, జిరానియం లేక జునిపర్‌ నూనెలతో కలిపి వాడాలి. జుట్టు బాగుంటుంది .
  • ===========================================
Visit my Website - Dr.Seshagirirao

Sunday 9 October 2011

అవిసె గింజలు-నూనె,linseed-Oil,Flax Seeds













  • image : courtesy with Andhraprabha News paper




పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



 అవిశ (ఫ్లాక్స్ ) సన్నని కాడలతో 1.2 మీటర్లు, (3ఫీట్ల 11 ఇంచుల)పొడవుగా, నిటారుగా పెరుగుతున్న వార్షిక వృక్షం. మొక్క చివర్లు 20-40 మిటర్లు పొడవు, 3 మీటర్లు వెడల్పు కలిగి ఉంటుంది. పూలు స్వచ్ఛమైన నీలం రంగులో ఉండి, 5 రేకలతో (15-25) మీటర్ల వెల ల్పు ఉంటాయి. దీని పండు గుండ్రంగా, ఒక చిన్న యాపిల్‌ మాదిరిగా ఉంటుంది. దీనిలోని గింజలు గోధుమ విత్తనాలవలే అదే రంగులో ఉంటాయి. దీని ఆకులు ముదరాకుపచ్చ రంగులో ఉండి వాటిలో గ్లూకోజ్‌ పిండిపదార్ధం ఆయుర్వేద పరంగా ఉపయోగపడుతుంది.



  • ఉపయోగాలు:


అవిశ వృక్షాల్ని గింజల కోసం పెంచడం జరుగుతుంది. ఎందుకంటే వాటిలో ఫైబర్‌ అధిక శాతంలో లభ్యమ వుతుంది. అవిశె పలు ప్రాంతాల్లో ఫ్యా బ్రిక, అద్దకం, కాగితం, మందులు, ఫిషింగ్‌ వలలు, జుట్టుకోసం ఉపయోగించే జల్‌లు, రకరకాల సబ్బులు చేయడానికి ఉపయోగి స్తారు. అవిశ విత్తనాలనుండి ఉత్పత్తయ్యే నూనెను మనం వంటకు ఉపయోగిస్తాము. ఈ నూనెలో ఎలర్జీని నివారించే గుణం ఉంది. అంతేకాక ఫర్నిచర్‌ ఉత్పతుల్లో ఒక మూల వస్తువుగా కూడా దీనిని వినియో గిస్తారు. ఆయుర్వేద వైద్య విధానంలో అవిశె చెట్టు వేరు, ఆకులు, విత్తనాలు, బెరడు మొదలైన అన్ని భాగాల్లోను ఔషధగుణాలు ఉండటం చేత దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది.




  • గోధుమరంగు ఫ్లాక్స విత్తనాలు:


అవిశ విత్త నాలు రెండు రకాలు 1)గోధుమ రంగు 2) పసుపు పచ్చరంగు. ఈ రెండు రకాలలోను ఒకే విధమైన పోషక విలువలు ఉన్నాయి. దీని నుండి తయారు చేసిన చమురు చాలా విలక్షణంగా ఉంటుంది. అవిశ నారను పశువుల దాణాలో ఒక మూలవస్తువుగా వాడతారు. ఇదే అవిశ నూనెని పూర్వకాలంలో వంట నూనెగా వాడేవారు. దీని చమురు వాణిజ్య పరంగా చాలా వినియోగంలో ఉండేది. నేటికీ దీనిని చాలా మంది వాడుతూనే ఉన్నారు. అందుకే ఇది పురాతన వాణిజ్య నూనెల్లో ఒకటి. ఈ నూనె చాలా మృధువుగా, పొడిగా కూడా ఉండటం వల్ల, ఔష ధగుణాలు కలిగివుండ టం వల్లా వాణిజ్య రంగంలో మంచి డిమాండ్‌ కలిగివుండేది.

అవిశె విత్తనాల్ని బీహార్‌ ప్రాంతంలో, ఉత్తర భారతదేశంలో 'టిసి' అని పిలుస్తారు. కాల్చిన ఈ విత్తనాల పొడిని ఉడికించిన అన్నంతో తింటారు. పూర్వం రోజుల్లో గ్రామాల్లో వీటిలో కొద్దిగా ఉప్పు, నీరు వేసుకుని కూడా తినేవారు. ఈ అవిసెగింజలు జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఉదర సంబంధ వ్యాధుల్ని నివారిస్తుంది. అవిశ విత్తనాలు చాలా కాలం నిలవ వుండే గుణం కలిగి ఉన్నందున వీటినీ కాలాను గుణంగా కూడా వినియో గించుకోవచ్చును. ఇక ఈ అవిశలో ఉండే



పోషక విలువలు ఏ విధంగా ఉన్నాయంటే...

  • విత్తనం పోషక విలువ 100 గ్రా (3.5)

  • ఉత్పాదకత 2,234కెజె (534కెకాల్‌)

  • కార్బొహైడ్రేట్లు 28.88గ్రా

  • చక్కెర 1.55గ్రా

  • పీచు పదార్థం 27.3గ్రా

  • కొవ్వు 42.16గ్రా

  • ప్రొటీన్స్‌ 18.29గ్రా

  • విటమిన్‌ బి1 1.644ఎంజి (143%)

  • విటమిన్‌ బి2 0.161ఎంజి (13%)

  • విటమిన్‌ బి3 3.08ఎంజి(21%)

  • విటమిన్‌ బి5 0.985ఎంజి (20%)

  • విటమిన్‌ బి6 0.473 ఎంజి (36%)

  • విటమిన్‌ బి9 (0%)

  • విటమిన్‌ సి 0.6ఎంజి (1%)

  • కాలిషియం 255ఎంజి (26%)

  • ఐరన్‌ 5.73 ఎంజి (44%)

  • మాగ్నీషియం392ఎంజి(110%)

  • పాస్పరస్‌642ఎంజి(92%)

  • పొటాషియం 813ఎంజి(17%)

  • జింక 4.34ఎంజి(46%)













సాధారణంగా అక్కడక్కడా రహదారి వెంట కనిపించే ఈ వృక్షాల్ని సామాన్య ప్రజానీకం అంతగా పట్టించుకోరు. అందుకు కారణం వృక్షశాస్త్ర పరిజ్ఞానం ప్రాధమిక స్థాయి నుం చీ లేకపోవడమే. అసలు చిన్న తరగతుల నుంచీ మొక్కలు, వాటి ఉపయోగాలు ఒక ప్రత్యేక పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టి, అంద రికీ అవగాహన కలిగించివుంటే నేడు ప్రతి చెట్టుకీ ఒక ప్రత్యేక స్థానం ఏర్పడేది.




  • ఆరోగ్యాన్నిచ్చే ఆహార పదార్థాలను ఏదైనా ఇష్టంగా తినాలి. కష్టంగా మాత్రం తినొద్దు. రోజువారీ ఆహారంలో అవిసె గింజల్ని భాగం చేసుకుని తినేవారి ఆరోగ్యం ఎక్కువ కాలం సురక్షితంగా ఉంటుంది. ఇందుకు సాక్ష్యం పాతతరం వారు. ఆ రోజుల్లోనే అవిసెగింజలతో చిట్కా వైద్యాలు ఎన్నో చేశారు మన పెద్దవాళ్ళు. ఎముకల అరుగుదల, జాయింట్ పెయిన్స్‌తో బాధపడేవారు అసె గింజలను ఆహార పదార్థాలతో పాటు తీసుకుంటే ఈ రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. వీటిలో ఉండే ఒమేగా యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా కొలెస్టరాల్ స్థాయిలు చాలా వరకూ తగ్గుతాయి.అవిసె నూనె వలన కూడా చాలా లాభాలున్నాయి


అవిసె గింజలు మెదడుకు శక్తిని పెంచే ఆహారం. వీటిలో ఉండే ప్యాటీయాసిడ్లు ఎమర్జెన్సీగా పనిచేసి డిప్రెషన్‌ను కూడా సమర్థవంతంగా నివారించ గలుగుతాయి.



అవిసెలో పీచు అధికంగా లభిస్తుంది. కనుక మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. .



సూర్య కిరణాల వేడికి చర్మం దెబ్బతినకుండా ఈ గింజల నుండి తీసే నూనె రాసుకోవడం వలన చర్మరక్షణ లభిస్తుంది.



ఆస్తమా, ఎలర్జీల నుండి ఉపశమనం అవిసె నూనె వలన లభిస్తుంది.



చుండ్రు సమస్యను సమర్థవంతంగా నివారించి, పేలు నశించేట్లు చేయడంలో అవిసె నూనెను మించింది లేదు. వెంట్రుకలు కూడా మళ్ళీ పెరిగి జుత్తు చిక్కగా తయారవుతుంది.



 ప్రస్తుతం పని ఒత్తిడి కారణంగా చాలామంది తలనొప్పితో బాధపడుతున్నట్లు సర్వేలు చెపుతున్నాయి. అధిక తలనొప్పితో బాధపడుతుంటే అవిసె నూనెను ఉపయోగించిన వంటలు లేదా అవిసె ఆకును ఆహారంగా తీసుకుంటుంటే తలనొప్పి మటుమాయం.





అలాగే నడివయసులో వచ్చే కీళ్ళ సమస్యలు, నడుము నొప్పితో బాధపడేవారు కూడా అవిసె నూనెతో చేసిన వంటకాలు వాడుతుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.



 అవిసె గింజల నుంచి తయారు చేసిన నూనెలో ఒమెగా-3, ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండటంతో శరీరంలోని రక్త సరఫరాకు అంతరాయం లేకుండా చేస్తాయి. దీంతో గుండెనొప్పి, మధుమేహం, క్యాన్సర్‌లాంటి దీర్ఘకాలిక వ్యాధులు దరి చేరవంటున్నారు ఆరోగ్య నిపుణులు.



అవిసె నూనెలో విటమిన్ 'ఈ' పుష్కలంగా ఉంది. కుష్టువ్యాధితో బాధపడేవారికి ఈ నూనెను వంటలలో ఉపయోగించి ఆహారంగా సేవిస్తుంటే లాభదాయకంగా ఉంటుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.



 కాలిన గాయాలపై అవిసె నూనె నురుగును పూస్తే మంట, నొప్పినుంచి ఉపశమనం కలగుతుంది. అవిసె ఆకును వేంచుకుని మేక పాలలో ఉడకబెట్టుకుని ఆలేపనాన్ని పుండ్లపై పూస్తే పుండ్లు, కురుపులుంటే మటుమాయమవుతాయంటున్నారు ఆయుర్వేదవైద్యులు.



తైలవర్ణ చిత్రలేఖనం అనేది ఆరిపోయే తైల మాధ్యమానికి నిబద్ధమై ఉండే వర్ణద్రవ్యాలను ఉపయోగించే ఒక చిత్రలేఖన ప్రక్రియ - ప్రారంభ ఆధునిక ఐరోపాలో ఈ చిత్రలేఖన పద్ధతిలో సీమ అవిసె నూనె (లిన్సీడ్గ ఆయిల్‌)ను ఎక్కువగా ఉపయోగించేవారు. తరచుగా సీమ అవిసె నూనె వంటి చమురును దేవదారు సర్జరసం (రెసిన్‌) లేదా ఫ్రాంకిన్‌సెన్స్‌ (వివిధ అరేబియా లేదా తూర్పు ఆఫ్రికా ప్రాంత చెట్ల నుంచి తయారు చేసే ఒక సుగంధ భరితమైన జిగురు రెసిన్‌తో వేడిచేస్తారు. వీటిని ''వార్నిషూలు'' అని పిలుస్తారు.



  • ================================


Visit my Website - Dr.Seshagirirao

Soup , సూప్‌(చారు)



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


వేడిగా పొగలు కక్కుతూ ఉండే సూప్‌ను చెంచాతో తీసుకుని ఆరగించడమంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే బయట హోటల్లలో దొరికే చాలా సూప్‌లు నాన్‌వెజ్‌వే కావడం తెలిసిందే. రక్తం, రసం, నీళ్లు లేదా ఇతర ద్రవంతో మాంసం మరియు కూరగాయలు వంటి వంట సరంజామాను చేర్చడం ద్వారా తయారు చేసే ఆహారాన్ని చారు (సూప్) అంటారు. రసాలను సేకరించే వరకు ఒక కుండలోని ద్రవాల్లో ఘన ఆహార పదార్థాలను వేడి చేయడం ద్వారా బ్రోత్ (మాంసంవేసి కాచిన చారు) తయారవుతుంది, దాంతో సూప్ మీద ఎంత ఇష్టం ఉన్నా శాఖాహారులు వాటిని తీసుకోవడానికి జంకుతారు. అందుకే ఇలాంటి వారికోసం వెజిటేరియన్ సూప్‌ని పరిచయం చేస్తున్నాం.

భోజనానికి ముందు ఏదైనా సూప్ తాగడము వలన ఆహారము తగ్గించి తీసుకోవడానికి తోడ్పడుతుంది . అధ్యయనాలు పేర్కోంటున్నాయి. సూప్ లేకుండా భోజనము చేసినవారికన్నా పూరి భోజనానికి ముందు సూప్ తీసుకున్న వాళ్ళలో కేలరీల మొత్తం ఇంటేక్ 20% తగ్గినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి .

ఈ వెజిటేరియన్ సూప్ తయారీకి కావలిసినవి : క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, టమోటాలు, వెల్లుల్లి, ఆలివ్ నూనె, చీజ్ 25 గ్రాములు, ఉప్పు, మిరియాలపొడి.

తయారుచేసే విధానం : క్యాబేజీ ఆకు ముకల్ని చిన్న ముక్కలుగా కత్తరించుకోవాలి. దీంతోపాటు అన్నిరకాల కూరగాయలను కూడా చిన్నపాటి ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో ఆలివ్ ఆయిల్ వేసి స్టౌమీద పెట్టాలి. నూనె కాగగానే వెల్లుల్లి వేయాలి. తర్వాత తరిగిపెట్టుకున్న కూరగాయలు వేయాలి.

ఈ సమయంలో టమోటాలు మాత్రం వేయకూడదు. కూరగాయలు కొద్దిగా వేగగానే నాలుగు గ్లాసుల నీరు పోసి ఉడికించాలి. కూరగాయలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత టమెటాలను కూడా వేసి బాగా ఉడికించాలి. చివరగా సరిపోయేంత ఉప్పు వేసి మళ్లీ ఉడికించాలి.

మొత్తం కూరగాయలు ఉడికి సూప్‌లాగా తయారైన సమయంలో స్టౌనుంచి దించేయాలి. ఇలా తయారు చేసిన సూప్‌ను వేడిగా ఉన్నప్పుడే చప్పరిస్తే ఆ రుచే వేరు.

సూప్ పూర్తి వివరాల కోసము --> Soup , సూప్‌(చారు)
  • ============================================
Visit my Website - Dr.Seshagirirao