Pages

Labels

Popular Posts

Monday 19 December 2011

ఆఫీసులో ఉద్యోగినులు-పోషకాహారం అవగాహన , Women employees-Nutritiona food Awareness


  • image : courtesy with Eenadu newspaper.

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


ఆఫీసులో ఉద్యోగినులు-పోషకాహారం అవగాహన :

ఆఫీసులో పని కాస్త ఎక్కువయితే కాఫీలు, టీలు. కొద్దిపాటి విరామం దొరికితే సమోసాలు, బజ్జీలు. క్షణం తీరిక లేకుండా ఉంటే భోజన విషయం పక్కనపెట్టి పనిలో మునిగిపోవడం. ఉద్యోగినుల్లో ఎక్కువమంది పాటించే ఆహారపు అలవాట్లివి. బరువును పెంచి, ఉత్సాహాన్ని తగ్గించే ఈ అలవాట్లకు బదులుగా ఆఫీసులో ఉద్యోగినులు తీసుకోవాల్సిన పోషకాహారం గురించి నిపుణులు ఇలా వివరిస్తున్నారు.

ఆఫీసులో ఉన్నప్పుడు ఒకటికి నాలుగు సార్లు టీ, కాఫీలు సేవించడం.. శీతలపానీయాలు తాగడం అందుబాటులో ఉండే జంక్‌ఫుడ్‌ను లాగించేయడం చాలామందికి అలవాటు. ఇవి శరీరానికి నూతనోత్సాహాన్ని అందించడానికి బదులు శక్తిహీనంగా మార్చేస్తాయి. ఏకాగ్రతని దెబ్బతీస్తాయి. అందుకే ఈ అలవాట్లను నియంత్రించడం లేదా కాఫీ, టీలను ఆరోగ్యకర పానీయాలుగా మలుచుకోవడం చాలా అవసరం.

స్పానీటితో... శక్తినిచ్చే టీలు
స్పా వాటర్‌.. మినరల్‌ వాటర్‌ మాదిరిగానే ఈ మధ్యకాలంలో మార్కెట్‌లో ఈ నీళ్ల సీసాలు లభ్యమవుతున్నాయి. ఆరోగ్యకరమైన, ప్రత్యేకమైన ఖనిజ లవణాలని అందించే ఈ నీటిని జోడించి ఆఫీసులో సొంతంగా హెర్బల్‌ టీలు చేసుకోవచ్చు. పంచదార వాడకాన్ని తగ్గిస్తే కెలొరీలు తగ్గి అధిక బరువు సమస్య ఉండదు.

* దంచిన పుదీనా ఆకులు, అల్లం, నిమ్మ, బత్తాయి రసాలు వీటిలో ఏవి దొరికితే వాటిని గ్లాసుడు చల్లని స్పా నీటిలో కలిపి, చెంచా పంచదార వేసి టీ చేసుకోవచ్చు. దీని నుంచి 15 కెలొరీలు మాత్రమే అందుతాయి.

* స్పా నీటితో చేసిన బ్లాక్‌టీ, గ్రీన్‌టీ, డీకేఫ్‌ పానీయాలు(కెఫీన్‌ లేనివి) ఆరోగ్యదాయకం.

* దాల్చినచెక్క, వెనిల్లా టీలు పంచదార వేయకపోయినా రుచిగానే ఉంటాయి. మామూలు టీ, కాఫీలకు బదులు ఈ టీలు తాగడం వల్ల ఫ్లవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా అంది శరీరం నూతనోత్సాహం సంతరించుకొంటుంది. పనిపై ఏకాగ్రత పెరుగుతుంది.

కెలొరీలు లేని కాఫీలు
టీ కంటే కాఫీ తయారీలో పాలు ఎక్కువ పడతాయి. అందుకనుగుణంగా రుచికోసం వాడే క్రీం, పంచదార వినియోగమూ ఎక్కువే. ఫలితంగా కాఫీ అందించే కెలొరీలు ఎక్కువే! ఒక పెద్ద కప్పు కాఫీ నుంచి అందే కెలొరీలు 300 నుంచి 400 వరకు ఉంటాయి.

* ఒక చిన్న చెంచా పంచదారతో.. మీగడ లేని కాఫీ తాగడం వల్ల సమస్య ఉండదు.

అప్పటికప్పుడు అందుబాటులో పండ్లరసాలు
క్యాంటీన్‌కు వెళితే సోడా అధికంగా ఉండే శీతల పానీయాల వైపు మనసు మళ్లడం సాధారణమే! బదులుగా బజారులో దొరికే పండ్ల గుజ్జుని కొనిపెట్టుకొని అవసరం అయినప్పుడు చల్లని మినరల్‌ వాటర్‌ లేదా స్పా నీళ్లతో కలుపుకోవచ్చు. రెండు చెంచాల గుజ్జుకు గ్లాసుడు నీళ్లు కలపొచ్చు.

* కప్పు శీతలపానీయాల నుంచి 150 కెలొరీలు అందితే.. ఈ రకం పండ్లరసం నుంచి 18 కెలొరీలు మాత్రమే అందుతాయి.

తాజాగా ఫ్రూట్‌ కూలర్లు..
సూపర్‌మార్కెట్లలో తక్షణ శక్తినిచ్చే ఎనర్జీ డ్రింకులు దొరుకుతున్నాయి. కానీ వీటిల్లో ఉండే కెలొరీలు ఎక్కువే. బదులుగా కప్పు ఐసు, కప్పు మినరల్‌ వాటర్‌, కొద్దిగా స్టాబెర్రీలు వేసి మిక్సీలో ఒకసారి తిప్పాలి. గ్లాసులోకి తీసుకొని పుదీనాతో అలంకరించుకొని తాగేయండి. రుచితో పాటు శక్తి కూడా!

ఆరోగ్యకరంగా.. డెస్క్‌టాప్‌ పానీయాలు
కొన్ని రకాల విధి నిర్వహణల్లో భాగంగా రాత్రి షిఫ్టుల్లోనూ పనిచేయాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో టీ, కాఫీలు, కోలాలకు బదులుగా పంచదార కలపని ఈ పానీయాలని ప్రయత్నించవచ్చు.

* కొవ్వు లేని పాలు
* కొవ్వులేని పాలతో చేసిన హాట్‌ చాక్లెట్‌ పానీయం.
* కొద్దిగా స్పావాటర్‌ వాడిన పండ్ల రసం.
* నెక్టర్‌ వాడి చేసిన పండ్లరసం. నెక్టర్‌ అంటే సహజసిద్ధంగా పూలు, పండ్లను నుంచి సేకరించిన చక్కెర పదార్థం.

ఆఫీసు బ్యాగులో పోషకాహారం
* సాయంకాలం ఉపాహారం తినే సమయంలో చాలా మంది ప్రాధాన్యం ఇచ్చేది సమోసా, పిజా, బర్గర్‌, చిప్స్‌ వంటి వాటికే! బదులుగా ఉప్పు తక్కువగా ఉండే సూప్‌లు లేదా గుప్పెడు వాల్‌నట్లు, బాదం వంటివి తీసుకోవచ్చు. వీటి వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు.

* మనకోసం మనం చేసుకొనే పదార్థాల్లో వేటి మోతాదు ఎంత మేరకు ఉంటే.. ఆరోగ్యదాయకమో మనకు బాగా తెలుస్తుంది. ఉద్యోగ పనుల్లో ఆరోగ్యం గురించి ఆలోచించడానికి క్షణం తీరిక లేదు అనుకొనేవారు ఒక రోజు ముందుగానే పండ్లని ముక్కలుగా తరిగి జిప్‌లాక్‌ బ్యాగులో వేసుకోవాలి. ఆఫీసుకెళ్లేటప్పుడు బాక్సులో తీసుకెళ్లిపోవచ్చు.

* ఆకలి వేసినప్పుడు ఏదో ఒకటి తినేద్దాంలే అనుకోకుండా ఉండాలంటే .. బేబీ క్యారట్‌, తృణధాన్యాలతో చేసిన బార్లు, మొలకలు వంటి వాటిని బ్యాగులో వేసుకొని వెళితే మేలు. కొంతవరకైనా జంక్‌ ఫుడ్‌కి దూరంగా ఉండగలుగుతారు.

* వంట చేయడాన్ని ఆస్వాదించేవారు తక్కువ సమయంలో అయిపోయే కార్న్‌చాట్‌, చపాతీ రోల్స్‌ వంటి వాటిని ఎంచుకోవచ్చు. వెంట తీసుకెళ్లవచ్చు. బజ్జీలు, సమోసాలకు బదులు పాప్‌కార్న్‌, బేల్‌పూరీలు మంచి ప్రత్యామ్నాయాలు.

* నలుగురితో కలిసి తినే బిస్కెట్లను తక్కువ అంచనావేయొద్దు. రెండు మూడు బిస్కెట్లలో కూడా బోలెడు కెలొరీలు, కొవ్వు, పంచదార ఉంటాయి.

* ఆఫీసులో పార్టీ అనగానే క్యాంటీన్‌లో కనిపించే చాక్లెట్లని తినేస్తుంటారు చాలామంది. సాధారణ చాక్లెట్‌కన్నా హాట్‌ చాక్లెట్‌ డ్రింక్‌ మంచి ప్రత్యామ్నాయం. ఎందుకంటే దీనిలో మూడు గ్రాముల కొవ్వు, 140 కెలొరీలు శక్తి మాత్రమే ఉంటే, చాక్లెట్‌ని నేరుగా తినడం వల్ల 230 కెలొరీల శక్తి, 13 గ్రాముల కొవ్వు చేరుతుంది.

ఎండుఫలాలు.. వేయించిన సెనగలు
ఇంటి నుంచి వస్తూ వస్తూ తాజా పోషకాహారాన్ని తెచ్చుకోవడానికి వీలుపడట్లేదు అనుకొనేవారు.. ఆఫీసులో భద్రపరుచుకొనే ఆహారాలివి.

ఒక డబ్బా నిండా ఎండు ఫలాలు, పీచు అధికంగా ఉండే పోషకాహార బిస్కెట్లు, ఇన్‌స్టంట్‌ భేల్‌పురీ, వేయించిన సెనగలు, బఠాణీలు, మరమరాలు ఉంచుకోవచ్చు.

పనివేళల్లో ఆహారం.. అప్రమత్తం
* 'పని ఎక్కువగా ఉంది' అని వేగంగా తినడం మంచి పద్ధతి కాదు. ఇలా అయితే అనుకొన్న దాని కంటే ఎక్కువగా తినేస్తారు. అలాగే చేయబోయే పని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఆహారంపై దృష్టిపెట్టకపోయినా పెద్దగా ఫలితం ఉండదు. ఎంత పనిలో ఉన్నా సరే భోజనం తినేటప్పుడు కొంత విరామాన్ని తప్పక తీసుకోవాలి.
  • ====================================
Visit my Website - Dr.Seshagirirao...

Sunday 18 December 2011

Which cooking oil is good for health?,వంటనూనెలలో ఆరోగ్యానికి ఏది మంచిది?



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

  • 'అన్ని నూనెలూ ఆరోగ్యానికి హాని చేస్తాయి.. కొవ్వు పెంచేస్తాయి..' వంటి భావనలు చాలామందిలో పేరుకుపోయాయి. నిజానికి ఇది పూర్తిగా వాస్తవం కాదు . నూనెల నుంచి లభించే అన్ని రకాల కొవ్వుపదార్థాలు అనారోగ్యం కలిగించవు. వాటిల్లో ఉపయోగపడేవీ ఉంటాయి. ఆ వివరాలు తెలుసుకుని, పరిమితంగా వాడితే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.

శరీర పనితీరు బాగుండాలంటే విటమిన్లు, ఖనిజాలు ఎలా తప్పనిసరో కొవ్వుల వాడకం కూడా అంతే ప్రధానం. ముఖ్యంగా ఎ, డి, ఇ, కె వంటి కీలక విటమిన్లు శరీరానికి నేరుగా అందాలంటే కొవ్వులని ఆహారంలో తప్పక తీసుకోవాలి. ఇవి మనం తినే పప్పుల నుంచీ, తృణధాన్యాల నుంచీ కొంతవరకు అందితే.. మరికొంత వంటల్లో వాడే నూనెల నుంచి అందుతాయి. ఇంకొంత శాతం శరీరమే స్వయంగా విడుదల చేస్తుంది.


  • కొవ్వుల నుంచి ప్రధానంగా విటమిన్‌ ఎ, డి, ఇ, కె వంటి విటమిన్లు లభిస్తాయి. వీటితో పాటు వాటికుండే రంగు, రుచి, వాసన, ఇతర పోషకాల కారణంగా నూనెలు ప్రత్యేకతలను సంతరించుకొంటాయి. ముఖ్యంగా వాటిలోని ఫ్యాటీ యాసిడ్ల మేళవింపు, మోతాదు కారణంగానే నూనెలు ఎంత వరకు ఆరోగ్యప్రదం అన్న విషయం తెలుస్తుంది. ఈ ఫ్యాటీ యాసిడ్లు మూడు రకాలుంటాయి. ఒకటి శాచురేటెడ్‌ అయితే తక్కినవి అన్‌శాచురేటెడ్‌ రకాలు. అన్‌శాచురేటెడ్ లో మోనో అన్‌శాచురేటెడ్‌ (మూఫా-MUFA), పాలీ అన్‌శాచురేటెడ్‌(పూఫా-PUFA) ఉంటాయి.

శాచురేటెడ్‌ కొవ్వులు సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద ఘన రూపంలో ఉంటాయి. వాస్తవానికి శరీరం ఎప్పటికప్పుడు కావాల్సినంత శాచురేటెడ్‌ కొవ్వులని ఉత్పత్తి చేసుకొంటుంది. అయినా శాచురేటెడ్‌ కొవ్వులని బయట నుంచి అదనంగా వాడటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అలాని పూర్తిగా దూరంగా ఉండటం కూడా మంచిది కాదు. ఎందుకంటే శరీర పనితీరుకు ఈ కొవ్వులు తప్పనిసరిగా అవసరం అవుతాయి.

  • ఇక మోనో అన్‌శాచురేటెడ్‌, పాలీ అన్‌శాచురేటెడ్‌ కొవ్వులని కలిపి అన్‌శాచురేటెడ్‌ కొవ్వులుగా వ్యవహరిస్తారు.

మోనో అన్‌శాచురేటెడ్‌ అంటే, ఇవి గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటాయి. రిఫ్రిజిరేటర్‌లో పెట్టగానే ఘనరూపంలోకి వస్తాయి. ఆరోగ్యపరంగా కూరలు, వేపుళ్లలో ఉపయోగించడానికి మోనో అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు చక్కగా ఉపయోగపడతాయి. వేరుసెనగ, నువ్వులు, కనోలా, ఆలివ్‌ నూనెలు ఈ కోవకు చెందుతాయి. ఆలివ్‌ నూనె తప్ప తక్కినవి అధిక ఉష్ణోగ్రతలకు గురిచేసినా కూడా వీటిల్లో పెద్దగా మార్పు ఉండకపోవడం విశేషం.


  • పూఫా అధికంగా ఉండే నూనెలు శరీరానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా రక్తంలోని చక్కెర స్థాయులని నియంత్రిస్తాయి. టైప్‌ 2 మధుమేహం సమస్యని నియంత్రిస్తాయి. గుండెజబ్బులు, రొమ్ముక్యాన్సర్‌ రాకుండా అడ్డుకొంటాయి. సోయాబీన్‌ నూనె, సన్‌ఫ్లవర్‌ నూనెల్లో ఈ పూఫా అధికంగా లభ్యమవుతుంది.

కొలెస్ట్రాల్‌
  • శరీర పనితీరు చురుగ్గా ఉండటానికి, పాడయిన శరీర కణాలు కోలుకోవడానికి కొలెస్ట్రాల్‌ కొంతమేరకు అవసరమే. ఇది తగినంతగా లేకపోతే కుంగి పోవడం, నిరాశలోకి కూరుకుపోవడం, ఊపిరితిత్తుల సమస్యలు, కొన్నిసార్లు క్యాన్సర్ల బారినపడటం కూడా జరుగుతుంది. కొలెస్ట్రాల్‌ని సాధారణంగా గుడ్లు, మాంసం, ఇతర పాల ఉత్పత్తులన నుంచి పొందితే.. శరీరంలోని కాలేయం నుంచి కూడా కొంతవరకు అందుతుంది.

కొలెస్ట్రాల్‌లో రెండు రకాలుంటాయి. ఒకటి లో డెన్సిటీ లిపో ప్రొటీన్స్‌ ఉండే (ఎల్‌డీఎల్‌) రకం. ఇది చెడు కొలెస్ట్రాల్‌. శాచురేటెడ్‌ ఫ్యాట్లు అధికంగా ఉండే ఆహారం తినేవారిలో ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ అధికంగా చేరుకొంటుంది. ఇవి గుండె జబ్బులు రావడానికి కారణం అవుతాయి. మరొకరకం కొవ్వు హెచ్‌డీఎల్‌.. దీన్నే హైడెన్సిటీ లిపోప్రొటీన్స్‌ అని కూడా అంటారు. ఇవి మంచి రకం కొవ్వులు.

  • ట్రాన్స్‌ఫ్యాట్లతో.. అప్రమత్తం
నూనెలను రుచికోసం కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో రసాయనిక చర్యలకు గురిచేసి ట్రాన్స్‌ ఫ్యాట్లుగా లేదా హైడ్రోజినేటెడ్‌ నూనెలుగా మారుస్తారు. బేకరీ, ప్యాక్‌ చేసిన పదార్థాల్లో.. రెస్టారెంట్లలో వీటిని ఉపయోగిస్తారు. సలాడ్‌ డ్రెస్సింగుల్లోనూ వాడతారు. ఇవి తక్కిన వాటితో పోలిస్తే చౌకగా ఉంటాయి. వనస్పతి ఈ కోవకి చెందినదే! ఇవి శరీరానికి హాని చేస్తాయి.

  • మేలు నూనెల గుర్తింపు ఎలా?
వంట నూనెల్లో.. ఇతరత్రా వంటకు పనికిరాని నూనెలని కలపడం ద్వారా వాటిని కల్తీకి గురిచేస్తారు. ఉదాహరణకి ఆముదం, ఆర్గీమోన్‌, మినరల్‌ నూనెలని వంటకు వాడే నూనెల్లో కలపడం ద్వారా కలుషితం చేసే వీలుంది. కొన్ని సందర్భాల్లో కాటన్‌సీడ్‌, పామోలీన్‌ వంటి చౌక నూనెలనూ ఇందుకు ఉపయోగిస్తారు. నూనెలు బాగా ముదురు రంగులో కనిపించినా, ముక్కవాసన వచ్చినట్టున్నా.. అప్పడాలు వంటివి వేయించిన వెంటనే రుచిలో తేడాగా ఉన్నా అది వాడేసిన నూనెగా గుర్తించాలి. ఒకసారి వాడిన నూనెలని మరోసారి మరిగిస్తే అవి అనేక అనారోగ్యాలకి దారి తీస్తాయి.

ఒకసారి వాడిన నూనెని, వాడని దానితో కలపకూడదు. దానివల్ల తాజా నూనె కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. నూనెలని చల్లని, పొడి ప్రదేశాల్లో, సరైన మూత పెట్టి నిల్వ చెయ్యాలి. రిఫ్రిజిరేటర్‌లో పెట్టి తీస్తే గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత వాడాలి.
  • సమాచారంతో అవగాహన
నూనెల్లో మూఫా, పూఫాల మేళవింపు ఎలా ఉందో చూసుకొని కొనుక్కొంటే ఆరోగ్యప్రదం. నూనెలో భారలోహాలు, హానిచేసే సూక్ష్మక్రిములు, ఇతరత్రా కలుషితాలు లేవని నిర్థారించుకోవాలి.
నూనె ప్యాకెట్‌ని కొన్నాక దానిపై ఏం రాసి ఉందని చదివితే.. ఉత్పత్తి పేరు, తయారైన స్థలం, సమయం, అందులోని పోషకాల వివరాలు, కాల వ్యవధి తెలుస్తాయి. నూనెలో సింథటిక్‌ యాంటీ ఆక్సిడెంట్లని కలిపి ఉంటే వాటి వివరాలు పొందు పరచాలని నిబంధనలు తెలియజేస్తున్నాయి. నూనెలపై 'ఫ్రీ ఫ్రమ్‌ ఆర్గీమోన్‌ ఆయిల్‌ ఆర్‌ ట్రాన్స్‌ ఫ్యాట్స్‌' అని రాసి ఉండటం తప్పనిసరి. ఎందుకంటే ట్రాన్స్‌ఫ్యాట్లు, ఆర్గీమోన్‌ నూనెలు అనేవి ఆరోగ్యానికి చేటు చేస్తాయి. అందుకే మీరు కొనే నూనెలో అవి లేవని నిర్ధారించుకోవాలి.

  • Source -- The Johns Hopkins Textbook of Dyslipidemia / 1. D. Paul Nicholls, MD, DSc, FRCP; 2. Ian S. Young, MD, FRCP, FRCPath

  • ==========================
Visit my Website - Dr.Seshagirirao...

Saturday 17 December 2011

Junk food , జంక్ ఫుడ్



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


  • సరియైన నూట్రిషనల్ విలువలు లేని లేదా సరిపడు కేలరీలు లేని లేదా అనారోగ్యకరమైన అహారపదార్ధాలను జంక్ ఫుడ్స్ అంటారు . జంక్ ఫుడ్ తినడము వలన అనారోగ్యం నకు దారితీయును . ఈ పదము మొదట 1972 లో Michael Jacobson (director of the center for Science in the public interest). జంక్ ఫుడ్ లో ఎక్కువ పరిమాణములో సాచ్యురేటెడ్ కొవ్వులు, సాల్ట్ , సుగర్ ఉంటాయి. ఆరోగ్యకరమైన పండ్లు , కాయకూరలు , ఫైబర్ ఉన్న పదార్ధములు ఉండవు . సాధారణముగా ఉప్పు స్నాక్స్ అంటే చిప్స్ , కాండీ , తీపి ఉండలు , పంచదారపెట్తిన సీరల్స్ , ఫ్రైడ్ ఫాస్ట్ ఫుడ్స్ , కార్బొనేటెడ్ డ్రింక్స్ , రెడిమేడ్ కూల్ డ్రింక్స్ , మసలా చాట్ , పకోడీలు, బజ్జీలు వంటి స్నాక్ ఫుడ్‌,మిర్చి బజ్జీలు,ఫాస్ట్ ఫుడ్ టమోటో కెచప్, వెన్నతో కూడిన కేకులు, చాక్లెట్‌ డింగ్‌-డాంగ్స్‌, బేకన్‌, సాసేజ్‌ మున్నగునవి.బర్గర్, పిజా, ఫ్రెంచి ఫ్రైస్, కేక్స్, నూడిల్స్... పిల్లలకు నచ్చే జంక్ ఫుడ్. '

జంక్‌ ఫుడ్‌ తింటే స్థూలకాయం వస్తుంది. ఈ ఊబకాయం వలన చిన్న వయస్సులోనే బిపి, ఆపై షుగర్‌ వస్తుంది'. శాస్త్రవేత్తలు.'ధూమపానం, మత్తు మందుల మాదిరిగానే జంక్‌ ఫుడ్‌ తినడం కూడా వ్యసనంగా మారుతుందంటున్నారు. అంతే కాదు మనిషిపై మాదక ద్రవ్యంతో సమానంగా దుష్ప్రభావాన్ని సైతం చూపుతాయ'ని వీరు కనుగొన్నారు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన స్క్రిప్స్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు మూడేళ్లపాటు పరిశోధనలు చేసి జంక్‌ ఫుడ్‌ కొకైన్‌ వంటి మాదక ద్రవ్యాలతో సమానమని తేల్చారు. జంక్‌ ఫుడ్‌కు అంటే బేకరి పదార్థాలకు అలవాటు పడితే అది ఊబకాయానికి దారి తీయడమే కాకుండా మెదడుకు కూడా హాని కలిగిస్తుందని కనుగొన్నారు. ఇందుకు కారణం బేకరీ పదార్థాల్లో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉండటమేనని వెల్లడించారు. జంక్‌ ఫుడ్‌ వల్ల కలిగే ప్రభావాలు తెలుసుకునేందుకు వీరు ఎలుకలపై మూడేళ్ల పాటు పరిశోధనలు సాగించారు. అధిక కేలరీలు గల ఆహారం తీసుకోవడం వల్ల మెదడుకు ప్రమాదమని తేల్చారు.


  • ఫాస్ట్‌ఫుడ్‌కు ప్రత్యామ్నాయంగా...
ఫాస్ట్‌ ఫుడ్‌ ఆరోగ్యకరమైన ఆహారం కాదు...ఈ విషయం దాదాపు అందరికీ తెలిసిందే. కానీ ఫాస్ట్‌ఫుడ్‌ కనబడితే చాలామంది తినకుండా ఉండలేరు. ఏదో కొద్దిగా తింటే ఏమవుతుంది అని
ఫాస్ట్‌ ఫుడ్‌ తినడం మొదలు పెట్టి ఎక్కువగా తినేస్తారు. దీంతో ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఫాస్ట్ ఫుడ్స్ జంక్ పుడ్డులో ఓ రకం..అందుకని భేదాలు..విభేదాలు ఉండవు. రెండూ ఒకటే.


  • -ప్రతిరోజూ ఫాస్ట్‌ఫుడ్‌ను తింటే ఆరో గ్యానికి కలిగే హాని గురించి తరచూ వార్తా పత్రికలు, టివిలలో అందరూ చూస్తుంటారు. కానీ వీటిని తినడానికి మాత్రం వెనుకాడరు. ఈ విషయంలో న్యూట్రీషనిస్ట్‌ నమ్రతా దేశాయ్‌ మాట్లాడు తూ ‘ఫాస్ట్‌ ఫుడ్‌ వంటి జంక్‌ ఫుడ్‌కు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ ఆహారం ఏదీ లేదు. కానీ ఫాస్ట్‌ ఫుడ్‌ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేసరిపోతుంది. నేటి రోజుల్లో బ్యాలెన్స్‌డ్‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మేలు. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో కూరగాయ లు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. దీంతో పాటు రోజూ కొంతసేపు వ్యాయా మాలు చేయడం ఆరోగ్యానికి మంచిది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా జంక్‌ ఫుడ్‌ తీసుకోవాలనుకున్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. నేటి బిజీ జీవితంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. ఫాస్ట్‌ ఫుడ్‌కు ప్రత్యామ్నాయంగా బేక్‌డ్‌, గ్రిల్‌డ్‌, రోస్టెడ్‌ ఫుడ్‌ను తీసుకోవచ్చు. గ్రిల్‌ చేసిన చికెన్‌ బాగా ఫ్రై చేసిన చికెన్‌ కంటే రుచికరంగా ఉంటుంది. గ్రిల్‌డ్‌ సలాడ్స్‌తో కూడిన స్యాండ్‌విచ్‌, గ్రిల్‌డ్‌ సలాడ్స్‌తో కూడిన బర్గర్‌ ఆరోగ్యానికి మంచిది. సాధారణంగా ఉపయోగించే వెన్నకు బదులుగా తక్కువ కొవ్వు ఉండే వెన్నను వాడడం శ్రేయస్కరం. దీంతో రుచికరమైన ఆహారాన్ని తక్కువ క్యాలరీలతోనే పొందవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే జంక్‌ ఫుడ్‌కు ప్రత్యామ్నాయ ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

  • దేశంలో శరవేగంగా పెరిగిపోతున్న ఫాస్ట్‌ ఫుడ్‌ సంస్కృతి

దేశంలో ఫాస్ట్‌ ఫుడ్‌ సంస్కృతి శరవేగంగా పెరిగిపోతుంది. ఈ ఫుడ్‌ చాలా ఫాస్ట్‌ గురూ అని పిస్తోంది. దేశంలో గత కొన్ని సంవత్స రాలుగా ఫాస్ట్‌ ఫుడ్‌ పరిశ్రమ అనూ హ్యంగా అభివృద్ధి
చెందుతోంది. దేశం లోని ప్రజల జీవన విధానంలో సంభ వించిన అనేక మార్పులు, ఆదాయాలు భారీగా పెరిగిపోవడం, ఆహార అభిరు చుల్లో తరచుగా మార్పులు చేసుకోవడం లాంటి ఘటనలు ప్రజలు కొత్త కొత్త రుచులకు అలవాటు పడటానికి, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లకు పరుగులు తీయ డానికి దోహదపడ్డాయి. దాంతో దేశంలోని ఫాస్ట్‌ ఫుడ్‌ పరిశ్రమ మూడు పువ్వులు ఆరు
కాయలుగా ముందుకు సాగుతోంది. భారతీయులు ఈ మధ్య కాలంలో తరచుగా విదేశాలను సందర్శించడంతో అక్కడి ఆహార అలవాట్లపై మోజు పెంచుకోవడం, జీవన విధానంలో మార్పులు చేసుకోవడం, తీసుకునే ఆహారంలో మార్పులు చేర్పులతో ప్రయోగాలు చేస్తున్నారని నిపుణులు చెపుతున్నారు. ఈ సందర్భగా భారత(ఉత్తర, తూర్పు ప్రాంతీయ) మెక్‌ డోనాల్డ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండి) విక్రమ్‌ బక్షీ మాట్లాడుతూ దేశం మొత్తం మేద ఫాస్ట్‌ ఫుడ్‌ మార్కెట్‌ వ్యాప్తి శరవేగంగా జరుగుతోందని, 2010 సంవత్సరంలో మెట్రోనగరాలలో దాదాపుగా ఫాస్ట్‌ ఫుడ్‌ అమ్మకాలు 20 శాతం మేరకు పెరిగిన్నట్లు అమ్మకాలను పరిశీలిస్తే తెలుస్తోందని చెప్పారు. అంతేకాక త్వరలో దేశవ్యాప్తంగా ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లను మరో 40 ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ విధమైన సెంటర్‌లను దేశంలో మొట్ట మొదటి సారిగా 1996లో ఢిల్లీలోని బసంత్‌ లోక్‌లో మెక్‌డోనాల్డ్‌ ప్రారంభించిందని, ప్రస్తుతం మొత్తం 211 ఫాస్ట్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌లలో భారత్‌లోని ఉత్తర, తూర్పు ప్రాంతాలలో 105, పశ్చిమ, దక్షిణ భారత్‌లో 106 రెస్టారెంట్‌లు వున్నాయని బక్షీ తెలిపారు. మెక్‌డోనాల్డ్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌లు మెట్రో నగరాలతో పాటుగా మిగతా నగరాలలో కూడా త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నాయని దానికి ఉదాహరణ హర్యానాలో 14, పంజాబ్‌లో 11, ఉత్తరప్రదేశ్‌లో 28 రెస్టారెంట్‌లు పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. దేశంలో పెరిగిపోతున్న చిన్న కుటుంబాలు, మధ్య తరగతి ప్రజలకు తగినంత ఆదాయం రావడం, ఇళ్ళలో వంట చేసుకొనే సమయం లేకపోవడం లాంటి అంశాలతో ఫాస్ట్‌ ఫుడ్‌ రంగం త్వరిత గతిన పెరగటానికి కారణంగా కనిపిస్తోందని, భవిష్యత్‌లో కూడా ఈ రంగం అభివృద్ధి చెందుతుని భావిస్తున్నట్లు నిరులా, విపి మార్కెటింగ్‌ విభాగానికి చెందిన రీతూ చౌదరి చెప్పారు. నిరులా కంపెనీ దేశంలోని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాంచల్‌, హర్యా నా, రాజస్థాన్‌, పంజాబ్‌లలో మొత్తం 80 ఫాస్ట్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌లను ప్రారంభించారు. 2012 నాటికి మరో 70 రెస్టా రెంట్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్థానిక ప్రజలు ఫాస్ట్‌ ఫుడ్‌కు అలవాటు పడటంతో కంపెనీలు మంచి లాభాలు
గడిస్తున్నాయని, దేశంలో మొట్ట మొదటి సారిగా పిజ్జాను ప్రవేశపెట్టామని, అది ప్రస్తుతం స్థానిక వినియోగదారులను ఆకర్శించిందని, అంతేకాక కరహీ పన్నీరు, తీఖా పన్నీరు, కరిహీ చికెన్‌లను ఇంతకు ముందే రుచి చూపించామని అని ప్రస్తుతం అవి విజయవంతం అయ్యాయని, త్వరలో మరికొన్ని రుచికర పదార్ధాలను అదించనున్నట్లు ఫిజ్జా హట్‌ మేనేజర్‌ ఉమేష్‌ కుమార్‌ తెలిపారు.

బక్షీ మాట్లాడుతూ ఉత్తర భారతీయులు విభిన్న రుచులను ఎల్లప్పుడూ ఆదరిస్తారని, వీరిని దృష్టిలో పెట్టుకొని త్వరలో మెక్‌ఆలూ తిక్కీ బర్గర్‌, పిజ్జా మెక్‌పుఫ్‌, మెక్‌వెజ్‌లనే కొత్త రుచులను
ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. గడిచిన 2008, నుంచి 2010 మధ్య కాలంలో ఫాస్ట్‌ ఫుడ్‌ వినియోగం వార్షిక సగటు 7.8 శాతంగా పెరిగిందని, 2012 నాటికి సగటున 8.6 శాతానికి అభివృద్ధి చెందుతుందని ఒక నివేదిక తెలిపింది. ఈ సందర్భంగా బిపిఒలో పనిచేస్తున్న మోనా శర్మ(24) మాట్లాడుతూ తాము రాత్రులు కూడా పనిచేస్తుంటామని, పనిభారం కూడా వుంటుందని అందు వల్ల బయటకు వచ్చి తినటానికి సమయం లేదని, సహజంగా తమ కంపెనీలు కొంత మంది ఉద్యోగులు కలసి బయట రెస్టారెంట్ల నుంచి ఫుడ్‌ను తెప్పించుకొంటారని, పిజ్జాలు, బర్గర్‌లు వెంటనే తినటానికి వీలుగా వుంటాయి కనుక తమ సమయం వృధా కాకుండా వుంటుందని ఆమె తెలిపింది. ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లను కొన్ని వైవిధ్యమైన ప్రదేశాలలో స్థాపిస్తున్నారని, ప్రయాణంలో వున్న వారిని కూడా ఆకర్శించటానికి వీలుగా వ్యాపార కూడలల్లో, ఎయిర్‌పోర్టుల్లో, మెట్రో స్టేషన్‌లతో పాటుగా అనేక ప్రదేశాలలో ఈ
ఫుడ్‌ సెంటర్‌లను ప్రారంభించారు. దేశంలో ఫాస్ట్‌ ఫుడ్‌ సంస్కృతి పెరిగిపోతుందని చెప్పాటానికి ఈ పరిమాణాలే ఉదాహరణగా చెప్పావచ్చును.

=-========================

Visit my Website - Dr.Seshagirirao...

Sunday 11 December 2011

Apricot , అప్రికాట్



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

ఆప్రికాట్ ఒక డ్రై ఫ్రూట్ , ఇతర డ్రైఫ్రూట్స్ తో పోలిస్తే దీనిలో క్యాలరీస్ తక్కువ . దీని శాస్త్రీయ నామము -Prunus armeniaca . ఇది సుమారు 8-10 మీ. ఎత్తు పెరిగే చెట్టు ,దీని మొదులు 40 సె.మీ వ్యాసము కలిగి పువ్వులు పింక్ రంగులోఉండును . పండ్లు 1.5 -2.5 సెం.మీ. ఉంది పసుపు లేదా ఆరెంజ్ రంగులో ఉండి ఒకే గింజ కలిగి ఉండును . మొదట ఇది ఆర్మేనియా దేశములో కనుగొనబడి క్రమేపీ ఇతర దేశాలకు వ్యాపించినది .

పచ్చి అప్రికాట్ పండులో పోషక పదార్ధములు 100 గ్రాములో:
  • శక్తి : 201 కేలరీస్ ,
  • కార్బోహైడ్రేట్లు : 11 గ్రా.
  • సుగర్స్ : 9 గ్రా .
  • ఫైబర్ : 2 గ్రా.
  • ఫాట్ : 0.4 గ్రా .
  • పోటీన్‌ : 1.4 గ్రా .
  • విటమిన్‌ ' ఎ ' : 12% ,
  • బీటాకెరటీన్‌ : 10% ,
  • విటమిన్‌ ' సి " : 12% ,
  • ఐరన్‌ : 3% ,
Apricots, dried Nutritional value per 100 g (3.5 oz)

  • Energy-------- 1,009 kJ (241 kcal)
  • Carbohydrates- 63 g
  • - Sugars------ 53 g
  • - Dietary fibre- 7 g
  • Fat------------ 0.5 g
  • Protein-------- 3.4 g
  • Vitamin A equiv-. 180 μg (23%)
  • - beta-carotene- 2163 μg (20%)
  • Vitamin C------- 1 mg (1%)
  • Iron------------ 2.7 mg (21%)

వైద్యములో దీని ఉపయోగాలు :

  • ఈ ఫలము మధుమేహ రోగులకు మేలుచేస్తుంది .
  • తీపిపదార్ధాలు తినాలనే కోఇకను తగ్గిస్తుంది .
  • దీనిలోని రసాయనాలు శరీరములో ఉన్నటువంటి చెక్కెరలను నియంత్రిస్తాయి .
  • అప్రికాట్ లోని బీటా కెరోటిన్‌ కంటికి , రోమాలకు, చర్మానికి , మేలుచేస్తుంది . ఒకటి , రెండు అప్రికాట్లను తింటే శరీరానికి కావాలసిన దినవారి విటమిన్‌ 'ఎ' సగము లభైస్తుంది .
  • గుండెసంబంధిత వ్యాధులను నిరోధిసంచే గుణము దీనిలో ఉంది.
  • మలబద్దకాన్ని ఆపుతుంది.
  • క్యాన్‌సర్ చికిత్స లో దీనిని వాడుదురు .
  • రక్తలేమితో బాధపడేవారికి ఇది మేలుచేస్తుంది.
  • కొవ్వులు లేని తక్కువస్థాయి పిండిపదార్ద్ధాలుకలిగీం ఈ ఫలము ఆరోగ్యానికి మంచిది .

  • ============================
Visit my Website - Dr.Seshagirirao...

ఎవో డైట్,Evo Diet








పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది.



పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.





ఎవో డైట్,Evo Diet



‘‘ఎవో డైట్...
’’ అంటే- ఎవల్యూషనరీ డైట్ అన్నమాట.‘ఎవోడైట్’ అంటే అన్నీ పచ్చివే సుమా! ఆది మానవుడు ఏమి తినేవాడో , ఎలా ఆరోగ్యము గా ఉండే వాడో నేడు చాలా మంది నిపుణులు ఆలోచించారు . మానవులు కోతులు నుండి పుట్టేరని .. అవి ఏమితింటున్నయో పరిశీలించి ... ఆచరించడము వలన ఎన్నోరకాల వ్యాధులనుండి మానవుడు దూరముగా ఉండడము గమనించి దానికొక పేరు పెట్ట్టారు ఇంగ్లండ్ నిపుణులు . అదే ఎవో డైట్ .. ఎవో అంటే ఆంగ్లములో ప్రిమిటివ్ (పురాతన,ఆది , ఆరంభము )అని అర్ధము .


ఎవో డైట్ లో అరటి, అప్రికాట్, చెర్రీ, మామిడి, ద్రాక్ష, ఖర్జూరం, స్ట్రాబెర్రీ, రాస్‌బెర్రీ, పుచ్చ... వంటి పండ్లు--బ్రాకోలి, క్యాబేజీ, క్యారెట్లు, ముల్లంగి, బఠాణీ, ఉల్లిపాయ, టమాటో... తదితర కూరగాయలూ- -వేరుశెనగపప్పు, ఆలివ్ గింజలు, అక్రోట్లు, జీడిపప్పు... మొదలైన నట్స్, ప్రత్యేకంగా తేనె..ఉంటాయి. ఇవన్నీ ఎవోడైట్‌కిందే లెక్క. దాదాపు పాతిక రకాల పండ్లూ, కూరగాయల్ని ఎవోడైట్ కింద చేర్చారు ఆహారనిపుణులు.

ఇలాంటి పండ్లూ, కూరగాయలను రోజూ దఫదఫాలుగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవని పరిశోధకులు తేల్చిచెబుతున్నారు. సుమారు అరవై లక్షల సంవత్సరాల నాటి మనిషి అంటే అప్పుడే కోతులనుంచి పరిణామం చెందిన ఆదిమ మానవుడు ఏం తిన్నాడో.. అదే ఇపుడు తింటే... ‘‘బరువు పెరగరు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తవు’’ అంటున్నారు. అధిక బరువు తెచ్చే తంటాలు అన్నీ ఇన్నీ కాదు. అలాంటి బరువును కోతులు తినే ఆహారాన్ని తింటే చాలు, దానంతట అదే బరువు తగ్గడం ఖాయం అంటున్నారు. కొలెస్ట్రాల్ కూడా బాగా తగ్గుతుందట. బీపీ సాధారణ స్థితిలో ఉంటుంది. మధుమేహ బాధితుల్లో ఇన్సులిన్ సమస్యలు సర్దుకుంటాయి. మొత్తంమీద ‘ఎవోడైట్’ తీసుకుంటే ఆరోగ్యంలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది.



  • =====================================


Visit my Website - Dr.Seshagirirao...

Saturday 10 December 2011

పప్పులతో గ్యాస్‌, Gas production with dals



  • పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


బఠానీలు, అలసందలు, రాజ్మా, శెనగలు, కందుల వంటి వివిధ చిక్కుడు జాతి, పప్పు ధాన్యాలు తినటానికి చాలామంది వెనకాడుతుంటారు. వీటితో కడుపుబ్బరం, గ్యాస్‌ వంటి ఇబ్బందులుంటాయని భయపడుతుంటారు. కానీ వీటన్నింటితో గ్యాస్‌ సమస్యలుండవని పరిశోధకులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ చిక్కుడుజాతి గింజలు, పప్పులపై ప్రజలు లేనిపోని అపోహలు పెంచుకోవటం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు కూడా.పప్పులతో గ్యాస్‌...అంతంతే


  • చిక్కుళ్లు, పప్పుల మూలంగా కడుపుబ్బటం, గ్యాస్‌ సమస్యల గురించి తాజాగా అమెరికాలో మూడు అధ్యయనాలు జరిగాయి. వీటిలో గుర్తించిన విషయం ఏమంటే- ఈ చిక్కుడు జాతి పప్పులు తీసుకున్న వారిలో 3-11% మంది మాత్రమే కడుపుబ్బరంతో బాధపడ్డారు. పైగా వీటిని తిన్న అందరిలోనూ ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌తో పాటు మొత్తం కొలెస్ట్రాల్‌లోనూ తగ్గుదల కనిపించటం విశేషం. ఈ రకంగా వీటితో గుండె జబ్బుల ముప్పు కూడా కొంత తగ్గుముఖం పడుతోంది. కాబట్టి చిక్కుడుజాతి గింజలు, పప్పులు తింటే తొలిదశలో కొందరికి కొంత గ్యాస్‌ సమస్య ఎదురైనా.. నెమ్మదిగా అదే సర్దుకుంటుందనే విషయాన్ని అందరూ గుర్తించాలని, గ్యాస్‌ సమస్యలను అతిగా వూహించుకోవద్దని ఈ అధ్యయన కర్తలు సూచిస్తున్నారు. నిజానికి ప్రోటీన్లు, పీచు, విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉండే పప్పులను వారంలో నాలుగైదు మార్త్లెనా తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.


ఇంతకీ చిక్కుడు జాతి గింజలు ఎందుకు కడుపుబ్బరం కలిగిస్తాయి? వీటిల్లో పీచు, ఆర్లిగోసాక్రైడ్లు దండిగా ఉంటాయి. ఈ పిండి పదార్థాలు జీర్ణం కావటానికి పేగుల్లోని ఎంజైమ్‌లు సరిపోవు. పేగుల్లోని బ్యాక్టీరియా ఇవి పులిసిపోయేలా చేసి, జీర్ణం చేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా కొంత గ్యాస్‌ ఉత్పత్తి అవుతుంది!


  • ఆహారం తీసుకోవడం లోనూ, ఆహార పదార్థాలను ఎన్నుకోవడంలోనూ సరైన అవగాహన వుంటే శారీరక సౌందర్యం, ఆరోగ్యం బాగుంటాయి. స్థూలకాయం ఏర్పడకుండా, పొట్ట ఎత్తుగా పెరగ కుండా, శరీరంలో కొవ్వు పేరుకోకుండా, తగిన ఆహారాన్ని తీసుకుంటూ, ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించాలి. జీర్ణక్రియ సవ్యంగా జరగటానికి మేలైన ఆహార పదార్థాలను తీసుకోవటమే కాకుండా ప్రతి రోజూ కొంత సమయం వ్యాయామం కూడా చేయాలి. ఎక్కువగా ఉపవాసాలు చేయకూడదు. వారానికి ఒక్క రోజు ఘన పదార్థాలను మానేసి, ద్రవ పదార్థాలను తీసుకోవచ్చు. వారానికి ఒక పూట ఉపవాసం చేయవచ్చు.

ఉదరభాగంలో కొవ్వు చేరకుండా జాగ్రత్తపడాలి. తక్కువ కేలరీలు లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మలబద్దకం ఏర్పడకుండా చూసుకోవాలి. ఆహార పదార్థాల్లో వెల్లుల్లి, అల్లం, పిప్పరమెంటు లాంటివి వాడటం వల్ల ఉదరంలో గ్యాస్‌ ఏర్పడకుండా చేస్తుంది. కడుపు ఉబ్బరం ఏర్పడకుండా నివారిస్తుంది. ఆహారంలో తప్పనిసరిగా పీచు పదార్థాలు, ఆకుకూరలు వుండేలా చూసుకోవాలి. క్యాబేజీ, పచ్చి ఉల్లి పాయలు, బీన్స్‌, పచ్చి బఠాణీలు లాంటివి గ్యాస్‌ ఏర్పడేందుకు కారణమవుతాయి. అందువల్ల, వాటి వాడకాన్ని తగ్గించాలి. కాఫీ, టీ లాంటి పానీయాలను ఎక్కువ సార్లు తీసుకో కూడదు. అందువల్ల ఉదరంలో గ్యాస్‌ ఏర్పడటమేకాక ఆకలిని తగ్గిస్తుంది. శీతలపానీయాలు కూడా ఆరోగ్యానికి మంచిదికాదు.

  • ఆహార నియమాలను పాటించడం, సరైన ఆహార పదార్థాలను తీసుకోవడం, శారీరక శ్రమ చేయడం వల్ల అజీర్ణ సమస్య ఏర్పడదని తెలుసుకోవాలి. కొన్ని రకాల పప్పులు కూడా అజీర్ణ వ్యాధికి, గ్యాస్‌ ఉత్పత్తికి కారణమవుతాయి. వాటిని తక్కువగా తీసుకోవడమే మంచిది. సెనగపప్పు, సెనగ పిండి, వేరుశెనగ పప్పు లాంటివి ఆహార పదార్థాల్లో తగ్గించడం వల్ల అజీర్ణం అనే సమస్య ఏర్పడదు, గ్యాస్‌ ఉత్పత్తి అవదు .
  • ===============================
Visit my Website - Dr.Seshagirirao...