Pages

Labels

Popular Posts

Monday 27 May 2013

Roselle , గోంగూర







  •  







  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.




Roselle , గోంగూర---దీని Botanical name -- Hibiscus sabdariffa(Roselle=Gongura)
వేసవిలో ఏ కూర చేసినా అంతగా తినాలని అనిపించదు. నీళ్లు మాత్రం గటగటా తాగేస్తాం. అయితే గొంగూర ఉంటే మాత్రం పుల్లగా... పుల్లగా లాగించేస్తాం. ఆంధ్రుల అభిమాన పచ్చడి
గోంగూర అంటే పడి చచ్చే వారు ఎందరో. అలాంటి గోంగూరతో చట్నీనే కాదు ఇతర వంటకాలు వండొచ్చు.
ఇది బెండ కుటుంబమునకు చెందినది. ఎప్పుడో సరిగ్గా తెలియకున్ననూ ఇది భారతదేశమునకు వెలుపలి నుండి వచ్చినట్లుగా తెలియుచున్నది. దీనిని ఆంధ్రదేశమున విరివిగా వాడతారు. దీనిని ఆంధ్ర మాత అని అంటారు. దీనిని సాధారణంగా నార పంట గా వాడుదురు.

రకములు

    దేశవాళీ గోగు: కాండము, ఆకుల తొడిమలు, ఈనెలు, పూవునందలి రక్షణ పత్రములు మొదలైన భాగాలు ఎరుపు రంగులో ఉంటాయి. వీటిని ఆకుల కొరకూ, నార కొరకు పెంచుతారు.
    పుల్ల గోగు: చిన్న మొక్క, కేవలము కూర కొరకు మాత్రమే పెంవబడును.
    
వంటలు
ప్రఖ్యాతి గాంచిన, ఘనత వహించిన గోంగూర పచ్చడి మాత్రమే కాకుండా దీనితో గోంగూర పప్పు, గోంగూర పులుసులు కూడా చేస్తారు.

వీటిలో క్యాల్షియం, ఇనుము, విటమిన్‌ ‘ఎ', ‘సి', రైబోఫ్లెవిన్‌, ఫోలిక్‌యాసిడ్‌ మరియు పీచు ఎక్కువగా ఉంటుంది
ఇందులో ఐరన్‌ అధికంగా ఉండడం వల్ల, కొంచెం ఎక్కువ తింటే అరక్కపోవడం కద్దు.

ఉపయోగాలు :


  • ఆహార పదార్థంగా గోంగూర ఉపయోగం మనకు తెలుసు. సంవత్సరం పొడుగునా నిలవ ఉండి, ఉప్పులో ఊర వేసిన గోంగూర అత్యవసర పరిస్థితుల్లో సిద్ధంగా ఉండే (ఇన్‌స్టాంట్‌) కూర .

  • గోంగూర కాడల్ని చితకకొట్టి, పలుపులు, నులక పేనడం ఆంధ్రదేశంలో అనాదిగా రైతులు చేసేపని. వాణిజ్యపరం గా, పెద్ద ఎత్తున పలుపులు, నులక పేనడం జరగక పోయినా, రైతు తన ఇంటి ఉపయోగానికి కావలసినంత మటుకు అయినా తయారు చేసుకోవడం ఒక అలవాటు. గోంగూరతో సంచులు చేస్తారు. జనపనార సంచులంత గట్టివి కాకపోయినా పనిగడుపుతాయి.

  • మెట్ట, మాగాణీ భూముల్లో గూడ గోగులు వేస్తారు. ఇందులో కొండగోంగూర, మంచి గోంగూర రెండు రకాలు. కొండ గోంగూర కాడ కొంచెం ఎరుపుదాళుగా ఉంటుంది. ఆకు కొద్దిగా వగరు.

  • నిలవపచ్చళ్ళకు వాడరు. మంచి గోంగూర పుల్లగా ఉంటుంది. పండు మిరప పండ్లను గోంగూర తో పాటు తగినంత ఉప్పువేసి తొక్కి నిలవ పచ్చడి తయారు చేస్తారు. 

  • మన గోంగూర విదేశాలకు పచ్చడి రూపాన ఎగుమతి అవు తున్నది. గణాంక వివరాలు ఇవ్వగలిగినంత గణనీయమైన ఎగుమతి వ్యాపారం కానప్పటికీ, మన గోంగూర ఎంతో కొంత విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి, పరోక్షంగా దేశసేవ చేస్తున్నది.

  •  ప్రకృతిలో ప్రతి ఆకు ఒక మూలిక. సృష్టిలోని ప్రతి మొక్క ఎంతోకొంత ఔషధ గుణం కలగి ఉంటూనే ఉన్నది. కాకపోతే మన శాస్త్రజ్ఞులు ఇప్పటికి కొన్ని గుణాలను మాత్రమే

  • తెలుసుకోగలిగారు. మరెన్నో మనకు తెలియని మూలికలు శాస్త్రజ్ఞుల దృష్టికి అందని మూలికలు వ్యర్థంగా అడవుల్లో తుప్పల్లో బీళ్ళలో పుడ్తున్నాయి, చస్తున్నాయి. గోగుపూలుఅందంగా ఉంటాయి. అస్తమించే సూర్యుడు గోగుపూల ఛాయలో ఉంటాడని కవులు వర్ణించారు కూడా.

  • గోంగూరకు ఔషధ గుణాలున్నా యని పరిశోధకులు ఎప్పుడో తెలుసుకు న్నారు. వ్రణాలు, గడ్డలపైన గోంగూర ఆకును ఆముదంతో కుమ్మి, వెచ్చచేసి వేస్తే అవి త్వరగా తగ్గిపోతాయి.

  • వ్రణాలు, గడ్డల వల్ల కలిగే తీపు తగ్గి, అవి తొందరగా పగులు తాయి. స్వస్థత చిక్కుతుంది.

  • రేచీకటికి రాత్రిపూట సరీగా చూపు కనపడక పోవటం అనే నేత్ర రోగం లేదా దృష్టిదోషం తో బాధపడేవారు భోజనంలో ఆకుకూర గానో, పచ్చడిగానో, ఊరగాయగానో గోంగూర వాడితే కొంతమేరకు మంచి ఫలితం ఉంటుంది. అంతటితో చాలదు రేచీకటి తగ్గడానికి చిన్న చిట్కా వైద్యం లేదా గృహవైద్యం ఇది. గోంగూర పూలను దంచి, అరకప్పు రసం చేసి, దాన్ని వడకట్టి,దానిలో ఒక అరకప్పు పాలు కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా సేవించడం తక్షణం చేయవలసిన పని. తరచూ గోంగూర వాడుతూ గోంగూర పువ్వులను దంచి అర కప్పు రసం తీసి దానికి అరకప్పు పాలు కలిపి తాగితే రేచీకటి తగ్గుతుంది .

  • బోదకాలు తగ్గడానికి శరీరంలో వాపులు తీయడానికి గోంగూర, వేపాకు కలిపి నూరి ఆ పదార్థాన్ని పట్టించాలి.

  • విరోచనాలు అధికంగా అవుతుంటే కొండ గోంగూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి త్రాగితే ముందు అవి కట్టుకుం టాయి. మిరపకాయలు వేయకుండా ఉప్పులో ఊరవేసిన గోంగూర అన్నంతో తిన్నా విరోచనాలు తగ్గిపోతాయి.

  • దగ్గు, ఆయాసం తుమ్ము లతో ఇబ్బంది పడేవారు గోంగూరను ఏదో విధంగా అంటే ఆహారంగానో లేక ఔషధం గానో పుచ్చుకుంటే స్వస్థత చిక్కుతుంది. దగ్గు ఆయాసం తుమ్ములతో బాధపడే వారికీ చాలామేలు చేస్తుంది .

  • శరీరం లో నీరు చేరినప్పుడు ఈ ఆకు కూర పథ్యం చాల మంచిది .

  • గోంగూర - మలబద్ధకాన్ని, రేచీకటిని తొలగిస్తుంది.

  • ఉష్ణతత్వ శరీరులకు, నిక్కాకతో బాధపడేవారికి గోంగూర పడదు. వారు ఏ రూపాన కూడా గోంగూర తినరాదు. 



  • ===================


Visit my Website - Dr.Seshagirirao...

Sunday 26 May 2013

Rock candy sugar,పటిక పంచదార ,పటిక బెల్లం



  •  












పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.





సుగర్ కేన్‌ నుండి తీసిన సూక్రోజ్ నే పంచదార అంటాము . పంచదార మొదటిగా ఇండియా ఉపఖండము లోనె జనించినది. పంచదార ను క్రిస్టల్ గా తయారుచేసి వాడిన దానినే పటిక పంచదార అంటాము . ఏ రంగూ కలపక పోతే ఇది తెల్లగాను , అందము కోసము వివిద రంగులు కలిపి రంగుల పటిక పంచదారను తయారుచేస్తారు.

తయారుచేయు విధానము  :


ఒక గ్లాసు నీరు గిన్నె లో తీసుకొని వేడి చేసి రెందు గ్లాసుల పంచదార పోస్స్తూ కలపాలి . ఒక పరిమితమైన వేడిలోనే పంచదార అంతా కరిగిపో్యేవరకూ ఉంచి .... దానిని 5-6 రోజులు అలాగే నిలువా ఉంచాలి . అప్పుడు ఒక పొర ఉపరితలము పై ఏర్పడును . అడుగుబాగము న పంచదార పటికలు ఏర్పడి నీరు , పైన తెట్టు తీసివేయగా మనకు కావలసిన పటిక పంచదార పటికలు గిన్నె అడుగున ఉంటాయి  .

ఉపయోగాలు :  
ఇది మేహశాంతిని కలుగజేస్తుంది.
జఠరదీప్తి, వీర్యవృద్ధి, దేహపుష్టి బలాన్నిస్తుంది.
నీరసాన్ని పోగొడుతుంది.
వాతపిత శ్లేష్మకారణంగా వచ్చిన రోగాలు, దాహం, తాపం, భ్రమ, శ్రమదగ్గు నేత్రరోగాలను తగ్గిస్తుంది.
పొడిదగ్గుని అణచివేస్తుంది. సర్వేంద్రియాలకు బలాన్ని కలిగిస్తుంది.
దీనిని మెత్తగా నూరి బార్లీ గంజిలోగాని, సగ్గుబియ్యం జావలోగాని కలిపి ఇస్తే జ్వరపడి లేచిన వారికి, రోగులకు ఆరోగ్యంగా ఉంటుంది.

చెడు :
మితిమీరి తింటే ఆకలి మందగించి విరేచనం కాకుండా పోతుంది.
మూత్రపిండాలకు హాని చేకూరుస్తుంది.

చరిత్ర :
క్యాండీ చక్కెర ఇరాన్ లో తన పుట్టుక  కలిగి ఉంది. దీనికి  మధ్య భారతదేశం లో వివిధ పేర్లు ఉన్నాయి. కళ్ళు చెక్కెర (కన్నడము ), Panakarkandu లేదా Kalkandu (తమిళం / మలయాళం),"ఖాదీ sakhar" (మరాఠీ),mishri (హిందీ),patika bellam (తెలుగు).9 వ శతాబ్దంలో మొదటి సగం లో అరబిక్ రచయితలైన స్పటికాలు అతిసంతృప్తం చక్కెర పరిష్కారాలను శీతలీకరణ ఫలితంగా పండించారు. క్రిస్టలీకరణ వేగవంతం చేయడానికి, confectioners తర్వాత పెరగడం స్పటికాలు కోసం పరిష్కారం లో చిన్న కొమ్మల ముంచడం నేర్చుకున్నాడు. వేడి పంచదార ద్రావకం కూలింగ్ చేయడము ద్వార పటికలు తయారుచేయడం నేర్చుకున్నాడు . వ్యాపారం కోసము, చిన్న పిల్లలను ఆకర్షించేందుకు రకరకాల రంగులు కలపడం తెలుసుకున్నాడు . దీనిని చైనా లో సంప్రదాయ చైనీస్ ఔషధం యొక్క ఒక భాగంగా ఉపయోగిస్తారు

source : candy sugar / rock sugar candy @ Wikipedia.org.


  • ====================


Visit my Website - Dr.Seshagirirao...

Monday 20 May 2013

Food-health and illness Awareness , ఆహారం-ఆరోగ్యం లేదా అనారోగ్యం అవగాహన



  •  





  •  




పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.







    తిండి లేని రోజు లేదు... అపోహ లేని ఆహారం ఉండదు! అన్నం.. నీళ్లు... పప్పు.. కూర... పాలు.. పెరుగు... చక్కర.. బెల్లం... ఇలా మన దైనందిన ఆహారం ఏదైనా తీసుకోండి... దాని చుట్టూ తేనెతుట్టెలా పట్టుకుని బోలెడు అపోహలు వేళ్లాడుతుంటాయి! నిజం చెప్పాలంటే మన సమాజంలో ఆహరం పట్ల శాస్త్రీయమైన అవగాహన, వైజ్ఞానిక సమాచారం కన్నా అపోహలే ఎక్కువగా రాజ్యమేలుతున్నాయి. వాస్తవానికి మన ఆరోగ్యం.. అనారోగ్యం అన్నవి రెండూ చాలావరకూ మన ఆహారంతోనే ముడిపడి ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన తిండి తినాలి. ముందు అదేమిటో మనకు తెలియాలి... అంతకంటే ముందు మనం నానారకాల అపోహల నుంచి బయటపడాలి.



ఖరీదు

* ఖరీదైన ఆహారంలోనే పోషకాలు ఎక్కువ ఉంటాయనీ, కాస్త చౌకగా దొరికే ఆహారంలో పోషకాలుండవని చాలామంది నమ్ముతుంటారు. కానీ ఇది వట్టి అపోహే!.'మంచి పోషకాహారం తినటం బాగా డబ్బులున్న వాళ్లకే సాధ్యంగానీ మనకెక్కడ కుదురుతుందని' చాలామంది భావిస్తుంటారు. కానీ తక్కువ ఖరీదులో దొరికే చాలా పదార్థాల్లో కూడా మంచి పోషకాలు ఉంటాయని గుర్తించటం అసవరం. నిజానికి ఇవాళా రేపూ ఆహార పదార్థాలన్నీ కాస్త ఖరీదు ఎక్కువగానే ఉంటున్నాయి. కాదనలేం. ఇటువంటి పరిస్థితుల్లోనే కాస్త ఖరీదు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవటం అవసరం. చాలామంది ఆపిల్‌ పండ్లలో పోషకాలు ఎక్కువ ఉంటాయని భావిస్తూ, ఎంత ఖరీదైనా వాటినే తెచ్చి పిల్లలకు పెడుతుంటారు. నిజానికి కాస్త ఖరీదు తక్కువగా ఉండే బొప్పాయిలో కూడా పోషకాలు సమృద్ధిగానే ఉంటాయి. మామిడిలో ఉన్నట్టే బొప్పాయిలోనూ విటమిన్‌-ఏ ఉంటుంది, పైగా ఇది ఏడాదంతా దొరుకుతుంది. కాబట్టి చౌకగా దొరికేదాన్ని తక్కువగా చూడటంగానీ, ఖరీదెక్కువ కాబట్టి ఆపిల్‌ వంటివాటిలోనే పోషకాలు ఎక్కువుంటాయని భావించటంగానీ సరికాదు. అలాగే బాగా పాలిష్‌ పట్టిన తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యం మంచివి. నిజానికి పాలిష్‌ తక్కువ పట్టిన బియ్యం ఇంకా ఖరీదు తక్కువగా ఉండాలి. అలాగే ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాలు.. ఇవన్నీ మంచి పోషకాలనిచ్చేవే. పోషకాహారంపై చక్కటి అవగాహన పెంచుకుని, అందుబాటులో ఉన్న మంచి పదార్థాలన్నింటినీ తినటం మంచిది.



మసాలా

* మసాలా పదార్థాలు ఎక్కువగా తింటే పొట్టలో అల్సర్లు వస్తాయని నమ్ముతుంటారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. పేగుల్లో పుండ్లు పడటాన్ని అల్సర్లు అంటారు. సాధారణంగా మసాలా పదార్థాల వల్ల ఈ పుండ్లు రావు. తీవ్రమైన ఒత్తిడికి గురికావటం, అస్తవ్యస్తమైన ఆహారపుటలవాట్లు, నొప్పుల బిళ్లల వంటివి ఎక్కువగా వాడటం వంటి వాటి వల్ల పేగుల్లో పుండ్లు వస్తాయి. ముఖ్యంగా హెలికో బ్యాక్టర్‌ పైలోరీ వంటి సూక్ష్మక్రిమి వల్ల ఇవి ఏర్పడుతున్నాయని వైద్య పరిశోధనల్లో స్పష్టంగా గుర్తించారు. కాబట్టి ఒత్తిడి తగ్గించుకోవటం, శుభ్రమైన ఆహారం తీసుకోవటం వంటివి ముఖ్యం. ఒకసారి అల్సర్లు ఏర్పడిన తర్వాత మాత్రం మసాలా పదార్థాలను మానెయ్యటం అవసరం. దాల్చిన చెక్క, లవంగం మొగ్గవంటి మసాలా పదార్థాల వల్ల అల్సర్లు వస్తాయనుకోనక్కర లేదు. కాకపోతే ఈ మసాలాల వల్ల అసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి అంతా వీటిని చాలా మితంగా తీసుకోవటమే మంచిది.



నూనెలు

* అస్సలు నూనె లేకుండా వండుకోవటం (జీరో ఆయిల్‌ కుకుంగ్‌) గుండెకు మంచిదని చాలామంది నమ్ముతుంటారు. కానీ ఇందులో నిజం లేదు. అస్సలు నూనె అనేది లేకుండా ఉడకబెట్టేసుకు తినమని చెప్పటం సరికాదు. నూనెల నుంచి వచ్చే పోషకాలు, శక్తి-క్యాలరీలు కూడా మన శరీరానికి అవసరం. మనం తినే ఆహారంలో, ఆహారం ద్వారా మనకు లభించే క్యాలరీల్లో కనీసం 20% నూనెల నుంచి రావటం ఎంతైనా అవసరం. నూనెల నుంచి మన శరీరానికి అత్యవసరమైన కొవ్వు ఆమ్లాలు (ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌) కొన్ని లభిస్తాయి. మన శరీరంలో కొన్ని జీవక్రియలు సజావుగా జరగాలంటే కొవ్వు తప్పనిసరి. అలాగే ఎ, ఇ, కె విటమిన్లు కేవలం కొవ్వులో మాత్రమే కరుగుతాయి, కొవ్వు ఉంటేనే ఇవి మన ఒంటికి పడతాయి. కాబట్టి ఇవన్నీ సజావుగా జరగాలంటే మన ఆహారంలో నూనె, కొవ్వు తప్పనిసరిగా ఉండాలి. అది అస్సలు లేకుండా వంటలు చేస్తుంటే- రకరకాల చర్మ సమస్యలు, విటమిన్‌ లోపాల వంటి రుగ్మతలు మొదలవుతాయి. మరోవైపు నూనె అవసరమంటున్నారు కదా అని.. వాటిని విపరీతంగా తినకూడదు. దానివల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. చక్కటి ఆరోగ్యానికి మితంగా అంటే రోజుకు మనిషికి 20 గ్రాములకు మించకుండా నూనె వాడుకోవటం అవసరం. శరీరానికి అన్ని పోషకాలూ అవసరం, కానీ వాటిని మితంగా, సమతులంగా తీసుకోవటం మంచిది.



ఆపిల్‌లో తొక్కలోనే పోషకాలు ఎక్కువ, లోపల ఉండేదంతా వట్టి పిండి పదార్థమే. పిండిపదార్థం మనం తినే వరి అన్నం వంటి వాటి నుంచి దండిగానే లభిస్తుంది. కాబట్టి ఆపిల్‌ వంటివి తొక్కతో తినటం మంచిది.



నీళ్లు

* మనం నీళ్లు ఎంత తాగితే అంత మంచిదనీ, రోజుకు 4-5 లీటర్త్లెనా తాగితే ఒంట్లో మలినాలు కొట్టుకుపోతాయనీ చాలామంది నమ్ముతుంటారు. కానీ ఇది సమస్యలు తెచ్చిపెట్టే నమ్మకం! నీరనేది కేవలం మనం తాగే నీళ్ల రూపంలోనే కాదు.. పండ్లు, కూరగాయలు, అన్నం, చారు, మజ్జిగ.. ఇలా అన్నింటిలోనూ ఉంటుంది. చాలామంది దీన్ని గుర్తించరు. ఇలాంటి పదార్థాల ద్వారా కాకుండా మనం రోజు మొత్తమ్మీద 2 నుంచి 2.5 లీటర్ల నీరు తాగితే చాలు! అంతకంటే ఎక్కువ తాగితే శరీరంలోని స్రావాలన్నీ పల్చబడిపోయి వాటి పనిసామర్థ్యం బాగా తగ్గిపోతుంది. చాలామంది నిద్ర లేస్తూనే 2 లీటర్ల నీటిని తాగేసెయ్యాలని చెబుతుంటారుగానీ ఇలా ఎక్కువగా తాగటం వల్ల జీర్ణ ప్రక్రియ వెనకబడుతుంది. మనం తినే ఆహారానికి తగ్గట్టుగా ఎంజైముల వంటివి ఊరతాయి. కానీ మనం ఒక్కసారే నీళ్లు ఎక్కువగా తాగేస్తే అవన్నీ పల్చబడి, వాటి సామర్థ్యం తగ్గిపోతుంది. ఆహారం తినేటప్పుడు మధ్య మధ్యలో కాకుండా మొత్తం తినటం పూర్తయిన తర్వాత తాగాలి. ఆ 2 లీటర్లు కూడా ఒక్కసారే ఎక్కువగా తాగటం కాకుండా రోజంతా వివిధ సందర్భాల్లో తాగుతుండటం ముఖ్యం. (కిడ్నీ సమస్యల వంటివి ఉన్నవారు వైద్యుల సలహా మేరకే తాగాలి)



పంచదార

* పంచదార ఎక్కువ తింటే 'షుగర్‌' వస్తుందన్నది చాలామంది నమ్మే విషయం. కానీ ఇది వాస్తవం కాదు. షుగర్‌.. మధుమేహం అన్నది కేవలం పంచదార, తీపి పదార్థాలు ఎక్కువగా తినటం వల్లనే రాదు. మనం ఏం తీసుకున్నా శరీరంలో అది ముందు షుగర్‌ కింద మారి, వినియోగానికి వీలైన శక్తిగా (క్యాలరీల్లా) సిద్ధంగా ఉంటుంది. కానీ మనం ఎటువంటి శారీరక శ్రమా చెయ్యకుండా దాన్ని ఖర్చు పెట్టకపోతే, అది తనకు తానుగా కొవ్వుగా మారిపోయి శరీరంలో పేరుకుని, నిల్వ ఉంటుంది. దీనివల్ల బరువు పెరగటం, అది తెచ్చే దుష్ప్రభావాలు మొదలవుతాయి. అంతేగానీ పంచదార తింటే మధుమేహం వస్తుందని భావించటం సరికాదు. మధుమేహానికి మన జీవనశైలి, ఒత్తిళ్లు, జన్యువుల వంటివి ముఖ్యమైన కారణాలుగానీ పంచదార కాదు. అయితే ఒకసారి మధుమేహం వస్తే మాత్రం పంచదార, తీపి, స్వీట్ల విషయంలో పథ్యం తప్పదు. తీపి, కొవ్వు తక్కువగా తీసుకోవాలి.



గుడ్డు

* గుడ్డులో కొలెస్ట్రాల్‌ ఉంటుంది కాబట్టి దాన్ని తినకూడదని నమ్మేవాళ్లూ చాలామంది ఉన్నారు. కానీ ఇది పూర్తి నిజం కాదు. గుడ్డులోని తెల్లసొనలో ఆల్బుమిన్‌, బోలెడన్ని మాంసకృత్తులు ఉంటాయి. దాంట్లో కొలెస్ట్రాలేమీ ఉండదు. పచ్చసొనలోనే కొలెస్ట్రాల్‌ ఉంటుందిగానీ అదొక్కటే కాదు, అందులో విటమిన్‌-ఎ, ఇతర కొవ్వు ఆమ్లాల వంటివెన్నో ఉంటాయి. కాబట్టి అందరికీ గుడ్డు మంచిది. కాకపోతే రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు ఎక్కువగా ఉన్నవాళ్లకు, గుండె జబ్బులు, హైబీపీ వంటివి ఉన్నవారికి ఈ పచ్చసొనతో కొంత ఇబ్బంది ఉండొచ్చు కాబట్టి వాళ్లు పచ్చసొన తీసేసి ఒక్క తెల్లదాన్ని తినొచ్చు. ఏ సమస్యా లేని సాధారణ ఆరోగ్యవంతులు గుడ్డు నిశ్చింతగా తినొచ్చు, రోజుకు ఒకటి తింటే మేలే చేస్తుంది.



శాక్రీన్‌

* మధుమేహం ఉన్న వారికి కృత్రిమ తీపి పదార్థాలు (ఆర్టిఫీషియల్‌ స్వీటనర్స్‌) మంచివని భావిస్తూ చాలామంది వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు, ఇదంత మంచిది కాదు. ఆస్పర్టేమ్‌, శాక్రీన్‌ వంటి కృత్రిమ తీపి పదార్థాలను ఏదో పాలు, కాఫీల్లో రుచికి కొద్దిగా కలుపుకొంటే పెద్దగా నష్టం ఉండదుగానీ వాటితోనే స్వీట్లు, బిస్కట్లు, బేకరీ ఉత్పత్తుల వంటివన్నీ చేసుకుని.. వాటిని పెద్ద మొత్తంలో తినటం వల్ల ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో ప్రస్తుతానికి చెప్పటం కష్టం. అవేవీ సహజమైనవి కావు, కృత్రిమ రసాయనాలు. వాటిపై జరిగిన అధ్యయనాలు ఇంకా స్పష్టంగా ఏమీ తేల్చకపోయినా సాధ్యమైనంత వరకూ తగ్గించుకోవటమే మంచిదని గుర్తించాలి.



ఉప్పు

*మన ఆరోగ్యానికి 'ఉప్పు పెద్ద ముప్పు' అని భావిస్తూ ఉప్పును పూర్తిగా మానెయ్యటం అవసరమన్న భావన తరచుగా వినపడుతుంటుందిగానీ అది పూర్తిగా మంచిది కాదు. ఉప్పు కూడా మన శరీరానికి, జీవక్రియలకు అవసరమైన వనరు. ఆరోగ్యవంతులు రోజుకు కాస్త అటూ ఇటూగా 4 గ్రాముల ఉప్పు తీసుకోవటం మంచిది. చాలామంది మన శరీరానికి కావాల్సిన సోడియం అంతా కూడా కూరగాయలు, మన ఆహార పదార్థాల నుంచి సహజంగానే వచ్చేస్తుందనీ, ఇంక అదనంగా ఉప్పు వేయటం వల్ల దాని పరిమితి పెరిగిపోతుందని చెబుతుంటారుగానీ నిజానికి ఆహారం కాకుండానే 4 గ్రాములు (యాడెడ్‌ సాల్ట్‌) తీసుకోవాలన్నది శాస్త్రరంగం చేస్తున్న సిఫార్సు. కొన్ని రకాల జీవక్రియల్లో సోడియం క్లోరైడ్‌ (ఉప్పు) చాలా అవసరం. ఒంట్లో నీరు, ఖనిజ లవణాల సమతుల్యత (బ్యాలెన్స్‌) సజావుగా ఉండటానికి, మనం 'డీహైడ్రేషన్‌' లోకి వెళ్లకుండా ఇది చాలా కీలకం. దీనర్థం ఉప్పు ఎక్కువెక్కువగా వాడమని కాదు. ఉదాహరణకు హైబీపీ ఉన్నవాళ్లు, కిడ్నీ జబ్బులున్న వాళ్లు ఉప్పు తగ్గించుకోవటం అసవరం. అంతేగానీ ఆరోగ్యవంతులు అసలు ఉప్పును పెద్ద శత్రువులా అభిప్రాయపడుతూ, అస్సలు ఉప్పు లేకుండా తినటం సరికాదు.



ప్రోటీన్లు

*మన శరీరానికి మాంసకృత్తులే చాలా మంచివనీ, పిండిపదార్థాలు అంతగా మంచివి కావని చాలామంది నమ్ముతుంటారు. కానీ ఇది సరైన అవగాహన కాదు. బియ్యం, గోధుమల వంటివి పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్‌). రకరకాల పప్పులు, మాంసం వంటివి మాంసకృత్తులు (ప్రోటీన్స్‌). నిజానికి ఈ రెండు రకాల ఆహార పదార్థాలూ మన శరీరానికి అవసరమైనవే. ఇందులో పిండిపదార్థాలు మన శరీరానికి అవసరమైన శక్తిని నిరంతరం అందిస్తుంటాయి. మాంసకృత్తులు కండరాల నిర్మాణానికి (మజిల్‌ బిల్డింగ్‌) దోహదం చేస్తాయి. మనం ఎప్పుడైతే పిండిపదార్థాలను తగ్గించేసి మాంసకృత్తులే తినటం మొదలుపెడతామో అప్పుడు శరీరం... మాంసకృత్తులను కండర నిర్మాణానికి కాకుండా శక్తి కోసం వాడుకోవటం ఆరంభిస్తుంది. దీంతో శారీరక, కండర నిర్మాణం వెనకబడుతుంది. ఇలా ప్రోటీన్లను శక్తి కోసం వినియోగించేసుకుంటూ ఉండటంతో.. మనం శరీరంలో ప్రోటీన్ల లోపం తలెత్తుతుంది. ఇది మంచిది కాదు. కాబట్టి మనం పిండిపదార్థాలూ తినాలి, మాంసకృత్తులూ తినాలి. కాకపోతే... పిండిపదార్థాలను మితంగా తినాలి.



పాలు

*'పాలు' అనేవి పిల్లలకేగానీ పెద్ద వాళ్లకు అక్కర్లేదని చాలామంది నమ్ముతున్నారు. కానీ వాస్తవానికి...పాలన్నది సంపూర్ణ ఆహారం. చంటి పిల్లలకు అదొక్కటే ఆహారం, కొంచెం పెద్దయితే పాలతో పాటు అదనపు ఆహారం కూడా ఇస్తారు. పాల ద్వారా మన శరీరానికి వచ్చే పోషకాలు చాలా ఎక్కువ. కాబట్టి పిల్లలకు సమృద్ధంగా పాలు ఇవ్వాలి. ఇక పెద్దల విషయానికి వస్తే- పాలలో ఉండే కొవ్వు ఒక్కటి తప్పించి మిగతావన్నీ మనకు చాలా అవసరమైనవి. పాలలో క్యాల్షియం వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. పెద్దవాళ్లకు క్యాల్షియం చాలా ఎక్కువ అవసరం. లేకపోతే ఒక వయసు వచ్చేసరికి ఎముకలు బోలుబోలుగా తయారై ఆస్టియోపొరోసిస్‌ వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి పెద్దలు కొవ్వు తీసిన, లేదా కొవ్వు తక్కువున్న పాలు తీసుకోవటం మంచిది. స్త్రీలకు పాలు మరీ ముఖ్యం.



పాలకూర

*పాలకూర, టమోటాలు కలిపి తింటే జబ్బు చేస్తుందని చాలామంది చెబుతుంటారుగానీ.. ఇది పూర్తి నిజం కాదు. ఆ రెండూ కలిపి వండేవాళ్లూ, తినేవాళ్లూ చాలామంది ఉన్నారు. దానివల్ల ఎలాంటి సమస్యలూ ఉండవు కూడా. కాకపోతే చాలా కొద్దిమందిలో ముఖ్యంగా శారీరక శ్రమ లేకుండా రోజంతా కూర్చుని పని చేయటం వంటి జీవనశైలి ఉన్నవారిలో- కొన్ని రకాల రసాయనాలు బాగా పేరుకున్నట్టయ్యే అవకాశం ఉంటుంది. పాలకూర, టమోటాల్లో ఆక్సలేట్‌ ఉంటుంది. ఈ రెంటినీ కలిపి వండటం వల్ల వాటిలోని 'క్యాల్షియం ఆక్సలేట్‌' రసాయనం పేరుకున్నట్త్టె క్రమేపీ అది చిన్నచిన్న రాళ్లలా తయారవుతుంది. ఇలా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. ఇలా కిడ్నీల్లో రాళ్లు వచ్చిన, వస్తున్న శారీరక తత్వం ఉన్న వారు... వీటిని కలిపి తినకుండా ఉండటం ఉత్తమం. ఇలాంటి సమస్యలేమీ లేనివారు ఆ రెంటినీ నిశ్చింతగా కలిపి తినొచ్చు.



నెయ్యి

*నెయ్యి ఎవరికీ మంచిది కాదని భావిస్తూ కొందరు అస్సలు నెయ్యిని పూర్తిగా దూరంగా పెట్టేస్తున్నారు. ఇది సరికాదు. చంటి పిల్లలు, పెరిగే పిల్లలు, రోజంతా కష్టించి బరువు పని చేసేవారు, క్రీడాకారులు.. వీరంతా రోజూ నెయ్యి వంటివి తీసుకోవటం మంచిదే. నెయ్యిలో సహజసిద్ధమైన విటమిన్‌-ఎ ఉంటుంది. ఇది శరీరానికి చాలా మంచిది. పెరిగే పిల్లలకు చాలా మంచి చేస్తుంది. కాకపోతే అస్సలు శారీరక శ్రమ లేని కంప్యూటర్‌ ఉద్యోగుల వంటివారు, శారీరక కదలికలు పెద్దగా లేని, మంచం దిగని వృద్ధుల వంటివారు రోజూ నెయ్యి వంటివి తినటం మంచిది కాదు. నెయ్యి అనేది సంతృప్త కొవ్వు కాబట్టి దానివల్ల కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశం ఉంటుంది. మిగతా వంట నూనెలను తగ్గించటమంటే కష్టంగానీ నెయ్యి తగ్గించెయ్యటం, మానెయ్యటం తేలికే. అందుకే ఎదిగే వయసు దాటిపోయిన పెద్దలు దీనికి దూరంగా ఉండొచ్చు.



వంట

*ఆహార పదార్థాలను అతిగా వండితే వాటిల్లోని పోషకాలు పోతాయని భావించేవారున్నారు. ఇది కొంత వరకూ నిజమే. బియ్యం, గోధుమల వంటి పిండి పదార్థాలను; చికెన్‌, మటన్‌ వంటి మాంసకృత్తులను బాగా వండితేనేగానీ అవి మన ఒంటికి పట్టవు. మన శరీరం జంతువుల్లాంటిది కాదు. కొంతమేరకు వేడి చేసి, వాటి స్వభావాన్ని మారిస్తేనే మన పేగులు వాటిని జీర్ణం చేసుకోగలుగుతాయి. వంట రూపంలో ముందు కొంత జీర్ణప్రక్రియ జరిగితే.. మిగతా దాన్ని మన శరీరం జీర్ణించుకుంటుంది. కాబట్టి పిండి పదార్థాలను, మాంసకృత్తులను కనీసంగానైనా వండటం అవసరం. అయితే కాయగూరల విషయానికి వచ్చేసరికి ఇది వర్తించదు. కూరగాయల్లో ఉండే ఖనిజ లవణాలు, నీటిలో కరిగే విటమిన్లు- మనం వేడి చేస్తే హరించుకుపోతాయి. అలాగని వండకుండా తినలేం కాబట్టి కూరగాయలను వేడి వేడి నూనెల్లో వేయించెయ్యటం వంటివి చెయ్యకుండా... కొద్దిగా నూనె వేసి తాలింపు పెట్టి తేలికగా ఉడికించి తినటం మంచిది. అలా చేసినా కొన్ని విటమిన్లు పోతాయి కాబట్టి రోజూ మనం విడిగా కొన్ని పచ్చి కూర ముక్కలు (సలాడ్లు), పండ్లు, పండ్ల రసాలు, మొలకెత్తిన గింజల వంటివి తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. కొత్తిమీర, పుదీనా వంటివాటితో పచ్చిగా చేసే రోటి పచ్చళ్ల వంటివీ బాగా ఉపయోగపడతాయి.



రాత్రి తిండి

*రాత్రిపూట తిండి ఎక్కువైతే బరువు పెరుగుతారని చాలామంది నమ్ముతుంటారు. కొంత వరకూ ఇందులో నిజం లేకపోలేదు. మనం రోజు మొత్తం మీద తినే తిండి, దాని ద్వారా వచ్చే మొత్తం క్యాలరీలు- మూడు పూట్లా చేసే భోజనాల నుంచి సమానంగా ఒంటికి దక్కటం మంచిది. కానీ చాలామంది ఉదయం ఆఫీసులకు వెళ్లే హడావుడిలో, మధ్యాహ్నం పని ఒత్తిడిలో పడి ఉదయపు అల్పాహారం అసలు తీసుకోవటం లేదు. రాత్రంతా ఏమీ తీసుకోకుండా ఉంటారు కాబట్టి ఉదయపు అల్పాహారం కాస్త దండిగా ఉండటం మంచిది, అవసరం కూడా. మధ్యాహ్నం ఓ మోస్తరుగా, రాత్రికి చాలా తేలికగా ఆహారం తీసుకోవటం మంచిది. రాత్రిపూట ఎక్కువగా తినటం అంత మంచిది కాదు, రాత్రంతా శారీరక శ్రమ లేకుండా పడుకునే ఉంటాం కాబట్టి క్యాలరీల ఖర్చుండదు, దాంతో అది కొవ్వుగా మారి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఉదయాన్నే వ్యాయామాలు చెయ్యటం వల్ల మంచి జరుగుతుంది. అయితే- రోజులో కేవలం మూడుసార్లే ఆహారం తినటం కాకుండా కాస్త తక్కువ పరిమాణంలో, రోజులో ఎక్కువ దఫాలు తీసుకోవటం మంచిది. ఎదురుచూసీచూసీ రోజులో మూడుసార్లు తినటం వల్ల ఆకలికి ఎక్కువ మొత్తంలో తినటం జరుగుతుంది. అలా కాకుండా మధ్య మధ్యలో తినటం వల్ల అంత ఎక్కువ ఆకలి ఉండదు. తక్కువగానే తింటాం. ఇలా ఎక్కువసార్లు తిన్నా తీసుకునే మొత్తం క్యాలరీలేమీ పెరగవు. దీనివల్ల బరువు పెరగరు, లావవ్వరు.



కూరగాయలను కోసిన తర్వాత ఆ ముక్కలను నీళ్లలో కడగటం, నానబెట్టటం వంటివి చెయ్యకూడదు. అలా చేస్తే కూరగాయల్లో ఉండే బీకాంప్లెక్స్‌ విటమిన్లు, పొటాషియం తదితర ఖనిజాలన్నీ నీళ్లలో కరిగిపోయి, చివరికి వాటిలో వట్టి పిట్టు మిగులుతుంది. కాబట్టి కూరగాయలను ముందే శుభ్రంగా కడిగేసి.. అప్పుడు తరిగి, వండుకోవాలి. ఒకసారి తరిగిన తర్వాత మాత్రం మళ్లీ నీళ్లలో కడగకూడదు. (కిడ్నీ జబ్బులున్న వారు ఇలా నానబెట్టి తినటం అవసరం, వారికి వైద్యుల సలహా ముఖ్యం)



-Dr.C.అంజలీదేవి ప్రొఫెషర్(రిటైర్డ్) పోషకాహార విభాగము ఉష్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ @ ఈనాడు సుఖీభవ .


  • ====================


Visit my Website - Dr.Seshagirirao...

Sunday 19 May 2013

Vitamin B9-folic acid , విటమిన్ B9 (ఫోలిక్ ఆమ్లం)



  •  





  •  




పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



విటమిన్ B9 (ఫోలిక్ ఆమ్లం)--



అమ్మకే కాదు... అందరికీ! 'బి' కాంప్లెక్స్‌ విటమిన్ల సమూహానికి చెందిన ఫోలిక్‌ యాసిడ్‌ మహిళలకు జీవితంలోని ప్రతి దశలో అవసరమే.



రక్త హీనతను తగ్గించడానికి ఇనుము అవసరం. ఎముక పుష్టికి క్యాల్షియం కావాలి. మరి పుట్టినప్పటి నుంచి ఎదిగే ప్రతి దశలో కణ నిర్మాణానికీ, ఎర్ర రక్తకణాల తయారీకి ఏ పోషకం అవసరం అంటే, అదే ఫోలిక్‌ యాసిడ్‌. ఇది శరీరంలో తనంతట తానుగా తయారవదు. మాత్రల రూపంలో తీసుకోవాలి. లేదంటే ఫొలేట్‌ కారకాలున్న ఆహార పదార్థాలను తినడం ద్వారా పొందాల్సిందే. నెలసరులు రావడం, గర్భం దాల్చడం, ఓ బిడ్డకు జన్మనివ్వడం, పిల్లలకు పాలివ్వడం... వంటి మార్పులు చోటుచేసుకునే సమయంలో శక్తి సన్నగిల్లకుండా చూడటంలో, ఉదర సంబంధ కణ నిర్మాణంలో ఫొలేట్‌ ఉపయోగపడుతుంది. వెన్నెముక దృఢంగా మారి, ఏ సమస్యలు రాకుండా ఉండటానికీ ఎంతగానో తోడ్పడుతుంది. పిల్లల్లో ఫోలిక్‌ లోపం ఉంటే రక్తహీనత సమస్య బాధిస్తుంది. శారీరక ఎదుగుదల మందగిస్తుంది. దీనినే 'మెగాలో బ్లాస్టిక్‌ ఎనీమియా' అంటారు. నెలసరులు ఆరంభమయ్యాక, టీనేజీలో ఫోలిక్‌ యాసిడ్‌ శాతం తగ్గితే, అదలాగే కొనసాగి భవిష్యత్తులో గర్భధారణ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. బాలింతలూ, ముప్ఫై ఏళ్లు దాటిన వాళ్లలో ఈ లోపం తలెత్తితే ఎముకలు గుల్లబారడం, గుండె జబ్బులూ, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి.



లోపము వలన కలిగే అనర్ధాలు :



రక్తహీనత, అతిసారము, తెల్ల రక్త కణాలు నష్ట పోవటము--ఫోలిక్‌ యాసిడ్‌ లోపం ఉన్నవాళ్లకు ఆకలి వేయదు. ముఖం పాలిపోయి, బరువు తగ్గిపోతుంటారు. త్వరగా అలసిపోవడం, బాగా నీరసంగా అనిపించడం, మగత వంటి లక్షణాలు కనిపిస్తాయి. పాసివ్‌ స్మోకింగ్‌ ప్రభావానికి లోనయ్యే మహిళల్లో కూడా ఫోలిక్‌ యాసిడ్‌ లోపం ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.



తల్లికీ, బిడ్డకూ రక్షణ...



నెల తప్పిన శుభవార్త తెలిసినప్పటి నుంచీ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలని వాడమని డాక్టర్లు కచ్చితంగా చెబుతారు. చాలామంది వాడతారు. ఎందుకంటే? గర్భం ధరించిన తొలి రోజుల్లో గర్భస్థ శిశువు ఎదుగుదలలో కొన్ని కీలకమైన మార్పులు జరుగుతాయి. వెన్నెముక, నరాలు ఏర్పడే ఆ దశలో తగినంత ఫొలేట్‌ అందకపోతే వెన్నెముకకు సంబంధించిన 'న్యూరల్‌ ట్యూబ్‌ డిఫెక్ట్‌' వచ్చే ఆస్కారం ఉంది. అంటే బిడ్డ వెన్ను సరిగ్గా అభివృద్ధి చెందదన్న మాట. అంతేకాదు, పాపాయి డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏల రూపకల్పనలో... పిల్లల్లో 'ఆటిజం' వంటి సమస్యలు రాకుండా చూడటంలో ఫొలేట్‌లు ఎంతో కీలకం. అందుకే గర్భం ధరించాలన్న ఆలోచన వచ్చింది మొదలు ఫోలేట్‌ యాసిడ్‌ ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలి. వైద్యుల సలహా ప్రకారం సప్లిమెంట్లు తీసుకోవాలి. తొలి పన్నెండు వారాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. తగినంత ఫోలిక్‌ యాసిడ్‌ లేకపోతే నెలలు నిండకుండానే ప్రసవమయ్యే అవకాశముంది. కొన్నిసార్లు అవాంఛిత గర్భస్రావాలు జరగడానికీ ఆస్కారముంది. ఒకవేళ ఏ సమస్యల్లేకుండా ప్రసవమైనా పిల్లలు తగినంత బరువుతో పుట్టరు.



పెద్ద వయసు వారిలో వచ్చే సమస్యలనగానే మతిమరుపూ, కంటి చూపు తగ్గడం వంటివి గుర్తుకొస్తాయి. ఈ రెంటినీ అదుపు చేయడానికి ఫొలేట్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. వృద్ధాప్య లక్షణాలు త్వరగా దరిచేరవు. ముఖ్యంగా మహిళలని వేధించే సర్వైకల్‌ క్యాన్సర్‌ రాకుండా నియంత్రించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎముకలు గుల్లబారడం (ఆస్టియోపొరోసిస్‌), నిద్రలేమి, ఆరు పదులు దాటిన వారికి గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు నిపుణులు ఇప్పుడు ఫోలిక్‌ మాత్రలు వాడమని సూచిస్తున్నారు.



పెళ్లయ్యాక మరింత శ్రద్ధగా: పురుషులతో పోలిస్తే మహిళలకిది ఎంతో అవసరమైన పోషకం. అందుకే పదకొండేళ్లు దాటిన అమ్మాయిలు పెళ్లయ్యేంత వరకూ రోజూ ఫొలేట్‌ ఉండే పదార్థాలను ఎక్కువగా తినాలి. ఇక పెళ్లయిన వారు, వీరినే పొటెన్షియల్‌ మదర్స్‌ అంటారు. గర్భం ధరించడానికి సిద్ధంగా ఉండే వీళ్లు సప్లిమెంట్లూ, ఆహార పదార్థాల రూపంలో 400 మైక్రో గ్రాముల వరకూ ఫొలేట్‌ తీసుకోవాలి. గర్భం ధరించిన తొలి పన్నెండు వారాల్లో 500 మైక్రో గ్రాములూ, పాలిచ్చే సమయంలో 300 మైక్రో గ్రాములు తీసుకోవాలి. గర్భిణులు తప్పించి, మిగిలిన వారంతా మాత్రల రూపంలో కాక నేరుగా ఆహార పదార్థాల నుంచి ఫొలేట్‌ కారకాలను పొందడం మంచిది.



ఏ పదార్ధాలలో దొరుకుతుంది?.



కాలేయము, మాంసము, గుడ్లు, పాలు, ఫలాలు, ధాన్యాలు, ఆకు కూరలు     --- పాలకూరలో పుష్కలం: ముదురాకుపచ్చని ఆకు కూరలు ఫొలేట్‌కి పెట్టింది పేరు. ముఖ్యంగా పాలకూర గురించి చెప్పుకోవాలి. ఒక కప్పు పాలకూర నుంచి అత్యధికంగా 260 మైక్రో గ్రాములని పొందవచ్చు. పాలకూరతో పాటు తోటకూర, చుక్కకూరల్లోనూ ఈ విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. వీటిని మరీ ఎక్కువ మంట మీద వండితే అవి ఫోలేట్‌లని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే కుక్కర్‌లో ఉడికించాలి. బీన్స్‌, చిక్కుడు జాతి గింజలూ, పప్పు ధాన్యాలూ ఫొలేట్‌ని ఎక్కువగా అందిస్తాయి. ఒక కప్పు బీన్స్‌ నుంచి 180 మైక్రో గ్రాముల ఫొలేట్‌ అందుతుంది. ఇది నీటిలో కరిగే 'బి' కాంప్లెక్స్‌ విటమిన్‌. చిక్కుడు వంటి గింజలని కూడా వేయించడం కాకుండా ఉడికించడం ద్వారా ఎక్కువ పోషకాలని పొందవచ్చు.



నారింజ రసం తాగితే: నిమ్మజాతి పండ్లలో సహజంగానే ఫొలేట్‌ పోషకాలు ఎక్కువ. అలాగే కప్పు నారింజ రసాన్ని తాగితే, ఒక రోజుకి అవసరమైన దానిలో ఐదో వంతు అందుతుంది. టొమాటో రసం నుంచీ పొందవచ్చు. మాంసాహారం తినేవారు లివర్‌ని తినడం వల్ల బి9 రూపంలో ఫోలిక్‌ యాసిడ్‌ లభిస్తుంది. బజారులో దొరికే హోల్‌వీట్‌ బ్రెడ్‌, వైట్‌ బ్రెడ్‌ తిన్నా మంచిదే.



బీట్‌రూట్‌తో ప్రయోజనాలు : వేయించి తినే పొద్దు తిరుగుడు విత్తనాల వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. వీటి నుంచి రోజువారీ అవసరాలకు కావాల్సిన ఫోలిక్‌ యాసిడ్‌ అరవై శాతం దొరుకుతుంది. వేరుసెనగ పప్పు, పుట్ట గొడుగులూ, బొప్పాయీ, క్యారెట్‌, బీట్‌రూట్‌, పచ్చి బఠాణీ, చేపలూ, పాలూ, అన్నం, అరటిపండు, అనాస, మొక్కజొన్న, క్యాబేజీ టోఫులు కూడా ఫోలిక్‌ యాసిడ్‌ను అందించేవే. బంగాళాదుంపలూ, చిలగడదుంపలూ, గోధుమపిండితో చేసిన పదార్థాల నుంచి ఫొలేట్‌ని పొందవచ్చు.






  • =======================


Visit my Website - Dr.Seshagirirao...

Thursday 16 May 2013

Nutritional Food , పౌష్టిక ఆహారం



  •  





  •  




పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



 Nutritional Food , పౌష్టిక ఆహారం



ఏ ఆహారమైతే మనము తీసుకుంటే మన ఆరోగ్యము పెంపొందించి , అనారోగ్యపాలుకాకుండా శక్తివంతముగా ఉంచి  జీవనపరిమాణము మెరుగవుతుందో దానినే పౌష్టికాహారము అంటాము . పౌష్టికాహారములో ముఖ్యము గా 7 రకాలైన పోషకాలు అనగా 1.మాంసకృత్తులు(proteins) , 2.పిండిపదార్ధాలు(carbohydrates) , 3.కొవ్వుపదార్ధాలు(fats) , 4.పీచుపదార్ధము(fiber) , 5.విటమిన్లు(vitamins) , 6.ఖనిజలవణాలు(minerals) , 7.నీరు(water) ఉండాలి.



 ఆహారం తీసుకోవడంలో సమతుల్యతా, వైవిధ్యం, పరిమితంగా ఉండగలగడం అనేవి, ఆరోగ్యంగా ఆహారం తీసుకునే పద్ధతులు అని వైద్యులు చిరకాలంగా చెబుతున్నారు. అంటే, శృతిమించిన స్థాయిలో కేలరీలు లేదా ఒకే తరహా పోషకాన్ని అతిగా తీసుకోకుండా.... వైవిధ్య భరితం అయిన ఆహారాన్ని తీసుకోవాలనేది వారి సలహా. మరి ఈ క్రింది సూచనలు మీ ఆరోగ్యానికి శ్రీరామరక్ష కాగలవు. ఆహారం విషయంలో నిర్దిష్ట గమ్యాలు-ఆహార సంబంధమైన మార్గదర్శక సూత్రాలు




  • వివిధ ఆహారపదార్థాల నుండి పోషణ రీత్యా తగిన ఆహారాన్ని వివేకంతో ఎన్నుకొని వినియోగించుకోవాలి.

  • గర్భంతో ఉన్నప్పుడు, తల్లి బిడ్డకు పాలిస్తున్నప్పుడు, అదనపు ఆహారం, మరింత జాగ్రత్త అవసరం,

  • బిడ్డకు 4 నుండి 6 నెలల వయస్సు వచ్చేదాకా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లి పాలను రెండేళ్ళ వరకు ఇవ్వవచ్చు,

  • శిశువులకు 4-6 నెలల వయస్సులో అదనపు ఆహార పదార్థాలను ఇవ్వాలి,

  • ఆరోగ్యంగా వున్నా, జబ్బున పడినా, పిల్లలు, కౌమార దశలో వున్న వాళ్ళు తగిన ఆహారాన్ని సరిపడినంత తీసుకోవాలి,

  • ఆకుకూరలు, ఇతర కూరగాయలు, పళ్ళు సమృద్ధిగా వాడాలి.

  • వంటనూనెలు, జంతు సంబంధ ఆహారపదార్థాలను పరిమితంగా వాడాలి. వనస్పతి, నెయ్యి, వెన్నలను అరుదుగా మాత్రమే వాడాలి.

  • అతిగా ఆహారాన్ని తినకుండ, ఎక్కవు బరువు, స్థూలకాయాన్ని నిరోధించాలి,

  • ఉప్పును పరిమితంగా వాడండి,

  • శుభ్రమైన, సురక్షితమైన ఆహారాన్ని తీసుకోవాలి.

  • ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను, వంట పద్ధతులను అనుసరించాలి.

  • నీళ్ళను తగిన పరిమానాలలో త్రాగాలి, పానీయాలను పరిమితంగా సేవించాలి.

  • తినడానికి తయారుగా ఉన్న ఆహార పదార్థాలు, ప్రోసెస్ చేయబడ్డ పదార్థాలను ఔచిత్యంతో వాడాలి. చక్కెరను పరమితంగా వాడాలి.

  • వయసు మళ్ళినవారు చురుకుగా ఆరోగ్యంగా వుండడానికి పుష్టికరమైన ఆహారాన్ని తినాలి.


మాంసకృత్తులు




    మాంసకృత్తులు (ప్రోటీన్స్) శరీర అవయవాల నిర్మాణ కార్యక్రమాన్ని, శక్తిని వినియోగించుటకు చాలా అవసరమైనవి. మాంసకృత్తులు శరీర నిర్మాణానికి, పెరుగుదలకు ముఖ్యంగా పిల్లలలోను కౌమారదశలోను చాలా ఉపయోగకరం. పెద్దవయస్సు లేక వృద్ధులలో మాంసకృత్తుల సహాయం చాలా  అవసరం . పెద్దగా దెబ్బలు తగిలినా అవి మానిపోవడానికి సహాయపడుతుంది.

    గ్ర్భవతులు, బాలింతలు మాంసకృత్తులను అధికంగా తీసుకోవటం చాలా అవసరం. ఇవి బిడ్డ పెరుగుదలకు ఎంతో తోడ్పడుతాయి .

    ఆహారంలో మాంసకృత్తులు ఎంతవరకు తీసుకోవాలి :



        మాంసాహారులకు లభించే మాంసకృత్తులు, అధిక శాతం మరియు నాణ్యమైన అవసరమైన అమైనో ఆమ్లాలను తయారుచేస్తుంది.



        శాఖాహారం తీసుకొనే వాళ్ళు తమకు సరిపడా మాంసకృత్తులను  పప్పు ధాన్యాలు, పాలు, గుడ్డు నుంచి  పొందవచ్చు.

        ఎక్కువ శాతం మాంసకృత్తులు నూనె గింజలు, పప్పులు ,పందిరి చిక్కుళ్ళు, పాలు, పాలతో తయారైన పదార్ధాలు ,జంతు మాంసము, చేపలు, కోడిమాంసము ద్వారా లభిస్తాయి.

        వృక్షాల ద్వారా లంభించే ఆహారంలో సొయాబీన్స్ లో చాలా ఎక్కువ శాతంలో అంటే 40% కన్నా ఎక్కువగా మాంసకృత్తులు ఉంటాయి.

        16–18 సంవత్సరాల మధ్య వయస్సు గల 57 కే.జీల బరువు బాలురకు రోజుకు 78 గ్రాముల  మాంసకృత్తులు అవసరం. అదే విధంగా 16 - 18 సంవత్సరాల మధ్య వయస్సు గల 50 కే.జిల బరువు బాలికలకు రోజుకు 63 గ్రాములు అవసరం.

        గర్బవతికి రోజుకు 65 గ్రాములు ఒక  రోజుకు,  పాలిచ్చే తల్లులకు/బాలింతలకు  6 నెలల వరకు   75 గ్రాములు 1 రోజుకు అవసరం.



    ఆహార పదార్ధాలు--     ప్రతి 100 గ్రాములకు లభించే మాంసక్రత్తులు /గ్రాముల్లో

    సోయాబీన్స్            ---       43.2,

    శెనగ పప్పు, పప్పు, మినపప్పు, పెసరపప్పు ఎర్ర పప్పు, కందిపప్పు--    22,

    వేరుశెనగపప్పు, బాదం పప్పు,జీడిపప్పు---        23,

    చేపలు         ---       20,

    మాంసము    ---            22,

    ఆవు పాలు    ---         3.2,

    గేదె పాలు             ---          4.3,

    కోడిగుడ్డు  ( సుమారు 44 గ్రాములు)    ---         13.3     (ఒక గుడ్డుకు)



పిండిపదార్ధాలు(carbohydrates) ---



తిండి గింజలతో తయారు చేసిన ఆహారపదార్ధాలలో సంక్లిష్ట పిండిపదార్ధాలు పుష్కలంగా లభిస్తాయి. పిండి పదార్థాలను ఆంగ్లంలో carbohydrates అంటారు. నిజానికి పిండి పదార్ధం - అంటే starchy substance - ఒక రకం కర్బనోదకం. పిండి పదార్ధాలు, చక్కెరలు, పిప్పి పదార్ధాలు, మొదలైనవన్నీ కర్బనోదకాలకి ఉదాహరణలే.

రసాయనులు కర్బనోదకాలని నాలుగు ప్రధాన వర్గాలుగా విభజించారు.



    ఏక చక్కెరలు లేదా మోనోసేకరైడ్లు (monosaccharides): వీటిని సామాన్య చక్కెరలు అంటారు. ఉదాహరణ: గ్లూకోజు, గేలక్టోజు, ఫ్రూక్టోజు-వీటిని జల విశ్లేషణ (hydrolysis) చేయలేము. ఏక చక్కెరలని ఇంకా చిరు వర్గాలుగా విడగొట్టవచ్చు. చక్కెర బణువులో ఉన్న కార్బన్ అణువుల సంఖ్యనుబట్టి కాని, కార్బనిల్‌ గుంపు (group) ఉన్న స్థానాన్ని బట్టి గాని, బణువుయొక్క కరత్వం (handedness) కాని ఈ విభజన చేస్తారు. కార్బనిల్‌ గుంపు ఆల్డిహైడ్‌ (aldehyde) అయిన యెడల ఆ ఏక చక్కెరని ఆల్‌డోజు (aldose) అంటారు; కార్బనిల్‌ గుంపు కీటోన్‌ అయిన యెడల ఆ ఏక చక్కెరని కీటోజు (ketose) అంటారు. అదే పద్ధతిలో - ఏక చక్కెర బణువులో మూడు కర్బనపుటణువులు ఉంటే అది త్రయోజు (triose), నాలుగుంటే చతుర్ధోజు (tetrose), అయిదు ఉంటే పంచోజు (pentose), ఆరు ఉంటే షడోజు (hexose). ఈ పద్ధతిలో గ్లూకోజు ఆల్డోషడోజు (aldohexose) అవుతుంది (అంటే ఆరు కర్బనపు అణువులు ఉన్న ఆల్డిహైడ్‌), రైబోజు (ribose) ఆల్డోపంచోజు (aldopentose) అవుతుంది (అంటే, అయిదు కర్బనపు అణువులు ఉన్న ఆల్డిహైడ్‌), ఫ్రూక్టోజు (fructose) కీటోహెక్సోజు (ketohexose) అవుతుంది (అంటే ఆరు కర్బనపు అణువులు ఉన్న కీటోను). జీవ రసాయనికంగా పెంటోజు లు, హెక్సోజు లు ప్రధానమైనవి. పెంటోజ్ లో రైబోజ్, హెక్సోజ్ లో గ్లూకోజ్, ఫ్రూక్టోజు లు చాలా ముఖ్యమైనవి.



    జంట చక్కెరలు లేదా డైసేకరైడ్లు (disaccharides): ఉదాహరణ: సుక్రోజు, లేక్టోజు, మాల్టోజు--వీటిని జల విశ్లేషణం చేసి రెండు ఏక చక్కెరలుగా విడగొట్టవచ్చు. జీవులలో జల విశ్లేషణం చేయడానికి ప్రత్యేకమైన ఎంజైములు ఉంటాయి.



    స్వల్ప చక్కెరలు లేదా ఒలిగోసేకరైడ్లు (oligosaccharides): మూడు నుండి తొమ్మిది వరకు ఏకసేకరైడులు కలిసి ఏర్పడిన చక్కెరలను స్వల్పచక్కెరలు అంటారు.

    బహు చక్కెరలు లేదా పోలిసేకరైడ్లు (polysaccharides): అనేక (తొమ్మిది దాటి) ఏకసేకరైడులు కలిసి ఏర్పడిన చక్కెరలను బహుచక్కెరలు అంటారు. ఉదాహరణ: పిండి పదార్ధం, కణోజు (లేదా సెల్యులోజు).



శాస్త్రం ప్రకారం స్వల్ప, బహు అని రెండు వర్గాలుగా విడగొట్టవలసిన అవసరం పెద్దగా లేదు. బహు చక్కెరల జాతిలో ముఖ్యమైనది కణోజు (cellulose). వృక్ష సంపద లోని జీవ కణాల గోడలలో ఉంటుంది కనుక దీనికి ఇంగ్లీషులో సెల్యులోజు అనీ, తెలుగులో కణోజు అనీ పేర్లు. ఈ భూలోకంలో అతి విస్తారంగా ఉన్న ప్రాణి చెట్లు, చేమలు, గడ్డి, మొదలైన వృక్ష సంపద కనుక 'ఈ భూలోకంలో అత్యంత సమృద్ధిగా దొరికే ఆంగిక బణువులు (organic molecules) ఏవి?' అన్న ప్రశ్న కి నిర్ద్వందంగా 'కణోజు' అని సమాధానం చెప్పొచ్చు. కాగితాలు, సెల్యులాయిడ్‌, నైట్రోసెల్యులోజు, రేయాన్‌ మొదలైన పదార్ధాల తయారీకి కణోజు ముడి పదార్ధం.



జీవ ప్రాముఖ్యం---    చక్కెరలు జీవులకు నిత్యం అవసరమయ్యే శక్తిని ప్రసాదిస్తాయి.    పోలీసేకరైడ్లు శక్తిని నిల్వ ఉంచే పదార్ధాలుగా పనిచేస్తాయి.    జీవకణాల గోడలు మరియు ఇతర నిర్మాణాలలో ఉపయోగపడతాయి.    కైటిన్ పాలిసేకరైడ్లు కీటకాలకు, కొన్ని అకశేరుకాలకు రక్షణ కవచాన్ని ఏర్పరుస్తాయి.    హైల్యురానిక్ ఆమ్లం కణజాలాలలో సిమెంట్ పదార్ధంగా ఉపయోగపడుతుంది.    హెపరిన్ జీవులలో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది.    మానవులలో రక్త వర్గాలు కూడా వీటితో తయారు అవుతాయి.    ఇవి జీవ పదార్థానికి జిగార్ధ (కొల్లాయిడల్ , colloidal) ధర్మాన్ని ఇస్తాయి.



పోషక సామర్ధ్యం



కర్బనోదకాలు జీవికి శక్తిని ఇచ్చే పోషక పదార్ధాలు. వీటిని తక్కువ నీటితో జీర్ణం చేసుకోవచ్చు. ప్రాణ్యము (protein) లని, కొవ్వు (fat) లని జీర్ణించుకుందుకి ఎక్కవ నీరు కావాలి. ప్రాణ్యములు, కొవ్వులు ఆవం (oven) నిర్మించటానికి వాడే ఇటికలు, సున్నం అనుకుంటే కర్బనోదకాలు ఆవంలో కాలే ఇంధనం (fuel) అవుతుంది. అంటే శరీరంలో జీవకణాల నిర్మాణానికి కణజాల (tissue) నిర్మాణానికి ప్రాణ్యములు, కొవ్వులు అవసరం, శక్తిని ఇవ్వటానికి కర్బనోదకాలు అవసరం.



కర్బనోదకాలు జీవి మనుగడకి తప్పనిసరి కాదు. కర్బనోదకాల సరఫరా లేకపోతే జీవి కొవ్వుల నుండి, ప్రాణ్యాల నుండి కర్బనోదకాలని తయారుచేసుకో కలదు.



స్థూలకాయంతో (obese) కాని, డయబెటీస్ (diabetes)తో కాని బాధ పడే ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతూన్న ఈ రోజులలో పోషకాహారం (diet) ఎటువంటిది తినాలన్నది ఒక జటిలమైన ప్రశ్నగా పరిణమించింది. ఐశ్వర్యవంతమైన దేశాలలో ఎదిగిన వ్యక్తులు తమకి కావలసిన శక్తిలో 40 నుండి 65 శాతం మేరకి కర్బనోదకాల నుండి లభించేలా చూసుకోవాలని ఒక మార్గదర్శిక సూచిక (guideline)ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) వారు మనకి లభించే శక్తిలో 55 నుండి 75 శాతం మేరకి కర్బనోదకాల నుండి పొందాలని వక్కాణించేరు. ఈ రెండింటిలో ఏ మార్గదర్శిక సూచిని వాడినా అందులో 10 శాతం మాత్రమే సాధారణ కర్బనోదకాలు (simple carbohydrates, అంటే, చక్కెర, గ్లూకోజు వగైరాలు) నుండి ఉండాలి అని, మిగిలినవి సంక్లిష్ట కర్బనోదకాలు (complex carbohydrates, అంటే, ధాన్యాలు, పళ్ళు, రొట్టెలు, మొదలైన పిండి పదార్ధాలు) అయి ఉండాలని సిఫారుసు చేశారు. ఆరోగ్య సూత్రాలు పాటించే వారు ఈ సంక్లిష్ట కర్బనోదకాలనే మంచి కర్బనోదకాలు (good carbs) అనిన్నీ, సాధారణ కర్బనోదకాలని చెడ్డ కర్బనోదకాలనిన్నీ (bad carbs) అంటూ ఉంటారు. రసాయన పరిభాషలో చెప్పాలంటే ఏక చక్కెరలు, జంట చక్కెరలు సాధారణ కర్బనోదకాలు. స్వల్ప చక్కెరలు, బహు చక్కెరలు సంక్లిష్ట కర్బనోదకాలు. ఇవి కాయగూరలు, ధాన్యాలు, పండ్లు, మొదలైన వాటిల్లో ఉంటాయి.



ఆరోగ్య పరిరక్షణకి మన అసలు గమ్యం రక్తంలో ఉన్న గ్లూకోజు మట్టాన్ని అదుపులో పెట్టగలగటం. కనుక ఏయే పదార్ధాలు తింటే రక్తంలో గ్లూకోజు మట్టం ఎంతెంత పెరుగుతుందో తెలిస్తే అప్పుడు ఏయే వస్తువులు తింటే మంచిదో తేల్చి చెప్పొచ్చు. ఈ కోణంలో ఆలోచించి కొందరు గ్లయిసీమిక్‌ సూచిక (glycemic index) అని ఒక కొత్త సూచిక ని ప్రవేశ పెట్టేరు. ఈ పద్ధతి ప్రకారం ఏయే కర్బనోదకాలని తింటే రక్తంలో గ్లూకోజు మట్టం ఎంతెంత పెరుగుతుందో లెక్క కట్టి, ఆ లెక్క ప్రకారం కర్బనోదకాలని వర్గీకరిస్తారు. మరొక పద్దతిలో ఇన్సులిన్‌ సూచిక (insulin) అనే మరొక కొత్త సూచిక వాడతారు. గ్లయిసీమిక్‌, ఇన్సులిన్‌ సూచికలు శాస్త్రవేత్తలకి అర్ధమయినంత తేలికగా సామాన్యులకి అర్ధం కావు. కనుక ప్రస్తుతం బాగా పలుకుబడిలో ఉన్న పద్దతి 'మంచి, చెడ్డ' అని కర్బనోదకాలని వర్గీకరించటమే.









కొవ్వుపదార్ధాలు - మనిషి ఆరోగ్యం--   కొవ్వు సంబంధ ఆహారం నుండి, మన శరీరానికి కొవ్వు అందుతుంది ఇవి చాలా రకాలుగా శరీరానికి ఉపయోగపడతాయి. ఇది శక్తివంతమైన, శరీరానికి ఇంధనము ఇచ్చే పదార్ధము

    1 gram కొవ్వు = 9 cal ఇంధనము శరీరానికి అందిస్తుంది.

    vit A, B, E & K అను విటమినులు, రక్తంలో కొవ్వుపదార్ధాము ఇమడడానికి చాలా అవసరం.



    కొవ్వు అనేది – ఆహారంలో, చెట్ల నుండి జంతువుల నుండి లభిస్తుంది.  veg-ఆయిల్ - మనము  తీసుకొనే  ఆహారంలొ  చాలా  ముఖ్యమైనది.   దీనిలోఅవసరమైన కొవ్వు ఆమ్లములు,

      1. ఆన్ సాచ్యురేటడ్ (మొనో ఆన్ సాచ్యురేటడ్)

      2. పాలీ ఆన్ సాచ్యురేటడ్

       ఉదా :అన్ సాచ్యురేటడ్ కొవ్వుఆమ్లాలు-వెజిటబుల్ oils    సాచ్యురేటడ్ కొవ్వు అనగా - వెన్న, నెయ్యి .  పెద్దవయస్సువారు - కొవ్వుపదార్ధాలు ఉండే, వెన్న, నెయ్యి హైడ్రొజినేటడ్ కొవ్వుపదార్ధాలు చాలా తక్కువగా తీసుకొవాలి కొబ్బరినూనెవాడరాదు.



    హైడ్రోజినేటడ్ కొవ్వు తీసుకొంటే రక్తంలో కోలెస్ట్రాల్ పెరుగుతుంది, తద్వారా గుండెకు, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులకు గురి అవుతారు.  వంటలకు వాడే నూనెలు, వెజిటబుల్ నూనె, వనస్పతి, నెయ్యి, వెన్నలలో కొ్వ్వును చూడగలము.

    తినుబండారాలలో వుండె కొవ్వు, కరగగలిగే మాంసము కొవ్వు, లేక ఇతర జంతువులకు సంబంధించిన కొవ్వు ఎక్కువ శాతం సాచ్యురేటడ్ కొవ్వులు -



    ప్రతిరోజు ఆహారంలో ఉండాల్సిన కొవ్వుశాతం -    యుక్త వయస్సు పిల్లలో రోజుకు, 25గ్రా- వరకు  సాచ్యురేటడ్ ఫాట్స్ ఉండాలి.    పెద్దవాళ్ళకు - 20గ్రా రోజుకు.

    గర్బవతులకు/ పాలిచ్చే తల్లులకు - 30 గ్రా రోజుకు.



    గుర్తుంచుకోవలసినవి -

    1. తగినంతగా సరిపడగలిగే కొవ్వు పధార్ధాలు తీసుకోవాలి.

    2. వంటలో ఒకటి కన్నాఎక్కువ రకాల నూనెలువాడాలి.

    3. నెయ్యి, వెన్న, వనస్పతి నూనెలు తగ్గించాలి.

    4. ఆకుకూరలు, మెంతులు, ఆవాలు ప్రతి రోజూ వాడాలి.

    5. జంతు అవయవాలు తినరాదు మాంసము/కోడి కన్నా ఎక్కువగా చేపలు తినవచ్చు



పీచుపదార్ధము(fiber)--మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువుండాలి. పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటే నీళ్లు కూడా అధికంగా తాగుతాం. దీని వల్ల శరీరంలోని విషపదార్థాలు శరీరం నుంచి బయటికి వెళ్లిపోతాయి. భోజనానికి, భోజనానికి మధ్యలో అధిక పీచు పదార్థాలను (క్యారెట్‌, బీట్‌రూట్‌, దోసకాయ, ఇతర పళ్లు) తీసుకుంటే కడుపు నిండుతుంది. వెంటనే ఆకలి వేయదు. దీని వల్ల జంక్‌ ఫుడ్‌ను నివారించినట్లవుతుంది

fiber rich foods are five basic categories:




  • * కాయకూరలు --Vegetables.

  • * గింజ దాన్యాలు --Whole grains.

  • * నట్స్ మరియు సీడ్స్ --Nuts and seeds.

  • * బీన్స్ మరియు లెగూమ్స్ -- Beans & legumes.

  • * తాజా & ఎండిన పండ్లు Fresh & dried fruits.


పదార్ధాలలో ఉన్న ఫైబర్ రెండు రకాలు :

కరిగే ఫైబర్(soluble fiber) :
ఇది బ్లడ్ కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది ..తద్వారా గుండె జబ్బులు వచ్చే
అవకాశము తక్కువ చేయును .ఇవి గ్లూకోజ్ అబ్సార్ప్షన్‌(glucose
absorption)నెమ్మది చేయుటచేత రక్తము లో సుగరు లెవల్ తగ్గును .




  • ఓట్స్ ,

  • ఓట్స్ తవుడు ,

  • బార్లీ ,

  • బ్రౌన్‌ రైస్ ,

  • చిక్కుడు ,

  • పండ్లు , కాయకూరలు ఉదా: యాపిల్ , ఆరెంజ్ ,కారెట్స్ మున్నగునవి .


కరగని పీచు పదార్ధము (insoluble fiber): దీనినే రఫేజ్ అని అంటాము . కడుపు నిండేందుకు ఉపయోగపడుతుంది . విరోచనము సాఫీ గా జరుగును .




  • తొక్కతీయని దాన్యాలు ,

  • అన్ని రకాల అపరాలు (చోళు, పెసలు , ఉలవలు)

  • గోధుమ పొట్టు ,జొన్న పొట్టు ,

  • పండ్లు తొక్కలు (outer peels) , కాయల తొక్కలు ,


Here is presented a high fiber food list, so check out:

* Grain Products:
o Whole grain breads
o Buns
o Bagels
o Muffins

* Bran Flakes:
o All Bran.
o Red River cereal.
o Corn bran cereal.
o Whole wheat.

* Shreddies:
o Whole-wheat pastas.
o Whole grains such as barley, popcorn, corn and brown rice.

* Fruits:
o Dried fruits such as apricots, dates, prunes and raisins
o Berries such as blackberries, blueberries, raspberries and strawberries
o Oranges, apple with skin and pear.

* Vegetables:
o Broccoli, spinach, Swiss chard and green peas.
o Dried peas and beans such as kidney beans, lima beans, black-eyed beans, chick peas and lentils.
o Nuts and seeds such as almonds, whole flaxseed and soynuts.



రోజు ౩౦ గ్రాముల పీచు అవసరమని వైద్యులు అంటున్నారు .అందులో కరిగే పీచు ఉంటె మంచిది .సాదారణంగా ప్రతి ఒక్కరు పీచు ఉండే పదార్థాలు  తినడం మంచిది.మధుమేహం ,గుండె జబ్బులు ,మలబద్దకం బాధ పడేవారు  ఎక్కువగా పీచు పదార్థాలు తీసుకుంటారు .

    పీచు లభించే పదార్థాలు     గోధుమలు ,రాగులు, జొన్నలు,సజ్జలు,కొర్రలు ..వీటిలో కరిగేరకం పీచు ఎక్కువగా ఉంటుంది .మనమే గోదుమలు తెచ్చుకొని పిండి పట్టిచడం మంచిది.మిగతా ధాన్యాలతో పోలిస్తే ఓట్స్ లో పీచు ఎక్కోవగా ఉంటుంది.పప్పుల్లో ముడి సెనగలు ,పెసలు ,మినుమలు ,అలసందలు బతనిలు..వీటిలో ఎక్కోవ పీచు ఉంటుంది.





విటమిన్లు (Vitamins)
--- సూక్ష్మమైన పోషక పదార్దములు .ఇవి శక్తినిచ్చే పదార్ధములు కావు .
శరీరములొని వివిధ జీవక్రియలను పరోక్షముగా నియంత్రిస్తాయి . వీటి లోపము వలన
అనేక వ్యాధులు కలుగుతాయి . ఎ,బి,సి,డి,ఇ,కె అనే ఆరు విటమిన్లు ఉన్నాయి.
విటమిన్ల అధ్యయనం చేసే శాస్తాన్ని " విటమినాలజీ " అని అంటారు . జీవి
పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు.
ముందుగా వీటిని వైటల్ - అతిముఖ్యమైన; అమైన్ - అమినో సమ్మేళనాలు అని ఫంక్
మొదటి సారిగా 1912లో ప్రతిపాదించాడు. ఇతనిని " విటమిన్ల పితామహుడు " అంటారు
. తరువాత కాలంలో విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించారు. కాబట్టి
'vitamines' అనే పదంలోని 'e' ని తొలగించి ప్రస్తుతం వాటిని 'vitamins' అని
పేర్కొంటున్నారు. ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలోగానీ
దేహనిర్మాణంలోగానీ తోడ్పడవు. కానీ శక్తిప్రసరణ, జీవక్రియల నియంత్రణలో
ముఖ్యపాత్ర వహిస్తాయి. కొన్ని విటమిన్లు సహ ఎంజైము (Coenzymes) లుగా
పనిచేస్తాయి.




  • మానవులలో ముఖ్యమైనవి 6 విటమిన్లు గుర్తించారు. వీటిని రెండు రకాలుగా వర్గీకరించారు.




ఎ. కొవ్వులలో కరిగే విటమిన్లు:

1.విటమిన్A,

2.విటమిన్D,

3.విటమిన్E,

4.విటమిన్K

విటమిన్లు కొవ్వులలో కరిగేవి. ఇవి శోషణం చెందడానికి పైత్యరసం అవసరం. ఇవి శోషరసం ద్వారా వివిధ భాగాలకు అందుతాయి.

బి. నీటిలో కరిగే విటమిన్లు:

1.విటమిన్ B-complex,విటమిన్ H(Biotin)

2.విటమిన్ C ,




ఖనిజలవణాలు(minerals)


దేహానికి అవసరమైన ఖనిజలవణాలు పుష్కలంగా ఉండేది ఆకుకూరల్లోనే. ఎందుకంటే సున్నం, భాస్వరం, ఉప్పు, ఇనుము తదితర ఖనిజలవణాలను సరాసరి స్వీకరించి, జీర్ణించుకునే శక్తి మనకు లేదు. ప్రకృతి ఆ శక్తిని వృక్షాలు, మొక్కలకు ఇచ్చింది. ఖనిజ లవణాలను అవి స్వీకరించి, సేంద్రియ లవణాల రూపంలో కాండాలలోను, ఆకులలోను, కాయలలోను, పండ్లలోను, పూలు, దుంపలతోను పదిలపరచుకుంటాయి. వాటిని మనం ఆధారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

 ఆకుకూరలలో ఇనుము విశేషంగా ఉంటుంది. ఎ,బి,సి,డి విటమిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అందువలన ఆకుకూరలను దేహ రక్షక పదార్థాలుగా పరిగణిస్తుంటారు. ఆకుకూరలలో గల మాంసకృత్తులు పదార్థము సులభంగా జీర్ణమై, త్వరగా శరీర థాతువులలో కలిసిపోవు స్వభావాన్ని కలిగి ఉంటుంది. ప్రతి మనిషికి సగటున రోజుకు రెండు మొదలు నాలుగు ఔన్సుల వరకు ఆకుకూరలను తీసుకొనుట అవసరమని వైద్యులు అంటున్నారు.

ప్రయోజనాలు

- బలవర్థకమైన ఆహారం కావలసిన వారికి ఆకుకూరలు సహాయపడవు.

- వ్యాధి ఉధృతిని తగ్గించటానికి, తిండి ఎక్కువై వ్యాధులు వచ్చిన వారికి ఆకుకూరలు సహాయపడతాయి.

- ఆకుకూరలు కన్నా కాయగూరలే మంచివి.

- ఎండలో కాయకష్టం చేసే వారికి ఆకుకూరలు అనవసరం. అనగా సూర్యరశ్మి సూటిగా తగలని వారిలో (కార్యాలయాల్లో పనిచేసేవారికి) సేంద్రియ లవణాల కొరతను ఆకుకూరలు పూరిస్తాయి. అటువంటి వారికి ఆకుకూరలు అవసరం.

- మధుమేహము, పక్షవాతము, స్థూలకాయము తదితర వ్యాధులకు పిండిపదార్థాలు ఎక్కువగా తినుక ఒక కారణం. ఇట్టివారికి అన్నానికి బదులుగా ఆకుకూరలు మేలు చేస్తాయి.

- చక్రవర్తి కూర, పెరుగు తోటకూర, బచ్చలి మొదలైనవి వేడిని తగ్గిస్తాయి. మిగిలిన ఆకుకూరలకు వేడిని ప్రకోపింపచేయు గుణము ఉన్నది.

- ఆకుకూరలను తరగకముందే నీటిలో కడగాలి. కడిగిన తర్వాత తరగకూడదు. ఆకుకూరలను తక్కువ మంటమీద తక్కువనీటిలో ఉడికించాలి. ఉడికించగా మిగిలిన నీటిని పారబోయకూడదు. వీలైతే తాగాలి. లేకపోతే ఇగురులోకాని, పప్పులోగాని, చారులో గాని కలుపుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలకు నేరుగా ఆకుకూరలు తిననప్పుడు ఈవిధంగా పప్పులో కలిపి పెడుతుంటే అన్ని పోషకాలు సమగ్రంగా అందుతాయి.


 


  • ========================


Visit my Website - Dr.Seshagirirao...

Monday 6 May 2013

Citron,దబ్బ పండు



  •  





  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు  ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.





 దబ్బపండుని చూడక్కరలేదు... ఆ పేరు వింటేనే నాలుక పులుపెక్కుతుంది. అందుకే దాన్ని మనం పచ్చడికే పరిమితం చేసేశాం. లేదంటే పులిహోర చేస్తాం.
పంపర పనస, నారింజ పండ్ల మధ్య సహజంగా జరిగిన సంకరీకరణ ద్వారా పుట్టినదే దబ్బపండు. అందుకేనేమో... ఇది ఒకలాంటి వగరుతో కూడిన తీపీ పులుపూ రుచులతో ఉంటుంది. మనదగ్గర దొరికే దబ్బపండు మన నారింజలోని పులుపుతోనూ పంపరపనస పరిమాణంలోనూ ఉంటుంది. కానీ ఐరోపా, అమెరికా దేశాల్లో దొరికేవి మాత్రం అక్కడి నారింజ అంటే కమలాపండ్ల మాదిరిగానే పులుపుతో కూడిన తియ్యని రుచితో ఎరుపు, గులాబీరంగు గుజ్జుతో ఉంటాయి. తియ్యని నారింజతో పోలిస్తే గ్రేప్‌ ఫ్రూట్‌ రుచే వేరు అంటుంటారు అక్కడివాళ్లు. గుజ్జు రంగుల్లో తేడా ఉన్నప్పటికీ తొక్క రంగు మాత్రం ఎక్కువగా పసుపురంగులోనే ఉంటుంది. నిజానికి నారింజ, నిమ్మ, పంపరపనసల్లోని గుణాలన్నింటినీ పుణికి పుచ్చుకున్నదే దబ్బపండు.

లాభాలు :
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. అందుకే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణుల అంటారు .
* వందగ్రాముల గుజ్జులో 42 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కానీ పీచు శాతం మాత్రం చాలా ఎక్కువ. ఈ పీచు క్యాన్సర్‌కు కారణమైన రసాయనాల్ని పీల్చేస్తుంది. ఇంకా కొలెస్ట్రాల్‌ తగ్గేందుకూ సహకరిస్తుంది.

* ఇందులో విటమిన్‌-ఎ సమృద్ధిగా దొరుకుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే నారింజనిన్‌, నారింజిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి వూపిరితిత్తుల క్యాన్సర్‌, నోటి క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి. వీటితోపాటు, లైకోపిన్‌, బీటా కెరోటిన్‌, క్సాంథిన్‌, ల్యూటిన్‌... వంటి ఫ్లేవొనాయిడ్‌లూ ఎక్కువే. అందుకే దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటిచూపూ మెరుగుపడుతుంది.

*సి-విటమిన్‌ కూడా పుష్కలంగా ఉంటుంది. సహజమైన ఈ యాంటీ ఆక్సిడెంట్‌ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

* 100 గ్రా. తాజా పండులో 135 మి.గ్రా. పొటాషియం ఉంటుంది. గుండె వేగాన్ని నియంత్రించేందుకూ రక్తపోటు అదుపునకూ ఇది ఎంతో ఉపయోగం.

* ఎరుపురంగులో ఉండే గ్రేప్‌ ఫ్రూట్‌లో లైకోపిన్‌ ఉండటంవల్ల ఇది చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడటంతోబాటు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ నుంచీ రక్షిస్తుంది. ఇతర కెరోటినాయిడ్లతో పోలిస్తే క్యాన్సర్‌ కారక ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి లైకోపీన్‌కే ఎక్కువ.

* లిమోనాయిడ్లూ గ్లూకారేట్లూ కూడా ఇందులో ఎక్కువ. ఇవి రొమ్ముక్యాన్సర్లూ ట్యూమర్లూ రాకుండా కాపాడతాయి.

* ఇందులోని నారింజనిన్‌ అనే ఫ్లేవొనాయిడ్‌ దెబ్బతిన్న డి.ఎన్‌.ఎ.ను సైతం బాగుచేస్తుందట.

* ఇందులో కాల్షియం, ఐరన్‌, కాపర్‌, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజాలతోపాటు కొద్దిపాళ్లలో బి-కాంప్లెక్స్‌ విటమిన్లు కూడా ఉంటాయి. ఇది వూబకాయాన్ని నివారించేందుకు దోహదపడుతుందని పరిశోధకులు నిర్ధరించారు.

ఇది సహజమైన క్లీన్సర్‌ కూడా. దీని గుజ్జుని చర్మంమీద నెమ్మదిగా రుద్దితే మృతకణాలన్నీ తొలగి నిగారింపుని తీసుకొస్తుంది. ఖరీదైన క్లీన్సర్లూ ఫేస్‌క్రీముల్ని గమనిస్తే వాటిల్లో ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు ఉంటాయి. అవన్నీ సహజంగానే ఈ దబ్బపండులో ఉంటాయి. ఇంటిని శుభ్రపరిచేందుకూ అద్భుతంగా పనికొస్తుంది. మూడొంతుల వేడినీళ్లలో ఒక వంతు వినెగర్‌నీ, ఒక వంతు దబ్బపండు రసాన్నీ కలిపితే చాలు... బాత్‌రూమ్‌ టబ్‌లూ సింక్‌లూ, కిచెన్‌ టైల్సూ అన్నీ శుభ్రం చేసుకోవచ్చు.
అన్నింటికన్నా ముఖ్యంగా వయసును పైబడనివ్వనివ్వదని పరిశోధనల్లో తేలింది... అందుకే అక్కడివాళ్లు గ్రేప్‌ ప్రూట్‌ జ్యూస్‌ తెగ తాగేస్తుంటారు. కానీ దీన్ని భోజనం తరవాతే తీసుకోవాలిగానీ పరగడుపునే వద్దని అదీ నిత్యం మందులు వాడేవాళ్లు వాటితో కలిపి తీసుకోకూడదనీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఏ సిట్రస్‌ పండయినా భోజనానికీ భోజనానికీ మధ్యలో తీసుకోవడమే మంచిది!



courtesy with : Dr.peddi ramadevi BAMS@Eeandu sunday news paper


  • ==================


Visit my Website - Dr.Seshagirirao...

Friday 3 May 2013

Our health is in our hands,మన చేతుల్లోనే ఆరోగ్యం


  •  








పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.







మనం ఆరోగ్యంగా ఉండడం అనేది మనచేతుల్లోనే ఉంది. ఒంట్లో కొద్దిగా నలత గా ఉన్నా పట్టించుకోకుండా అలాగే పనిచేస్తుంటాం. పరిస్థితి ఆందోళనకరంగా మారినప్పుడు వైద్యుల వద్దకు పరుగులు తీస్తుంటాం. ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్ద తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండొచ్చని వైద్యులు వివరిస్తున్నారు. రోజూ తగిన మోతాదులో పౌష్టికాహారం తీసుకుంటే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండొచ్చంటున్నారు. ఆరోగ్యం దెబ్బతిన్న తరువాత మందులకు ఖర్చు చేయడం కంటే ముందునుంచే పండ్లు, కూరగాయాలు, పాలు, మాంసం కోసం కేటాయించడం మంచిదని న్యూట్రిఫిట్ డైరక్టర్, కన్సలెంట్ న్యూట్రీనిస్టు డాక్టర్ జానకీ శ్రీనాథ్ తెలిపారు.



ఆహారపు అలవాట్లు, వ్యాయమం లేక అనేకమంది వ్యాధుల బారిన పడుతున్నారని వివరించారు. ఆహారంలో ఎక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకోవడం, సమయాలు పాటించకపోవడం, కల్తీ పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందన్నారు. ప్రతి రోజూ 45 నిమిషాలను నడకకు కేటాయించాలని సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏమేమి చేయాలో తెలుసుకుందాం.



ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..



- ఆహారాన్ని ఒకేసారి ఎక్కువగా కాకుండా మూడు గంటలకొక సారి కొంచెం కొంచెం తీసుకోవడం ఉత్తమం.

- ఆహారంగా తీసుకునే పదార్థాలను ఎక్కువ సేపు ఉడకపెట్టకూడదు.

- ఆహారంలో తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, పళ్లలో ఉండే సూక్ష్మ పోషక పదార్థాలు, ఫైబర్‌లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పసుపు, నారింజరంగులో ఉండే పళ్లు కొన్ని దీర్ఘకాల జబ్బులనూ నిరోధిస్తాయి. తాజాగా ఉండే పచ్చికూరగాయలను, పళ్లను సలాడ్ల రూపంలో కూడా తీసుకోవచ్చు.

- ఆహారంలో 'ఎ' విటమిన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. 'ఎ' విటమిన్ అంధత్వంతోపాటు పిల్లల్లో వాంతులు, విరేచనాలు, తట్టు, శ్వాసకోశ సంబంధ వ్యా«ధులు తదితరమైన వాటిని నివారిస్తాయి. కెరోటిన్ ఉన్న మునగ ఆకులు, తోటకూర, మెంతికూర, పాలకూర, క్యారట్, మంచి గుమ్మడి, మామిడి, బొప్పాయిలను తీసుకుంటే అవి శరీరంలో ఎ విటమిన్‌గా మారతాయి. డి విటమిన్ కూడా అవసరమైన మేరకు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.



మంచి ఆరోగ్యం కోసం...

- ద్యానం, యోగాభ్యాసం వంటి వాటితో ఒత్తిడి తగ్గించుకోవాలి.

- రోజూ తప్పని సరిగ్గా వ్యాయామం చేయాలి.

- పొగతాగడం, పొగాకు నమలడం, గుట్కా, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి.

- ముప్పై ఏళ్లు పైబడిన వాళ్లు రక్తంలో గ్లూకోజ్, లైపిడ్ల స్థాయి పరీక్షలతోపాటు బీపీ పరీక్షల్లాంటివి చేయించుకోవాలి.

- 30 ఏళ్లు దాటిన మహిళలు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి.

- పిల్లలకు, గర్భిణులకు రోగ నిరోధక మందులు, టీకాలు వంటివి ఇప్పించాలి.

- వినియోగానికి ముందు కూరగాయలను, పండ్లను శుభ్రంగా కడగాలి.



నీళ్లు, పాల ప్రాధాన్యం :

- పరిశుభ్రమైన నీటినే తాగాలి. మంచినీళ్లు తాగితే 50 శాతం రుగ్మతలకు దూరంగా ఉండవచ్చు.

- నీళ్లు కలిషితమైందని అనుమానం కలిగితే కాచి వడపోసి తాగాలి.

- నీటితోపాటు పాలు కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం.

- రోజుకు 250 మిల్లీలీటర్ల కాచి, చల్లార్చిన లేదా పాశ్చరైజ్డ్ పాలను వాడితే మంచిది.

- టీ, కాఫీ అలవాటుంటే... కాఫీ కంటే టీ తీసుకుంటే మంచిది. అది కూడా ఒకటి రెండుసార్ల కంటే ఎక్కువ వద్దు.



వీటి విషయంలో జరభద్రం



- వంటనూనెలు, నెయ్యి, వెన్న, వనస్పతి వంటివి చాలా తక్కువగా వినియోగించాలి. ఎక్కువగా తీసుకుంటే కొవ్వు పెరిగి స్థూలకాయం తద్వారా గుండెజబ్బులు, క్యాన్సర్ లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. మాంసాహారులు మేక మాంసం, కోడి మాంసం బదులు చేపలు తీసుకోవడం మేలు. మాంసాహారంలోనూ లివర్, కిడ్నీ, బ్రెయిన్ వంటి పదార్థాలను మానుకోవడం మంచిది.



- ఫ్రై చేసిన ఆహార పదార్థాలకు సాధ్యమైనంత వరకు దూరం గా ఉండాలి.

- రెండు మూడు రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవద్దు.

- విపరీతమైన ఉపవాసాలు మంచిది కాదు.

- ఎక్కువ కొవ్వు కలిగిన పాలను తీసుకోవద్దు.

- ఊరగాయలు, ఉప్పు, బిస్కెట్లు, చిప్స్, వెన్న, పిజ్జా, శీతలపానీయాలు, ప్రాసెస్ చేసిన పదార్థాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి.

- బరువు పెరగకుండా చూసుకోవాలి.



Courtesy with ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ,ఏప్రిల్ 6-2013.




  • =====================


Visit my Website - Dr.Seshagirirao...