Pages

Labels

Blog Archive

Popular Posts

Showing posts with label దబ్బ పండు. Show all posts
Showing posts with label దబ్బ పండు. Show all posts

Monday, 6 May 2013

Citron,దబ్బ పండు



  •  





  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు  ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.





 దబ్బపండుని చూడక్కరలేదు... ఆ పేరు వింటేనే నాలుక పులుపెక్కుతుంది. అందుకే దాన్ని మనం పచ్చడికే పరిమితం చేసేశాం. లేదంటే పులిహోర చేస్తాం.
పంపర పనస, నారింజ పండ్ల మధ్య సహజంగా జరిగిన సంకరీకరణ ద్వారా పుట్టినదే దబ్బపండు. అందుకేనేమో... ఇది ఒకలాంటి వగరుతో కూడిన తీపీ పులుపూ రుచులతో ఉంటుంది. మనదగ్గర దొరికే దబ్బపండు మన నారింజలోని పులుపుతోనూ పంపరపనస పరిమాణంలోనూ ఉంటుంది. కానీ ఐరోపా, అమెరికా దేశాల్లో దొరికేవి మాత్రం అక్కడి నారింజ అంటే కమలాపండ్ల మాదిరిగానే పులుపుతో కూడిన తియ్యని రుచితో ఎరుపు, గులాబీరంగు గుజ్జుతో ఉంటాయి. తియ్యని నారింజతో పోలిస్తే గ్రేప్‌ ఫ్రూట్‌ రుచే వేరు అంటుంటారు అక్కడివాళ్లు. గుజ్జు రంగుల్లో తేడా ఉన్నప్పటికీ తొక్క రంగు మాత్రం ఎక్కువగా పసుపురంగులోనే ఉంటుంది. నిజానికి నారింజ, నిమ్మ, పంపరపనసల్లోని గుణాలన్నింటినీ పుణికి పుచ్చుకున్నదే దబ్బపండు.

లాభాలు :
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. అందుకే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణుల అంటారు .
* వందగ్రాముల గుజ్జులో 42 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కానీ పీచు శాతం మాత్రం చాలా ఎక్కువ. ఈ పీచు క్యాన్సర్‌కు కారణమైన రసాయనాల్ని పీల్చేస్తుంది. ఇంకా కొలెస్ట్రాల్‌ తగ్గేందుకూ సహకరిస్తుంది.

* ఇందులో విటమిన్‌-ఎ సమృద్ధిగా దొరుకుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే నారింజనిన్‌, నారింజిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి వూపిరితిత్తుల క్యాన్సర్‌, నోటి క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి. వీటితోపాటు, లైకోపిన్‌, బీటా కెరోటిన్‌, క్సాంథిన్‌, ల్యూటిన్‌... వంటి ఫ్లేవొనాయిడ్‌లూ ఎక్కువే. అందుకే దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటిచూపూ మెరుగుపడుతుంది.

*సి-విటమిన్‌ కూడా పుష్కలంగా ఉంటుంది. సహజమైన ఈ యాంటీ ఆక్సిడెంట్‌ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

* 100 గ్రా. తాజా పండులో 135 మి.గ్రా. పొటాషియం ఉంటుంది. గుండె వేగాన్ని నియంత్రించేందుకూ రక్తపోటు అదుపునకూ ఇది ఎంతో ఉపయోగం.

* ఎరుపురంగులో ఉండే గ్రేప్‌ ఫ్రూట్‌లో లైకోపిన్‌ ఉండటంవల్ల ఇది చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడటంతోబాటు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ నుంచీ రక్షిస్తుంది. ఇతర కెరోటినాయిడ్లతో పోలిస్తే క్యాన్సర్‌ కారక ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి లైకోపీన్‌కే ఎక్కువ.

* లిమోనాయిడ్లూ గ్లూకారేట్లూ కూడా ఇందులో ఎక్కువ. ఇవి రొమ్ముక్యాన్సర్లూ ట్యూమర్లూ రాకుండా కాపాడతాయి.

* ఇందులోని నారింజనిన్‌ అనే ఫ్లేవొనాయిడ్‌ దెబ్బతిన్న డి.ఎన్‌.ఎ.ను సైతం బాగుచేస్తుందట.

* ఇందులో కాల్షియం, ఐరన్‌, కాపర్‌, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజాలతోపాటు కొద్దిపాళ్లలో బి-కాంప్లెక్స్‌ విటమిన్లు కూడా ఉంటాయి. ఇది వూబకాయాన్ని నివారించేందుకు దోహదపడుతుందని పరిశోధకులు నిర్ధరించారు.

ఇది సహజమైన క్లీన్సర్‌ కూడా. దీని గుజ్జుని చర్మంమీద నెమ్మదిగా రుద్దితే మృతకణాలన్నీ తొలగి నిగారింపుని తీసుకొస్తుంది. ఖరీదైన క్లీన్సర్లూ ఫేస్‌క్రీముల్ని గమనిస్తే వాటిల్లో ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు ఉంటాయి. అవన్నీ సహజంగానే ఈ దబ్బపండులో ఉంటాయి. ఇంటిని శుభ్రపరిచేందుకూ అద్భుతంగా పనికొస్తుంది. మూడొంతుల వేడినీళ్లలో ఒక వంతు వినెగర్‌నీ, ఒక వంతు దబ్బపండు రసాన్నీ కలిపితే చాలు... బాత్‌రూమ్‌ టబ్‌లూ సింక్‌లూ, కిచెన్‌ టైల్సూ అన్నీ శుభ్రం చేసుకోవచ్చు.
అన్నింటికన్నా ముఖ్యంగా వయసును పైబడనివ్వనివ్వదని పరిశోధనల్లో తేలింది... అందుకే అక్కడివాళ్లు గ్రేప్‌ ప్రూట్‌ జ్యూస్‌ తెగ తాగేస్తుంటారు. కానీ దీన్ని భోజనం తరవాతే తీసుకోవాలిగానీ పరగడుపునే వద్దని అదీ నిత్యం మందులు వాడేవాళ్లు వాటితో కలిపి తీసుకోకూడదనీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఏ సిట్రస్‌ పండయినా భోజనానికీ భోజనానికీ మధ్యలో తీసుకోవడమే మంచిది!



courtesy with : Dr.peddi ramadevi BAMS@Eeandu sunday news paper


  • ==================


Visit my Website - Dr.Seshagirirao...