Pages

Labels

Blog Archive

Popular Posts

Showing posts with label Vitamins for Beauty and health-అందం ఆరోగ్యానికి ఏబీసీడీ విటమిన్లు. Show all posts
Showing posts with label Vitamins for Beauty and health-అందం ఆరోగ్యానికి ఏబీసీడీ విటమిన్లు. Show all posts

Monday, 18 August 2014

Vitamins for Beauty and health-అందం ఆరోగ్యానికి ఏబీసీడీ విటమిన్లు ,






  •  












పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.






Vitamins for Beauty and health-అందం ఆరోగ్యానికి ఏబీసీడీ విటమిన్లు ,



    చిన్న పనులకే అలసటగా అనిపిస్తుంటుంది. చూస్తుండగానే చర్మం పొడిబారుతుంది. ముఖం కళ తప్పుతుంది. నాలుగు మెట్లెక్కినా కీళ్లనొప్పులొస్తుంటాయి. చాలామటుకు ఇవన్నీ చిన్న విషయాలనుకుంటాంకానీ... కాదు! మన శరీరానికి తగినంతగా విటమిన్లు అందడం లేదనడానికి ఇవి సంకేతాలు. సాధారణంగా మన శరీరం ఎప్పటికప్పుడు ఎ, బి 12, డి విటమిన్లని నిల్వ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఆ నిల్వ ఏ కాస్త తగ్గినా ఇబ్బందులు మొదలవుతాయి! ఇవే క్రమంగా పెద్ద సమస్యలుగా మారతాయి. అలాకాకూడదంటే మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు సమృద్ధిగా ఉండేలా చూడాలి. అందుకేం చేయాలో చెబుతున్నారు నిపుణులు..




  • 'ఎ' ఇన్‌ఫెక్షన్లూ రాకుండా..!





  •  


సాధారణంగా విటమిన్‌ 'ఎ' లోపం ఉంటే చూపు తగ్గుతుందనే అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ, రోజురోజుకీ చర్మంలో కళ తగ్గడం, విపరీతంగా వేధించే మొటిమలు, క్యాన్సర్‌ ప్రమాదం పెంచే ఫ్రీరాడికల్స్‌ ఇవన్నీ ఈ విటమిన్‌ తగ్గితే ఎదురయ్యేవే. ఫ్యాట్‌ సాల్యుబుల్‌ విటమిన్‌గా పరిగణించే 'ఎ'ని క్రమం తప్పకుండా తీసుకుంటే రకరకాల ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటాం. అంతేకాదు మెనోపాజ్‌ దాటాక మహిళల్లో వచ్చే గుండెజబ్బులూ, నాడీసంబంధ సమస్యలూ, కొన్నిరకాల క్యాన్సర్ల ప్రభావాన్ని వీలైనంతవరకూ తగ్గించుకోవాలంటే ఈ పోషకం తరచూ శరీరానికి అందాల్సిందే. మూత్రపిండాల్లో రాళ్లూ, డయేరియా, ఆకలి మందగించడం లాంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా విటమిన్‌ 'ఎ' అవసరమే. పళ్లూ, ఎముకలకి బలాన్నిచ్చే విటమిన్‌ ఇది.

ఎందులో ఉంటాయంటే? : జంతువుల కాలేయం, కాడ్‌లివర్‌ ఆయిల్‌, క్యారెట్లు, బ్రకోలీ, చిలగడదుంపలు, వెన్న, పాలకూర, గుమ్మడీ, గుడ్లూ, పాలూ, పాలపదార్థాలూ, మొక్కజొన్న, పసుపూ, కాషాయం, ఎరుపూ, ఆకుపచ్చ రంగున్న పండ్లూ, కూరగాయల్లో ఉంటుంది.



'బి'తో ఢీకొట్టేద్దాం..



నెలసరి ముందు వచ్చే పొత్తికడుపు నొప్పి, గర్భిణుల్లో కనిపించే మార్నింగ్‌ సిక్‌నెస్‌, తీవ్రమైన అలసట, నలభైల్లో ఎదురయ్యే కీళ్లనొప్పులు వీటన్నింటినీ బి6 పోగొడుతుంది. ఈ పోషకం రక్తంలో హిమోగ్లోబిన్‌ పెంచడంతోబాటు రక్తంలో చక్కెరస్థాయులు సమతూకంలో ఉండేలా చేస్తుంది. శరీరానికి అవసరమైన శక్తినిస్తుంది. మెనోపాజ్‌ దశ తరవాత మహిళలకూ పురుషులతో సమానంగా గుండె జబ్బులు ఎదురవుతాయి కాబట్టి.. వాటిని అదుపులో ఉంచాలంటే ఈ పోషకం ఎప్పటికప్పుడు తప్పనిసరిగా అందాలి. ''బి6 రక్తంలో ఉండే హోమోసిస్టీన్‌ స్థాయుల్ని తగ్గించడం ద్వారా గుండెజబ్బులు రాకుండా చేస్తుంది'' అంటున్నాయి అధ్యయనాలు.

ఏయే పదార్థాల్లో ? : ఈ పోషకం క్రమం తప్పకుండా అందాలంటే రోజుకో అరటిపండు తీసుకోవచ్చు.మాంసం, పొట్టుధాన్యాలూ, కూరగాయలూ, నట్స్‌, చికెన్‌, గుడ్లూ, చిక్కుడు జాతి గింజలూ, బంగాళాదుంపల్లో ఎక్కువగా ఉంటుంది.


  • రక్తహీనత రాకుండా..





  •  


నెలసరి మొదలైన వారిలో, పిల్లల్ని కనే వయసులో ఉన్నవారిని రక్తహీనత తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. దీనికి ప్రధాన కారణాల్లో బీ12 లోపం ఒక్కటి. శాకాహారుల్లో, వెగాన్‌ డైట్లు తీసుకునే వారిలో ఈ పోషక లోపం ఎక్కువగా ఉంటుంది. దీని లోపంతో ఎర్రరక్తకణాల ఉత్పత్తి పడిపోయి.. రోగనిరోధకశక్తీ తగ్గుతుంది. తలనొప్పి, గుండె కొట్టుకునే వేగం పెరగడం, మలబద్ధకం, చర్మం పాలిపోయినట్లు మారడం వంటివన్నీ బి12 లోపంతో ఎదురయ్యే సమస్యలే. ఈ లోపంతో బాధపడే మహిళలు గర్భం దాల్చితే అది పిల్లలకూ చేరి, ఎదుగుదల సమస్యలొస్తుంటాయి. ఆస్టియోపోరోసిస్‌, కొన్నిరకాల క్యాన్సర్ల ప్రమాదం నుంచి తప్పించుకోవాలన్నా ఈ పోషకం ఎప్పటికప్పుడు అందేలా చూసుకోవాలి.

వీటిల్లో.. : చేపలూ, చికెన్‌, గుడ్లు, పాలూ, పాల పదార్థాలు. కొన్నిరకాల సోయా ఉత్పత్తులూ ఈ పోషకాన్ని అందిస్తాయి.




  • ' సి'రాకులు ఉండవ్‌!





  •  


గర్భిణుల్లో విటమిన్‌ 'సి' లోపం ఏ కాస్త ఉన్నా సరే.. పుట్టబోయే పాపాయి మెదడు పనితీరుపై పదిహేను శాతం ప్రభావం చూపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి! రోగనిరోధక శక్తి పెరగాలన్నా, చర్మం, చిగుళ్లూ, పళ్లూ, ఎముకలూ ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ పోషకం ఎంతో అవసరం. మనలో చిరాకూ, కోపం ఎక్కువవుతున్నా శరీరంలో 'సి' విటమిన్‌ తగ్గిందని తెలుసుకోవాలి. కీళ్లూ, కండరాల నొప్పులూ, జుట్టూ పొడిబారడం వంటి సమస్యలు నివారించాలంటే ఈ పోషకాన్ని సరిపడా తీసుకోవడమే పరిష్కారం. కొందరు దీన్ని మాత్రల రూపంలో తీసుకుంటారు కానీ.. ఆ మోతాదు పెరిగితే వికారం, అజీర్తి వంటి ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఆహారం ద్వారా తీసుకోవడమే ఉత్తమం.

ఇవి తినాలి.. : నిమ్మజాతిపండ్లు, ద్రాక్ష, జామ, స్ట్రాబెర్రీ, క్యాప్సికం, బ్రకోలీ, పాలకూర, టొమాటోలూ, బంగాళాదుంపలూ, కీరదోస, ఉసిరి, టొమాటోలు




  • ఎండ వే'డి' నుంచి..







  •  


మెనోపాజ్‌ దాటాక గుండెజబ్బులు రాకుండా ఉండాలన్నా, చర్మం ముడతలు పడకుండా ఉండాలన్నా, రోజువారీ తీసుకునే క్యాల్షియం, ఫాస్ఫేట్‌ శరీరానికి సరిగ్గా అందాలన్నా ఈ పోషకం చాలా అవసరం. ఈ పోషకం కనుక లోపిస్తే అరవైరెండుశాతం గుండెజబ్బులొచ్చే ఆస్కారం పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. ఆస్టియోపొరోసిస్‌ వంటి సమస్యలు, ఎముకల నొప్పులూ, కండరాలు బలహీనపడటం, మధుమేహం, అధికరక్తపోటు వంటివి 'డి' పోషకం లోపం వల్ల కలిగే సమస్యలే. సాధారణంగా గర్భిణులూ, పాలిచ్చే తల్లుల్లో ఈ లోపం ఎక్కువగా ఉంటుంది. ఆహారం ద్వారా మనకు అందే డి విటమిన్‌ చాలా తక్కువ. అందుకే అవసరమైతే సప్లిమెంట్‌గా తీసుకోవాలి. మెనోపాజ్‌ దాటినవారూ, గర్భిణులే కాకుండా మధ్యవయసు మహిళల్లో, పీసీఓఎస్‌ (పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌), రక్తంలో చక్కెరశాతం ఎక్కువగా ఉన్నవారిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ లోపాన్ని ఎప్పటికప్పుడు గమనించుకుని తగ్గించుకోవాలి.

ఇవి తింటే..: చేపలూ, గుడ్లూ, పుట్టగొడుగులూ, చిక్కని పాల నుంచి ఈ పోషకాన్ని పొందవచ్చు.



Courtesy with Dr.Janaki srinadh-nutritionist  Banana fruits



============================

Visit my Website - Dr.Seshagirirao..