Pages

Labels

Blog Archive

Popular Posts

Showing posts with label Lilly flowers. Show all posts
Showing posts with label Lilly flowers. Show all posts

Saturday, 19 May 2012

లిల్లీపువ్వులు,Lilly flowers



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


  • పువ్వులు లేని ప్రకృతిని ఓ సారి కళ్లు మూసుకుని ఊహించుకోండి..... పసిపాపల బోసి నవ్వులు లేని ఇల్లంత భయకరంగా కనిపిస్తోందిగా... అదే మరి... ఆ పువ్వులలో స్వచ్ఛత, ప్రకృతికే కాదు సమస్త్త మానవాళి 'మనుగడ'కు దిక్సూచిలా నిలచే పుష్పాలలో లిల్లి కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు.

లిలియేసి వృక్ష జాతికి చెందిన ఈ లిల్లీ పుష్పాలు ప్రపంచ వ్యాప్తంగా 110 రకాలుగా లభ్యమవుతున్నట్లు వృక్ష శాస్త్రనిపుణులు చెప్తున్నారు. గుభాళింపులతో మనసుని మైమరిపించే ఈ లిల్లీ ఉత్తర అర్ధగోళంలో ఎక్కువగా దర్శనమిస్తుంది. ముఖ్యంగా మన దేశంలో నీలగిరి పర్వత ప్రాం తంలో ఎక్కువగా సాగవుతోంది.

  • అలాగే ఫిలిప్పిన్స్‌, దక్షిణ జపాన్‌, ఆసియా, యూరప్‌, దక్షిణ కెనడా, యునైటెడ్‌ స్టేట్స్‌ దేశాలలో విస్తారంగా దొరికే ఈ పుష్పం కేవలం అటవీ ప్రాంతంలోనే కాకుండా సాధారణ నేలల్లోనూ కనిపిస్తుంది. సమ శీతోష్ట్ణస్ధితి ఉండే ప్రదేశంలో జీవించే ఈ లిల్లీ జాతులు వసంత ఋతువు ప్రారంభంలో ఎక్కువగా పూయటం ప్రారంభిస్తాయి. మరి కొన్ని జాతులు శీతాకాలం చివర్లో పుష్పించడం ప్రారంభించి చల్లని గాలులకు తోడుగా మంచి సువాసనలు వెదజల్లుతూ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంటాయి.

చిత్తడి నేలల్లో లిల్లీ జాతులు అంటు కట్టడం ద్వారా కొత్త మొక్కలు పుట్టుకొస్తాయి... చిన్న పాటి నీటి తుంపర్లకే తమని తాము అభివృద్ది పరచుకుంటూ విస్తారమవుతాయి. లాంగీ కాండియం, లాంగి కాటెబై జాతులకు చెందిన మొక్కలు వేసవిలోనూ పెరిగి వసంత ఋతువు నాటికి పుష్పించడం ప్రారంభించడం మరో విశేషం.


పసుపు, తెలుపు, నారింజ, ఎరుపు, గులాబీ, తదితర రంగుల్లో దర్శనమిచ్చే లిల్లి జాతులు చిన్న పాటి పుష్పంగానే కాకుండా పెద్ద సైజులోనూ ఉంటాయి. మనకి ఎక్కువగా కనిపించే జాతుల్లో ఫ్రిటిల్లేరియా, నోమోభారీస్‌, నధోలిరియన్‌ చిన్న మొక్కలే అయినా పుష్ప సంతతిని విస్తృతం పరిమిళింప చేస్తుంది. లిల్లీ జాతులలో కేవలం ఒకే రంగు పుష్పాలే కాకుండా రెండు వేర్వేరు రంగుల మేలు కలయికలోనూ పుష్పాలు మనకి కనిపిస్తాయి. వీటిలో ఓ రంగు పుష్పంపై మరో రంగు చుక్కచుక్కలుగా ఉండటమే కాకుండా బ్రెష్‌ స్ట్రోక్‌లు కూడా కనిపిస్తాయి.

  • ఉపయోగాలు :
  • సున్నితత్వానికి మారు పేరుగా ఉండే ఈ పుష్పాలు ఎక్కువగా సుగంధ ద్రవ్యాలలో వినియోగిస్తారు.
  • అలాగే మానవాళికి ఉపయోగ పడే ఔషధాల తయారీలోనూ లిల్లిలు తమ తరహా పాత్ర పోషిస్తున్నాయి.
  • ఇక లిల్లి మొక్కల వేరు భాగంలో ఉండే దుంపలు అత్యంత పోషక విలువలున్నవిగా జపాన్‌, జర్మనీ తదితర దేశాల్లో వినియోగిస్తుంటారు. క్యారెట్‌, బీట్‌రూట్‌ తరహాలో ఉండే ఈ దుంపలు దాదాపు బంగాళా దుంపల రుచిని కలిగి ఉంటాయని పాకశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఈ దుంపలు మనిషి శరీరంలో ఉండే అంతర్గత వేడిని తగ్గు ముఖం పట్టించేందుకు దోహదకారిగా ఉండటమే కాకుండా... మెదడుకు చురుకు దనాన్ని కలుగ చేసే వివిధ విటమిన్లు, రసాయనాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.

  • శరీరానికి చల్ల దనాన్నిచ్చే తత్వం ఈ దుంపలు కలిగి ఉండటంతో చైనాలోని వివిధ వంటకాలలో వీటిని వాడుతున్నారు. వీటితో తయారు చేసే 'సూప్‌'కి అక్కడ డిమాండ్‌ అధికంగా ఉంది. బంగాళా దుంపలు మనిషి శరీరానికి ఇబ్బందులు కలుగ చేసేవి అయితే లిల్లి దుంపలు ఆరోగ్య ప్రదాయినిగా చైనీయులు పేర్కొంటుండటం ఓ విశేషం.

జపాన్‌లో వీటికి 'లిల్లీ రూట్‌' అని పేరు పెట్టి బలవర్ధకమైన ఆహార పదార్ధాల సరసన చేర్చడమే కాకుండా వీటి పిండి పదార్దాలతో ప్రత్యేక వంటకాలు, సాస్‌లు మార్కెట్‌లోకి దిగుమతి చేస్తున్నారు అక్కడి వాణిజ్యవేత్తలు. ఇలా కోట్లాది రూపాయల వర్తకానికి అవకాశం ఉన్న పుష్పంగా లిల్లీని చెప్పుకోవల్సిందే....


  • Courtesy with : ఆంధ్రప్రభ దినపత్రిక - ప్రకృతి - ఆదివారము అనుబంధం -Sun, 31 Jul 2011.

  • ======================
Visit my Website - Dr.Seshagirirao...