Pages

Labels

Blog Archive

Popular Posts

Showing posts with label Basil Seeds - సబ్జా గింజలు. Show all posts
Showing posts with label Basil Seeds - సబ్జా గింజలు. Show all posts

Saturday, 30 August 2014

Basil Seeds - సబ్జా గింజలు


  •  







  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



Basil Seeds - సబ్జా గింజలు

సబ్జా గింజల్ని  ఆంగ్లంలో "బేసిల్ సీడ్స్" అంటారు. బేసిల్ తులసి మొక్కలాంటిదే. ఒకటే జాతి. ఆకులు వేరుగా ఉంటాయి. వీటి గింజలను రకరకాలుగా వాడతారు. కూల్డ్రింక్స్ లో,
ఐస్క్రీంస్ లో, "ఫలూదా" అనే ప్రఖ్యాత డ్రింక్ లో.. ఇలాగన్నమాట. సబ్జా గింజల  ముఖ్య గుణం శరీరంలో వేడిని తగ్గించటం. బజార్లో చాలా చోట్ల తక్కువ ధరలో ఈ గింజలు మనకు
లభ్యమౌతాయి.అనేక సమస్యలను పరిష్కరించి శరీరానికి ఎంతో మేలు చేస్తాయివి.. అదెలాగంటే..చూడ్డానికి చిన్నగా, నలుపురంగులో ఉండే ఈ గింజలు నీటిలో నానితే పెద్దగా ఉబ్బుతాయి. ఈ గింజల్లో పీచు పుష్కలంగా ఉంటుంది. వీటిని వంటల్లో వాడటం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. మలబద్దకం రాకుండా ఉంటుంది. ఒక మోస్తరు క్యాబేజీతో సమానమైన పీచుని నాలుగు గ్రాముల సబ్జా గింజల నుంచి పొందవచ్చు.ఈ గింజల్ని నానబెట్టి ఆహారపదార్థాల్లో, జ్యూసుల్లో వేసుకుని తీసుకోవచ్చు. అంత సమయం లేదనుకొనేవారు నీటిలో పదినిమిషాలు నానబెట్టి, తరవాత వడకట్టి ఆ నీటిని తాగొచ్చు లేదా ఆ గింజల్ని తినొచ్చు.ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉండేవారు ఆ అలవాటు నుంచి బయటపడాలంటే సబ్జాగింజలు నానబెట్టిన నీటిని తాగాలి. ఇలా చేస్తే అతిగా తినాలనే కోరిక అదుపులోకి వస్తుంది. పైగా కెలొరీలు పెద్దగా ఉండవు.రోజూ ఈ సబ్జానీటిని తాగితే శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. వీటిల్లోని అల్ఫాలినోలెనిక్‌ యాసిడ్‌ చర్మంలో వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకొంటుంది. ముఖం కళగా కనిపిస్తుంది. అదే సమయంలో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ కూడా అదుపులో ఉంటుంది. వినికిడి సంబంధిత సమస్యలు రాకుండా తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.



  • సబ్జా గింజల్లోని ఔషధ గుణాలేంటి..?


1.సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది. చికెన్ పాక్స్ వచ్చిన వారికి శరీర

తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది.
2.అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనముంటుంది. గ్లాసుడు నీళ్లలో సబ్జా గింజల గుజ్జు వేసి రోజుకు మూడు

లేక నాలుగు సార్లు ఇచ్చినా ఫలితముంటుంది. వీటి గుజ్జును పైనాపిల్, ఆపిల్, ద్రాక్ష రసాల్లో కలిపి పిల్లల చేత తాగిస్తే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. ధనియాల రసంతో ఇస్తే

జ్వరం తగ్గుముఖం పడుతుంది.
3.మహిళలూ బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సబ్జాను నానబెట్టిన నీటిని తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని నిద్రపోయే

ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీ బయాటిక్‌లాగా పనిచేస్తుంది.
4.బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్‌ 2 మధుమేహాన్ని

అదుపులో ఉంచుతుంది. అంతేకాదు... ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్‌ రాకుండా చూడడంతోబాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.
శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జాగింజలు పెట్టింది పేరు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సబ్జా వాటర్‌ను సేవించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
5.ఇంకా సబ్జా ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్‌ మాదిరిగా

తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోబాటు అధికంగా పీచుని ఇవి కలిగివుంటాయి.
6.ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్‌, నియాసిన్‌, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్‌ 'ఇ' లభించడంతోబాటు, శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి కూడా

ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
7.సబ్జా వాంతుల్ని తగ్గించి అజీర్తిని తొలగిస్తాయి. హానికరమిన టాక్సిన్లు పొట్టలోకి చేరకుండా చేస్తాయి.గొంతు మంట, దగ్గు, ఆస్తమ, తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు సబ్జా గింజల్ని

నీళ్ళలో నానబెట్టి తిన్నా, తాగినా ఫలితం ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టిన సబ్జాలకు అల్లం రసం, తేనె కలిపి తాగితే, శ్వాసకోస వ్యాధులు తగ్గుముఖం పడతాయి.

Courtesy with : Eenadu Vasundhara



  • ============================ 


Visit my Website - Dr.Seshagirirao...