Pages

Labels

Blog Archive

Popular Posts

Monday 24 December 2012

Pain killers with our food , ఆహారము తో పెయిన్ కిల్లర్లు


  •  







పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


జబ్బుల నుంచి బయటపడటానికి టాబ్లెట్లే వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రకృతి అందించిన ఆహార పదార్థాలే మంచి ఔషధాలుగా పనిచేస్తాయన్నది ప్రకృతి వైద్య నిపుణులు ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు. అదే నిజమని మరిన్ని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఇరిటిబుల్ బొవెల్ సిండ్రోమ్ లాంటి జీర్ణకోశ సమస్యల వల్ల కలిగే కడుపునొప్పి, నడుంనొప్పి, కీళ్లనొప్పులు.. ఇలా నొప్పి ఏదైనా సరే.. నొప్పిని తెలియజేసే నాడుల మార్గాలను ఆపేయడం ద్వారా గానీ, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడం ద్వారా మాత్రమే కాకుండా నొప్పిని మూలాల్లోంచి తీసేయగల శక్తి ఆహారపదార్థాలకు ఉంది. తలనొప్పిగా ఉందంటే ఏ జండూబామో రాసుకుంటాం..

ఒళ్లంతా నొప్పులంటే ఏ పెయిన్ కిల్లర్ టాబ్లెట్టో వేసుకోమంటాం. కానీ ఈ పెయిన్ కిల్లర్ మాత్రలు ఎంత ఎక్కువగా వాడితే అంతటి దుష్ప్రభావం ఉంటుందనీ తెలుసు. కానీ ఒక్కోసారి నొప్పి తగ్గాలంటే వాటిని వాడక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెయిన్ కిల్లర్స్ కోసం పరుగులు తీయకుండా మనం తినే ఆహారం వైపు ఓ లుక్కేయమంటున్నారు పరిశోధకులు. మనం తీసుకునే ఆహారంలోనే చాలా రకాల నొప్పులను తగ్గించగలిగిన సుగుణాలు ఉన్నాయని ఇటీవలి అధ్యయనాలు వెల్లడిచేశాయి. నొప్పి తగ్గించడంలో మందులు చేసే పనే ఇవీ చేస్తాయనీ అదీ ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా.. అనీ చెబుతున్నారు అధ్యయనకారులు.


  • curd-పెరుగుతో పొట్ట క్షేమం


మనలో 40 శాతం మంది ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్‌తో బాధితులున్నారని అంచనా. దీనివల్ల విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. దీనికి మంచి పరిష్కారాన్ని చూపేవి అతి చిన్న సూక్ష్మజీవులైన బాక్టీరియా అంటున్నారు నిపుణులు. లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్, లాక్టోకోకస్ లాక్టిస్ లాంటి మేలు చేసే ఈ బాక్టీరియా పెరుగులో పుష్కలంగా ఉంటాయి. పొట్ట ఉబ్బరాన్ని, కడుపు నొప్పిని తగ్గించడంలో ఇవి కీలకపాత్ర వహిస్తాయి. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కప్పుల పెరుగు తీసుకుంటూ ఉంటే ఐబిఎస్ నుంచి ఉపశమనం కలుగుతుంది.


  • Herbal Tea - హెర్బల్ టీ


తలనొప్పిగా ఉంది.. టీ తాగాలి అని చాలా సార్లు అనుకుంటూనే ఉంటాం. ఆ తాగే టీ ఏదో హెర్బల్ టీ తాగండి.. తలనొప్పి ఉండదు అంటున్నారు పరిశోధకులు. గ్రీన్ టీలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కెఫీన్ చాలా తక్కువగా ఉంటుంది. 150 మిల్లీలీటర్ల కప్పు గ్రీన్ టీలో pandu నుంచి 36 మిల్లీక్షిగాముల కెఫీన్ మాత్రమే ఉంటుంది. అదే ఫిల్టర్ కాఫీలో అయితే 106 నుంచి 164 మిల్లీక్షిగాముల కెఫీన్ ఉంటుంది. గ్రీన్ టీలో ఉన్న కెఫీన్ రక్తనాళాలు వ్యాకోచం చెందేలా (వాసో డైలేషన్) చేస్తుంది. ముడుచుకుపోయిన రక్తనాళాలు రిలాక్స్ కావడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే గర్భిణులు, రక్తహీనత ఉన్నవారు డాక్టర్ సూచనల మేరకే ఈ టీ తీసుకోవాలి. ఎందుకంటే టీలో ఉంటే టానిన్లు కొన్ని రకాల పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి.


  • cherries -చెర్రీతో కీళ్లు భద్రం


చెర్రీ పండ్లలో ఆంథోసయనిన్లు అనే శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. నొప్పిని తగ్గించడానికి ఇవి రెండు రకాలుగా పనిచేస్తాయి. యాస్ప్రిన్, నాప్రోక్సెన్ లాంటి ఇతర నాన్ స్టిరాయిడల్ యాంటి ఇన్‌ఫ్లమేటరీ మందుల మాదిరిగానే ఇవీ పనిచేస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ ప్రక్రియను బ్లాక్ చేయడమే కాకుండా నొప్పికి కారణమయ్యే ఎంజైమ్‌లను కూడా అడ్డుకుంటాయి. ఒక కప్పు చెర్రీపండ్లను ప్రతిరోజూ తీసుకుంటే కీళ్లవాపు 25 శాతం వరకూ తగ్గిపోతుందంటున్నారు పరిశోధకులు. రోజూ రెండు సార్లు 360 మిల్లీలీటర్ల చెర్రీ పండ్లరసాన్ని తీసుకుంటూ ఉండటం వల్లనే చాలామంది అథ్లెట్లలో ముఖ్యంగా రన్నింగ్‌లో పాల్గొనేవారిలో కండరాల నొప్పి చాలా తక్కువగా ఉన్నట్టు అధ్యయనాల్లో తేలింది. అందుకే రోజూ చెర్రీలు తీసుకోండి పిక్క(కండర)బలం పెంచుకోండి అంటున్నారు అధ్యయనకారులు.


  • Turmeric - పసుపు.. యాంటి ఇన్‌ఫ్లమేటరీ..


ఎక్కడైనా చర్మం కోసుకుని రక్తం కారుతుంటే వెంటనే వంటగదిలో నుంచి పసుపు తెచ్చి అక్కడ రాయడం పరిపాటే. నిజానికి ఆయుర్వేద వైద్యం పుట్టినప్పటి నుంచీ వైద్యంలో పసుపుకి విశిష్ట స్థానమే ఉంది. నొప్పి తగ్గించేందుకు, జీర్ణవ్యవస్థ చురుకుదనానికి, యాంటి బాక్టీరియల్ ప్రభావానికి పసుపును ఇప్పటికీ ఒక ఔషధంగా వాడుతున్నారు. చర్మ సౌందర్యం పెంచడంలో కూడా పసుపుకే పెద్దపీట. వీటన్నిటికి తోడు పసుపులో యాంటి ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాన్ని చూపగల గుణం కూడా ఉందంటున్నారు పరిశోధకులు. దీనిలో ఉంటే కర్క్యుమిన్ వల్లనే పసుపు ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాన్ని చూపుతోంది. కణాలు దెబ్బతినకుండా నివారించగలిగే పసుపు కీళ్లలో వాపును కూడా అరికట్టగలదు. అంతేకాదు.. నాడీకణాల పనితీరును మెరుగుపరుస్తుంది. రోజుకి 1 నుంచి 2 గ్రాముల పసుపును తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మన భారతీయ వంటకాల్లో ఈ మోతాదు పసుపును చేర్చడం పెద్ద విషయమేమీ కాదు. అయితే ఇంతకన్నా కాస్త ఎక్కువైనా పరవాలేదంటారు అధ్యయనకారులు. కూరల్లోనే కాదు.. చపాతీ పిండిలో, ఇడ్లీ, దోసె పిండిలో కూడా పసుపును వాడవచ్చంటున్నారు. పసుపును ఉపయోగించినప్పుడల్లా కాస్త మిరియాల పొడి కూడా వాడటం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఎందుకంటే మిరియాలు పసుపులోని కర్క్యుమిన్ వినియోగానికి ఉపయోగపడతాయి.


  • Ginger - ఆర్థరైటిస్‌కి అల్లం


జీర్ణశక్తిని పెంచే అల్లం వాంతులు, వికారానికి కూడా మందుగా పనిచేస్తుంది. వాంతులను ప్రేరేపించే రీసెప్టర్లను బ్లాక్ చేయడం ద్వారా ఇది సహాయపడుతుంది. పేగుల్లో ఏర్పడే గ్యాస్‌ను పోగొట్టే ఔషధం కూడా. వీటికి తోడు అల్లంలో మరో సుగుణం కూడా ఉంది. అదే యాంటి ఇన్‌ఫ్లమేటరీ ప్రభావం. సాధారణ కండరాల నొప్పి దగ్గరి నుంచి మైగ్రేన్ తలనొప్పి, ఆర్థరైటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఇది దివ్యౌషధం. కూరల్లో వాడటమే కాకుండా బార్లీతో కలిపి అల్లం రసాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అల్లం ముక్కలను నిమ్మరసం, తేనెతో కలిపి తీసుకున్నా రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.


  • fish - నడుంనొప్పికి చేప


మెర్క్యురీ లేకుండా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న చేపలు ఆరోగ్యకరమైన వెన్నుపాముకు దోహదం చేస్తాయి. వెన్నుపాము డిస్కుల చివర్లలో ఉండే రక్తనాళాలు అన్ని ముఖ్యమైన పోషకాలను డిస్కులకు సరఫరా చేస్తాయి. ఈ రక్తసరఫరా తక్కువ అయితే డిస్కులకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందక అవి వదులయిపోతాయి. తద్వారా నెమ్మదిగా దెబ్బతినడం ఆరంభమవుతాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఈ రక్తసరఫరా బావుండేందుకు సహాయపడతాయి. అంతేకాదు... రక్తనాళాలు, నాడుల్లో ఇన్‌ఫ్లమేషన్ రాకుండా నివారిస్తాయి. ఒమేగా-3తో పాటు రోజుకి ఒకవూటెండు గ్రాముల ఇహెచ్‌ఎ, డిపిఎ తీసుకుంటే మెడ, వెన్ను, నడుము నొప్పుల నుంచి మరింత త్వరగా ఉపశమనం దొరుకుతుందంటారు నిపుణులు. నిజానికి చేపనూనెలు గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి చాలా మంచివి. శాకాహారులకు అవిసె గింజల్లో కావలసినంత ఒమేగా-3 ఫాటీఆమ్లాలు లభిస్తాయి. దీనితో పాటు రోజూ పావు కప్పు వాల్‌నట్స్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Courtesy with Sakala@Namste Telangana news paper.



  • =====================


Visit my Website - Dr.Seshagirirao...

Tuesday 18 December 2012

Pure water and Water purifiers-శుద్ధజలం మరియు నీటి శుద్ధి పరికరాలు


  •  





  •  image : courtesy with Eenadu news paper



  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



 
నీరు :
రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం వల్ల.. చక్కటి ఆరోగ్యం సొంతమవుతుంది, శరీరంలోని వ్యర్థాలు దూరమవుతాయి. అవి మంచి నీళ్లయితే అంతా మంచిదే! కానప్పుడు! కాలుష్య కారకాలతో నిండినవైనప్పుడు? అనారోగ్యాలు కమ్ముకొంటాయి. ప్రాణాంతక వ్యాధుల్లో అధిక శాతం అపరిశుభ్రమైన జలాల కారణంగానే వ్యాపిస్తాయని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తెలిపాయి. మరి ఈ సమస్యని నియంత్రణలో ఉంచడానికి మార్గమేదీ అంటే.. అత్యధిక మందికి అందుబాటులో ఉన్నవి నీటి శుద్ధి పరికరాలు (వాటర్‌ ప్యూరిఫైయర్లు). వీటి పనితీరుపై చక్కటి అవగాహన కలిగి, ఎంపికలో తగు జాగ్రత్తలు పాటిస్తే వందశాతం స్వచ్ఛమైన జలాన్ని స్వీకరించడం ఈ రోజుల్లో సాధ్యమనే చెప్పొచ్చు. ఆ దిశలో మార్గనిర్దేశం అందించే కథనమే ఇది.

బావి నీరు, కుళాయి నీరు.. స్వచ్ఛమైన తాగునీరు అని అన్ని సందర్భాల్లో అనుకోవడానికి లేదు. వివిధ కారణాల వల్ల వాటిల్లో జీవ సంబంధిత, రసాయనిక వ్యర్థాలు వచ్చి చేరతాయి. బావుల్లో చుట్టుపక్కల ఇంకిన మురుగు నీరు వచ్చి కలుస్తుంది. పొలాల్లో చల్లే పురుగు మందుల దుష్ప్రభావం ఉంటుంది. పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు నీటిలో కలిసే అవకాశాలూ అధికమే. కార్పొరేషన్‌, మున్సిపాలిటీ నీళ్లు శుద్ధి అయి వస్తాయి కాబట్టి వీటిల్లో సాధారణంగా ఆర్సెనిక్‌ వంటి భారలోహాలు ఉండవు. కానీ పైపుల ద్వారా రావడం వల్ల గొట్టాల్లో ఉండే పాచి, తుప్పు వల్ల నీరు కలుషితం అవుతుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని చూసినప్పుడు..ఈ రకమైన కలుషిత జలాలను నిత్యం ఎక్కువ కాలం స్వీకరించడం, ఆరోగ్యానికి మంచిది కాదు. ఒకప్పటితో పోలిస్తే ఈ వాస్తవాన్ని ప్రజలూ గ్రహిస్తున్నారు. అందుకే మెట్రోల్లోనే కాదు పట్టణాల్లోనూ వాటర్‌ ప్యూరిఫైయర్ల కొనుగోలు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు.

వాటితో ఏయే ఉపయోగాలు...


తాగే నీటికి చక్కటి రుచిని ఇవ్వడంతో పాటు నీటిలోని హానికారక వైరస్‌, ముఖ్యంగా జీర్ణాశయ వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాలను నీటి శుద్ధి పరికరాలు సమర్థంగా నియంత్రిస్తాయి. ఈ ఒక్క చర్య కారణంగానే డయేరియా, కలరా, కామెర్లు వంటి వ్యాధులని అడ్డుకోవచ్చు. నీటిలో కరిగి ఉండే రసాయనాలని తొలగించి దీర్ఘకాలిక ఇబ్బందులు రాకుండా చూడటంలో వీటిది కీలక పాత్ర. బావి నీటిలో హానికారక క్యాడ్మియమ్‌, సీసం, మెగ్నీషియమ్‌, సిలికా, క్రోమియమ్‌ వంటి లోహాలు ఉంటే అవి శరీరానికి చేరకుండా నిరోధిస్తాయి. ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ.. మలబద్దకానికి కారణం అయ్యే ఇనుము, ఫ్లోరిన్‌లను తొలగిస్తాయి. నీటియొక్క పీహెచ్‌ సమతుల్యాన్ని ఇవి కాపాడతాయి. విలువైన ఖనిజాలని తాజాగా శరీరానికి అందిస్తాయి.

శుద్ధి విధానాలపై శ్రద్ధ...


నీటిని మరగకాచి చల్చార్చడం, క్యాండిళ్లున్న వాటర్‌ ఫిల్టర్లను వాడటం వంటి శుద్ధి విధానాలను ఇప్పటికీ పల్లెల్లో చాలాచోట్ల వాడుతున్నారు. అయితే వీటితో పోలిస్తే ఆధునిక తరహావి పలు విధాల మేలైనవి, అతి సూక్ష్మ క్రిములను సైతం నియంత్రించగలవన్న విశ్వసనీయతను సంపాదించాయి. ఇవి ప్రధానంగా యూవీ ప్యూరిఫికేషన్‌, రివర్స్‌ ఆస్మోసిస్‌ విధానం, యాక్టివేటెడ్‌ కార్బన్‌ ఫిల్టరింగ్‌, డిస్టిలేషన్‌, ఐయాన్‌ ఎక్స్‌ఛేంజ్‌, ఎలక్ట్రో డీఐయనైజేషన్‌ వంటి విధానాలతో లభ్యమవుతున్నాయి. ఇవి కలుషితాలను పరిహరించి, వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్‌ వంటి సూక్ష్మజీవులని అరికడతాయి.

ఎటువంటి పరికరాలు కొనాలి..


ఒకసారి పరికరాన్ని కొనాలని నిర్ణయించుకొన్న తర్వాత ఎటువంటి వడపోత విధానం సరిపడుతుందనే దానిపై అవగాహన తెచ్చుకోవాలి. పైన చెప్పుకొన్నట్టు.. యాక్టివేటెడ్‌ కార్బన్‌ ఫిల్టరేషన్‌, యూవీ ప్యూరిఫికేషన్‌, రివర్స్‌ ఆస్మోసిస్‌... లేదా వీటి మేళవింపు పరిజ్ఞానంతో ప్రస్తుతం పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏది మంచిది అని నిర్ణయించుకోవాలంటే ముందు తాగే నీటిలో టీడీఎస్‌ (టోటల్‌ డిసాల్వ్‌డ్‌ సాలిడ్స్‌) స్థాయులు ఎంత ఉంటున్నాయో చూసుకోవాలి. నీటిని దగ్గర్లోని ల్యాబులో పరీక్ష చేయించుకోవచ్చు. కేవలం మురికి, స్వల్ప కలుషితాలు మాత్రమే ఉంటే ఖరీదయిన పరికరాన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదు. అందుకు సాధారణ యాక్టివేటెడ్‌ కార్బన్‌ ఫిల్టర్‌ క్యాట్రిడ్జ్‌ను ఉపయోగించి శుభ్రం చేసుకోవచ్చు. కేవలం క్లోరిన్‌, అతినీలలోహిత కిరణాలతోనే ఈ ప్రక్రియ జరిగిపోతుంది. అలాగే మున్సిపాలిటీ వాళ్లందించే నీటిని శుద్ధి చేసుకోవడం కోసం 'యూఎఫ్‌ అల్ట్రా ఫిల్టరేషన్‌' పరిజ్ఞానం సరిపోతుంది. అయితే ఇవి నీటిని వడకట్టినా అందులో క్రిముల అవశేషాలు జీర్ణాశయంలో చేరి అలర్జీలు రావొచ్చు. గమనించుకొని సందర్భానుసారంగా ఎంచుకోవాలి.

వివిధ వడపోత దశలివి...


బిందెకి ఒక వస్త్రం చుట్టి నీళ్లు పట్టడం తెలిసిందేగా! వాటర్‌ ప్యూరిఫైయర్‌లోనూ ఈ తీరును మనం ఊహించవచ్చు. ఇరవై మైక్రాన్లు, ఐదు మైక్రాన్లుండే అతి సూక్ష్మమైన రంధ్రాల ద్వారా నీరు పంపుతారు. ఫలితంగా మట్టి, మురికి, సూక్ష్మ క్రిములు అక్కడ నిలువరించబడతాయి. తరవాత మరిగించే ప్రక్రియ సాగుతుంది. అయితే నిర్ణీత కాలం తరవాత పరికరం తయారీదారు నిర్దేశించినట్టుగా వడపోత కాగితాలని మార్చాల్సి ఉంటుంది. బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది. పరికరంలో యూవీ వాటర్‌ స్టెరిలైజింగ్‌ విధానం ఉంటే కనుక అది హానికారక బ్యాక్టీరియాతో పాటు వాటి క్రిముల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా 99 శాతం నీరు శుభ్రం అవుతుంది. మెంబ్రేన్‌ ఆధారిత వాటర్‌ ఫిల్టర్లు, యూఎఫ్‌ మెంబ్రేన్‌ ఆధారిత రకాలు కూడా ఈ ప్రక్రియని సమర్థంగా నిర్వహిస్తాయి. నీటిని శుభ్రపరచడంలో కీలక దశ రసాయనాలని తొలగించడం. బావినీటిలో, బోరునీటితో ఉండే భారలోహాలని తొలగించడానికి 'రివర్స్‌ ఆస్మోసిస్‌ విధానం' ఉన్న వాటర్‌ ప్యూరిఫైయర్లు బాగా ఉపయోగపడతాయి.

ఈ అంశాలనూ పరిగణనలోకి...


భారతీయ ప్రమాణాల బ్యూరో మార్గనిర్దేశాల ప్రకారం ప్రముఖ బ్రాండ్లలో, రివర్స్‌ ఆస్మోసిస్‌ పరికరాలకు ఆదరణ అధికమని చెప్పొచ్చు. వీటి తరవాత యూవీ వాటర్‌ ప్యూరిఫైయర్ల గురించి చెప్పుకోవాలి. నీటి శుద్ధి పరికరం కొనేప్పుడు జాతీయ పారిశుద్ధ్య ఫౌండేషన్‌, నీటినాణ్యత సంఘం నిర్ధారించినదై ఉండాలి. కాట్రిట్జ్‌ లేబుల్‌పైన వివరాలను పరిశీలించాలి. సామర్థ్యం, తయారైన ప్రదేశం, ఖరీదు గమనించాలి. వినియోగ సూచనల పుస్తకంలో కేర్‌ నంబర్‌తో పాటు ఉపయోగించే విధానం తెలుసుకొంటే సమస్య ఎదురయినప్పుడు తక్షణం సంప్రదించే వీలుంటుంది.



  • -Concert


(ఎ సెంటర్‌ ఫర్‌ కన్జూమర్‌ ఎడ్యుకేషన్‌, రీసెర్చ్‌ టీచింగ్‌ ట్రైనింగ్‌ అండ్‌ టెస్టింగ్‌) నివేదిక ఆధారంగా @Eenadu vasundara


  • =======================


 Visit my Website - Dr.Seshagirirao...

Tuesday 11 December 2012

Food items for better sperm count-మగవారిలో సంతనోత్పతి పెంచే ఆహారాలు








http://4.bp.blogspot.com/-f0nOrkbpM_4/ULwJeXsovmI/AAAAAAAADlY/h63BrTcZoVI/s1600/Eating+Fruits+with+outerfeels.jpg






  • పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. 














బిడ్డలు పుట్టక పోవడానికి దోషం ఎవరిలో ఉంది? ఒకప్పుడయితే స్త్రీ గర్భం ధరించలేకపోతే దోషం ఆమెదని, ఆమె గొడ్రాలని, పనికి మాలినదని ముద్ర  వేసేవారు. మగవాడు పరిపూర్ణుడనే అపోహ ఉండేది. దంపతుల మధ్య నిస్సారతకు భార్యాభర్తల్లో ఎవరో ఒకరు కారణం కావచ్చు, లేదా ఇద్దరూ కావచ్చు. ఇంకా ఇతర కారణాలు కూడా ఉండొచ్చు.  దంపతులలో సంతానం కలగకపోవటానికి భార్యాభర్త లిరువురిలోనూ లోపాలుండవచ్చు, వైద్య పరిభాషలో  సంతానం కలగకపోవటానికి 40% వరకు ఆడవరిలో లోపాలుండవచ్చు, లేదా 30% వరకు మగవారిలో లోపాలుండవచ్చు, లేదా 20% వరకు ఇద్దరిలో  లోపాలుండవచ్చు, లేదా 10% వరకు దంపతులిద్దరిలోనూ ఇదమిద్దముగా చెప్పలేని కారణాలవల్ల సంతానం కలగకపోవచ్చు.  పెళ్లయి భార్యాభర్తలు కలిసి  జీవిస్తూ ఏ విధమైన సంతాన నిరోధకాలు వాడకుండా ఉన్నా మొదటి సంవత్సరంలోపు సంతానం కలగనట్లయితే వెంటనే సంతాన సాఫల్యతా నిపుణులను  సంప్రదించడం చాలా అవసరం.






  • సంతాన లేమికి మగవారిలో ఉండే కారణాలు :




1. వీర్యంలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండుట.

2. వీర్య కణాల కదలిక, సారూప్యంలో అధికముగా తేడాలుండుట.

3. వీర్యంలో వీర్య కణాలు లేకపోవటం.

4. వీర్య కణాలు ప్రయాణించే నాళం మూసుకుపోవటం.

5. హొర్మొన్ల శాతంలో తేడాలుండుట.

6. వీర్యకణాల అండాన్ని ఫలదీకరించే శక్తి తక్కువగా ఉండేందుకు ఎన్నో రకాల కారణాలు ఉండవచ్చు.

7. వీర్యం ఉత్పత్తిలో లేదా పనితీరులో చోటు చేసుకునే అసాధరణత్వాలు,

8. సాధారణ ఆరోగ్యం, జీవనశైలి సంబంధిత అంశాలు,






  • ఆహారాలు :




చక్కని పాపాయి పుట్టాలంటే ఆడవారితో పాటు మగవారు కూడా మంచి ఆహారాలు తీసుకోవాలి. ఆడవారిలో ఫెర్టిలిటీ పెంచే ఆహారాలు ఎలాగైతే ఉన్నాయో  మగవారిలో స్పెర్ము కౌంట్ పెంచే ఆహారాలు కూడా ఉన్నాయి.




  •  వెల్లులి : ఇది ఆడవారిలో మరియు మగవారిలో ఫెర్టిలిటీ నీ పెంచే సూపర్ ఫుడ్. దీనిలో విటమిన్ బీ 6 ఎక్కువగా ఉంటుంది. 

  •  దానిమ్మ : దానిమ్మ గింజలు, రసం స్పెర్ము కౌంట్ ను, వాటి కదలికలను వాటి నాణ్యతను బాగా పెంచుతాయి. 

  •  అరటి : మంచి స్పెర్ము పెరగటానికి అపారమైన అన్ని కారకాలు మనం తీనే అరటిలో ఉన్నాయి. దీనిలో బీ 1 ,సి విటమిన్లు ప్రోటీన్ లు లబిస్తాయి. అరటిలో 

  • ఉండే బ్రోమోలేయిన్ శక్తి వంతమైన సెక్స్ హర్మోనేగా పనిచేస్తది.

  •  పాలకూర : ఫోలిక్ఆసిడ్ ఉంటుంది . ఇది మంచి వీర్య వృదికీ సహకరిస్తాది. పాలకురలో విటమిన్ సి, ఐరన్ కూడా లబిస్తాయి.

  •  మిరపకాయ : చాల మందికి మిరపకాయ గురించి తెలిదు కానీ ఇది ఒక సూపర్ ఫుడ్ అని ఇది మేల్ ఫెర్తిలిటిని పెంచడంలో బాగా సహకరిస్తాది. రోజు గనక మిరపని ఆహారంలో తీంటే ఎన్దోర్ఫిన్లను ఎక్కువ చేస్తాయి. దీని వలన మెదడు  బాగా విశ్రాంతి తీసుకుంటది. మిరపలో సి, బీ , ఈ.. విటమిన్లు సమ్రుదిగా లబిస్తాయి.

  •  టమాటో : అత్యంత సాదారణంగా వాడె ఈ కూరగాయలో కెరొటినోయిడ్స్(carotinoids),లైకోపాన్‌(Licopan) చక్కని వీర్య  శక్తి , మంచి ఆరోగ్యం  ఇస్తుంది. ప్రతిరోజూ ఆహారంలో ఎదో విదంగా దీనిని బాగం చేసుకోవాలి. 

  •   పుచ్చ : దేనిలో సమ్రుదిగా ఉండే  లీకోపాస్, నీటి శాతం మగవారి  ఫెర్టిలిటీ(male fertility) ని మెరుగుపరుస్తాయి. మంచి స్పెర్ము కౌంట్ ను  పెంచుతాయి. మగవారికి తమ శరీరం మంచి హైడ్రేషన్‌(hydration) ఉంచుకోవటం కోసం బాగా సహకరిస్తుంది. 

  • విటమిన్ సి : మేల్ ఫెర్టిలిటీ మెరుగుదలకు ఇది అత్యంత అవసరం. వీర్యంలో DNA ను ఇది కాపాడుతుంది.  ఫెర్టిలిటీ విషయంలో వీర్యాని కాపాడుతుంది. కాకపోతే పొగత్రాగడం వలన శరీరం లోని'సి' విటమిన్ హరిస్తుంది. కాబటి పిల్లలు కావాలి అనుకునే వారు పొగత్రాగటం మానివేయాలి. 

  • ఆపిల్ : దీనిలోగల ఎన్నో ప్రయోజనాలు మనకు తెలుసు కానీ మేల్ ఫెర్టిలిటీ నీ పెంచడం గురించి ఎవరికీ తెలిదు. స్పెర్ం కౌంట్ నీ గణనీయంగా పెంచుతుంది. 

  • జీడిపప్పు : బోజనాల్లో జీడిపప్పు తీనడం వలన కడుపు నిండి, బరువును కంట్రోల్ లో ఉంచడమే కాకా జింక్ శాతం పెంచుతుంది జింక్ ఫెర్టిలిటీ నీ  మెరుగుపరుస్తాయి.












  • =========================




Visit my Website - Dr.Seshagirirao... 

Tuesday 4 December 2012

Cluster Bean-గోరు చిక్కుడు




  • పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. 








గోరు చిక్కుడు శాస్త్రీయ నామం... సైమాప్సిస్‌ టెట్రాగోనొలోబా. గింజల్లో సీడ్‌ కోట్‌ (పై పొర), ఎండోస్పెర్మ్‌ (లోపల పప్పు), జెర్మ్‌ అని మూడు భాగాలు ఉంటాయి. ఎండోస్పెర్మ్‌లో గెలాక్టోమెనన్‌ అనే పదార్థం ఉంటుంది. దీని నుంచే జిగురు తయారుచేస్తారు. జోధ్‌పూర్‌లోని సెంట్రల్‌ ఆరిడ్‌ జోనల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (కాజ్రి) ఎక్కువ జిగురును ఇచ్చే గోరు చిక్కుడు రకాలపై పరిశోధనలు చేస్తోంది. గంగానగర్‌లోని  వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు సాగుతున్నాయి. గుంటూరు, తిరుపతి నగరాల్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లోనూ అధ్యయనం జరుగుతోంది.



    మనం తినే కేకు, మనం రుద్దే పేస్టు, మనం వాడే షాంపూ, మనం పెట్టే కుక్కబిస్కెట్లూ... అన్నింట్లోనూ 'గోరుచిక్కుడు' ఉంది. డాలర్లదేశం ఆశగా భారత్‌ వైపు చూసేది, ఒక్క గోరుచిక్కుడు కోసమే! ఆ జిగురే కనుక అందకపోతే... అమెరికా చేతిచమురు వదుల్తుంది!



గోరుచిక్కుడుతో కూర వండుకోవచ్చు. సాంబార్లో వేసుకోవచ్చు. నచ్చితే రోటిపచ్చడీ చేసుకోవచ్చు. రొట్టెలోకైనా అన్నంలోకైనా బాగానే ఉంటుంది. మొత్తంగా ఇదో 'మినిమమ్‌ గ్యారెంటీ' కూర! అద్భుతమన్న ప్రశంసలు రావు. చండాలంగా ఉందన్న విమర్శలూ ఉండవు. వేడివేడిగా వడ్డిస్తే కిక్కురుమనకుండా తినేస్తారు.



ఇదో మెట్టపంట. వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకుంటుంది. ఇసుక నేలల్లో, ప్రతికూల వాతావరణంలో కష్టాల సాగు చేస్తున్న రాజస్థానీ రైతుల జీవితాల్లో  మెరుపులు మెరిపిస్తోంది. నిన్నమొన్నటిదాకా సైకిళ్లకే దిక్కులేని గ్రామాల్లో ఆడి, బీఎండబ్ల్యూ, టొయోటా-ఫార్చూనర్‌ కార్లు కనిపిస్తున్నాయంటే...అంతా  గోరుచిక్కుడు మహత్యమే! రాజస్థానీలను రాజాలుగా మార్చిన ఆ పంట...ఆంధ్రప్రదేశ్‌ రైతులనూ ఆకట్టుకుంటోంది. వివిధ జిల్లాల్లో ఉత్సాహంగా సాగు చేస్తున్నారు.



గోరుచిక్కుడు మనకు తెలిసిన కూరగాయే..! రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పండుతుంది. తెలంగాణాలో దీన్ని 'గోకరకాయ' అని పిలుస్తారు. హిందీలో గౌర్‌ అనీ, ఇంగ్లిష్‌లో క్లస్టర్‌ బీన్‌ అనీ అంటారు. ఈ మొక్క తరాల క్రితమే ఆఫ్రికా నుంచి మన దేశానికి వచ్చిందని నిపుణులు చెబుతారు. ప్రస్తుతం  దక్షిణాసియాలోనే అధికంగా పండుతోంది. భారత్‌లో మరీ ఎక్కువ. ప్రపంచంలో ఉత్పత్తయ్యే గోరుచిక్కుడులో 80 శాతం వాటా మనదే. తర్వాతి స్థానాల్లో  పాకిస్థాన్‌, అమెరికా ఉన్నాయి. దక్షిణాఫ్రికా, మలావి, జైర్‌, సూడాన్‌లలోనూ వాణిజ్య ప్రాతిపదికన సాగు చేస్తున్నారు. మొదట్లో రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో   అయితే, ఒంటెలకూ పశువులకూ మేత కోసమే ఎక్కువగా పండించేవారు. గోరుచిక్కుడు జిగురులోని పారిశ్రామిక ప్రయోజనాలు తెలియడంతో...ఆ పంట దిశ  మారింది. రైతన్న దశా మారింది. జోధ్‌పూర్‌, బికనీర్‌, గంగానగర్‌, జైపూర్‌, ఆల్వార్‌ ప్రధాన మార్కెట్లుగా అవతరించాయి. గుజరాత్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌ రైతులు పోటీపడి పండిస్తున్నారు. కుబేరులూ కార్పొరేట్లూ కూడా గోరుచిక్కుడు పంట మీద ఆసక్తి చూపుతున్నారు.



గోరుచిక్కుడు పంట చేతికి రాగానే బాగా ఎండబెట్టి, గింజల పొట్టు తీస్తారు. వాటిని పప్పుగా చేస్తారు. ఆ పొడిలో నీళ్లు కలిపితే జిగటజిగటగా మారుతుంది.  ప్రత్యేకంగా జిగురు కోసమే పండించే గోరుచిక్కుడును 'గమ్‌గౌర్‌' అని వ్యవహరిస్తారు. ఐస్‌క్రీమ్‌లు, సాఫ్ట్‌ డ్రింకులు, పుడ్డింగ్స్‌, చాకొలెట్‌ మిల్క్‌, ఫ్లేవర్డ్‌ మిల్క్‌,  జామ్‌, జెల్లీ, బ్రెడ్‌, బిస్కెట్‌, సాస్‌, కెచప్‌, చీజ్‌, క్యాన్డ్‌ ఫిష్‌, క్యాన్డ్‌ మీట్‌, నూడుల్స్‌, పాస్తా...ఇలా రకరకాల ఆహార పదార్థాల్లో వాడతారు. గోరుచిక్కుడు  జిగురులో కేలరీలు ఉండవు. జీర్ణవ్యవస్థ శుద్ధికి ఉపయోగపడుతుంది. కొద్దిగా తీసుకున్నా పొట్ట నిండినట్టు అనిపిస్తుంది. దీంతో బరువు తగ్గాలనుకునేవారి  కోసం ప్రత్యేకంగా తయారు చేసే ఆహార పదార్థాల్లో గోరుచిక్కుడు జిగురును విరివిగా వాడుతున్నారు. పోషకాహారాల తయారీలో, చర్మ సౌందర్యానికి వాడే  లోషన్లలో దీన్ని వినియోగిస్తారు.



వస్త్ర పరిశ్రమ, ముద్రణ, అగ్నిమాపక పదార్థాల తయారీ, సిరామిక్స్‌, దోమల నివారిణులు, కాగితం, వాటర్‌ పెయింట్లు, చమురు బావుల తవ్వకాలు, మైనింగ్‌,  పేలుడు పదార్థాల తయారీలో...గోరుచిక్కుడు జిగురు చాలా కీలకం. చమురు-గ్యాస్‌ బావులకైతే జిగురు లేకపోతే పనే నడవదు. అమెరికా షేల్‌ ఆయిల్‌, షేల్‌  గ్యాస్‌ వెలికితీతపై దృష్టి పెట్టడంతో...మన దేశంలో గోరుచిక్కుడు జిగురు ధరకు  రెక్కలొచ్చాయి. గతంలో క్వింటాలుకు రెండువేల నుంచి నాలుగువేల మధ్య  ఉన్న గింజల ధర గత ఏడాది ముప్పై అయిదువేలు పలికింది. జిగురు ధర లక్షా పదివేల పైమాటే. గోరుచిక్కుడు జిగురుకు అంతర్జాతీయ మార్కెట్లో గొప్ప గిరాకీ ఉంది. అమెరికా తన చమురు పరిశ్రమ అవసరాల కోసం భారత్‌ జిగురుపైనే ఆధారపడుతోంది.



షేల్‌గ్యాస్‌ లేదా నూనె వెలికితీసే 'ఫ్రాకింగ్‌' ప్రక్రియలో ఇది కీలకమైంది. ఇంతకీ షేల్‌ గ్యాస్‌/ఆయిల్‌ అంటే ఏమిటి? ఫ్రాకింగ్‌లో ఏం చేస్తారూ  అంటే..సాధారణంగా సహజవాయువూ చమురూ భూమిలోని రాతి పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి. భూమి లోపలికంటా తవ్వి బావుల నుంచి వెలికి తీయాలి.  సాధారణంగా ఇసుకరాయి (శాండ్‌ స్టోన్‌), సున్నపురాయి (లైమ్‌ స్టోన్‌) పొరల్లో నిక్షేపాలు ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 90 శాతం  సహజవాయువూ చమురూ ఈ రెండురకాల రాళ్ల నుంచే వస్తోంది. ఇసుకరాయిలో రేణువుకీ రేణువుకీ మధ్య, సున్నపురాయిలో లైమ్‌స్టోన్‌లో పొరల మధ్య  ఉన్న ఖాళీలలో గ్యాస్‌, ఆయిల్‌ ఉంటాయి. సంప్రదాయ విధానంలో శిలల్ని బుల్లెట్‌తో పేలుస్తారు. కొన్నిసార్లు రసాయనాలూ పంపిస్తారు. అప్పుడు రాళ్లల్లో  నిక్షిప్తమైన గ్యాస్‌, ఆయిల్‌ బావుల్లోకి వచ్చేస్తుంది. ఇక షేల్‌ గ్యాస్‌నూ షేల్‌ ఆయిల్‌నూ వెలికితీయడం కొంత భిన్నమైన విధానం. భూమి లోపల బంకమట్టి  గట్టిపడగా ఏర్పడిన రాళ్లనే 'షేల్‌' అంటారు. ఈ రాళ్లలో చాలా పలుచని పొరలు ఉంటాయి. భూమి లోపలికి వెళ్లేకొద్దీ ప్రతి 100 మీటర్లకూ మూడు డిగ్రీల  చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత, ఒత్తిడి తదితర కారణాల వల్ల... కాలక్రమంలో బంకమట్టి గట్టిపడి 'హార్డ్‌రాక్‌'గా మారుతుంది. ఈ  ప్రక్రియలో మట్టిలో ఉండే నీరు, చమురు వంటివి చాలా వరకూ బయటికెళ్లిపోతాయి. ఇంకా కొంత గ్యాస్‌, ఆయిల్‌ రాతి పొరల మధ్యలో చిక్కుకుపోయి  ఉంటుంది. దీన్ని బయటికి తీయాలంటే రాతిని ముక్కలు చేయాలి. పగుళ్లు సృష్టించాలి. పొరలమధ్య దూరాన్ని పెంచాలి. షేల్‌ గ్యాస్‌/ఆయిల్‌ కోసం భూమి  లోపలి వరకు నిట్టనిలువుగా తవ్వకాలు (డ్రిల్లింగ్‌) జరుపుతారు. మట్టిపొరలు తగిలాక భూమిలోపల సమాంతరంగా తవ్వకాలు చేస్తారు, నీటిలో వివిధ  రసాయనాల్ని కలిపి ఎక్కువ పీడనంతో భూమి లోపలికి పంపుతారు. మట్టి రేణువుల మధ్య ఖాళీ ఏర్పడేలా చేస్తారు. అప్పుడే దాన్లోని చమురు గ్యాస్‌  బావిలోకి చేరుతుంది. భారీగా నీటిని వాడతారు కాబట్టి ఈ ప్రక్రియను హైడ్రో ఫ్రాక్చరింగ్‌ అనీ ఫ్రాకింగ్‌ అనీ పిలుస్తారు. ఇలా భూమి లోపలికి పంపించే  పదార్థాన్ని ప్రొపొనెంట్‌ అంటారు. 'షేల్‌' బావుల్లోకి పంపే ప్రొపొనెంట్స్‌లో ఎక్కువ శాతం గోరుచిక్కుడు జిగురు ఉంటుంది. ఆ పదార్థం లేకుండా షేల్‌ గ్యాస్‌  తవ్వకాలు అసాధ్యం. అమెరికాలో ప్రస్తుతం 30 శాతం వరకు గ్యాస్‌ 'షేల్‌' నుంచే వస్తోంది. మనం జిగురు సరఫరా చేయకపోతే ఆ బావులన్నీ  మూతపడినట్టే. అందుకే మరి, మన దగ్గర గోరుచిక్కుడు ఉత్పత్తి తగ్గితే అమెరికాకు చెమటలు! షేల్‌ గ్యాస్‌ వెలికి తీయడం కొంత సంక్లిష్టమైన ప్రక్రియే అయినా, చాలా దేశాలు దీనిపై దృష్టి సారిస్తున్నాయి. సంప్రదాయ ఇంధన వనరులు క్రమంగా  తగ్గుముఖం పడుతుండటంతో ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం తప్పనిసరి అవుతోంది. పైగా సహజవాయువుల కోసం, చమురు కోసం పూర్తిగా  దిగుమతులపైనే ఆధారపడటం ఎప్పటికైనా ప్రమాదమే. ప్రపంచంలోని చాలా దేశాల్లో షేల్‌ గ్యాస్‌/ఆయిల్‌ నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతానికి, కొన్ని  దేశాలు మాత్రం వెలికి తీస్తున్నాయి. భారత్‌ కూడా షేల్‌ గ్యాస్‌ ప్రాధాన్యాన్ని గుర్తించింది. మన దగ్గరే కాదు, పొరుగు దేశాల్లోనూ లీజుల ద్వారా తవ్వకాలు  జరుపుతామని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఆ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది కూడా. అమెరికాలో అయితే ఎప్పుడో  2004లోనే ఈ కార్యక్రమం వూపందుకుంది. ప్రస్తుతం అక్కడ 30 శాతం సహజవాయువు షేల్‌ నుంచే వస్తోంది. మనం కూడా షేల్‌ గ్యాస్‌ వంటి  ప్రత్యామ్నాయాల్ని వెతకాల్సిన అవసరం చాలా ఉంది. భారత్‌లో చాలా చోట్ల 'షేల్‌' ఉన్నా, గ్యాస్‌/ఆయిల్‌ నిక్షేపాలు కలిగిన షేల్‌ కొన్ని చోట్లే ఉంటుందని  చమురు రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మన అవసరాలకు 176 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల చమురు అవసరమైతే, 2011-12లో 48  మిలియన్‌ మెట్రిక్‌ టన్నులే ఉత్పత్తి చేయగలిగాం. గ్యాస్‌ 64 బీసీఎం (బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు) అవసరమైతే గత సంవత్సరం 52 బీసీఎం ఉత్పత్తి  చేయగలిగాం. మిగిలింది అంతా, విదేశాల నుంచే దిగుమతి  సుకుంటున్నాం. భవిష్యత్‌తో షేల్‌ ప్రాధాన్యం మరింత పెరగడం ఖాయం. దాంతోపాటే...  గోరుచిక్కుడు మార్కెట్‌ కూడా!



దేశంలో ఉత్పత్తి అవుతున్న గోరుచిక్కుడు జిగురులో 75 శాతం వరకు రాజస్థాన్‌ నుంచే వస్తోంది. ఈ పరిశ్రమలకు జోధ్‌పూర్‌ ప్రధాన కేంద్రం. గంగానగర్‌లో  ఓ పరిశోధన కేంద్రం కూడా ఉంది. రాజస్థాన్‌లో వర్షాలు అంతంతమాత్రమే కావడంతో కాలం కలిసొస్తే నాలుగు గింజలు రాలేవి. రైతుకు నాలుగు రాళ్లు  వచ్చేవి. ధరలూ తక్కువే కావడంతో గోరుచిక్కుడు సేద్యం లాభదాయకంగా ఉండేది కాదు. దళారుల దోపిడీ సరేసరి. వ్యాపారులు, పరిశ్రమల యజమానులు  మాత్రం బాగుపడేవారు. గత సంవత్సరం పరిస్థితి మారిపోయింది. ఉత్తర అమెరికాలో షేల్‌ గ్యాస్‌ బూమ్‌తో గోరుచిక్కుడు జిగురుకు ఒక్కసారిగా గిరాకీ  పెరిగింది. ధరలు నింగినంటాయి. వూహించని డబ్బు వచ్చిపడటంతో రాజస్థాన్‌ రైతులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ప్రజల జీవనశైలే మారిపోయింది. అప్పటి  వరకు గుడిసెల్లో బతుకీడుస్తున్నవారు పక్కా ఇళ్లు కట్టుకున్నారు. టీవీ, ఫ్రిజ్‌ వంటి గృహోపకరణాలు సమకూర్చుకున్నారు. ట్రాక్టర్లు కొనుక్కున్నారు.  ఆమధ్య గంగానగర్‌కు చెందిన 70 ఏళ్ల బీర్బల్‌ 20 క్వింటాళ్ల గింజల్ని దాదాపు ఐదున్నర లక్షలకు విక్రయించాడు. విత్తనాల కోసం క్వింటాలు గింజల్ని  దాచుకున్నాడు. వాటిని దొంగలు ఎత్తుకెళ్లకుండా గట్టి కాపలా ఏర్పాటు చేసుకున్నాడట. వ్యాపారి రాధేశ్యామ్‌ గోరుచిక్కుడులో సంపాదించిన లాభాలతో 

హాంకాంగ్‌లో స్థిరాస్తి వ్యాపారం చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడట. సేద్యానికి  ట్టుబడి సమస్యే లేదు. రైతులు వ్యాపారుల దగ్గరకు వెళ్లడం కాదు...  వ్యాపారులే రైతుల దగ్గరకు వచ్చి బయానా సమర్పిస్తున్నారు. విత్తనాలూ గట్రా సరఫరా చేస్తున్నారు. రైతేరాజు అన్నమాట రాజస్థాన్‌ రైతన్నల విషయంలో  నిజమవుతోంది! గోరుచిక్కుడు పంటలోనూ, గోరుచిక్కుడు జిగురు ఎగుమతిలోనూ మనదేశం అగ్రగామిగా ఉంది. అంతర్జాతీయ పారిశ్రామిక అవసరాల్లో ఎనభై శాతం దాకా  ఇక్కడి నుంచే వెళ్తోంది. భారత్‌లో గోరుచిక్కుడు గింజల సగటు ఉత్పత్తి 10-11 లక్షల టన్నులు. దేశం నుంచి 1-1.5 లక్షల టన్నుల జిగురు ఏటా  ఎగుమతి అవుతోంది. మరో 20 నుంచి 30 వేల టన్నుల జిగురును దేశీయంగా వినియోగిస్తున్నాం. మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఆహార  పదార్థాల్లో బాస్మతి బియ్యం తర్వాతి స్థానం గోరుచిక్కుడుదే. అయితే, భారత్‌ నుంచి గింజల రూపంలో గోరు చిక్కుడు ఎగుమతుల్లేవు. దీనిపై నిషేధం  విధించారు. పప్పు లేదా జిగురు రూపంలోనే పంపాలి. ధరలు అదుపు తప్పడంతో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ను కూడా నిలిపేశారు. ఉత్తర భారతంలో దీన్ని ఖరీఫ్‌ 

పంటగా వేస్తారు. గత సీజన్‌లో అక్కడ 12 లక్షల టన్నుల గింజలు పండించారు. ఈ సంవత్సరం 15 నుంచి 18 లక్షల టన్నుల దాకా చేతికొస్తుందని  భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే, గోరుచిక్కుడు ధరలు తగ్గాయి. అయినా క్వింటాలుకు రూ.8 వేల దాకా పలుకుతోంది.



కూరగాయ గోరుచిక్కుడుకీ జిగురు గోరు చిక్కుడుకీ కొంత తేడా ఉంది. కూరగాయగా పండించడం అన్నది, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉంది. గత ఏడాది  ఒక్కసారిగా డిమాండ్‌ పెరగడంతో కూరగాయగా పండించిన గోరుచిక్కుడునే కొందరు రైతులు జిగురు కోసం విక్రయించారు. ఇప్పుడు రాజస్థాన్‌, గుజరాత్‌ల  నుంచి విత్తనాలు తెచ్చుకుని వాణిజ్య ప్రాతిపదికన సాగు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా వంటి వర్షాభావ ప్రాంతాల్లో ఇప్పటికే  ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగు చేస్తుండగా...ఇప్పుడు గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోను పెద్ద ఎత్తున సాగు చేయాలని భావిస్తున్నారు. మన రాష్ట్రం  నెలనెలా 200 టన్నుల జిగురును ఉత్తరభారతం నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 50 టన్నుల వరకు మస్కిటో కాయిల్స్‌ తయారీకే  వాడుతున్నారు. గోరుచిక్కుడులో రెండు రకాలు... 80-90 రోజుల్లో కోతకు వచ్చేవి ఉన్నాయి, 120-125 రోజుల్లో కోతకు వచ్చేవీ ఉన్నాయి. పెద్దగా తెగుళ్లు  లేకపోవడం, వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకునే గుణం ఉండటం, పెట్టుబడి తక్కువ కావడం, గిరాకీ బాగుండటం... తదితర కారణాల వల్ల రైతులు మక్కువ  చూపుతున్నారు. పత్తి, మిరప దెబ్బతీస్తుండటంతో గోరు చిక్కుడు ఆశాకిరణంలా కనిపిస్తోంది. అలా అని, అనాలోచితంగా అడుగు ముందుకేయడమూ 

ఇబ్బందే. దీనిపై ఇంకా కొంత అధ్యయనం జరగాల్సి ఉంది. అన్ని కాలాల్లో, అన్ని నేలల్లో, వివిధ వాతావరణ పరిస్థితుల్లో పండించి చూసిన తర్వాత కానీ ఒక  నిర్ణయానికి రావడం కష్టమంటున్నారు అనుభవజ్ఞులు.



ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన హంగామా ... రాజస్థాన్‌, గుజరాత్‌ వ్యాపారులను ఆకర్షిస్తోంది. పల్లెల్లో ప్రత్యక్షమైపోయి, క్వింటాలుకి రూ.10-12 వేలు  ఇస్తామంటూ రైతులతో ఒప్పందం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మన రైతుల్లో చాలా మంది ముందస్తు ఒప్పందానికి సిద్ధంగా లేరు. సీజన్‌లో  మంచి ధరలు వస్తాయన్న ఆశ వారిలో కనిపిస్తోంది. ''ముప్పై ఏళ్ల నుంచీ గోరు చిక్కుడు పండిస్తున్నా. ఇది వరకు పంటలో పనికిరాని విత్తనాల్ని జిగురు  కోసం పంపించేవాళ్లం. ఇప్పుడు గిరాకీ పెరగడంతో 10 ఎకరాల్లో కేవలం జిగురు గోరుచిక్కుడునే పండించాలని అనుకుంటున్నా. ఎకరానికి రూ.10 వేల  వరకూ పెట్టుబడి అవుతుంది. తెగుళ్లు తక్కువ. క్వింటాలుకి రూ.8 వేలు ధర వచ్చినా కూడా, మిగతా అన్ని పంటల కంటే ఇది లాభదాయకంగా ఉంటుంది''  అంటారు గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన జెట్టి రత్తయ్య. ఈ పంట మన రాష్ట్రానికి చాలా అనుకూలమని, ప్రస్తుతం మంచి గిరాకీ ఉన్నందున రైతులు  సాగు చేయవచ్చునని విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త ఆలపాటి సత్యనారాయణ అభిప్రాయపడుతున్నారు. మన రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌లో 6645 ఎకరాల్లో  జిగురు గోరుచిక్కుడును సాగు చేస్తున్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 3500 ఎకరాల్లో సాగు ఉంది. ఏది ఎలా ఉన్నా, మార్కెట్‌ పరిస్థితుల్ని దృష్టిలో  ఉంచుకుని పంట వేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అందరూ వేలం వెర్రిగా ఇదే పంట వేసినా, సరఫరా పెరిగి ధరలు పడిపోతే నష్టపోవాల్సి  వస్తుందని హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయంగా మాత్రం పరిస్థితులు ఆశాజనకంగానే ఉన్నాయి. ప్రస్తుతం షేల్‌ గ్యాస్‌ ఎక్కువగా అమెరికాలోనే వెలికి తీస్తున్నారు. చైనాలో కూడా భారీ  నిల్వలు ఉన్నట్టు అంచనా. మరికొన్ని దేశాలు త్వరలో షేల్‌ గ్యాస్‌ వెలికితీయడంపై దృష్టి పెట్టనున్న నేపథ్యంలో భవిష్యత్‌ బంగారమే అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రైతన్న గోరుచిక్కుడుపై కొండంత ఆశే పెట్టుకున్నాడు. గోరుచిక్కుడు జిగురుకు ఔషధగుణాలున్నాయి. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. టన్ను నాణ్యమైన గోరుచిక్కుడుతో 300 కిలోల జిగురు తయారవుతుంది. సాధారణ జిగురుతో పోలిస్తే... ఆయిల్‌, గ్రీజు వంటి వాటిని కూడా తట్టుకుని నిలిచే శక్తి ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల అనంతపురం జిల్లాలో వేరుసెనగ పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసేందుకు 'ఆపరేషన్‌  అనంత' పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌)  శాస్త్రవేత్తల బృందం అనంతపురం వెళ్లి అధ్యయనం చేసింది.  వివిధ ప్రత్యామ్నాయ పంటలు సూచించింది. వాటిలో గోరుచిక్కుడు ఒకటి. సాగు లాభదాయకంగా అనిపించడంతో రైతులు మొగ్గు చూపుతున్నారు.  అనంతపురం రైతులకు  ఇచ్చేందుకు విత్తనాలు కావాలంటూ రాజస్థాన్‌ విత్తనాభివృద్ధి సంస్థను మన ప్రభుత్వం కోరింది. కానీ వాళ్లు చేతులెత్తేశారు. దీంతో జోధ్‌పూర్‌ కేంద్రంగా  నిచేస్తున్న ఓ ప్రైవేటు పరిశ్రమ పంటను తిరిగి కొంటామంటూ ఉచితంగా విత్తనాలు అందజేసింది. ఒకటిరెండు పంటలు బాగా వస్తే... సాగు పుంజుకునే అవకాశం ఉంది.





Courtesy with--జె.కళ్యాణ్‌బాబు, ఈనాడు, గుంటూరు @Eenadu sunday magazine


  • =========================


Visit my Website - Dr.Seshagirirao...

Sunday 2 December 2012

Nutrients of outerfeel of fruits & vegetables-పండ్లు.కాయల తొక్కల్లో పోషకాలు




  •  image : courtesy with Eenadu vasundara paper







పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.





    అరటిపండు తింటూ తొక్కనీ, దోసకాయ వండుతూ చెక్కునీ తీసి పారేయడం అలవాటు. కానీ అసలు విషయమంతా వాటిల్లోనే ఉంది అంటున్నారు పోషకాహార నిపుణులు. పండ్లలో అసలు కంటే కొసరుగా ఉండే చెక్కులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని అధ్యయనాలూ వెల్లడించాయి. తీసి పారేయొద్దు... తింటేనే మేలు!  ఆ వివరాలు తెలుసుకుంటే, తీసి పారేసే వాటితో విభిన్న వంటకాలను ప్రయత్నించొచ్చు. పోషకాలనూ పొందవచ్చు.




  • బీరకాయ తొక్క :


మనందరికీ గుర్తుండే ఉంటుంది, చిన్నప్పుడు బీరకాయలని అమ్మ పప్పుతో కలిపి వండేది. అంతటితో సరిపెట్టుకొనేది కాదు, బీర చెక్కుని పారేయకుండా దానితో తీయగా, పుల్లగా ఉండే పచ్చడి చేసి పెట్టేది. బీరకాయలతో పోలిస్తే, దాని పొట్టులో పోషకాలు అధికం. దాన్నుంచి లభించే పీచు మలబద్దకాన్ని తగ్గించేందుకు దోహదం చేస్తుంది. అధిక కెలొరీలు, చక్కెరలు, కొవ్వుల ప్రమాదం ఉండదు. సొరకాయలు, లేత అరటి కాయల పొట్టుతోనూ పచ్చళ్లు చేసుకోవచ్చు. అవీ ఆరోగ్యానికి ఉపకరించేవే. దోసకాయ పప్పు, కూరలు చేసేప్పుడు సాధారణంగా చెక్కు తీసేస్తారు. దోస ఆవకాయకి మాత్రం ఉంచుతాం. దోస చెక్కులో పీచు అపారం. చక్కటి కంటిచూపునకు ఉపయోగపడే విటమిన్‌ 'ఎ', బీటా కెరొటిన్‌ దీన్నుంచి లభ్యమవుతాయి. చిలగడ దుంపల్ని ఉడకబెట్టినప్పుడు పై పొట్టు తీసేసి తినడం చాలామందికి అలవాటు. కానీ ఈ తీసేసే వాటిల్లో రక్తహీనతను తగ్గించే ఇనుము, వ్యాధి నిరోధక శక్తిని పెంచే జింక్‌ పోషకాలుంటాయి.




  • యాపిల్ తొక్క లో యాంటీ ఆక్సిడెంట్లు అధికం..


రోజుకో ఆపిల్‌ తింటే వైద్యుడిని కలవాల్సిన అవసరం లేదని చెబుతారు. అందుకేగా, యాపిల్‌తో చేసిన డ్రింక్‌లూ, జ్యూస్‌లూ తాగుతున్నాం అనకండి! అందరూ అనుకొనేట్టు యాపిల్‌ గుజ్జులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉండవు. గుజ్జులో కంటే తొక్కలో ఐదురెట్లు ఎక్కువ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని అధ్యయనాలు తెలిపాయి. జర్నల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ కెమిస్ట్రీ అధ్యయనం ప్రకారం, యాపిల్‌ తొక్కులో రొమ్ము, కాలేయం, పెద్ద పేగు క్యాన్సర్లను నయం చేసే శక్తి ఉంది. జ్యూస్‌ తాగడం కన్నా యాపిల్‌ని కొరుక్కు తినడం వల్లే ఎక్కువ మేలు. చర్మం నిగనిగకు, చిగుళ్ల సంరక్షణకు ఉపయోగపడే శక్తివంతమైన పాలీఫినాల్స్‌ ఎక్కువగా పొందగలం కూడా.



ఇక, పుల్లని నల్ల ద్రాక్షల విషయానికొస్తే, చాలామంది యథాతథంగా తినకుండా చక్కెర కలిపిన జ్యూస్‌గా తాగుతారు. రుచి బాగుంటుంది. కానీ రసం తీసి వడ కట్టినప్పుడు పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండే చెక్కులో పాతిక శాతం వినియోగించుకోలేకపోతాం. దాంతో కొలెస్ట్రాల్‌ నిరోధక గుణాలనీ కోల్పోతాం. జామకాయలు మరీ పచ్చిగా ఉన్నా, పూర్తిగా పండినా ఏం చేస్తాం... ముక్కలుగా కోసం మధ్యలో ఉండే మెత్తని గుజ్జుని తినేస్తాం. కానీ ఇది సరికాదు. దీనివల్ల యాంతోసియానిన్‌ అనే క్యాన్సర్‌ నియంత్రణ కారకాన్ని పొందలేము.



కేక్‌లు, సలాడ్లలో నిమ్మపొడి...

నోటికి ఏ రుచీ సహించనప్పుడూ నిమ్మకాయ, చింతకాయ పచ్చళ్లు తినాలనిపిస్తుంది. రుచికంటే వీటికుండే వాసనే సగం సాంత్వన కలిగిస్తుంది. నిమ్మ, నారింజ చెక్కులో ఉండే మోనోటెర్‌పాన్స్‌ నూనెలు ప్రత్యేక వాసనలని వెదజల్లుతాయి. వీటికి చర్మ, కాలేయ, గర్భాశయ, వూపిరితిత్తుల క్యాన్సర్లని నివారించే శక్తి ఉంది. పచ్చళ్ల రూపంలో ఇప్పటికే వీటిని తింటున్నాం. పచ్చళ్లు వద్దనుకునే వాళ్లు నిమ్మతొక్కలతో చేసిన చాయ్‌కి హాయ్‌ చెప్పేయచ్చు. కేకులు, సలాడ్లలో లెమన్‌ పీల్‌ పొడిని చల్లుకొన్నా రుచిగానే ఉంటుంది. పదార్థాలని బేక్‌ చేసేటప్పుడూ, మఫిన్స్‌, బిస్కట్లలో కూడా ఈ పౌడర్‌ని ఎక్కువగా వాడుతుంటారు.



తెల్లని గుజ్జుని వదలొద్దు...

పుచ్చకాయ ముక్కలు అంటే ఎర్రని గుజ్జే అనుకుంటాం. కానీ అడుగున ఉండే తెల్లని పదార్థంలో పోషకాలు పుష్కలం. దాన్లో సిట్రులిన్‌ అనే పోషక పదార్థం ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే అమినోయాసిడ్లు, విటమిన్‌ సి, విటమిన్‌ 'ఎ', థయామిన్‌, రైబోఫ్లెవిన్‌... రక్తహీనత రాకుండా చూసే ఇనుము, మెగ్నీషియమ్‌, ఎముకల బలానికి తోడ్పడే క్యాల్షియం ఉంటాయి. పోషకాలు అపారం కాబట్టి జ్యూస్‌ తయారు చేసేప్పుడు కాస్త లోతుగా కట్‌ చేయడం వల్ల తెలుపు రంగు పదార్థాన్నీ మిక్సీలో వేయొచ్చు.



దానిమ్మ టీ...

ఎర్రెర్రని దానిమ్మ గింజల్లో కంటే దాని పొట్టులో రెండు రెట్లు ఎక్కువగా శక్తివంతమైన పోషకాలుంటాయి. కానీ దానిని తినడం మనవల్ల అయ్యే పనికాదుగా. అందుకే దానిని ఎండబెట్టి పొడి చేసుకొని టీ చేసుకోవచ్చు.



* తీపి గుమ్మడి పులుసు పెట్టినప్పుడు చెక్కు తీయడం ఎందుకు? దానిలో ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా చేసే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు అధికం.



* ఆలూ దుంపలపై ఉండే పొరలో విటమిన్‌సి, బి6, పొటాషియం, మాంగనీస్‌ పోషకాలు ఉంటాయి. అందుకే ఆలూ పరాటా చేసినప్పుడు పొట్టు తీయకుండా ఉంటే సరిపోతుంది



 -- courtesy with Eenadu Telugu daily news paper


  • =======================


 Visit my Website - Dr.Seshagirirao.../

Thursday 22 November 2012

Stress and Strain reducing foods-ఒత్తిడి శాతాన్ని తగ్గించే కొన్ని ఆహారపదార్ధాలు.






  •  

  • పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


   

ఈ రోజులలో ఒత్తిడి అనే మాట ప్రతి ఒక్కరి నోటి నుంచి విని పిస్తోంది. ఒత్తిడిని తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా అధిక ఒత్తిడిని  తగ్గించుకోవచ్చు. ఆహారపు అలవాట్లను కూడా ఒక దశకు వచ్చే సరికి నియంత్రణ చేయాలి.. చిన్నప్పువు ఇష్టంగా తిన్నామని…  పెద్దయ్యాక కూడా వాటిని అదేలా తింటామంటే కుదరదు. ముఖ్యంగా ఆడవారి విషయంలో సమతుల ఆహారం తీసుకోవాలి . ఎక్కువశాతం ఒత్తిడికి గురయ్యే విషయంలో పురుషుల కన్నా మహిళలే ముందు వరుసలో ఉంటున్నారని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది. ఒక్కోసారి   చిన్న చిన్న విషయాలకే వైద్యుల వద్దకు వెళ్లి  సైడ్‌ఎఫెక్ట్‌లు ‌ కలిగించే మందులను ఊరికే వాడుతుంటాం. మన చేతిలో ఉన్న చిన్న పాటి జాగ్రత్తలు తీసుకోము.




సహజసిద్ధంగా ఒత్తిడి శాతాన్ని తగ్గించే కొన్ని ఆహారపదార్ధాలను పరిశీలిద్దాము .


  • బొప్పాయి: దీనిలో ఉండే కెరోటిన్‌ విషతుల్యాల్ని తొలగిస్తుంది. దీనివల్ల శరీరం, మనస్సు తేలికపడి ఒత్తిడి ఇట్టే ఒత్తిడి తగ్గిపోతుంది.

  • ఆరెంజ్‌ :  అత్యధికంగా కమలాల్లో లభించే సి విట మిన్‌ వల్ల ఒత్తిడి ఫలితంగా ప్రభావం చూపే  హార్మో న్ల స్థాయిని తగ్గించి మేలు చేకూరుస్తుంది.

  • అరటిపండు : దీనిలో ఉండే అధిక క్యాలరీలు, మెగ్నీషియం టెన్షన్‌ను  సులభంగా తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో అరటిపండు ఎంతో మేలు .

  • బంగాళ దుంప : జింక్‌, విటమిన్‌ సి పెరిగి రోగని రోధకశక్తి ఇనుమడించి మనస్సును దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

  • చాక్లెట్‌ : వీటిలో సహజంగా ఉండే ఫెనిలెథిలమైన్‌ (పిఇఎ) ఎండార్ఫిన్‌ స్థాయిల్ని తొలగించి సహజసి ద్దమైన యాంటీ – డిప్రెెస్సెంట్‌గా పనిచేస్తుంది.

  •  యాప్రికోట్‌లోని కెరోటిన్‌ ఒత్తిడిని తగ్గిస్తుంది.,

  • పెరుగులోని  విటమిన్‌ బి నెర్వస్‌నెస్‌ను తగ్గిస్తుంది.

  • గోధుమలో ఉండే ఐరన్‌ మెదడుకు ఆక్సిజన్‌ను ఇచ్చి ఒత్తిడిని, టెన్షన్‌ను నివారిస్తుంది.

  • ఒమెగా3 ఫ్యాటీయాసిడ్లు అత్యధికంగా లభించే చేపలు స్ట్రెస్‌ను తగ్గిస్తాయి.

  • పాలలోని ల్యాక్టోస్‌  మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురుకుగా ఉంచేందుకు సహకరిస్తాయి.





  • =====================


Visit my Website - Dr.Seshagirirao...

Wednesday 21 November 2012

Balanced and Nutritive food for beauty- అందానికి సమతుల్య మరియు పౌష్టికాహారం


  •  














పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.







ముప్ఫౖ ఏళ్లు దాటుతున్నా, ఇరవై ఏళ్ల వారిలా కనిపించాలని అనుకుంటారు చాలామంది. అలా కనిపించడం సులువే అంటున్నారు సౌందర్య నిపుణులు. చేయాల్సిందల్లా తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టడమే. పోషకాహారం, కంటినిండా నిద్ర, ప్రశాంతమైన మనసు... ఈ మూడూ చర్మం మెరిసిపోవడానికి ముఖ్యంగా పాటించాల్సినవి. ఇందులో ఆహారానిదే ప్రధానపాత్ర. ఓ తాజా అధ్యయనం ప్రకారం, ఆహారంలో చక్కెర ఎక్కువగా తీసుకునే వాళ్లు వారి అసలు వయసు కన్నా పెద్దవారిలా కనిపిస్తున్నట్లు తేలింది. అందుకే చక్కెర ఎక్కువగా ఉండే శీతల పానీయాలూ, క్యాండీలూ, కేకులూ, కుకీలకు దూరంగా ఉండాలి. సహజ చక్కెరలు కలిగే ఉండే తాజా పండ్లను ఎక్కువగా తినాలి. ఉప్పు ఎక్కువగా తినడం తగ్గించాలి. ఒకరోజులో తినే ఆహార పదార్థాలన్నింటిలో ఒక టీ స్పూను కన్నా ఎక్కువ ఉప్పు వేయకుండా ఉంటే మంచిది.మగవారు కాస్త మోటుగా వున్నా పర్వాలేదు. ఆడవారు అందంగా నాజూగ్గా వుండాలి. ఆడవాళ్లు అందంగా కనిపించాలంటే బాహ్యాలంకరణ మాత్రమే వుంటే చాలదు. స్వతస్సిద్ధంగా కూడా అందంగా వుండాలి. వయసుకు తగ్గ అందం వుండాలి. అందంగా వుండాలనుకుంటే శరీరం తప్పకుండా ఆరోగ్యవంతంగా వుండాలి. ఆరోగ్యానికి ఆయువుపట్టు మీరు తీసుకునే ఆహారం నియమబద్దంగా వుండాలి. పౌష్టికాహారాన్ని నియమబద్ధంగా తీసుకుంటూ తగు మోతాదులో శరీర వ్యాయామం చేసుకుంటూ అందంగా, ఆరోగ్యంగా వుండాలి. ఇది ఆడవారికి అత్యంత ముఖ్యం.  చేయగలిగినంత ఇంటిపని చేయాలి. మన శరీరంలోని కణాలు నిర్వీర్యం కాకుండా పొషించేవి విటమిన్లు, న్యూట్రిషియన్‌ ఫుడ్‌ను తీసుకోవాలి. అంటే పరిపూర్ణ ఆహారం తీసుకోవాలి. పాలు, పండ్లు వంటివి బ్యాలెన్స్‌డు డైటు తీసుకోవాలి.





మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు విటమిన్లు మినరల్స్‌ కొవ్వు పదార్థాలు వుండాలి.మనం తీసుకునే ఆహారంలో హెచ్చుభాగం పండ్లు, కూర గాయలు వుండాలి. రిఫైండ్‌ షుగర్స్‌ వాడ రాదు. పంచదారకన్నా తేనెను వాడవచ్చు. అలాగే తాజా ఆకుకూరలు, టమాటోలు, దోసకాయ మొదలైనవాటిలో కాల్షియం ఎక్కువగా వుంటుంది. కెరోటిన్‌, రిబోప్లోవిన్‌, విటమిన్‌ సి, పోలిక్‌ ఏసిడ్‌ వుంటాయి. కాబట్టి ఇవే తీసుకో వాలి.ఆరంజ్‌, యాపిల్‌, బొప్పాయి తింటే ఆరోగ్య మైన చర్మం ఏర్పడుతుంది. లెమన్‌ జ్యూస్‌ మంచిది. ఇందులో సి విటమిన్ వుండి చర్మాన్ని ఇన్‌ఫెక్షన్‌ నుంచి కాపాడుతుంది. ఎక్కువగా టీ, కాఫీ త్రాగ కూడదు. అతి చల్లని పానీ యాలు ఆరోగ్యానికి హాని కరం. నీరు పుష్కలంగా తాగాలి. శరీరంలోని మలినాలని ప్రక్షాళన చేస్తుంది. ఇంకా మజ్జిగ, వెన్నతీసిన పాలు ఒంటికి మంచిది. టిన్‌లలో పాక్‌ చేసిన పండ్లు, కూరలు వాడ కూడదు. జీర్ణకోశం శుభ్రంగా వుండాలంటే పీచు ఎక్కువగా వున్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. గ్యాస్‌ ప్రాబ్లమ్‌వుంటే నూనె వస్తువులు, శనగపిండితో చేసే వాటిని తగ్గించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, వాకింగ్‌ శరీరాన్ని అనవసరంగా పెరగనివ్వకుండా చేస్తుంది. తిండి తినకుండా మాడితే మనుషులు బరువు తగ్గుతారనేది సరైనది కాదు. బ్యాలెన్స్‌డ్‌ ఫుడ్‌ తీసుకోవాలి. స్వీట్లు మితంగా తినాలి. ఇక తిండి తినేటప్పుడు పుస్త కాలు చదవడం, టీవి చూడటం చేయకూడదు.   ఫైబర్‌ ఫుడ్స్‌ వల్ల పైల్స్‌, కిడ్నీలో రాళ్లు, అల్సర్‌ లాంటివి రావు.  ఆహారం అసలు తినకుండాను(ఉపవాసము ), ఆహారం అమితంగా(exess)ను తీసుకోకూడదు. మీ కోపతాపాలు, మీ శరీరం సౌందర్యం ... మీరు తినే ఆహారం మీదే ఆధారపడివుంటాయి



మూడేళ్ల క్రితం చేసిన ఓ పరిశోధనలో పసుపూ, ఆకుపచ్చ రంగులో ఉన్న కూరగాయలూ, పండ్లూ తినడం వల్ల ముఖంపై ముడతలు రావడం తగ్గుతుందని తెలిసింది. అలాగే వివిధ రంగుల్లో ఉండి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పళ్లను తింటే వయసు అయిదేళ్లు తగ్గినట్టు కనిపిస్తారు. ఇక, చర్మం తాజాగా మారిపోవాలి అనుకునే వారు చేపల్ని తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఒమెగా త్రీ, సిక్స్‌ ఫ్యాటీ ఆమ్లాలూ, ప్రొటీన్లూ ఉన్న చేపలు తింటే అందం, ఆరోగ్యం సొంతం అవుతాయి.




  • =====================


Visit my Website - Dr.Seshagirirao...

Monday 12 November 2012

Snuf - నశ్యము



 image : Courtesy with Wikipedia.org.


  •  

  • పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. 



  •  నశ్యము (Snuff) అనగా ముక్కు పొడి. దీనిని పొగాకు నుండి తయారు చేస్తారు. బాగా ఎండిన పొగాకును పొడి అయ్యే వరకు నూరి చిన్న డబ్బాలలో భద్రపరుస్తారు. ఈ నశ్యము ముక్కు ద్వారా పీల్చి సేవిస్తారు. ఇది ఒక వ్యసనము . పొగలేని ఈ పొగాకు- నశ్యము మొదట అమెరికా లో ప్రారంభమై 17 వ శతాబ్దము లో ప్రపంచమంతటా వ్యాపించినది . క్రమేపి ఈ పొగాకు పౌడర్ లో వాసనకోసం కర్ఫూరము , యాలకులు, గులాబి  , చెర్రీ , కోలా సుగంధ ద్రవ్యాలు కలపడము మొదలు పెట్టారు .

  •  పనిచేయు విధానము : పొగాకు లో నికొటిన్‌(nicotine) పదార్ధము మెదడును ఉత్తేజ పరచడము ద్వారా మనిషి ఉషారుగా , ఉత్తేజముగా ఉంటాడు . ఈ నికొటున్‌ ప్రభావము అయిపోయిన తరువాత మెదడు డిమ్‌ (sleepy) గా ఉండడము వలన మళ్ళీ నశ్యము తీసుకోవాలని తీవ్యమైన కోరిక , అవసరము కలుగుతుంది . ఆ విధముగా ఇది వ్యసనము గా (addiction) మారుతుంది . 

  • ఆరోగ్య ప్రమాదాలు : నశ్యము వలన పొగ ఉండదు కావున ఊపిరితిత్తుల క్యాన్‌సర్ రాదుగాని  " ముక్కు -గొంతు (Naso-pharyngeal) క్యాన్‌సర్ లు వచ్చే ప్రమాదము ఉంది . తుమ్ములు ఎక్కువగా వస్తాయి. ఊపిరి తిత్తులలో ఈ పౌడర్ గాలి గదుల గోడలకు అంటుకునే అవకాశము ఉన్నందున గాలిలోని ఆక్షిజన్‌ తీసుకునే శక్తి తగ్గి ... ఉబ్బసము , బ్రొంకైటిస్ , మిగతా ఆయాసము వ్యాధులు వచ్చే అవకాశము ఉంది. 

  • వ్యసనాలలో ఇది కూడా ధూమపానము లో చెప్పబడి ఉన్నది. దూమపానము వలన చేసే వ్యక్తికే కాకుండా చుట్టూ ఉన్నవారికి నష్టము జరుగుతుంది. . కాని నశ్యము ఆ వ్యక్తికే పరిమితము అవుతుంది . నశ్యం పండిత లక్షణం అనేవారు . . . పూర్వము అలా జనాన్ని నమ్మించేవారు ... వ్యసనాన్ని మానలేక .



  • =====================


Visit my Website - Dr.Seshagirirao...

Tuesday 11 September 2012

ఫాస్ట్ ఫుడ్-మన ఆరోగ్యము అవగాహన , Fast foods and health awareness


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



సృష్టిలోని అన్ని సంపదలకన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. ఆర్ధికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆరోగ్యం ఉన్నతంగా

లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే. ఉన్నవారికీ, లేనివారికీ కావలసిన ఏకైక సంపద ఆరోగ్యం మాత్రమే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం

అన్నారు. ఆహారం విషయంలో మనం ఉండాల్సినంత జాగ్రత్తగా ఉంటున్నామో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎత్తుకు తగ్గ

బరువుతో బలంగా, శక్తిగా ఉన్నామో లేదో చూసుకోవాలి. బరువు ఎక్కువై, ఊబకాయం తెచ్చుకుంటే ఎంత కష్టమో, తక్కువై బలహీనంగా

ఉన్నా అంతే కష్టం. కనుక సమతుల్యతను కాపాడుకోవాలి. ఆహారంలో ఉండే పోషకాలు శక్తిని విడుదల చేస్తాయి. ఏదైనా అనారోగ్యంతో

బాధపడుతుంటేనో, లేక హార్మోన్ల అపసవ్యత చోటుచేసుకుంటేనో తప్పించి సాధారణంగా మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి బరువులో

హెచ్చుతగ్గులు ఉంటాయి.

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఆహార నియమాలను పాటించాలి. తీసుకున్న ఆహారం సవ్యంగా జీర్ణమయ్యేందుకు కొంత వ్యాయామం

తప్పనిసరి. లేకుంటే బరువు విపరీతంగా పెరిగిపోతుంటుంది. కొవ్వు నిల్వలు చేరతాయి. శరీరానికి అవసరమైన శక్తి సరిగా విడుదల

కాదు. దాంతో బరువు తగ్గించుకోడానికి నానా యాతనా పడాలి. అవసరమైన కంటే ఎక్కువ ఆహారం ఎలా మంచిది కాదో, తక్కువ

తినడమూ శ్రేయస్కరం కాదు. శరీరం శుష్కించుకు పోయి, నీరసం ముంచుకొస్తుంటుంది. ఏ పనిమీదా శ్రద్ధాసక్తులు ఉండవు. ఈ దశ

ముదిరితే అసలు జీవితం మీదే ఆసక్తి నశిస్తుంది. కనుక ఏవిధంగా చూసినా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేందుకు ప్రణాళిక

వేసుకోవాలి.
మనలో చాలామంది చేసే తప్పు ఏమిటంటే, ఆహారం రుచిగా ఉంటె సరిపోతుంది అనుకుంటాం. కానీ ఆహారం శుచిగా ఉండటం అంతకంటే

ముఖ్యం. పరిశుభ్రంగా లేని పదార్ధాల వల్ల లేనిపోని జబ్బులొస్తాయి. అలాగే నిలవున్న పదార్ధాలు విషతుల్యం అయ్యి, ఫుడ్ పాయిజన్

గా మారే ప్రమాదం ఉంది. ఇక ముఖ్యమైన అంశం ఆహారంలో పోషక విలువలు ఉండాలి. కింది కనీస జాగ్రత్తలు పాటించాలి.
1. ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవడంవల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్సు అందుతాయి.
2. వీలైనంతవరకు ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోకపోవడం మంచిది.
3. రుచికి, చూపులకు బాగుంటుంది కదాని పోలిష్ పట్టిన తెల్లటి బియ్యాన్ని వాడతాం. కానీ దంపుడు బియ్యపు అన్నం ఎంతో శ్రేష్టం.
4. అన్నం కంటే ఎక్కువగా కూరలను తినడం మంచిది.
5.ఆయా సీజన్లలో దొరికే పండ్లను సేవిస్తుండాలి.
6. నీళ్ళు బాగా తాగాలి. రోజుకు నాలుగు లీటర్లకు తక్కువ కాకుండా తాగితే మంచిది.
7. ఎక్కువ నీళ్ళు తాగి, తరచుగా యూరిన్ పాస్ చేయడంవల్ల శరీరంలో చోటు చేసుకున్న మలినాలు చాలావరకూ వెళ్ళిపోతాయి.


ఫాస్ట్ ఫుడ్ అనేది చాలా త్వరగా తయారు చేసి వడ్డించగల ఆహారానికి పేరు. తక్కువ తయారీ సమయం తీసుకునే ఎలాంటి భోజనమైనా

ఫాస్ట్ ఫుడ్ అనుకోవచ్చు, కానీ సామాన్యంగా ఈ పదాన్ని ఒక రెస్టారెంట్ లేదా మునుపే వేడిచేసిన లేదా వండిన పదార్థాల దుకాణంలో

అమ్మబడే ఆహారాన్ని సూచిస్తుంది, మరియు ఇది వినియోగదారుడికి టేక్-అవుట్/టేక్-అవే గా ప్యాక్ చేసి ఇవ్వబడుతుంది. ఈ పదం

"ఫాస్ట్ ఫుడ్" అనేది ఒక నిఘంటువులో మెరియం–వెబ్‌స్టెర్‌చే 1951లో గుర్తింపబడింది.

అమ్మే దుకాణాలు నీడ లేదా కూర్చునే సదుపాయం లేని స్టాండ్లు లేదా బట్టీలు ఇంగ్లీష్ లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు అని పిలుస్తారు.
బర్గర్‌, పిజ్జా, వేపుడు దినుసులు, కోలా పానీయాలు, మనిషి శరీరానికి ఎక్కువ కేలరీలు కొవ్వును అందించి ప్రమాదం

తెచ్చిపెడుతున్నాయి. హామ్‌బర్గ్‌ర్‌లో 300 కేలరీలు, కొవ్వు 10 గ్రాములు వుంటుంది.మిరియం కలిపిన పిజ్జాలో 180 కేలరీలు, 7

గ్రాముల కొవ్వు వుంటుంది. 340 మిల్లీలీటర్ల కోకోకోలాలో 158 కేలరీలు, మేక్‌ డోనాల్డ్‌ సారాలో 210 కేలరీలు వుంటాయి. ఇది

ప్రమాదకరం. మిరపకాయ బజ్జీలు, పానీపూరీ, చాట్ ,ఇడ్లీ, దోసె, సమోసా, పకోడా, వంటివి అంతగా హానికారకాలుకాని ఫాస్ట్‌ఫుడ్స్‌

క్రిందలెక్క.

భారత దేశానికి వచ్చినట్లైతే ఒక టిఫెన్‌లో 1 ఇడ్లీకి 70 కేలరీలు, 0.2 గ్రాముల కొవ్వు, 1 దోశలో 140 కేలరీలు 5 గ్రాముల కొవ్వు,

సమోసా పేకెట్‌లో 370 కేలరీలు, 18 గ్రాముల కొవ్వు వుంటుంది. ఒక గ్లాసు లస్సీలో 140 కేలరీలు 2 గ్రాముల కొవ్వు వుంటుంది.

ఇలా ఎన్నయినా ఉదాహరణలు ఇవ్వవచ్చు.

ఆరోగ్య సమస్యలు
మెడికల్ సొసైటీ కమిటీ ఆన్ న్యూట్రిషన్ ప్రకారం, ప్రత్యేకంగా ఫాస్ట్ ఫుడ్ క్రొవ్వు పరిమాణం ఎక్కువగా కలిగి ఉంటుంది, ఫాస్ట్ ఫుడ్

తీసుకోవడానికీ - శరీర ద్రవ్యరాశి సూచిక (BMI) మరియు బరువు పెరగడానికీ దగ్గరి సంబంధం ఉంది. "ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం

వలన కెలొరీ గ్రహణం పెరుగుతుంది, బరువు పెరగడం ఎక్కువవుతుంది, మరియు మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతుంది".


క్రొవ్వు ఆమ్లాలు, ఎక్కువ కెలోరీలు మరియు తక్కువ పీచుపదార్థం , మరొక ఆరోగ్యపరమైన హాని, ఆహారం కలుషితం కావడం. ఆహారం

కలుషితమయ్యే హాని జరగడానికి అవకాశం ఎక్కువ. మాంసంతో ఎరువులు కలవడం వలన, అది సాల్మొనెల్ల మరియు ఎస్కేరిచియా కోలి

0157:H7 లతో కలుషితమవుతుంది. E. కోలి 0157:H7 అనేది అతి హీనమైన ఆహార కాలుష్యాల్లో ఒకటి. సామాన్యంగా వండని

హాంబర్గర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది, మరియు దీనికి చికిత్స కష్టం. వ్యాధినిరోధకాలు సూక్ష్మక్రిములను నిర్మూలించినప్పటికీ, అవి

హానికర క్లిష్టతలను ఉత్పన్నం చేసే విషపూరిత పదార్థాన్ని విడుదల చేస్తాయి. E. కోలి 0157:H7 కలిగిన వారిలో సుమారు 4%

హేమోలిటిక్ యూరెమిక్ సిండ్రోం లక్షణాలు చూపుతారు, మరియు ఈ సిండ్రోం వృద్ది అయిన వారిలో 5% పిల్లలు మరణిస్తారు. E. కోలి

0157:H7 అనేది అమెరికన్ పిల్లలలో మూత్రపిండాల వైఫల్యానికి ప్రధాన కారణం అయింది.


మొత్తం జనాభాలో రోజుకు సుమారు 30.3% మంది ఫాస్ట్ ఫుడ్ తిన్నట్టూ తెలిసింది. ఫాస్ట్-ఫుడ్ తీసుకోవడం పురుషులు మరియు

స్త్రీలు, అన్ని జాతులు/తెగల సమూహాలు, మరియు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. ఫాస్ట్ ఫుడ్ తీసుకున్న పిల్లలు, తీసుకోని

వారితో పోల్చినపుడు, మరింత మొత్తం క్రొవ్వు, కార్బోహైడ్రేట్లు, మరియు పంచదారచే-తియ్యనైన పానీయాలు తీసుకుంటున్నారని

తెలిసింది. ఫాస్ట్ ఫుడ్ తిన్న పిల్లలు పీచు పదార్ధం, పాలు, పళ్ళు, మరియు స్టార్చ్ లేని కూరగాయలను తక్కువగా తీసుకుంటారని కూడా

తెలిసింది. పరిశోధకులు ఈ పరీక్షా ఫలితాలను సమీక్షించిన తరువాత, పిల్లలు ఫాస్ట్ ఫుడ్ తింటే, అది వ్యక్తిగత ఆహారంపై చెడు ప్రభావం

చూపి, ఊబకాయం యొక్క అపాయాన్ని గణనీయంగా పెంచుతుందని నిశ్చయించారు.

పాస్ట్ ఫుడ్స్ చేసేవారు వాటి పోషక విలువల సమాచారం తెలియజేయడంలో బాధ్యతా రహితమైనవి మరియు మోసం చేస్తున్నాయని

మనము తెలుసుకోవాలి. ఇది ఒక వ్యసనమంగా మారినది.

పిల్లలు-ఫాస్ట్‌ ఫుడ్స్‌

సాధారణంగా రోజూ ఒకేరకమైన ఆహార పదార్థాలు తినీ, తినీ విసుగుచెంది, ఫాస్ట్‌ ఫుడ్స్‌పై మక్కువ చూపిస్తుంటారు పిల్లలు. ఫాస్ట్‌ ఫుడ్స్‌

తినేటప్పుడు బాగానే ఉంటాయి కానీ, పిల్లలు వీటికి అలవాటు పడ్డారంటే భవిష్యత్తులో ఎన్నో సమస్యలను ఎదుర్కో వాల్సి వస్తుంది . .

బేకరీలు, ఫాస్ట్‌ ఫుడ్స్‌ సెంటర్లలో లభించే చిప్స్‌, సమోసాలు ,పేస్ట్రీలు లాంటి పధార్థాలు పిల్లల నోటికి రుచిగా అన్పించి పదే పదే వాటిని

తినేందుకు ఇష్టపడతారు. ఇలా వారు రోజూ ఫాస్ట్‌ ఫుడ్స్‌ తీసుకోవడం వల్ల, అవి వారి జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని కలుగజేసి,

అనేక అనర్థాలకు దారి తీస్తాయి . ఈ ఫాస్ట్‌ ఫుడ్స్‌కు అలవాటు పడిన పిల్లలు తరచూ అనారోగ్య సమస్యలకు గుర వడమే కాక, వారిలో

క్రమేణా ఊబకాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది . డీప్‌ ఫ్రై చేసే పదార్థాలలో ట్రాన్స్‌ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయనీ, వాటి

శాతం శరీరంలో అధి కమైతే భవిష్యత్తులో గుండెపోటు రావడం కూడా ఖాయం. ఫాస్ట్‌ ఫుడ్స్‌ అప్పుడప్పుడు తీసుకుంటే ఫర్వాలేదు కానీ

అదేపనిగా రోజూ తినకూడదు .ఫాస్ట్‌ ఫుడ్స్‌ కంటే పిల్ల లకు సీజనల్‌గా వచ్చే పండ్లనన్నింటినీ పిల్లలకు పెడితే మంచి పోషకవిలు వలు

చేకూరి, అన్నిట్లో చురుకుగా ఉంటారని పేర్కొంటున్నారు వారు. రోజూ క్రమం తప్పక లంచ్‌, డిన్నర్‌ తర్వాత ఒక అరటిపండును

తీసుకోవడం ఎంతో మంచిదని, ఫాస్ట్‌ ఫుడ్స్‌ కంటే పండ్లే మంచి ఆహారము .

ఈ లెక్కల్ని పరిశీలించి ప్రజలు ఇకనైనా ముతక ధాన్యాల పదార్థాల్ని సజ్జ, రాగి, పొట్టు గోధుమలు, దంపుడు బియ్యం, మొలకెత్తిన

పెసలు, శనగలు, తినడం నేర్చుకుంటే శరీర ఆరోగ్యానికి ఏ ఢోకా వుండదు. ''ఫాస్ట్‌ఫుడ్స్‌కు వీడ్కోలు, దేశీయ ముతక ధాన్యాల

పదార్థాలకు స్వాగతం''
  • ======================
Visit my Website - Dr.Seshagirirao...


కోలా పానీయాలు-మన ఆరోగ్యము ,Cola drinks and our health



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
  • సుప్రసిద్ధ కూల్ డ్రింక్ బ్రాండ్ కోకొ-కోలా తన 125 వ ఏడాదిలోకి అడుగుపెట్టింది.మొదట శక్తినిచ్చే పానీయంగా. తర్వాత కాలక్రమంలో కూల్ డ్రింక్ గా విశేష ప్రాచుర్యం పొందిన కోక్............కోక ఆకులూ కోక గింజలతో తయారు చెయ్యడం వల్ల ఈ పేరు వచ్చింది.అట్లాంటాకు చెందిన వ్యాపారవేత్త ఆసా గ్రిగ్స్ 1888 లో షుమారు లక్ష రూపాయలు వెచ్చించి కోకో కోలా బ్రాండ్ ను కొనుగోలు చేసాడు. ప్రారంబంలో రూపొందించిన రేసిపీతో నే ఇప్పటికీ కోక్ తాయారు చేస్తున్నారు.ఈ ఫార్ములాను కంపెని అత్యంత రహస్యంగా కాపాడుతుంది.రెసిపి ఫార్ములాను మొత్తం కంపెనీలో ఇద్దరికీ మాత్రమే తెలుపుతుంది.వారిద్దరూ ఏకకాలంలో విమాన ప్రయాణాలు,కలిసితిరగడం పూర్తిగా నిషిద్దం ఏదైనా ప్రమాదం జరిగినా కనీసం ఒక్కరైన బతికి బట్టకట్టాలని కంపెని ఉద్దేశ్యం.ఫార్ములా రహస్య పత్రాల ఒకేఒక కాపీని అట్లాంటా లోని ఓ బ్యాంకు లో భద్రపరిచారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1200 కోక్ బాట్లింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయి.కోక్ ప్రారంబమైన ఏడు దశాబ్దాల తర్వాత కాని కొత్త ఫ్లేవర్ డ్రింకులు ప్రారంభం కాలేదు.కంపెని తొలిరోజుల్లో రోజుకు తొమ్మిది గ్లాసుల పానీయం అమ్ముడు పోతే ఇప్పుడు రోజుకు 170 కోట్ల డ్రింకులు అమ్ముడుపోతున్నాయి.ప్రస్తతం కంపెని నుంచి 500 బ్రాండ్ లతో 3300 రకాల పానీయాలు తయారు ఆవుతున్నాయి.చైనా బాషలో కోకో అంటే "నోటిని ఆనందంగా ఉంచేది"అని అర్ధం.ప్రపంచంలో ఉన్న మొత్తం కోక్ బాటిళ్ళను ఒక దాని తర్వాత ఒకటిగా పేర్చుకుంటూ వెళితే 1677 సార్లు భూమికి చంద్రుడికి మద్య తిరిగినంత దూరం ఉంటుంది.. ప్రపంచం మొత్తం మీద ఓ కే అనే పదం తర్వాత కోక కోలా నే ఎక్కువమందికి పరిచయం ఉన్న పేరు.ఇప్పటివరకు కోక్ నాలుగు లక్షల కోట్లు బాటిళ్ళు తాయారు చేసింది.కంపెని కేవలం సిరప్ మాత్రమే తాయారు చేస్తుంది.దాన్నిబాట్లర్స్ కు పంపితే వాళ్ళు మిగతా పదార్ధాలను కలిపి విక్రయిస్తారు.

  • కోక్, పెప్సి, 7 అప్, మిరిండా, ఫాంటా, తమ్స్ అప్, లిమ్కా, మరియు స్ప్రైట్. భారతదేశములో తయారయిన పెప్సి యొక్క సీతాల పానీయాలు.
భారతేదేశములో శీతల పానీయాల మార్కెట్ కు ఎటువంటి నియంత్రణ లేదు. 1954 నాటి ఆహార కల్తి చట్టంలో శీతల పానీయాలు చేర్చబడిలేదు. ఆగుస్ట్ 2003కు ముందు అమలులో ఉన్న BIS నియమాలలో శీతల పానీయాలలో పురుగుమందు ఎంత మేరకు ఉండవచ్చో అని ఎటువంటి నియమాలు లేవు. అయితే పురుగుమను ఎంత మేరకు ఉండవచ్చని వివిధ సంస్థలు కొన్ని నియమాలను రూపొందించాయి. తాగే నీళ్ళలో గరిష్టంగా 0.1 పార్ట్స్ పెర్ బిలియన్ వరకు పురుగుమందులు ఉండవచ్చని, అలగైతేనే అవి మనుషులకు హాని ఉండదని స్పష్టం చేసాయి. ఆల్డ్రిన్, డయల్డిన్, హేప్టాక్లోర్ ఎపోక్సైడ్ వంటి పురుగుమందులకు ఇంకా తక్కువగా అనగా గరిష్టంగా 0.1 పార్ట్స్ పెర్ బిలియన్ వరకు మాత్రమె ఉండవచ్చు.

  • జాగ్రత్తలు :
శీతల పానీయాలు విషపూరితమనీ, వాటిని తాగడం వల్ల ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతింటాయని మనము తెలుసుకోవాలి ,దానివల్ల కేన్సర్‌, కాలేయం, మూత్రపిండాలు, జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు సంభవిస్తాయని గుర్తించాలి .

విదేశీ కంపెనీలచే తయారై మన దేశ ప్రజల ఆర్థిక, ఆరోగ్య నష్టాలు, కష్టాలకు శీతల పానీయాలు కారణమవుతున్నాయని జెవివి రాష్ట్ర వ్యవస్థాపక సభ్యులు డా.వి.బ్రహ్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. డా.బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ కూల్‌డ్రింక్స్‌ తాగడం వలన ఎవరికి లాభమని ప్రశ్నించారు. విదేశీ శీతల పానీయాలు ఎందుకు తాగకూడదో అనే అంశానికి బలమైన శాస్ర్తీయ ఆధారాలు మనముందు ఉన్నాయన్నారు. కాగా సినీతారలు, క్రీడాకారులు కోట్ల రూపాయలు పారితోషకంగా తీసుకుంటూ కూల్‌డ్రింక్స్‌ను తాగమని ప్రచారం నిర్వహించడం స్వార్థపూరితమేగాక బాధ్యతారాహిత్యమన్నారు.


రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటీవ్‌ మెడిసిన్‌(ఐపిఎం) వారు థమ్స్‌అప్‌, లిమ్కా, పానీయాల నమూనాలను సేకరించి మైక్రో బయోలజి పరీక్షలు జరిపి అందులో రకరకాల రోగాలు తెచ్చే బ్యాక్టీరియా మోతాదుకు మించి చాలా ఎక్కువగా ఉందని తేల్చి చెప్పారన్నారు. శీతల పానీయాలు తయారు చేసే సంస్థలు వాటిని రవాణా చేసే విషయంలో, నెలల తరబడి నిల్వ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పట్టించుకోవడం లేదన్నారు. దీని వల్ల బ్యాక్టీరియా సులువుగా వృద్ధి చెందుతుందన్నారు. శీతల పానీయాలకు వాడే రంగులు కూడా మోతాదు పరిమితులకు లోబడి వాడాలని, లేనిపక్షంలో అనారోగ్య కారకాలు వృద్ధి చెందుతాయన్నారు. కేరళలోని పాలక్కాడ్‌ జిల్లాలో ప్లాచిమడలో ఉన్న కోకో కోలా కంపెనీ విసిరి పారేస్తున్న వ్యర్థ పదార్థాలలో క్యాన్సర్‌ కారకమైన కాడ్మియం అనే లోహ అవశేషాలు అధిక మొత్తంలో అంటే 201.8 మిల్లీ గ్రాములు ఉన్నట్లు తేలిందన్నారు.


జెవివి జిల్లా ప్రధానకార్యదర్శి సి.యాగంటీశ్వరప్ప మాట్లాడుతూ పిహెచ్‌ విలువ ప్రకారం కూల్‌డ్రింక్స్‌ టాయిలెట్‌ క్లీనింగ్‌ యాసిడ్స్‌ కన్నా గాఢమైనవన్నారు. మన పార్లమెంటులో వీటిని నిషేధించారని, కొన్ని యూనివర్శిటీలలో వాడడం లేదన్నారు. ప్రకటనల ద్వారా పెప్సీ, కోక్‌ కంపెనీలు ప్రజలకు తప్పుడు సంకేతాలను అందిస్తున్నాయని ఆరోపించారు. శీతల పానీయాల వల్ల మధుమేహం, ఊబకాయం, ఎముకలు గుల్లబారడం వంటి జబ్బులు రావచ్చని నిపులైన వైద్యులు చెబుతున్నారన్నారు.


కొన్ని కోలా పానీయాలు, మరియు చాక్ లెట్లు ఈ ఎసిడిటీని ఇంకా ఎక్కువ చేస్తాయని మరచిపోవద్దు. కనుక కూల్ డ్రింక్స్ ఇతర చిరుతిళ్ళు తగ్గించండి.

కోలా పానీయాలు, రసాయనపూరితాలు, అయినా అందరి దృష్టి ఎక్కువ వీటిపైనే వుంటుంది. స్లో పాయిజన్‌ లాంటి ఈ తరహా పదార్థాలు పానీయాలు, ఎక్కువగా తీసుకుంటే కోరి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది.

బీర్, కోలా వంటి కార్బోనేటేడ్ పానీయాలు కూడా గ్యాస్ కి కారణం.

  • కోలాతో క్లీనింగ్ :
కూల్‌డ్రింక్ అనగానే కోలా సీసాలు కళ్ల ముందు కదలాడుతుంటాయి. కోలా బాటిల్ దొరగ్గానే తాగేయడం కాకుండా దాంతో బోలెడు పనులు చేసుకోవచ్చు. మొండి మరకల్ని వదలగొట్టడంలో కోలా తనకు తానే సాటి అంటోంది.

వంటింట్లో మాడిన వంటసామాన్లు త్వరగా శుభ్రం కావు. అలాంటి పాత్రలో అర కప్పు కోలా వేసి ఓ పదినిమిషాల తర్వాత కడిగితే పాత్రకి పట్టుకున్న మాడు వెంటనే వదిలిపోతుంది. అలాగే స్టీలు సామాన్లపై పేరుకుపోయిన తుప్పు మరకల్ని కూడా కోలా ఇట్టే తొలగిస్తుంది. ఎక్కడైతే తుప్పు మరకలు ఉంటాయో...అక్కడ ఐదారు చుక్కల కోలా పోసి ఓ పావుగంట తర్వాత స్పాంజ్‌తో గట్టిగా తుడిస్తే వెంటనే తుప్పు మరకలు పోతాయి. అలాగే బాత్‌రూమ్‌లలో వాడే టబ్బులు సున్నం మరకలతో ఉంటాయి.

అలాంటి మరకల్ని కూడా కోలా ఇట్టే పోగొడుతుంది. టబ్బులపై కోలా నీళ్లు చల్లి పదినిమిషాల తర్వాత బ్రష్‌తో రుద్దితే కొత్త టబ్బుల్లా తయారవుతాయి. సన్నటి దుమ్ము పట్టిన గాజు అద్దాలను కూడా కోలాతో శుభ్రం చేసుకోవచ్చు. ఒక మగ్గులో ఒక కప్పు కోలా, రెండు కప్పుల నీళ్లు పోసి అందులో బట్టని ముంచి గట్టిగా పిండి ఆ బట్టతో అద్దాలను తుడిస్తే తళతళలాడుతాయి. ఇవన్నీ ఒకెత్తయితే...బట్టలపై ఉండే మరకలు మరింత ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా నూనె మరకలు.

కొన్నిసార్లు రక్తపు మరకలు కూడా పోవు. ఈ రెంటికీ కోలా మంచి డిటర్జెంట్‌గా ఉపయోగపడుతుంది. బట్టల్ని నానబెట్టేముందు డిజర్జెంట్ నీళ్లలో రెండు కప్పుల కోలా కూడా పోయాలి. లేదంటే వాషింగ్ మిషన్‌లో వేసినా పరవాలేదు. నూనె, రక్తపు మరకలు త్వరగా వదిలిపోతాయి. కేవలం తాగడం కోసమే అనుకునే కోకో కోలా వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలియక చాలామంది బాటిల్ దొరగ్గానే పూర్తిగా తాగేస్తారు. ఈసారి కొద్దిగా కోలాని మిగిల్చి క్లీనింగ్‌కి వాడి చూడండి.
  • ======================
Visit my Website - Dr.Seshagirirao...


Wednesday 29 August 2012

palleru,పల్లేరు



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

  • పల్లేరు అందరికీ తెలిసిన మూలిక. దీనిని ఆయుర్వేదంలో గోక్షుర అంటారు.(aster, daisy, or sunflower family- Acanthospermum hispidum) English meaning of palleru =thorny creeping plant called Pedalium murex)» దీని ముళ్లు వల్ల పశువులకు అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది.దీనిలో పెద్దవాటిని ఏనుగు పల్లేరు అంటారు. సాధారణంగా ఇసుక నేలల్లో, ముళ్లతో కూడి కనిపించే ఈ మొక్క విచిత్రంగా ముల్లు కంటే ఎక్కువగా బాధించే మూత్ర సంబంధపు ఇన్‌ఫెక్షన్లను అమోఘంగా తగ్గించగలదు. అలాగే దీనిలోని హార్మోన్ల అంశం వల్ల దీనికి ప్రజనన వ్యవస్థను శక్తివంతం చేసి లైంగిక దోషాలను తగ్గించగలిగే శక్తి అబ్బింది. దీనికి మూత్రాన్ని జారీచేసే శక్తి ఉన్నప్పటికీ, నీరుడు మందుల్లాగా ఇది చర్మాన్ని పొడిగా మార్చదు. దీనిలోని పోషణ అంశాలు శే్లష్మపు పొరలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడి చర్మాన్ని పొడిబారకుండా కాపాడతాయి. పైగా ఇది హస్తపాదాల దురదలను అమోఘంగా తగ్గించగలదు.

ఆయుర్వేద గుణకర్మలు
  • మూత్రవిరేచన (మూత్రాన్ని జారీ చేస్తుంది)
  • మూత్రకృఛ్రఘ్న (మూత్రంలో నొప్పిని తగ్గిస్తుంది)
  • అశ్మరీహర (మూత్ర వ్యవస్థలో రాళ్లను కరిగిస్తుంది)
  • భేదన (శరీరంలో సంచితరమైన దోషాలను తొలగిస్తుంది)
  • వేదనాస్థాపన (నొప్పిని తగ్గిస్తుంది)
  • శోథహర (వాపును తగ్గిస్తుంది)
  • వృష్య (కామజ్వాలను పెంచుతుంది)
  • వాజీకరణ (లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది)
  • శుక్రశోధన (శుక్రకణాల దోషాలను సరిదిద్దుతుంది)
  • రక్తశోధన (రక్త దోషాలను సరిచేస్తుంది)
  • బృంహణ (శారీరక బరువును పెంచుతుంది)
  • బల్యం (శారీరక బలాన్ని పెంచుతుంది)
  • త్రిదోషహరం (మూడు దోషాలను తగ్గిస్తుంది)

పరిశోధిత విశేషాలు

  • డైయూరిటిక్ (మూత్రాన్ని జారీ చేస్తుంది)
  • లితోట్రిప్టిక్ (రాళ్లను కరిగిస్తుంది)
  • యాఫ్రోడైజియాక్ (లైంగిక కేంద్రాలను ఉత్తేజపరుస్తుంది)
  • రిప్రొడక్టివ్ టానిక్ (జననేంద్రియాలను శక్తివంతం చేస్తుంది)
  • నర్వైన్ (నరాలను శక్తివంతం చేస్తుంది)
  • యాంటీ స్పాజ్‌మోడిక్ (అంతర్గత నొప్పిని తగ్గిస్తుంది)
  • ఎనబాలిక్ (జీవక్రియకు తోడ్పడుతుంది)

గృహ చికిత్సలు
  • ఒక చిటికెడు పల్లేరుకాయల చూర్ణాన్ని, ఒక టీస్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని ఒక కప్పు పాలకు కలిపి మరిగించి, వడపోసుకొని పడుకునే సమయంలో తాగితే మగవాళ్లలో లైంగిక బలహీనత తగ్గుతుంది. ఇలాగ కనీసం పది పదిహేను రోజులు వాడాల్సి ఉంటుంది.
  • పల్లేరు చెట్టు బెరడుతో కషాయం తయారుచేసుకొని ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా ఉదయం, సాయంకాలం తాగితే పిత్తప్రకోపం వల్ల వచ్చిన తలనొప్పి తగ్గుతుంది.
  • పల్లేరు పువ్వుల ముద్దను ఎండబెట్టి, చూర్ణంగా దంచి, రెండు గ్రాముల మోతాదుగా, రెండు మూడు ఎండు ద్రాక్ష పండ్లతో కలిపి రోజుకి మూడుసార్లు పది పదిహేను రోజులు క్రమం తప్పకుండా సేవిస్తే ఆయాసం, ఉబ్బసం వంటివి తగ్గుతాయి.
  • పల్లేరు మొక్కలు కాయలతో సహా తెచ్చి కచ్చాపచ్చాగా దంచి ఒక కప్పు మేక పాలకు కలిపి నానబెట్టి, మూడు గంటల తరువాత కొద్దిగా నీళ్లు కలిపి, దంచి గుడ్డలో వేసి పిండి, రసం తీయండి. ఈ రసాన్ని ఒక టీ స్పూన్ తేనెతో తాగండి. ఇలా కొంతకాలంపాటు చేస్తే మగవాళ్లలో సంభోగ శక్తి పెరుగుతుంది.
  • పల్లేరు కాయలు, అశ్వగంధ వేర్లు వీటి సమభాగాల సూక్ష్మ చూర్ణాన్ని అర టీస్పూన్ మోతాదుగా, రెండు టీ స్పూన్ల తేనెతో కలిపి రోజుకి రెండుసార్లు తింటూ, పావు లీటర్ పాలను తాగుతూ ఉంటే కొద్ది రోజుల్లోనే క్షయ వ్యాధి, దగ్గు, దౌర్బల్యం ఇలాంటి వ్యాధుల్లో అమితమైన ఫలితం కనిపిస్తుంది.

--Courtesy with డా. చిరుమామిళ్ల మురళీమనోహర్(Ayurvedic physician)
  • ====================
Visit my Website - Dr.Seshagirirao...


Sunday 15 July 2012

యాలకులు ,ఇలద్వయ,Cardimom








పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.




  • యాలకులు ,ఇలద్వయ,Cardimom----యాలకులు: తీపి పదార్థాలకు మంచి రుచితో పాటూ సువాసన వచ్చేందుకు వీటిని ఎక్కువగా వాడుతుంటాం. కానీ ఇవి కెలొరీలను సులువుగా కరిగిస్తాయి. జీవక్రియల పనితీరు సరిగ్గా ఉండేలా చేస్తాయి. కొద్దిగా వాడినా సరే, కొవ్వు కరిగేలా చేసి, బరువు పెరగకుండా చూస్తాయి. కాబట్టి మీరు తీసుకునే కాఫీ, టీలల్లో ఈ పొడిని కొద్దిగా చల్లుకోవడం మరవకండి.


మన వంటిల్లే ఒక వైద్యశాల. అందులో మనం వాడే వస్తు వులు సమస్తం ఆరోగ్యహేతువులే. వాటిలో అత్యధికంగా వాడబడేది ఇలద్వయ. అంటే వాడుకలో దీనినే యాలకులు అని అంటాం. దీని శాస్త్రీయనామం ఇలటేరియా కార్డిమమ్‌. సుగంధ ద్రవ్యాల్లో అత్యంత సువాసన గల వస్తువుల్లో ఇదే ప్రధమ స్థానంలో ఉంటుంది. ఇది సిటామినేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇది సాధారణ మొక్కలకి భిన్నంగా రసాయ నాలు, మనసుకి ఉల్లాసాన్ని కలిగించే తైలంతో చాలా విల క్షణంగా ఉండే ఔషధ మొక్క ఇలద్వయం. వీటిలో చిన్న యాలకులు, పెద్ద యాలకులు అని రెండు రకాలు ఉంటాయి. ఈ రెండూ ఒకే విధమైన ఔషధగుణాలు కలిగివుం టాయి.




  • ఔషధగుణాలు


యాలకులు అనాదిగా ఆయుర్వేద శాస్త్రీయ వైద్యవిధానంలో వాడకంలో ఉన్నట్టు కరక సంహిత, సుశ్రుత సంహిత అనే గ్రంధాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా వీటినుండి తయారైన ఇలాదికర్న, ఇలాదివతి, ఇలాదిక్వత, ఇలాదిమొదక, ఇలాద్యారిష్ట, శీతోఫలాదికర్న, అరవిందసవ వంటి ఔషధాలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. శరీరానికి చలువచేసే గుణాలు ఎక్కువగా ఇందులో ఉండటం మూలంగా వీటిని అనేక పానీయాల్లో, వంటకాల్లో వినియోగించడం అనవాయితీగా వస్తోంది.




  • ఉపయోగాలు



  1. దీనితో తయారుచేయబడిన అంతవర్ధ ప్రసమన, ఉబ్బసం వ్యాధితో బాధపడేవారికి దివౌషధంగా పని చేస్తుంది.

  2. ఒళ్ళు నొపðలకి, సిరోవిరికన అనే ఔషధం, నాసికా చికిత్సకి అనాదిగా వాడుతున్నట్టు వైద్య సంహితల్లో పేర్కొన్నారు. యాలకులు బాగా నూరి నుదురుకి లేపనం చేస్తే తల నొప్పి చిటి కెలో మటుమాయమవు తుంది.

  3. అలాగే యాలకుల కషా యం సేవిస్తే దగ్గు నుంచి మంచి ఉపశమనం ఉం టుంది.

  4. యాలకుల గింజలు నోటితో నములుతుండటం వల్ల క్రిములు నశించడమే కాకుండా నోటి దుర్వాసనను అరికడుతుంది. దంతాలను, చిగుళ్ళను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.

  5. యాలకులు నూరి పేస్ట్‌గా చేసి గాయా లకి, పుండ్లకి పైలేపనంగా వాడితే వెంటనే మానిపో తాయి.

  6. వీటిని నములుతూ ఉండటం వల్ల ఉదర సంబంధ వ్యాధులు ఉపశమించడమే కాక కడుపులో ఏర్పడ్డ పుండ్లు (అల్సర్స్‌) కూడా తగ్గుముఖం పడ తాయి.

  7. చాలా రకాల రుగ్మత లకి ఇలద్వయ (ఇలాచీ-యాలకులు) ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.

  8. యాలకుల తైలం పంటినొ ప్పిని నివారించి, క్రిముల్ని సమూలంగా నాశనం చేస్తుంది.

  9. దీని కషాయం సేవిస్తే వాంతులు అరికట్టి, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది.

  10. యాలకుల పొడి, సొంటిపొడి 0.5గ్రా్ప్పచొపðన సమపాళ్ళలో తయారుచేసుకుని అందులో కొంచెం తేనె కలిపి తీసుకుంటే, కఫాన్ని నిర్మూలించి, దగ్గు నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

  11. ఆస్త్మా రోగులు యాలకులు, జాతిఫల, కుంకుమ పువ్వు, వంశలోకన, నాగకేసర, శంఖజీరక సమ పాళ్ళలో నూరి తేనెతో కలిపి సేవిస్తూవుంటే ఆ వ్యాధి నుంచి మంచి ఉపశమనం ఏర్పడుతుంది.


ఇలా అన్ని రుగ్మతలకీ ఉపయోగపడే ఈ ఇలద్వయ సంజీవని వంటిదని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. దీనిని ఇంటి ఆవరణలో కూడా పెంచుకుంటే అందమైన పుష్పాలతో, సంవత్సరం పొడవునా ఉండే పచ్చని ఆకులతో ఇంటికి శోభనివ్వడమేకాకుండా మంచి ఔషధం కూడా మన పెరటిలో ఉన్నట్టే...





  • ========================


Visit my Website - Dr.Seshagirirao...

Saturday 26 May 2012

మహానారాయణ తైలం , Mahanarayana Thailam



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


ఈ తైలం తయారీలో 'శతావరి' అనే మూలికను ప్రధానంగా వాడతారు. శతావరికి నారాయణి అనే పర్యాయపదం ఉండడం వల్ల ఈ తైలాన్ని నారాయణ తైలమని, మహానారాయణ తైలమని పిలుస్తారు. చర్మంపైన అభ్యంగ (మసాజ్) రూపంలోగానీ, కడుపులోకి తీసుకోవడానికి గానీ ఈ తైలాన్ని వాడతారు. అయితే తాగడంలో ఇబ్బంది ఏమైనా ఉంటే వస్తి (ఎనిమా) రూపంలోనూ శరీరానికి అందించవచ్చు. చెవి, ముక్కు వ్యాధుల్లో, ఆ భాగాల్లో వేసే చుక్కల మందుగా కూడా ఈ తైలం వాడుకలో ఉంది.

తైలంలో...ఇందులోని అంశాలు మూడు రూపాల్లో ఉంటాయి .
  • కల్కాంశం :
దోష్టు, ఏలకులు, మంచిగంధం, బలా మూలాలు, జటామాంసీ, ఛఠీలా, సైందవ లవణం, అశ్వగంధ, వచా, రాస్నా, సోంపు, దేవదారు, సుగంధిపాల, పాఠా, మాషపర్ణీ, ముద్గపర్ణీ, తగర వీటన్నిటినీ పొడిచేసి, నీటితో కలిపి ముద్దగా (కల్కం) చేసి పెట్టుకోవాలి.
  • తైలాంశం:
తయారు చేసుకున్న ముద్ద తూకానికి నాలుగు రెట్లు నువ్వుల నూనె తీసుకోవాలి.
  • ద్రవాంశం:
అశ్వగంధ, బలామూలాలు, బిల్వమూలాలు, బృహతీద్వయం, పల్లేరు, సంబరేణు, పాఠామూలాలు, పునర్నవా, ముద్గ, రాస్నా, ఏరండమూలం, దేవదారు, ప్రసారణీ, అరణీ ఈ మూలికలకు నీళ్లు చేర్చి సిద్ధం చేసిన కషాయద్రవం ఒక భాగం, శతావరీ రసం ఒక భాగం, పాలు ఒక భాగం. ఇవన్నీ కలిపి తైలాంశానికి మళ్లీ నాలుగు రెట్లు తీసుకోవాలి. వీటన్నిటినీ ఒక పెద్ద పాత్రలో కలిపేసుకుని, ద్రవాంశం పోయి, తైలాంశం మాత్రమే మిగిలేలా పొయ్యి మీద ఉడికించాలి.
  • తైలగుణాలు:
తైలం తయారీలో ఉపయోగించిన ఈ మూలికలన్నీ శరీరంలో విషమించే వాతదోషాల్ని ఉపశమింపచేసేవి, శక్తిని ప్రసాదించేవి. మూలికల గుణాలను శరీరానికి అందించడంలో తైలం ఒక వాహకంలా పనిచేస్తుంది. ఈ తైలంతో చర్మం మీద మర్దన చేసినప్పుడు చేష్టానాడులు, రక్త వహి సిరా ధ మనులు, స్నాయు, పేశీకండరాలు ప్రేరణ పొంది మరింత శక్తివంతమవుతాయి.

బలహీనపడిన అవయవాలు బలపడి తమ విధులను శక్తివంతంగా నిర్వహిస్తాయి. మర్ధనలోని హస్తలాఘవం (మానిప్యుటేషన్ స్కిల్స్) ప్రభావంతోనే ఈ శరీర క్రియలు సాధ్యమవుతాయి. ఫిజియోథెరపీలో వివిధ తైలాలతో చేసే 'మసాజ్' ప్రాచుర్యానికి రావడానికి ఈ విధానమే కారణం.

ఈ మసాజ్‌కు నారాయణ తైలం కూడా తోడైతే ఫలితాలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అవయవాల శక్తిసామర్థ్యాన్ని పెంచడంతో పాటు నొప్పులను త గ్గించడంలో నారాయణ తైలానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కేవలం పైపూతగానే ఈ తైలం ఎక్కువగా వాడుకలో ఉంది.

అయితే ఈ తైలాన్ని కడుపులోకి తీసుకున్నప్పుడు ఇది నొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే చెవిలో చుక్కలుగా వేయడం వల్ల చెవినొప్పి, ముక్కులో వేయడం వల్ల తలనొప్పి, తలకు సంబంధించిన మరికొన్ని ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. రోగి పక్షవాతం వంటి సమస్యలతో కదల్లేని స్థితిలో ఉన్నప్పుడు మర్ధన గానీ, కడుపులోకి ఇవ్వడం గానీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి స్థితిలో నారాయణ తైలాన్ని ఎనీమాగా పేగుల్లోకి ఎక్కించ వచ్చు.ఇలా చేయడం వల్ల పేగుల్లోని పొర (మ్యూకోజా) ద్వారా ఔషధ గుణాలు శరీరానికంతా వెళ్లే అవకాశం ఉంది.

  • ఏ వ్యాధులకు..?
వాత వ్యాధులకు, కీళ్లు, కండరాల నొప్పులను తగ్గించడంలో నారాయణ తైలానికి ప్ర«థమ స్థానం ఉంది. వీటితో పాటు పక్షవాతం, అర్థత వాతం (ఫేషియల్ పెరాలిసిస్), దవడ-మెడ పట్లు, భుజాలు పడిపోవడం (బ్రేకియల్ పాల్సీ) కటిశూల (డిస్క్, బ్యాక్‌పెయిన్) పార్శ్వశూల, కుంటడం, నడుము వంగిపోవడం, గృధసీ వాతం (సయాటికా) వంటి సమస్యలను తగ్గించడంలోనూ ఈ తైలం బాగా పనిచేస్తుంది.

వీటితో పాటు అవయవాలు ఎండిపోవడం, చెవినొప్పి, వినికిడి లోపం, వృషణాల నొప్పి, తలనొప్పి, కండరాలు పట్టేయడం వంటివి ఈ తైలంతో తగ్గుముఖం పడతాయి. సర్వైకల్, లుంబార్ స్పాండిలోసిస్ ఉన్నవారు మర్ధనంతో పాటు కడుపులోకి కూడా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వస్తి (ఎనిమా) కూడా చేయించుకుంటే లామినెక్టమీ శస్త్ర చికిత్స అవసరమే లేకుండా పోతుంది.

పైన పేర్కొన్న అన్ని వ్యాధుల్లోనూ నారాయణ తైలంతో మర్ధన చేసి ఆ తరువాత వేడినీళ్లతో స్నానం చేయడం గానీ, నొప్పిగా ఉన్న చోట వేడినీళ్లతో కాపడం పెట్టడం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఫలితం రెట్టింపుగా ఉంటుంది.


  • courtesy with : blossomera.blogspot.in/
  • =======================
Visit my Website - Dr.Seshagirirao...

Sunday 20 May 2012

Sun flower,సన్‌ ఫ్లవర్‌,పొద్దు తిరుగుడు పువ్వు



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


  • ప్రకృతిలో జనిస్త్తున్న పుష్పాలు మానవాళిని కనువిందు చేస్తుంటాయి. అందులోనూ సూర్యుడితో పాటు తిరిగే పొద్దు తిరుగుడు పచ్చదనంతో పాటు భారీ తనం కూడా కంటికింపుగా ఉంటుంది.ఆర్నికా పుష్ప జాతికి చెందిన ఈ పొద్దు తిరుగుడు దాదాపు 30 ఉప జాతులుగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉంది. హెర్బాసియస్‌ ప్రజాతికి చెందితీ పుష్పాలు మృదువైన పూల రెక్కలతో పాటు వైవిధ్య భరితం గా కాస్త జుత్తు తగుతున్నట్లుంటే పత్రాలు కలిగి ఉండటం వీటి ప్రత్యేకత

సమశీతోష్ణ స్ధ్దితి ఉన్న దేశాలలో ఎక్కువగా దీనిని వాణిజ్య పంటగా పండిస్తున్నారు రైతులు. కేవలం నూనె తీసేందుకే కాకుండా వివిధ రసాయనిక ప్రయోగాలలో, మానవాళి వాడుతున్న మందుల్లోనూ వీటి వాడకం నిత్యం పెరుగుతండటంతో ఎక్కువ మంది వీటిని పండించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

  • బలమైన కాండాన్ని కలిగి ఉండి 10 నుండి 15 ఇంచ్‌ల పొడవాటి పుష్పాలు, పసుపు, నారింజ, రంగుల్లో దర్శనమిస్తాయి. ఆర్నికా జాతులు కొద్ది పాటి సువాసనలు మాత్రమే వెదజల్లిన తత్వాన్ని కలిగి ఉన్నా మానవాళికి ఉపయుక్తంగా ఉండే ఈ పొద్దు తిరుగుడు పుష్పాల మధ్యలో ఉండే వృత్తాకార భాగంనే వివిధ రకాలుగా వినియోగిస్తారు.

ఇక ఈ పొద్దు తిరుగుడు వెలువరించే వివిధ రసాయనాలు ఔషధ గుణాలు కలిగి ఉండటంతో ఆయు ర్వేద వైద్యంలో ప్రత్యేకత సంతరించుకుందనే చెప్పాలి. బెణుకులు, గాయాలు తగిలినపుడు మనం వాడుకునే లేపనాలు (ఆయింట్‌ మెంట్లు) తయారీలో సన్‌ ఫ్లవర్‌ని వినియోగిస్తున్నారు. ఈ మొక్కల వేళ్లలో ఉండే కినీకల్లీ సబ్కాటానియస్‌ రక్త కేశనాళాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు పరిశోధనల్లో వెల్లడి కావటంతో దీనిని క్రీడా కారుల అలసట, నీరసించి పోవటాల నుండి సత్వర ఉపశమనానికి వాడుతున్నారు. అలాగే వివిధ రకాల నొప్పుల నివారణకి ప్రయోజనకారిగా ఉండటంతో అందుకు సంబంధించిన మందుల తయారీ ల్లోనూ దీని వాడకం ఎక్కువైంది.

  • హౌమియో మందుల్లోనూ పొద్దు తిరుగుడు తన ఔషధతత్వాన్ని చూపిస్తోంది. హౌమియోలో అత్యం త కీలక భూమిక పోషించే టించర్‌ చిక్కబడకుండా ఉండేందుకు పొద్దు తిరుగుడు నుండి తీసిన రసాయనాలే చూస్తుంటాయి. మానవ శరీరంలో అనేక ధోష పూరిత లవణాలను బైటకు పంపించడంలో ప్రత్యేక లక్షణాలు ఇది కలిగి ఉందని వైద్య శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు. ఈ సన్‌ ఫ్లవర్‌ ఎంత ఉపయుక్తంగా ఉంటుందో తగు రీతిన జాగ్రత్తలు వహించక పోతే అంతే ప్రమాదకారి కూడా.. ఈ పూలను, ఆకుల్ని తాగినపుడు ఎంత ఆహ్లాదక రంగా ఉంటుందో తదుపరి శరీరానికి చికాకు పుట్టి స్తుంది. పూలలోని చిన్న చిన్న విత్తనాలను పొరపాటున నోటిలో వేసుకుంటే అది విషతుల్యమై ఉండటంతో ఆజీర్ణం, కడుపులో గ్యాస్‌ పెరగటం, అంతర్గత రక్తస్రావాలకు దారి తీస్తుంది. కొన్ని ఉప జాతు లు విషతుల్యం కాకపో యినా.. జీర్ణ ప్రక్రియపై ప్రభావం చూపిస్తాయి.

  • Courtesy with - సత్యగోపాల్ ‌@ అంధ్రప్రభ దిన పత్రిక ఆదివారము అనుబందము .

  • =========================
Visit my Website - Dr.Seshagirirao...

ఆకు కూరలు-మన ఆరోగ్యము ,Green leafy vegetables and our health








పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.





  • మనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్యవరాలలో ఆకు కూరలు చేసే అద్భుతాలెన్నో.... శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను ,విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ... నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది. ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండాతినే ఆహారాన్ని రుచి కరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి. ఆకు కూరలు వండుకునే ముందు ఖచ్చితంగా ఒకటికిరెండు సార్లు కడగటం మంచిది. ఎందుకంటే వాటిలో చేరే చిన్న చిన్న పురుగులు, ధుమ్మూ,ధూళి మనఆరోగ్యానికి హాని కలిగించ వచ్చు. అవసరమైతే ఆకు కూరలు కడిగేప్పుడు గట్టిగా ఉండే భాగాలను ఏరివేయండి. వీలైతే పొటాషియం పర్మాంగనేట్‌తో ఆకు కూరలు శుభ్రం చేస్తే మంచి ఫలితా లుంటాయి.


ఉదాహరణ (for example) కొన్ని ఆకుకూరలు --



  • మెంతికూర,

  • కరివేపాకు,

  • కొత్తిమీర,

  • తోట కూర,

  • తులసి,

  • గోంగూర,

  • బచ్చలి


ఇలా పలు రకాల ఆకుకూరలు వండేముందు కాస్త ఉప్పువేసిన మంచి నీటిలొ ముంచితే వాటిపై ఉండే క్రిమికీటకాలు, గుడ్లు, నాశనమవుతాయి. ఇవి తొందరగా నలిగే గుణం ఉండ టం వల్ల సలాడ్‌, సూపులుగా, చట్నీలుగా తీసుకోవచ్చు. ముఖ్యంగాఆకు కూర లు వండే సమ యంలోమూతలు పెట్టి వండండి. వీలైనంతవరకు ప్రెజర్‌ కుక్కర్‌లోనే వండేందుకు యత్నిస్తే... వాటిలోనిపోషకాలు మనకి అందుతాయి. అలాగే ఆకుకూరలు ఉడక పెట్టాక ఆందులోనీటిని పారేయకండి. కాస్తనిమ్మరసం, ఉప్పు,కలిపి సూప్‌గా తీసు కుంటే ఆరోగ్యానికి మంచిది.



ఆకుకూరలు తో మధుమేహానికి చెక్ ,
ఆకుకూరలు తినండి.. మధుమేహానికి చెక్ పెట్టండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆకుకూరలను తినడం వల్ల మధుమేహానికి దూరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది.

అంతేకాదు, ఆకుకూరలే కాకుండా రోజూ పల్లీలు, ఇతర డ్రై ఫ్రూట్స్‌ తీసుకునే వారిలో కూడా మధుమేహంతోబాటు ఇతర గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రతిరోజూ పల్లీలు తినేవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం ఇరవైవొక్క శాతం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. డ్రైఫ్రూట్స్‌ శరీరానికి అవసరమైన కొవ్వును అందిస్తూనే బరువును అదుపులో ఉంచుతాయని న్యూట్రీషన్లు అంటున్నారు.

ఆకుకూరల్లో కెలోరీలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ ఏదో ఒక ఆకుకూర తీసుకొనే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పధ్నాలుగు శాతాన్ని తగ్గించవచ్చంటున్నారు. కాబట్టి ఆహారం ఆకుకూరలు వారానికి మూడు సార్లు తీసుకుంటూ వుండండి. 


  • ========================


Visit my Website - Dr.Seshagirirao...