Pages

Labels

Blog Archive

Popular Posts

Showing posts with label రక్తపోటు అదుపులో ఉండేందుకు కొన్ని ఆహారపు చిట్కాలు. Show all posts
Showing posts with label రక్తపోటు అదుపులో ఉండేందుకు కొన్ని ఆహారపు చిట్కాలు. Show all posts

Tuesday, 2 July 2013

Food Tips for controling Blood pressure,రక్తపోటు అదుపులో ఉండేందుకు కొన్ని ఆహారపు చిట్కాలు





  •  




పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



 Food Tips for controling Blood pressure,రక్తపోటు అదుపులో ఉండేందుకు కొన్ని ఆహారపు  చిట్కాలు --


అధిక రక్తపోటుతో రక్తనాళాలు దెబ్బతినటం, పక్షవాతం, కిడ్నీజబ్బు వంటి ఇబ్బందులు పొంచి ఉంటాయి. అందువల్ల రక్తపోటును అదుపులో ఉంచుకోవటం ఎంతో అవసరం. క్రమం తప్పకుండా మాత్రలు వేసుకోవటం మానరాదు. ఇవే కాదు కొన్ని చిట్కాలూ రక్తపోటు అదుపులో ఉండేందుకు తోడ్పడతాయి.


కొబ్బరినీళ్లు: దాహం తీరటానికే కాదు. రక్తపోటు తగ్గటానికీ కొబ్బరినీరు ఉపయోగపడుతుంది. ఇందులో కేంద్ర నాడీవ్యవస్థను ప్రశాంతంగా ఉంచేందుకు, రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడేందుకు తోడ్పడే పొటాషియం దండిగా ఉంటుంది. సుమారు 600 మిల్లీలీటర్ల కొబ్బరినీరుతో 1,500 మి.గ్రా. పొటాషియం లభిస్తుంది.

* నువ్వులనూనె: ఇందులో ఆరోగ్యకరమైన బహుళ అంసతృప్త కొవ్వు ఆమ్లాలతో పాటు సిసమిన్‌ అనే రసాయనమూ ఉంటుంది. ఇవి రక్తనాళాల గోడలు వదులుగా ఉండేలా చేస్తూ హఠాత్తుగా రక్తపోటు పెరగకుండా చూస్తాయి. ఈ నూనెను అన్నం, సలాడ్ల మీద కొద్దిగా వేసుకొనీ తినొచ్చు.

* దాల్చినచెక్క: మసాలా దినుసుల్లో ఒకటైన దాల్చినచెక్కలోని వృక్ష రసాయనాలు గుండె కండరాలు, రక్తనాళాలు వదులుగా ఉండేందుకు దోహదం చేస్తాయి. ఇలా రక్తపోటు అదుపులో ఉండేందుకు తోడ్పడతాయి.

* ప్రకృతి దృశ్యాలు: పచ్చని ప్రకృతి దృశ్యాలను చూసినప్పుడు మెదడులో హాయిని కలిగించే అల్ఫా తరంగాలు పుట్టుకొస్తాయి. ఇవి కేంద్ర నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతాయి. రక్తపోటును పెంచే కార్టిజోల్‌ హార్మోన్‌ ఉత్పత్తినీ తగ్గిస్తాయి. కాబట్టి గోడ మీద ప్రకృతి దృశ్యాల చిత్రాలను అలంకరించుకోవటం మంచిది.

* నిటారుగా కూచోవటం: ముందుకు వంగి కూచున్నప్పుడు రక్తపోటు 16% వరకు పెరుగుతుంది. మన మెడలో ప్రశాంతతకు సంబంధించిన సందేశాలను మెదడుకు చేరవేసే నాడులుంటాయి. ముందుకు వంగటం వల్ల మెడలోని వెన్నుపాము, డిస్కుల మీదా ఒత్తిడి పడుతుంది. దీంతో ఆ భాగంలోని సున్నితమైన నాడులు నొక్కుకుపోయి వాటి పనితీరు మందగిస్తుంది. అందువల్ల వీలైనంతవరకు నిటారుగా కూచుంటే మంచిది.

* బంగాళాదుంపలు: బంగాళాదుంపలను తింటే రక్తపోటు అదుపులో ఉండేందుకు తోడ్పడుతున్నట్టు ఒక అధ్యయనంలో తేలింది. దుంపల్లో పొటాషియం, క్లోరోజెనిక్‌ ఆమ్లం, ట్రీప్టోఫాన్‌ దండిగా ఉంటాయి. ఇవి రక్తనాళాలు వదులుగా ఉండేందుకు దోహదం చేస్తాయి. అయితే బంగాళాదుంపలోని పోషకాలు చాలావరకు పొట్టులోనే ఉంటాయి కాబట్టి వీటిని పొట్టు తీయకుండా తినటం మంచిది.

* నెమ్మదిగా శ్వాస: నెమ్మదిగా, దీర్ఘంగా శ్వాస తీసుకోవటం వల్ల మహిళల్లో రక్తపోటు 14 పాయింట్లు తగ్గుతున్నట్టు బయటపడింది. ఈ ప్రక్రియ ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో రక్తనాళాలు వదులుగా అవుతాయి, రక్తపోటు అదుపులో ఉంటుంది.


  • =====================


Visit my Website - Dr.Seshagirirao...