Pages

Labels

Blog Archive

Popular Posts

Monday, 3 November 2014

Body and Nutrients,శరీరం మరియు పోషకాహారం

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


  •  









  •  Body and Nutrients,శరీరం మరియు పోషకాహారం



మన శరీరం ఒక యంత్రం లాంటిది. ఇంధనం లేకపోతే యంత్రం ఎలా పని చేయలేదో అలా మన శరీరం కూడ ఆహారం లేకపోతే పని చేయదు. మనం తీసుకొనే ఆహారం శరీరం సక్రమంగా పని చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తూ ‘ఇంధనం’ లా పని చేస్తుంది.

ఆహారం మన శరీరానికి ఈ క్రింది మూడు విధాలుగా ఉపయోగపడుతుంది.
1. శరీర నిర్మాణానికి:
మనం తీసుకున్న ఆహారం శరీర నిర్మాణానికి దోహద పడుతుంది. 2.7 కిలోల నుంచి 3.2 కిలోల మధ్య బరువుండే కొత్తగా పుట్టిన పాపాయి పెరిగి పెద్దయే సరికి 55 నుంచి 70 కిలోల బరువుకు చేరుకుంటాడు. అంటే ఈ ఎదిగిన బరువంత కూడా అతనికి తను పుట్టిన దగ్గరి నుంచి నిత్యం తీసుకొంటున్న ఆహారం ద్వారానే లభించుతుంది. దీనిని బట్టి తేలేది ఏమిటంటే ఆహారం యొక్క అతి ముఖ్యమైన ఫంక్షన్‌ శరీర నిర్మాణానికి సహకరించటం! పుట్టిన దగ్గరనుంచి పెరిగి పెద్దయేదాకా -అంటే అడల్ట్‌హుడ్‌ దాకా మీరు ప్రతిరోజు ఆహారాన్ని సరెైన పరిమాణంలో తీసుకుంటే అది మీ శరీరంలో అరిగిపోయిన కణజాలం స్థానంలో కొత్త కణాల్ని నిర్మించుతూ, మీ శరీరం సక్రమమైన రీతిలో ఎదుగుతూ ఆరోగ్యంతో విలసిల్లుతూ పరిపూర్ణస్థాయికి చేరుకొనేటట్లు చేస్తుంది.

2. శక్తిని చేకూర్చటానికి:
ఆహారం మన శరీరానికి అందజేసే రెండవ ఉపకరణం ఏమిటంటే - మన శరీరం చేసే సంకల్పిత, అసంకల్పిత చర్యలకు అవసరమైన శక్తిని అందించటం. సంకల్పిత చర్యలు అంటే ఇంటిపని నుంచి ఆఫీసు పని దాకా నిత్య జీవితంలో మనం తెలిసి చేస్తుండే - ప్రయత్నపూర్వకంగా చేసే పనులు.
అసంకల్పిత చర్యలు: అంటే మన ప్రయత్నం మన ప్రమేయం లేకుండా మన శరీరంలో యాంత్రికంగా జరిగిపోయే చర్యలు! ఉదాహరణకు గుండె కొట్టుకో వడం, జీర్ణం కావడం, శరీరంలో టెంపరేచరు క్రమబద్దీకరించబడటం మొదలెైనవి.

3.శరీర కార్యక్రమాన్ని క్రమబద్దీకరించటం:
మన శరీరంలో యాంత్రికంగా జరిగిపోయే, జరగాల్సిన, కార్యక్రమాల క్రమబద్ధీకరణ ఈ కోవలోకి వచ్చే చర్యలు:
గుండె కొట్టుకోవటం
కండరాల సంకోచవ్యాకోచాలు
నీటి సమతుల్యాన్ని కాపాడటం
రక్తం గడ్డ కట్టటం
శరీరం నుంచి వ్యర్థపదార్థాల్ని తొలగించటం మొదలెైనవి.
శరీరం సక్రమంగా ఆరోగ్యంతో ఉండాలన్నా, శరీరానికి అవసరమైన శక్తి సరిప డా లభించాలన్నా మనం అన్ని పోషక విలువలు కలిగిన సమతుల్యాహారాన్ని రెగ్యులర్‌గా తీసుకొంటూ ఉండాలి.
మన మనుగడకు అవసరమైన ఆహారం ద్వారా మనకు లభించే పోషక విలువలు:
కార్బోహైడ్రేట్స్‌
మాంసకృత్తులు
కొవ్వు పదార్థాలు
విటమిన్‌లు
ఖనిజ లవణాలు
నీరు
పీచు పదార్థం
సమతులాహారం

మీరు నోట్లో ఆహారాన్ని పెట్టుకున్నప్పుడల్లా ‘మానవ శరీరం’ అనబడే అత్యంత తెలివెైన రసాయన యంత్రాంగానికి మీరు రీ-ఫ్యూయల్‌ చేస్తున్నారన్నమాట! మన శరీరం పని చేయటానికి ఆహారం, నీరు - ఈ రెండూ అతి ముఖ్యమైన పోషకావసరాలు.మన శరీరంలోకి ప్రవేశించే ప్రమాదకరమైన బాక్టీరియాలతో పోరాటం సల్పటానికి, శరీరానికి అవసరమైన నీటి సమతుల్యతను కాపాడటానికి, ఇతరత్రా మరెన్నో శరీర ధర్మ నిర్వహణల కోసం ఆహారం ద్వారా లభించే అనేక రసాయనాలు శరీరానికెంతగానో అవసరమవుతాయి.

కొన్ని ఆహార పదార్థాలలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. కొన్నింటిలో తక్కువ పోషక విలువలు ఉంటాయి. అలాగని ఏ ఆహారాన్ని తీసి పారేయటానికి వీలులేదు. మనం ఎంత తింటు న్నామన్నది మాత్రమే కాదు. ఏమి తింటున్నామన్నది కూడా ముఖ్యమైన అంశమే.కొన్ని కొన్ని ఆహార పదార్థాలు కొన్ని కొన్ని వ్యాధుల్ని నిరోధించగలవు. నియంత్రించగలవు. ఇందుకు
ఉదాహరణ: పండ్లు, కూరగాయలు క్యాన్సర్‌ వ్యాధిని నిరోధించగలవు. ఆహార పదార్థాలలోని పీచు (ఫెైబర్‌) కొలెస్టరాల్‌ నియంత్రణకు సాయపడుతుంది. వృద్ధాప్యంలో వచ్చే ‘అస్టియోపొరాసిస్‌’ వ్యాధిని నిరోధించటానికి కాల్షియం అధికంగా లభ్యమయ్యే పాలులాంటి వాటిని తీసుకోవాలి. ‘ఆస్టియోపొరా సిస్‌’ కారణంగా ఎముకలు బోలుబారి తేలికగా విరుగుతాయి.

ఈ రకంగా...
శరీరారోగ్యానికి అవసరమైన ఇలాంటి అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకుం టూ, ప్రాధాన్యతనిస్తూ, మనం సక్రమమైన ఆరోగ్యంలో ఉండటానికి ఏ ఏ ఆహార పదార్థాలను ఏఏ మేర తీసుకోవాలన్న విషయమై అమెరికా శాస్త్రజ్ఞులు ‘ఫుడ్‌ గెైడ్‌ పిరమిడ్‌’ అన్న పేరుతో ఆహార నియమావళిని రూపొందించారు.

‘ఫుడ్‌ గెైడ్‌ పిరమిడ్‌’
ప్రకారం మనం: అన్నం, రొట్టె, బ్రెడ్‌ వగెైరాలు: వీటిని ఎక్కువగా వాడుకోవాలి. ఈ ఆహార పదార్థాలలో ఫెైబర్‌, ‘బి’ విటమిన్‌లు, ఖనిజలవణాలు పుష్కలంగా ఉండటమే కాకుండా కాంప్లెక్స్‌ కార్బొహైడ్రేట్స్‌ కూడా లభిస్తాయి.
పళ్ళు:వీటిలో కొవ్వు, ఉప్పు తక్కువగా ఉంటాయి. విటమిన్‌లు ‘ఎ’,‘సి’ లాంటివి అధికంగా లభిస్తాయి. పొటాషియం, మరికొన్ని ఖనిజ లవణాలు కూడా లభించటమే కాక ఫెైబర్‌ అధికంగా లభిస్తుంది. వీలెైనప్పుడల్లా తాజా పళ్ళను తినటం మేలు.
కాయగూరలు: వీటిలో కూడా కొవ్వు తక్కువగానూ, ‘ఎ’, ‘సి’ విటమిన్‌లు ఎక్కువగానూ లభిస్తాయి. ఫెైబర్‌, ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. మాంసం, చేపలు, చికెన్‌, గుడ్లు, జీడిపప్పు, వగెైరాలు: వీటిలో సాధారణంగా ప్రొటీన్లు ఎక్కువ ఉంటాయి. ఐరన్‌, ‘బి’ విటమిన్‌, మరికొన్ని ఖనిజ లవణాలు కూడా బాగానే ఉంటాయి. కొవ్వు కూడా అధికంగానే ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి.
పాలు,పెరుగు,వెన్న: డెైరీ ఉత్పత్తులలో కాల్షియం, ప్రొటీన్‌లు, విటమిన్‌లు, కొన్ని ఖనిజ లవణాలు ఎక్కువగా లభిస్తాయి. కొవ్వు కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి తక్కువగా వాడటం మంచిది.
స్వీట్లు,నూనెలు:ఈ ఆహారపదార్థాలలో పోషకవిలువలు అంతగా ఉండవు కాని కేలరీలు (శక్తి) మాత్రం సమృద్ధిగా లభిస్తాయి. కేకులు, స్వీట్లులాంటి వాటిని ఎంత తక్కువగా తింటే అంత మంచిది.
ఆహారాన్ని అసలు తీసుకోకపోతే...కొందరు చానాళ్ళపాటు ఏ ఆహారం తీసుకోకుండా ఉండాల్సి వస్తుంది. నిరాహారదీక్ష వల్ల, అనోరెగ్జియా నెర్వోసా వల్ల, జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఏ భాగానన్నా తీవ్రమైన వ్యాధితో బాధ పడుతున్నప్పుడు, పక్షవాతం వల్ల, కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు...
ఇలాంటి సందర్భాలలో మనుషూలు ఆహారాన్ని తీసుకోకుండా నిరాహారా నికి గురి కావల్సి వస్తుంది.

ఎన్నాళ్ళకూ ఆహారాన్ని తీసుకోని ఇలాంటి సందర్భాలలో శరీరం శక్తికోసం తనలోని కణజాలాన్నే కేలరీల కింద హరాయించుకోవటం మొదలెడు తుంది. ఫలితంగా శరీరంలో నిలవ ఉంచుకున్న కొవ్వు దాదాపు అదృశ్యమై పోతుంది. అంతర్గతావయవాలు, కండరాలు,క్రమేపీ డామేజ్‌ కావటం మొదలెడతాయి.నిరాహారానికి గురెైన సందర్భంలో పెద్దవాళ్ళు తమ శరీరానికి చెందిన బరువులో సగానికి పెైగా కోల్పోయే ప్రమాదం ఉంది. పిల్లలు ఇంకా ఎక్కువ బరువును కోల్పోతారు.
శరీరపు బరువును కోల్పోతున్న నిష్పత్తిలోనే లివరు, పేగులు అధికంగా కృశించుతాయి. కిడ్నీలు, గుండె కాస్త తక్కువ స్థాయిలో కృశించుతాయి.

ఇంకా జరిగే మార్పులు ఏమిటంటే:
కండరాలు కరిగిపోయే ఎముకలు పొడుచుకు వస్తాయి.
చర్మం పల్చగా అయి పొడిబారిపోతుంది. చర్మంలో సాగేగుణం తగ్గిపోతుం ది. తెల్లగా పాలిపోతుంది .చల్లగా అవుతుంది.
వెంట్రుకలు పొడిబారి చిట్లుతుంటాయి. తేలికగా రాలిపోతుంటాయి.
పూర్తిగా నిరాహారంగా ఉంటే ఆ మనిషి 8 నుంచి 12 వారాల లోపు చనిపోతాడు.

ట్రీట్‌మెంట్‌
ఎక్కువ రోజుల పాటు నిరాహారంగా ఉన్న మనిషిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావటానికి కొంత వ్యవధి పడుతుంది. ఎంతకాలం పడుతుందనేది అతను ఎన్నాళ్ళనుంచి నిరాహారంగా ఉన్నాడు, దాని ప్రభావం అతని శరీరం మీద ఎంతగా పడింది అన్న వాటిమీద ఆధారపడి ఉంటుంది.అధిక రోజులపాటు నిరాహారంగా ఉండటం వల్ల జీర్ణయంత్రాంగా ముడుచుకు పోతుంది. మామూలు సమయాలలో తీసుకునేంత ఆహారాన్ని అది ఇముడ్చుకోలేదు.

మనం తీసుకున్న ఆహారం శరీర నిర్మాణానికి దోహదపడుతుంది. 2.7 కిలోల నుంచి 3.2 కిలోల మధ్య బరువుండే కొత్తగా పుట్టిన పాపాయి పెరిగి పెద్దయే సరికి 55 నుంచి 70 కిలోల బరువుకు చేరుకుంటాడు. అంటే ఈ ఎదిగిన బరువంత కూడా అతనికి తను పుట్టిన దగ్గరి నుంచి నిత్యం తీసుకొంటున్న ఆహారం ద్వారానే లభించుతుంది.

అసంకల్పిత చర్యలు: అంటే మన ప్రయత్నం మన ప్రమేయం లేకుండా మన శరీరంలో యాంత్రికంగా జరిగిపోయే చర్యలు! ఉదాహరణకు గుండె కొట్టుకో వడం, జీర్ణం కావడం, శరీరంలో టెంపరేచరు క్రమబద్దీకరించబడటం మొదలెైనవి.

- డాక్టర్‌ సి.ఎల్‌. వెంకట్రావు, హైదరాబాద్‌


  • ============================ 

  • Visit my Website - Dr.Seshagirirao...

    http://dr.seshagirirao.tripod.com/


Spirulina,స్పిరులినా

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


  •  









  •  


స్పిరులినా అంటే...........స్పిరులినా అనేది చారిత్రకంగా ఏనాటి నుంచో వాడుకలో ఉన్న ఆకుపచ్చటి ఆహారం. భూమిపై మొక్కల ఆవిర్భావానికి సంబంధించి వాటి తొలి రూపంగా దీన్ని భావిస్తారు. ఆదిమకాలంలో మనిషి ఆహారంలో ఇది భాగంగా ఉండింది. శతాబ్దాలు గా కూడా ఇది మనిషి ఆహార వనరుగా ఉపయోగపడుతూనే ఉంది. ఇప్పటికీ ఎన్నో దేశాల్లో దీన్ని ప్రజలు తమ ఆహారంలో భాగంగా చేసుకున్నారు. ఆఫ్రికాలో కరువు కాటకాలు నెలకొన్న సందర్భాల్లో కొన్ని దేశాల ప్రజలు తమకు అవసరమైన పోషకాల కోసం ప్రధానంగా స్పిరులినా పైనే ఆధారపడ్డారు.

స్పిరులినాకు ఎందుకింత ప్రత్యేకత
స్పిరులినా పోషకాల పుట్ట లాంటిది. మహిళకు ప్రతి దశలోనూ అవసరమైన సూక్ష్మపోషకాలను ఇది అందిస్తుంది. ప్రపంచం లోనే పోషకాలు సమృద్ధిగా గల ఆహారవనరుల్లో ఇది కూడా ఒకటిగా గుర్తింపు పొందింది.
ప్రొటీన్లలో సంపన్నం
ఐరన్‌కు చక్కటి వనరు
సూక్ష్మపోషకాలతో శక్తివంతం
స్పిరులినాలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఐరన్‌ లోపంతో వచ్చే అనీమియా (రక్తహీనత)తో బాధపడేవారికి రోజుకు 1-2 గ్రాముల స్పిరులినా ఎంతగానో తోడ్పడుతుంది. శాకా హారులకు, ఆహారం నుంచి ఐరన్‌ పొందడం కష్టమవుతుంది. పాలకూర లాంటి వాటిల్లో ఐరన్‌ ఎక్కువగా ఉన్న ప్పటికీ, స్పిరులినా ద్వారానే దాని కంటే ఎక్కువగా ఐరన్‌ శరీరానికి అందుతుంది. ఇందుకు కారణం పాలకూరలో ఐరన్‌ శరీరానికి అందకుండా నిరోధించే ఆక్సలేట్‌ లాంటివి ఉంటాయి.
స్పిరులినాలో బెటా కరొటెన్‌ (ప్రో విటమిన్‌ ఎ) పుష్కలంగా ఉంటుంది. ఒక గ్రాము స్పిరులినా 2ఎంజీల బెటా కరొటెన్‌ను అందిస్తుంది. ఒక వ్యక్తి రోజువారీ అవసరాలకు సరిపడా బెటా కరొటెన్‌ను ఇది అందించ గలుగుతుంది. సాధారణవిధానాల్లో దీన్ని పొందడం కష్టమవుతుంది.

స్పిరులినాతో ఎన్నెన్నో ప్రయోజనాలు


    స్పిరులినాతో పలు ప్రయోజనాలున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది.
    రోగ నిరోధకత, హిమోగ్లోబిన్‌ స్థాయిలను పెంచుతుంది.
    కెమోథెరపీ, రేడియేషన్‌ థెరపీ చేయిం చుకున్న వారిలో తెల్లరక్తకణాలపై గుణాత్మక ప్రభావాన్ని కనబరుస్తుంది.
    కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో తోడ్పడుతుంది.
    ఐరన్‌ లోపంతో ఏర్పడే రక్తహీనతను ఎదుర్కొంటుంది.
    నరాల సంబంధిత నష్టాన్ని నివారిస్తుంది.
    కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
    ఆరోగ్యదాయక గర్భధారణకు అండగా...

    గర్భం దాల్చిన 7వ నెల నుంచి ప్రసవం అయ్యేదాకా స్పిరులినా తీసుకుంటే, విటమిన్‌ ఎ స్థాయి పెరగడంతో పాటు ఆరోగ్యదా యక శిశు జననానికి తోడ్ప డుతుంది. గర్భధారణ అనంతరం మూడో త్రైమాసికం నుంచి స్పిరులినా తీసుకుంటే తల్లిపాలు కూడా చక్కగా పడుతాయి.ప్రత్యేకించి గర్భధారణ కాలంలో బీఎంఐ ని మెరుగ్గా నిర్వహిం చుకునేందుకు తోడ్పడుతుంది. స్పిరులినా పోషకాలు, యాంటీఆక్సిడెంట్స్‌, ఫైటోపిగ్మెంట్స్‌ను సమృద్ధిగా కలిగి ఉన్నందున సౌందర్యసాధనాల రంగంలో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. స్పిరులినాను ఫేస్‌ ప్యాక్‌గా లేదా హెయిర్‌ కండీషనర్‌గా ఉపయోగించి నప్పుడు చర్మానికి, వెంట్రుకలను పోషకాలను అందించి వాటిని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.

    స్పిరులినా సహజ అనుబంధ ఆహారం. ఔషధం కాదు. దీనికి అలవాటు పడడం అంటూ ఉండదు. దీన్ని రోజుకు సుమారు గా 2 గ్రాముల వరకు తీసుకోవచ్చు. స్పిరులినాతో గరిష్ఠస్థాయిలో ప్రయో జనాలు పొందేందుకు దీన్ని కనీసం 6 -8 వారా ల పాటు ఉపయోగించాల్సి ఉంటుంది. నిర్దిష్ట కాలం పాటు దీన్ని వాడాలనే పరిమితులంటూ ఏవీ లేవు. కోరుకున్నంత కాలం కూడా దీన్ని వాడవచ్చు. స్పిరులినా మార్కెట్లో కాప్సుల్‌ లేదా మాత్రల రూపంలో లభ్య మవుతుంది. నాణ్యమైన ఉత్పాదనను ఎంచుకోవడం ముఖ్యం. ప్యారీ స్పిరులినా లాంటి బ్రాండు అనేకం అందుబాటులో ఉన్నాయి.

స్పిరులినా మహిళల ఆరోగ్యానికి ఆవశ్యకమైన అనుబంధ ఆహారం-భారతీయ మహిళ ఆరోగ్యం, సంక్షేమం నేటికీ ఆందోళన కలిగించేవిగానే ఉన్నాయి. భారతీయ మహిళల్లో 36 % మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. మరో 55% మంది రక్తహీనతతో బాధ పడుతున్నారు. ప్రస్తుత, భవిష్యత్తు తరాలకు మధ్య వారధిగా ఉంటున్న నేపథ్యంలో మహిళ పోష కాహారం ఎంతో కీలక ప్రాధాన్యం సంతరిం చుకుంది. ఆమె పోష కాహార స్థాయిలో ఏ చిన్నపాటి లోపం ఉన్నా కూడా అది తీవ్ర పరిణా మాలకు దారి తీస్తుంది.

-పోషకాహార లోపంతో బాధపడే బాలికలు పోషకాహార లోపం ఉన్న తల్లులుగా మారి పోషకాహార లోపంతో ఉండే పిల్లలకు జన్మనిస్తారు. చివరకు ఇదొక విషవల యంగా మారుతుంది. తగినంత పోషకాహారం లభించకపోతే అది ఆ రోజుకు వారికి కావాల్సిన శక్తిని వారు పొందలేకపోతారు. అంతేగాకుండా రక్తహీనత (ఎనీమియా), రోగనిరోధకత తక్కువ గా ఉండడం, ఎముకల్లో ఖనిజ లోపాలకు, చిన్న వయస్సు లోనే వయస్సు పైబడినట్లుగా మారి పోవడం లాంటివాటికి గురి అవుతారు. ఎంతో మంది మహిళలు తమ ఆహారాన్ని పిండిపదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు వంటి స్థూల పోషకాల తోనే సరిపుచ్చుకుంటారు. సూక్ష్మ పోషకాల అవసరాన్ని వారు గుర్తించరు. వాటిపై అవగాహన ఉండదు. నిజానికి ఆరోగ్యానికి కీలకమైన వాటిలో సూక్ష్మ పోషకాలు కూడా ఎంతో ముఖ్యం.

శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు అవసరమైన విటమిన్లు, మినరల్స్‌, పలు యాంటీఆక్సిడెంట్స్‌ ఈ సూక్ష్మపోషకాల కిందకు వస్తాయి. సూక్ష్మపోషకాల లోపం మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కనబరుస్తుంది. ఈ సమస్యను గనుక పట్టించుకోకుంటే, అది జాతి సామాజిక ఆర్థికాభి వృద్ధిపై ఎంతో ప్రభావం కనబరుస్తుంది. ఇవే గాకుండా, విటమిన్‌ ఎ, ఐర న్‌, అయోడిన్‌, ఫోలేట్‌ లాంటివి చిన్నారుల జీవన అవకాశాల ను, మహిళల ఆరోగ్యాన్ని, విద్యా పరమైన విజయాలను, సంతాన సామర్థ్యాన్ని, రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తాయి.

అందుకు మహిళ జీవితంలో ప్రతి దశలోనూ పోషకా లపై తగు శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యం. యుక్త వయస్సుకు రావడం అనేది ఆమెలో ఐరన్‌ లోపాన్ని పెంచుతుంది. గర్భం, పాలు ఇవ్వాల్సి రావడం ఆమెకు కావాల్సిన కాల్షియం, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ అవసరాలను మరింత పెంచుతాయి. అవి తీరాలంటే సంపూర్ణ సమతుల్యాహారం తీసుకోవాల్సి ఉంటుంది. స్పిరులినా అనేది పోషకాహార సప్లిమెంట్‌కు అత్యుత్తమ ఎంపిక మాత్రమే గాకుండా మహిళల పోషకాల అవసరాలను అత్యుత్తమంగా తీర్చే మార్గం.


  - courtesy with : డాక్టర్‌ ఆర్‌.ఎజ్‌హిల్‌ అరాసన్‌