Pages

Labels

Blog Archive

Popular Posts

Showing posts with label ఉత్తరేణి (సర్వ రోగ నివారిణి). Show all posts
Showing posts with label ఉత్తరేణి (సర్వ రోగ నివారిణి). Show all posts

Tuesday, 3 January 2012

ఉత్తరేణి (సర్వ రోగ నివారిణి),Prickly Chaff Flower



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


  • ప్రకృతి ఎంత మనోహరమైనదో అంతకంటే ఎంతో లోతైన రహస్యాల్ని కడుపులో దాచుకున్నది. ప్రతి చెట్టూ, పుట్టా, నీరు, నిప్పు సమస్తం మనకందిస్తోంది. మానవుడు కూడా అంతే మేధావి. ప్రకృతి వనరుల్ని ఎలా వినియోగించుకుని జీవనాన్ని సుఖమయంగా మార్చుకోవాలో ఏ అవసరాన్ని దేనితో ఎలా తీర్చుకోవాలో నిత్యం అన్వేషిస్తూ ఉండే జ్ఞానం ఉన్న జీవి. ప్రకృతి ఎంత ప్రమోదాన్నందిస్తుందో, అంతే ప్రమాదాన్ని కూడా కలిగించగలుగుతుంది. దానిని గ్రహించడమే మానవ మేధస్సు

ఉత్తరేణి లేదా అపామార్గం (Prickly Chaff Flower) ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం అఖిరాంథస్ ఆస్పరా (Achyranthes aspera). ఇది అమరాంథేసి కుటుంబానికి చెందినది. వినాయక చవితి నాడు చేసే పత్ర పూజలో దీనిని ఉపయోగిస్తారు.ఈ మధ్యే జరిగిన వినియక చవితి పూజల్లో అధినాయుకుడికి ఇష్టమైన 21 ప్రతులలో ఒకటిగా చెప్పే ఉత్తరేణీ పత్రితో కూడా పూజ చేసారుగా....సకల రోగ నివారణిగా పేర్కొంటూ ఈ మొక్కలకు అత్యంత ప్రాధాన్యత ఆయుర్వేదంలో ఉంది. అమరాంథేసీ కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం అఖిరాంథస్‌ ఆస్పరా. ఉత్తరేణీకి పురాణ కధల్లో ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. వృత్తాసురుడు అనే రాక్షసుడ్ని చంపిన ఇంద్రుడు, ఆపై సముచి అనే మరో రాక్షసుడ్ని చంపేందుకు ఆతనితో స్నేహాన్ని నటిస్తూ... అదను చూసి సమూచి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తలని నరికేస్తాడు. దీంతో తెగి పడిన ఆ తల మిత్ర ద్రోహి అంటూ ఇంద్రుడ్ని తరమటం ప్రారంభించడంతో దాని నుండి తప్పించు కునేందుకు బృహస్పతిని కల్సి తరుణోపాయం చెప్పమంటే... రాజసూయ యాగంలో భాగంగా చేసే ఉత్తరణీ ధాన్యం వాడి చేసే యాగాన్ని చేయమంటాడు. దీంతో యాగమాచరించిన ఇంద్రుడుని ఉత్తరేణి సముచికి కనబడకుండా చేస్తుంది.ఈ ప్రక్రియని అపామార్గం అంటారు. దీని వల్లే ఉత్తరేణిని అపామార్గ మొక్కలని కూడా పిలుస్తారు.

  • భారత దేశంలో ఎక్కువగా కనిపించే ఈ ఉత్తరేణీని గుండ్రని కాండాన్ని, అభి ముఖ ప్రత విన్యాసంతో దీర్ఘ వృత్తాకారంలో, లేదా వృత్తాకార ఆకులని కలిగి ఎరుపు, తెలుపు రంగులున్న పొడువాటి కంకులని కలిగి ఉంటుంది. ఈ మొక్కని ఆయుర్వేద మందుల తయారీకి వాడుతారు.

  • ఉత్తరేణి ఆకుల రసాన్ని గాయాలు తగిలినప్పుడు పూస్తే రక్త స్రావం కాకుండా చూస్తుంది.
  • అలాగే దురదలు, పొక్కులు, శరీరం పై పొట్టు రాలటం జరుగుతుంటే ఈ రసం శరీరానికి పట్టిస్తే ఆ వ్యాధులు తగ్గుతాయి.
  • అలాగే కందిరీగ లు, తేనెటీగలు, తేళ్లు తదితరాలు కుట్టినప్పుడు ఆయా ప్రాంతాలలో ఈ ఆకులను ముద్దగా నూరి పెడితే నొప్పి, దురద తగుతాయి.
  • ఉత్తరేణి గింజల్ని పొడిచేసి, ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం కల్పిన మిశ్రమం వాడితే పంటి నొప్పులు, చిగుళ్ల నుండి రక్తం కారటం తదితర సమస్యలు తగ్గి దంతాలు మెరుస్తుంటాయి.
  • ఈ మొక్క లని కాల్చిన తరువాత వచ్చే బూడిదకు కాస్త ఆముదం కల్పి గజ్జి, తామర, తదితరాలపై లేపనంగా పూస్తే తగ్గుతాయి.
  • అలాగే ఈ బూడిదని తేనెలో కల్పి తీసుకుంటే ఉబ్బసం, దగ్గు తదితరాలతో పాటు గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులలోని శ్లేష్మం తగ్గుతాయి.
  • మజ్జిగలో కల్పి తీసుకుంటే రక్త విరేచనాలు తగ్గుతాయి. పురుషుల్లో వచ్చే పౌరుష గ్రంధి వాపు సమస్యకు ఉత్తరేణీ చూర్ణానికి ఆవునెయ్యి కల్పి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
  • ఉత్తరేణీ వేళ్లను కాల్చి చూర్ణంగా చేసి, అందులో మిరియాల పొడి కల్పి రెండు పూటలా చిన్న చిన్న మాత్రలుగా చేసి తీసుకుంటే చర్మ రుగ్మతలు సమసి పోతాయి.
  • నువ్వుల నూనెలో ఉత్తరేణీ రసాన్నిపోసి బాగా మరిగించాక ఆ నూనెని ప్రతి రోజూ పొట్టపై మర్ధన చేసుకుంటే కొవ్వుకరిగి సాధారణ స్ధితికి వస్తారు.
ఇలా అనేక రకాల రోగాలను నివారిస్తే మానవాళికి సహాయకారణిగా ఉండే ఉత్తరేణీయం గొప్పతనం అంతా ఇంతా కాదా?
  • ============================
Visit my Website - Dr.Seshagirirao...MBBS.