Pages

Labels

Popular Posts

Showing posts with label మన చేతుల్లోనే ఆరోగ్యం. Show all posts
Showing posts with label మన చేతుల్లోనే ఆరోగ్యం. Show all posts

Friday, 3 May 2013

Our health is in our hands,మన చేతుల్లోనే ఆరోగ్యం


  •  








పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.







మనం ఆరోగ్యంగా ఉండడం అనేది మనచేతుల్లోనే ఉంది. ఒంట్లో కొద్దిగా నలత గా ఉన్నా పట్టించుకోకుండా అలాగే పనిచేస్తుంటాం. పరిస్థితి ఆందోళనకరంగా మారినప్పుడు వైద్యుల వద్దకు పరుగులు తీస్తుంటాం. ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్ద తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండొచ్చని వైద్యులు వివరిస్తున్నారు. రోజూ తగిన మోతాదులో పౌష్టికాహారం తీసుకుంటే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండొచ్చంటున్నారు. ఆరోగ్యం దెబ్బతిన్న తరువాత మందులకు ఖర్చు చేయడం కంటే ముందునుంచే పండ్లు, కూరగాయాలు, పాలు, మాంసం కోసం కేటాయించడం మంచిదని న్యూట్రిఫిట్ డైరక్టర్, కన్సలెంట్ న్యూట్రీనిస్టు డాక్టర్ జానకీ శ్రీనాథ్ తెలిపారు.



ఆహారపు అలవాట్లు, వ్యాయమం లేక అనేకమంది వ్యాధుల బారిన పడుతున్నారని వివరించారు. ఆహారంలో ఎక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకోవడం, సమయాలు పాటించకపోవడం, కల్తీ పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందన్నారు. ప్రతి రోజూ 45 నిమిషాలను నడకకు కేటాయించాలని సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏమేమి చేయాలో తెలుసుకుందాం.



ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..



- ఆహారాన్ని ఒకేసారి ఎక్కువగా కాకుండా మూడు గంటలకొక సారి కొంచెం కొంచెం తీసుకోవడం ఉత్తమం.

- ఆహారంగా తీసుకునే పదార్థాలను ఎక్కువ సేపు ఉడకపెట్టకూడదు.

- ఆహారంలో తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, పళ్లలో ఉండే సూక్ష్మ పోషక పదార్థాలు, ఫైబర్‌లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పసుపు, నారింజరంగులో ఉండే పళ్లు కొన్ని దీర్ఘకాల జబ్బులనూ నిరోధిస్తాయి. తాజాగా ఉండే పచ్చికూరగాయలను, పళ్లను సలాడ్ల రూపంలో కూడా తీసుకోవచ్చు.

- ఆహారంలో 'ఎ' విటమిన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. 'ఎ' విటమిన్ అంధత్వంతోపాటు పిల్లల్లో వాంతులు, విరేచనాలు, తట్టు, శ్వాసకోశ సంబంధ వ్యా«ధులు తదితరమైన వాటిని నివారిస్తాయి. కెరోటిన్ ఉన్న మునగ ఆకులు, తోటకూర, మెంతికూర, పాలకూర, క్యారట్, మంచి గుమ్మడి, మామిడి, బొప్పాయిలను తీసుకుంటే అవి శరీరంలో ఎ విటమిన్‌గా మారతాయి. డి విటమిన్ కూడా అవసరమైన మేరకు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.



మంచి ఆరోగ్యం కోసం...

- ద్యానం, యోగాభ్యాసం వంటి వాటితో ఒత్తిడి తగ్గించుకోవాలి.

- రోజూ తప్పని సరిగ్గా వ్యాయామం చేయాలి.

- పొగతాగడం, పొగాకు నమలడం, గుట్కా, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి.

- ముప్పై ఏళ్లు పైబడిన వాళ్లు రక్తంలో గ్లూకోజ్, లైపిడ్ల స్థాయి పరీక్షలతోపాటు బీపీ పరీక్షల్లాంటివి చేయించుకోవాలి.

- 30 ఏళ్లు దాటిన మహిళలు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి.

- పిల్లలకు, గర్భిణులకు రోగ నిరోధక మందులు, టీకాలు వంటివి ఇప్పించాలి.

- వినియోగానికి ముందు కూరగాయలను, పండ్లను శుభ్రంగా కడగాలి.



నీళ్లు, పాల ప్రాధాన్యం :

- పరిశుభ్రమైన నీటినే తాగాలి. మంచినీళ్లు తాగితే 50 శాతం రుగ్మతలకు దూరంగా ఉండవచ్చు.

- నీళ్లు కలిషితమైందని అనుమానం కలిగితే కాచి వడపోసి తాగాలి.

- నీటితోపాటు పాలు కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం.

- రోజుకు 250 మిల్లీలీటర్ల కాచి, చల్లార్చిన లేదా పాశ్చరైజ్డ్ పాలను వాడితే మంచిది.

- టీ, కాఫీ అలవాటుంటే... కాఫీ కంటే టీ తీసుకుంటే మంచిది. అది కూడా ఒకటి రెండుసార్ల కంటే ఎక్కువ వద్దు.



వీటి విషయంలో జరభద్రం



- వంటనూనెలు, నెయ్యి, వెన్న, వనస్పతి వంటివి చాలా తక్కువగా వినియోగించాలి. ఎక్కువగా తీసుకుంటే కొవ్వు పెరిగి స్థూలకాయం తద్వారా గుండెజబ్బులు, క్యాన్సర్ లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. మాంసాహారులు మేక మాంసం, కోడి మాంసం బదులు చేపలు తీసుకోవడం మేలు. మాంసాహారంలోనూ లివర్, కిడ్నీ, బ్రెయిన్ వంటి పదార్థాలను మానుకోవడం మంచిది.



- ఫ్రై చేసిన ఆహార పదార్థాలకు సాధ్యమైనంత వరకు దూరం గా ఉండాలి.

- రెండు మూడు రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవద్దు.

- విపరీతమైన ఉపవాసాలు మంచిది కాదు.

- ఎక్కువ కొవ్వు కలిగిన పాలను తీసుకోవద్దు.

- ఊరగాయలు, ఉప్పు, బిస్కెట్లు, చిప్స్, వెన్న, పిజ్జా, శీతలపానీయాలు, ప్రాసెస్ చేసిన పదార్థాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి.

- బరువు పెరగకుండా చూసుకోవాలి.



Courtesy with ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ,ఏప్రిల్ 6-2013.




  • =====================


Visit my Website - Dr.Seshagirirao...