Pages

Labels

Popular Posts

Showing posts with label కుంకుడుకాయలు. Show all posts
Showing posts with label కుంకుడుకాయలు. Show all posts

Wednesday, 30 November 2011

కుంకుడుకాయలు,Soap nuts



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

ఆధునికత పెరిగే కొద్దీ ఆడంబరాలకు పోతూ మంచి ఆరోగ్య విధానాలకు సైతం మనం స్వస్తి చెబుతున్నాం. స్నానం చేసే సమయంలో ఖరీదైన షాంపూలు, సబ్బులను వాడకపోతే పరువు తక్కువ అని భావిస్తున్నాం. కాలగతిలో కుంకుడుకాయలు, శీకాకాయ, సున్నిపిండి వంటివి మరచిపోతున్నాం. అపార్టుమెంట్లలో ఉండేవారికి కుంకుడుకాయలు నలగగొట్టడానికి ఖాళీ స్థలమే కరువైంది. మార్బుల్, సిరామిక్ గచ్చులు పాడైపోతాయని కుంకుడు కాయల జోలికే వెళ్లడం లేదు. అందమైన సీసాలు, ఆకట్టుకునే ప్యాకింగ్‌ల్లో లభించే షాంపూల వైపే మొగ్గు చూపుతున్నాం. చౌకగా లభించే కుంకుళ్లవైపు కనె్నత్తి చూడం. ఖరీదైన వాటికోసం డబ్బు వదలించుకోవడం కన్నా కుంకుడు,శీకాయలతో కురుల అందాన్ని కాపాడుకోవచ్చన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నాం.

ఈరోజుల్లో అభ్యంగన స్నానానికి రకరకాల షాంపూలు, సబ్బులు మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని ఉపయోగించడం చాలా సులభం. పూర్వం తలస్నానానికి కుంకుడుకాయలను ఉపయోగించేవారు. కుంకుడుకాయలను వాడాలంటే కొంత శ్రమ ఉంటుంది. ఆ కాయలను చితక్కొట్టి, వాటిలో గింజలను తీసెయ్యాలి. వాటిని వేడి నీటిలో నానపెట్టి... ఆ రసంతో తలరుద్దుకునేవారు. ఆ తర్వాత శీకాకాయపొడి మార్కెట్లో లభించడం ఆరంభమయింది. ఆ పొడిని నీటిలో తడిపి, ఆ ముద్దతో తలరుద్దుకునేవారు. అయితే, ఈ రోజుల్లో శీకాకాయపొడి కాకుండా కుంకుడుపొడి కూడా లభిస్తోంది. చాలామంది, కుంకుడుకాయలను ఈ రోజుల్లో వాడటం లేదు. నిజానికి తలంటుకి కుంకుడుకాయలను వాడటమే మంచిది. దీనివల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటమే కాక పేలు, చుండ్రులాంటి సమస్యలు రావు.

వేసవిలో కుంకుడుకాయలను బాగా ఎండబెట్టి పొడిచేసుకుని నిల్వ చేయొచ్చు. దీనివల్ల తలస్నానం చేసిన ప్రతీసారీ కుంకుడుకాయలను కొట్టుకునే శ్రమ తప్పుతుంది. ఎండబెట్టిన కమలాతొక్కలు, నిమ్మతొక్కలు, మందారాకులు, మందారపూలు, మెంతులను పొడిచేసి కుంకుడు పొడిలో కలపవచ్చు. వీటన్నిటినీ కలిపిన పొడితో తలస్నానంచేస్తే వెంట్రుకలు నల్లగా ఉంటాయి. త్వరగా నెరవవు. జుట్టు ఊడదు. బిరుసెక్కకుండా మెత్తగా ఉంటుంది.

కుంకుడుకాయలతో తలస్నానం చేయడం వల్ల కేశాలు జిడ్డులేకుండా శుభ్రపడతాయి. పైగా వీటిలో ఎటువంటి రసాయనికాలు కలువవు. కనుక జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. కుంకుళ్ళు తలస్నానానికి కాక, చర్మ సౌందర్యానికీ, మృదుత్వానికీ, చర్మ ఆరోగ్యానికీ తోడ్పడతాయి. చర్మానికి ఏర్పడే దురదలను ఎలర్జీలను పోగొడ్తాయి. కుంకుడు రసంలో ఖరీదయిన పట్టుచీరలను నానపెట్టి ఉతికితే అవి ఎంతో మెరుస్తాయి. కుంకుడురసంలో బంగారు ఆభరణాలను నానబెట్టి, మెత్తని బ్రష్‌తో మృదువుగా రుద్దితే... అవి శుభ్రపడి ధగధగా మెరుస్తుంటాయి. బాణాలి, పెనంవంటి జిడ్డుపాత్రలను కుంకుడు పిప్పితో శుభ్రపరచవచ్చు. కుంకుడు కాయలే శ్రేష్ఠమని తెలుసుకోవాలి. మన సాంప్రదాయపు అలవాట్లలో కూడా కుంకుడు కాయలను వాడతారు. ప్రసవమయిన బాలింతరాలికి పదకొండో రోజు పురిటి స్నానం చేయించబోయేముందురోజు ఇరుగుపొరుగు వారికి కుంకుడుకాయలు, నూనె, సున్నిపిండి పసుపు, కుంకుమతో పాటు మిఠాయిని పంచుతారు. పూర్వపు రోజులలో పెళ్ళికి వచ్చిన వియ్యాలవారి విడిదిలో కుంకుడుకాయలు, కొబ్బరి నూనె, పౌడరు, అద్దం ఉంచడం సాంప్రదాయం. అందువల్ల, కుంకుడు కాయలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
  • =========================
Visit my Website - Dr.Seshagirirao...