- ప్రకృతిలో జనిస్త్తున్న పుష్పాలు మానవాళిని కనువిందు చేస్తుంటాయి. అందులోనూ సూర్యుడితో పాటు తిరిగే పొద్దు తిరుగుడు పచ్చదనంతో పాటు భారీ తనం కూడా కంటికింపుగా ఉంటుంది.ఆర్నికా పుష్ప జాతికి చెందిన ఈ పొద్దు తిరుగుడు దాదాపు 30 ఉప జాతులుగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉంది. హెర్బాసియస్ ప్రజాతికి చెందితీ పుష్పాలు మృదువైన పూల రెక్కలతో పాటు వైవిధ్య భరితం గా కాస్త జుత్తు తగుతున్నట్లుంటే పత్రాలు కలిగి ఉండటం వీటి ప్రత్యేకత
సమశీతోష్ణ స్ధ్దితి ఉన్న దేశాలలో ఎక్కువగా దీనిని వాణిజ్య పంటగా పండిస్తున్నారు రైతులు. కేవలం నూనె తీసేందుకే కాకుండా వివిధ రసాయనిక ప్రయోగాలలో, మానవాళి వాడుతున్న మందుల్లోనూ వీటి వాడకం నిత్యం పెరుగుతండటంతో ఎక్కువ మంది వీటిని పండించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
- బలమైన కాండాన్ని కలిగి ఉండి 10 నుండి 15 ఇంచ్‌ల పొడవాటి పుష్పాలు, పసుపు, నారింజ, రంగుల్లో దర్శనమిస్తాయి. ఆర్నికా జాతులు కొద్ది పాటి సువాసనలు మాత్రమే వెదజల్లిన తత్వాన్ని కలిగి ఉన్నా మానవాళికి ఉపయుక్తంగా ఉండే ఈ పొద్దు తిరుగుడు పుష్పాల మధ్యలో ఉండే వృత్తాకార భాగంనే వివిధ రకాలుగా వినియోగిస్తారు.
ఇక ఈ పొద్దు తిరుగుడు వెలువరించే వివిధ రసాయనాలు ఔషధ గుణాలు కలిగి ఉండటంతో ఆయు ర్వేద వైద్యంలో ప్రత్యేకత సంతరించుకుందనే చెప్పాలి. బెణుకులు, గాయాలు తగిలినపుడు మనం వాడుకునే లేపనాలు (ఆయింట్ మెంట్లు) తయారీలో సన్ ఫ్లవర్‌ని వినియోగిస్తున్నారు. ఈ మొక్కల వేళ్లలో ఉండే కినీకల్లీ సబ్కాటానియస్ రక్త కేశనాళాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు పరిశోధనల్లో వెల్లడి కావటంతో దీనిని క్రీడా కారుల అలసట, నీరసించి పోవటాల నుండి సత్వర ఉపశమనానికి వాడుతున్నారు. అలాగే వివిధ రకాల నొప్పుల నివారణకి ప్రయోజనకారిగా ఉండటంతో అందుకు సంబంధించిన మందుల తయారీ ల్లోనూ దీని వాడకం ఎక్కువైంది.
- హౌమియో మందుల్లోనూ పొద్దు తిరుగుడు తన ఔషధతత్వాన్ని చూపిస్తోంది. హౌమియోలో అత్యం త కీలక భూమిక పోషించే టించర్ చిక్కబడకుండా ఉండేందుకు పొద్దు తిరుగుడు నుండి తీసిన రసాయనాలే చూస్తుంటాయి. మానవ శరీరంలో అనేక ధోష పూరిత లవణాలను బైటకు పంపించడంలో ప్రత్యేక లక్షణాలు ఇది కలిగి ఉందని వైద్య శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు. ఈ సన్ ఫ్లవర్ ఎంత ఉపయుక్తంగా ఉంటుందో తగు రీతిన జాగ్రత్తలు వహించక పోతే అంతే ప్రమాదకారి కూడా.. ఈ పూలను, ఆకుల్ని తాగినపుడు ఎంత ఆహ్లాదక రంగా ఉంటుందో తదుపరి శరీరానికి చికాకు పుట్టి స్తుంది. పూలలోని చిన్న చిన్న విత్తనాలను పొరపాటున నోటిలో వేసుకుంటే అది విషతుల్యమై ఉండటంతో ఆజీర్ణం, కడుపులో గ్యాస్ పెరగటం, అంతర్గత రక్తస్రావాలకు దారి తీస్తుంది. కొన్ని ఉప జాతు లు విషతుల్యం కాకపో యినా.. జీర్ణ ప్రక్రియపై ప్రభావం చూపిస్తాయి.
- Courtesy with - సత్యగోపాల్ @ అంధ్రప్రభ దిన పత్రిక ఆదివారము అనుబందము .
- =========================