గురివింద గింజను విషపదార్థంగా భావిస్తారు ప్రతివారు. అయితే ఈ గింజను శుద్ధిచేసి ఉపయోగిస్తే ఔషధంగా కూడా వాడవచ్చు. ఈ గింజలు ఎరుపు, తెలుగు రంగుల్లో లభిస్తాయి. తెలుగు రంగు గింజలు మాత్రమే ఔషధంగా ఉపయోగపడుతాయి. ఈ గింజలనే కాక లేత ఆకులను, వేళ్ళను కూడా వైద్యానికి ఉపయోగిస్తారు. ఆయుర్వేద వైద్యంలో తెల్లగురివింద గింజలు వాడబడుతున్నాయి.
ఆయుర్వేద వైద్యంలో వీటి ఉపయోగాలు :
- లేత గురివింద ఆకులను నమిలితే గొంతు శ్రావ్యంగా ఉంటుంది. ఎక్కువ సేపు ప్రసంగించే వక్తలు, మిమిక్రీ కళాకారులు, సంగీత విద్వాంసులు, హరికథలు, బుర్రకథలు వినిపించేవారు ఈ ఆకులను నమిలితే మంచి ప్రయోజనం కలుగుతుంది.
- తెల్లబట్టతో బాధపడే స్ర్తిలు పరిశుద్ధం చేయబడిన గురివింద గింజలను మెత్తగా పొడికొట్టి, ఆ పొడిలో తేనెను కలిపి పుచ్చుకుంటే నివారణ కలుగుతుంది.
- ఈ గింజలు లేదా ఆకుల కషాయాన్ని తాగితే సుఖప్రసవమవుతుంది.
- గురివిందగింజలను కాలిస్తే వచ్చే పొగ దోమలను నిర్మూలిస్తుంది.
- చెవిపోటువస్తే గురివిందగింజ ఆకును నూరి ఆ పసరుపోస్తే తగ్గిపోతుంది .
- పేనుకొరుకుడుతో బాధపడుతున్నారా..గురివిందగింజతోవైద్యం --గురివింద గింజని బాగా అరగదీసి గంధం తీసి పేనుకొరికిన చోట రాయండి. ఇలా నాలుగైదురోజులు రాస్తే వెంట్రుకలు మళ్ళీ తిరిగి వస్తాయి.
-కె.నిర్మల
- =============================================