Pages

Labels

Blog Archive

Popular Posts

Tuesday, 11 September 2012

కోలా పానీయాలు-మన ఆరోగ్యము ,Cola drinks and our health



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
  • సుప్రసిద్ధ కూల్ డ్రింక్ బ్రాండ్ కోకొ-కోలా తన 125 వ ఏడాదిలోకి అడుగుపెట్టింది.మొదట శక్తినిచ్చే పానీయంగా. తర్వాత కాలక్రమంలో కూల్ డ్రింక్ గా విశేష ప్రాచుర్యం పొందిన కోక్............కోక ఆకులూ కోక గింజలతో తయారు చెయ్యడం వల్ల ఈ పేరు వచ్చింది.అట్లాంటాకు చెందిన వ్యాపారవేత్త ఆసా గ్రిగ్స్ 1888 లో షుమారు లక్ష రూపాయలు వెచ్చించి కోకో కోలా బ్రాండ్ ను కొనుగోలు చేసాడు. ప్రారంబంలో రూపొందించిన రేసిపీతో నే ఇప్పటికీ కోక్ తాయారు చేస్తున్నారు.ఈ ఫార్ములాను కంపెని అత్యంత రహస్యంగా కాపాడుతుంది.రెసిపి ఫార్ములాను మొత్తం కంపెనీలో ఇద్దరికీ మాత్రమే తెలుపుతుంది.వారిద్దరూ ఏకకాలంలో విమాన ప్రయాణాలు,కలిసితిరగడం పూర్తిగా నిషిద్దం ఏదైనా ప్రమాదం జరిగినా కనీసం ఒక్కరైన బతికి బట్టకట్టాలని కంపెని ఉద్దేశ్యం.ఫార్ములా రహస్య పత్రాల ఒకేఒక కాపీని అట్లాంటా లోని ఓ బ్యాంకు లో భద్రపరిచారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1200 కోక్ బాట్లింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయి.కోక్ ప్రారంబమైన ఏడు దశాబ్దాల తర్వాత కాని కొత్త ఫ్లేవర్ డ్రింకులు ప్రారంభం కాలేదు.కంపెని తొలిరోజుల్లో రోజుకు తొమ్మిది గ్లాసుల పానీయం అమ్ముడు పోతే ఇప్పుడు రోజుకు 170 కోట్ల డ్రింకులు అమ్ముడుపోతున్నాయి.ప్రస్తతం కంపెని నుంచి 500 బ్రాండ్ లతో 3300 రకాల పానీయాలు తయారు ఆవుతున్నాయి.చైనా బాషలో కోకో అంటే "నోటిని ఆనందంగా ఉంచేది"అని అర్ధం.ప్రపంచంలో ఉన్న మొత్తం కోక్ బాటిళ్ళను ఒక దాని తర్వాత ఒకటిగా పేర్చుకుంటూ వెళితే 1677 సార్లు భూమికి చంద్రుడికి మద్య తిరిగినంత దూరం ఉంటుంది.. ప్రపంచం మొత్తం మీద ఓ కే అనే పదం తర్వాత కోక కోలా నే ఎక్కువమందికి పరిచయం ఉన్న పేరు.ఇప్పటివరకు కోక్ నాలుగు లక్షల కోట్లు బాటిళ్ళు తాయారు చేసింది.కంపెని కేవలం సిరప్ మాత్రమే తాయారు చేస్తుంది.దాన్నిబాట్లర్స్ కు పంపితే వాళ్ళు మిగతా పదార్ధాలను కలిపి విక్రయిస్తారు.

  • కోక్, పెప్సి, 7 అప్, మిరిండా, ఫాంటా, తమ్స్ అప్, లిమ్కా, మరియు స్ప్రైట్. భారతదేశములో తయారయిన పెప్సి యొక్క సీతాల పానీయాలు.
భారతేదేశములో శీతల పానీయాల మార్కెట్ కు ఎటువంటి నియంత్రణ లేదు. 1954 నాటి ఆహార కల్తి చట్టంలో శీతల పానీయాలు చేర్చబడిలేదు. ఆగుస్ట్ 2003కు ముందు అమలులో ఉన్న BIS నియమాలలో శీతల పానీయాలలో పురుగుమందు ఎంత మేరకు ఉండవచ్చో అని ఎటువంటి నియమాలు లేవు. అయితే పురుగుమను ఎంత మేరకు ఉండవచ్చని వివిధ సంస్థలు కొన్ని నియమాలను రూపొందించాయి. తాగే నీళ్ళలో గరిష్టంగా 0.1 పార్ట్స్ పెర్ బిలియన్ వరకు పురుగుమందులు ఉండవచ్చని, అలగైతేనే అవి మనుషులకు హాని ఉండదని స్పష్టం చేసాయి. ఆల్డ్రిన్, డయల్డిన్, హేప్టాక్లోర్ ఎపోక్సైడ్ వంటి పురుగుమందులకు ఇంకా తక్కువగా అనగా గరిష్టంగా 0.1 పార్ట్స్ పెర్ బిలియన్ వరకు మాత్రమె ఉండవచ్చు.

  • జాగ్రత్తలు :
శీతల పానీయాలు విషపూరితమనీ, వాటిని తాగడం వల్ల ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతింటాయని మనము తెలుసుకోవాలి ,దానివల్ల కేన్సర్‌, కాలేయం, మూత్రపిండాలు, జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు సంభవిస్తాయని గుర్తించాలి .

విదేశీ కంపెనీలచే తయారై మన దేశ ప్రజల ఆర్థిక, ఆరోగ్య నష్టాలు, కష్టాలకు శీతల పానీయాలు కారణమవుతున్నాయని జెవివి రాష్ట్ర వ్యవస్థాపక సభ్యులు డా.వి.బ్రహ్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. డా.బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ కూల్‌డ్రింక్స్‌ తాగడం వలన ఎవరికి లాభమని ప్రశ్నించారు. విదేశీ శీతల పానీయాలు ఎందుకు తాగకూడదో అనే అంశానికి బలమైన శాస్ర్తీయ ఆధారాలు మనముందు ఉన్నాయన్నారు. కాగా సినీతారలు, క్రీడాకారులు కోట్ల రూపాయలు పారితోషకంగా తీసుకుంటూ కూల్‌డ్రింక్స్‌ను తాగమని ప్రచారం నిర్వహించడం స్వార్థపూరితమేగాక బాధ్యతారాహిత్యమన్నారు.


రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటీవ్‌ మెడిసిన్‌(ఐపిఎం) వారు థమ్స్‌అప్‌, లిమ్కా, పానీయాల నమూనాలను సేకరించి మైక్రో బయోలజి పరీక్షలు జరిపి అందులో రకరకాల రోగాలు తెచ్చే బ్యాక్టీరియా మోతాదుకు మించి చాలా ఎక్కువగా ఉందని తేల్చి చెప్పారన్నారు. శీతల పానీయాలు తయారు చేసే సంస్థలు వాటిని రవాణా చేసే విషయంలో, నెలల తరబడి నిల్వ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పట్టించుకోవడం లేదన్నారు. దీని వల్ల బ్యాక్టీరియా సులువుగా వృద్ధి చెందుతుందన్నారు. శీతల పానీయాలకు వాడే రంగులు కూడా మోతాదు పరిమితులకు లోబడి వాడాలని, లేనిపక్షంలో అనారోగ్య కారకాలు వృద్ధి చెందుతాయన్నారు. కేరళలోని పాలక్కాడ్‌ జిల్లాలో ప్లాచిమడలో ఉన్న కోకో కోలా కంపెనీ విసిరి పారేస్తున్న వ్యర్థ పదార్థాలలో క్యాన్సర్‌ కారకమైన కాడ్మియం అనే లోహ అవశేషాలు అధిక మొత్తంలో అంటే 201.8 మిల్లీ గ్రాములు ఉన్నట్లు తేలిందన్నారు.


జెవివి జిల్లా ప్రధానకార్యదర్శి సి.యాగంటీశ్వరప్ప మాట్లాడుతూ పిహెచ్‌ విలువ ప్రకారం కూల్‌డ్రింక్స్‌ టాయిలెట్‌ క్లీనింగ్‌ యాసిడ్స్‌ కన్నా గాఢమైనవన్నారు. మన పార్లమెంటులో వీటిని నిషేధించారని, కొన్ని యూనివర్శిటీలలో వాడడం లేదన్నారు. ప్రకటనల ద్వారా పెప్సీ, కోక్‌ కంపెనీలు ప్రజలకు తప్పుడు సంకేతాలను అందిస్తున్నాయని ఆరోపించారు. శీతల పానీయాల వల్ల మధుమేహం, ఊబకాయం, ఎముకలు గుల్లబారడం వంటి జబ్బులు రావచ్చని నిపులైన వైద్యులు చెబుతున్నారన్నారు.


కొన్ని కోలా పానీయాలు, మరియు చాక్ లెట్లు ఈ ఎసిడిటీని ఇంకా ఎక్కువ చేస్తాయని మరచిపోవద్దు. కనుక కూల్ డ్రింక్స్ ఇతర చిరుతిళ్ళు తగ్గించండి.

కోలా పానీయాలు, రసాయనపూరితాలు, అయినా అందరి దృష్టి ఎక్కువ వీటిపైనే వుంటుంది. స్లో పాయిజన్‌ లాంటి ఈ తరహా పదార్థాలు పానీయాలు, ఎక్కువగా తీసుకుంటే కోరి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది.

బీర్, కోలా వంటి కార్బోనేటేడ్ పానీయాలు కూడా గ్యాస్ కి కారణం.

  • కోలాతో క్లీనింగ్ :
కూల్‌డ్రింక్ అనగానే కోలా సీసాలు కళ్ల ముందు కదలాడుతుంటాయి. కోలా బాటిల్ దొరగ్గానే తాగేయడం కాకుండా దాంతో బోలెడు పనులు చేసుకోవచ్చు. మొండి మరకల్ని వదలగొట్టడంలో కోలా తనకు తానే సాటి అంటోంది.

వంటింట్లో మాడిన వంటసామాన్లు త్వరగా శుభ్రం కావు. అలాంటి పాత్రలో అర కప్పు కోలా వేసి ఓ పదినిమిషాల తర్వాత కడిగితే పాత్రకి పట్టుకున్న మాడు వెంటనే వదిలిపోతుంది. అలాగే స్టీలు సామాన్లపై పేరుకుపోయిన తుప్పు మరకల్ని కూడా కోలా ఇట్టే తొలగిస్తుంది. ఎక్కడైతే తుప్పు మరకలు ఉంటాయో...అక్కడ ఐదారు చుక్కల కోలా పోసి ఓ పావుగంట తర్వాత స్పాంజ్‌తో గట్టిగా తుడిస్తే వెంటనే తుప్పు మరకలు పోతాయి. అలాగే బాత్‌రూమ్‌లలో వాడే టబ్బులు సున్నం మరకలతో ఉంటాయి.

అలాంటి మరకల్ని కూడా కోలా ఇట్టే పోగొడుతుంది. టబ్బులపై కోలా నీళ్లు చల్లి పదినిమిషాల తర్వాత బ్రష్‌తో రుద్దితే కొత్త టబ్బుల్లా తయారవుతాయి. సన్నటి దుమ్ము పట్టిన గాజు అద్దాలను కూడా కోలాతో శుభ్రం చేసుకోవచ్చు. ఒక మగ్గులో ఒక కప్పు కోలా, రెండు కప్పుల నీళ్లు పోసి అందులో బట్టని ముంచి గట్టిగా పిండి ఆ బట్టతో అద్దాలను తుడిస్తే తళతళలాడుతాయి. ఇవన్నీ ఒకెత్తయితే...బట్టలపై ఉండే మరకలు మరింత ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా నూనె మరకలు.

కొన్నిసార్లు రక్తపు మరకలు కూడా పోవు. ఈ రెంటికీ కోలా మంచి డిటర్జెంట్‌గా ఉపయోగపడుతుంది. బట్టల్ని నానబెట్టేముందు డిజర్జెంట్ నీళ్లలో రెండు కప్పుల కోలా కూడా పోయాలి. లేదంటే వాషింగ్ మిషన్‌లో వేసినా పరవాలేదు. నూనె, రక్తపు మరకలు త్వరగా వదిలిపోతాయి. కేవలం తాగడం కోసమే అనుకునే కోకో కోలా వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలియక చాలామంది బాటిల్ దొరగ్గానే పూర్తిగా తాగేస్తారు. ఈసారి కొద్దిగా కోలాని మిగిల్చి క్లీనింగ్‌కి వాడి చూడండి.
  • ======================
Visit my Website - Dr.Seshagirirao...