Pages

Labels

Blog Archive

Popular Posts

Saturday, 5 January 2013

Heart food,గుండె ఆహారము


  •  












  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgZvGv1sNCLnQBWDpEaXTPnaXJFwG3hsBlgMSCOhBIWnmXM-yoRZU2ayRl7JsCmpdn-XjPPF9Q4P_DoQCPTO3yvp77k3t2jq-2CKUFF5Rs305kMIdqvYyBX80YA6X_OJ6HPEBMdpiqOySE/s1600/Heart+attack.jpg





      •  


      పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



      గుండె ఆరోగ్యముగా, పదిలము గా ఉండడానికి పలుఆరోగ్యకరమైన ఆహారపదార్ధాలు ఉన్నాయి. గుండె రిస్క్ కు గురికాకుండా ఉండాలంటే ... తక్కువగా శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉండే  రెడ్ మీట్ , తాజాపండ్లు , కూరగాయలు , ఎక్కువ చేపలు , తక్కువ పంచదార , ఎక్కువ ఫైబర్ తీసుకోవాలి.



      కొన్ని ముఖ్యమైన ఆహారపదార్ధములు : 




      • టొమాటోలు : 





      •  


      వీటిలో విటమిన్లు , లైకోపిన్‌ లు , పుష్కలముగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల రిస్క్ ను తగ్గిస్తాయి. టమాటోలు ఏవిధము గానైనా తినవచ్చును. యాంటీ ఆక్షిడెంట్లు , లైకోపిన్‌ మూలంగానే టొమాటోలు ఎర్రగా ఉంటాయి. రక్త ప్రసరణ నియంత్రించడానికి ఉపయోగపడతాయి. విటమిన్‌ " సి , ఇ ,  ప్లేవనాయిడ్స్ , పొటాషియం వంటివి పుష్కలము గా ఉంటాయి.




      • బ్రోకోలీ :  బ్రకోలి (పచ్చ క్యాలీఫ్లవర్‌)





      •  


      ఇది ఒక రకము తోటకూర లాంటిది . వీటిలో కెరోటి నాయిడ్స్ , ఇండోల్స్ , లాంటి రసాయన సమ్మేళనాలుంటాయి. ఇవి కాన్సర్ కణాలు ఉత్పత్తి కాకుండా నిరోధిస్తాయి. బ్రకోలీ లో విటమిన్‌ ' సి ' ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆసిడెంట్స్ గా పనిచేసే విటమిన్‌ ' ఇ '  ఇంకా కాల్సియం , బి 2 , ఐరన్‌  ఎక్కువగా ఉంటాయి. అధిక రక్తపోటు నుండి గుండెను రక్షించే " సల్పరోఫన్‌ " ఇందులో ఉంటుంది. ట్రైగ్లిజరైడ్స్ , కొలెస్టిరాల్ ను తగ్గించడములో సహకరిస్తుంది. క్యాలిఫ్లవర్ లో " ఇండోల్-3-కార్బినోల్ అత్యధికముగా ఉంటుంది . ఇది బ్లడ్ క్లాట్స్ , స్ట్రోక్ కు సంబంధించిన ప్లేట్ లేట్స్ ' స్టికినెస్ ' అరికడుతుంది.




      • దానిమ్మ : 





      •  


       ప్రతిరోజూ ఒకగ్లాసు దానిమ్మ రసము తీసుకునట్లయితే కొలెస్టిరాల్ కంట్రోల్ లో ఉంటుంది. ఇందులో ఉండే విటిమిన్‌ ' బి 12 ' రక్తములో ఎర్ర రక్తకణాలు తయారీ కి అవసరము .  గుండె ఆరోగ్యాన్ని పెంచే యాంటి ఆక్షిడెంట్లు అధికము గా ఉన్నందున ఇది గుండ జబ్బులు రానీయకుండా కాపాడును.




      • గుమ్మడి కాయ : 




      •  


      గుమ్మడి కాయలలో బీటాకెరోటిన్‌ లు ఎక్కువగాఉంటాయి. ఇవి శరీరములో విటమిన్‌ ' ఎ ' గా మార్పుచెంది భగు ప్రయోజనాలు కలిగిస్తాయి. గుండెజబ్బులు, క్యాన్సర్ , త్వరగా వయసు పెరిగినట్లు కనిపించడానికి కారణమయ్యే ఫ్రీరాడిలల్స్  ప్రారదోలడము లో సహకరించి గుండెను కాపాడుతుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందున గుండెకు మేలు జరుగుతుంది .




      • చేపలు : 





      •  


       ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దండిగా ఉంటాయి. రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడకుండా , గుండె వాపు రాకుండా , కొలెస్టిరాల్ తగ్గించడము  ద్వారా ఈ ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్స్ కాపాడుతాయి.  సార్డిన్‌ చేపలలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సన్నని ఎముకలు చిన్నవిగా ఉన్న చిన్న చేపలలో ఖనిజలవణాలు ఎక్కువగా ఉండును.



      బెర్రీస్ :




      •  


       బెర్రీస్ గుండె ఆరోగ్యానికి మంచి పౌష్టికాహారము . ఇవి తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది . మంచి కొలెస్టిరాల్ పెరుగుతుంది.  బెర్రీస్ లో " పాలిఫినాల్స్ , యాంటీఆక్షిడెంత్లు రోగాలపై పోరాడి గిండెను కాపాడు తాయి.





      ఫిగ్స్ (Figs)  



      : వీటిలో అత్యదికము గా ఉండే పొటాషియం , మెగ్నీషియం ,కాల్సియం లు రక్తపోటును తగ్గించడములో సహకరిస్తాయి. ఫిగ్స్ లోని డైటరీపీచు హానికర కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది. యాంటీఆక్షిడెంట్ విటమిం ' సి ' , ఒమెగా 3-,ఒమేగా 6 ఎసెన్షియల్ ప్యాటీయాసిడ్స్  ఫ్రీరాడికల్స్ ను నియంత్రించి .... ధమనులు-సిరలులో ప్లేక్స్ యేర్పడకుండా అరికడతాయి.



      బార్లీ(barli) :






      ఎప్పటినుండడ్ వాడుకలో ఉన్నది . పూర్తి ష్థాయి లో చెడుకొలెస్టిరాల్ లెవల్స్ ను తగ్గిసుంది. ఈ ధాన్యము లో కరిగిపోయే పీచు పధార్ధము ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ 2-3 కప్పుల ఉడికించిన బార్లీ తినేవారికి పూర్తి కొలెస్టిరాల్ 9% , చెడు కొలెస్టిరాల్ 11% తగ్గుతుందని అమెఇకా వ్యవసాయి శాఖి జరిపిన పరిశోధనలలో గుర్తించారు. ఆ విధము గా గుండెను కాపాడుతూ ఉంటుంది .



      హెంప్ సీడ్స్ (జనుప గింజలు) : 



       ప్లేట్ లెట్స్ stickyness ను తగ్గిస్తుంది . దీనిలో ఒమేగా-6 ఫ్యాటీయాసిడ్స్ , గామా లినోలెనిక్ యాసిడ్ (జి.ఎల్.ఎ) దీర్ఘకాలిక కార్డియో-వ్యాస్కులార్ వ్యాధులను తగ్గించడములో బాగా ఉపయోగ పడుతుంది.



      ఎర్ర మిరపకాయ(రెడ్ క్యాప్సికం) : 

      కార్డియోవాస్కులర్ కండిషన్లు తగ్గించడమలోను ,రక్తపోటు నియంత్రణలోను సహకరిస్తుంది ఆకుపచ్చ ఇతర రకాల కంటే ఎర్ర్ని మిరపకాయ లో " లైకోఫెన్‌ " యాంటీఅక్షిడెంట్ గా పనిచేస్తుంది . కొలెస్టిరాల్ ను తగ్గించే గుణము దీనికుంది. సాల్యుబుల్ ఫైబర్ , ఎ.సి, విటమిన్లు ఉండడము వలన గుండకు మంచిది .



      వాల్ నట్స్ : 








       యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గాను , మంచి కొలెస్టిరాల్ ను పెంచేకారకము గా పనిచేస్తుంది. ఇందులో " ఆల్ఫ లినోలెనిక్ యాసిడ్ " , ఒమెగా-3 ఫ్యాటీయాసిడ్స్ ఉండడము వల్లనూ , శరీరము నుంది అదనపు కొలెస్టిరాల్ ను కదలించడములోనూ లేదా తొలగించడము లోను బాలా పనిచేసి   హార్ట్ రిస్క్ ను  తగ్గించగలదు .



      స్పిరులినా : నీలి-ఆకుపచ్చ సముద్రపు మొక్కల్ని తరచూ " సూపర్ ఫుడ్ " గా పరిగణిస్తారు. దీనిలో అత్యదికము గా విజిటబుల్ పోటీన్లు చేపలలో కంటే అధికము గా ఉంటాయి. దీనిలో ఉండే ' సి-ఫికొక్యానిన్‌' అనే pigment దృడమైన రోగనిరోధక శక్తిని కలుగజేసుంది. ఇది ప్రకృతిలో లభించే పరిపూర్ణ ఆహారము . ముఖ్యమైన ఫిటో న్యూట్రియెంట్స్ , కెరొటొనాయిడ్స్ , ఎషన్‌సియల్ ఫాటీయాసిడ్స్ ,మెగ్నీషియం ఉండడము వలన గుందే కు మేలుచేస్తుంది.



      గ్రీన్‌ టీ :ఇది హార్ట్ స్ట్రోక్ రిస్క్ ను తగ్గిస్తుంది. దైనందిన ఆహారములో భాగము గా చేసుకుంటే 20% వరకూ హార్ట్ స్ట్రోక్ ను తగ్గించే అవకాశముంది.




      రెడ్ వైన్‌ : రక్తనాళాల లైనింగ్ ను పరిరక్షిస్తుంది. ఇన్‌ప్లమేషన్‌ ,రక్తపోటును తగ్గిస్తుంది. తగుమాత్రము అనగా రోజుకు 300 మి.లీ మించి తీసుకోకూడదు . రెడ్ వైన్‌ ప్రధాన పదార్ధమైన " పాలీఫెనాల్ " బ్లడ్ -వెజల్  డ్యామేజ్ నుంది రక్షిస్తుంది. ఇతర మూలకాలైన ద్రాక్ష , ఫెనొలిక్స్ , పాలిఫెనాల్స్ , యాంటీఅక్షిడెంట్లు ఉండి గుండె కు మంచి చేస్తాయి.



      సోయా మిల్క్ : కొలెస్టిరాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాని కాపాడుతుంది. దీనిని వెజిటబుల్ ప్రోటీన్‌ అని అంటారు. 



      నీరుల్లి పాయలు : వీటిలోని  ''క్వెర్సెటిన్‌'' వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఇది మంచి యాంటీఆక్షిడెంట్ ,రక్తపోటును తగ్గిస్తుంది. వీటిలో ఫైటోకెమికల్స ,ఫోలేట్ , పొటాషియం అధికము గా ఉంటాయి. గుండెకు మంచిది. 



      వెల్లుల్లి : వీటిలోని " ఎల్లిసిన్‌" పదార్ధము రక్తనాళాలు రిలాక్ష్ అవడా్నికి , రక్త సరఫరా సక్రమముగా జరిగేందుకు సహకరిస్తుంది . గుండెకు చాలా మంచిది. 



      ఆలివ్ ఆయిల్ : క్రమము తప్పకుండా ఎక్స్ ట్రా -వర్జిన్‌ ఆలివ్ ఆయిల తీసుకోవడము వల్ల్ .. సిస్టాలిక్ , డయాస్టాలిక్ రక్తపోటు ను తగ్గిస్తుంది. గుండెకు మంచిది.



      దాల్చిన చెక్క : ఈ ప్రాచీన కాలపు సుగంధద్రవ్యాలలో యాంటీ ఇన్‌ఫ్లమేషన్‌ లక్షణము ఉన్నందున గుండె , ఆర్టిరీస్ డ్యామేజ్ అవకుండా పరిరక్షిస్తుంది. 



      పసుపు : ఈ సాంప్రదాయ హీలింగ్ స్పైస్ లోగల " కుర్కుమిన్‌" శక్తివంతమయిన యాంటీ ఆక్షిడెంట్ . దీనికి ఫ్లేక్ పేరుకుకొని పోవడాన్ని తగ్గిస్తుంది. 

       





      • =======================


      Visit my Website - Dr.Seshagirirao...