Pages

Labels

Blog Archive

Popular Posts

Wednesday, 27 February 2013

sleeping problems with food eating,తిండితోనూ నిద్ర సమస్యలు












పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.





నిద్ర సరిగా పట్టటం లేదని బాధపడుతున్నారా? అయితే ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో కూడా కాస్త చూసుకోండి. ఎందుకంటే మనం తినే తిండి, తాగే పానీయాలూ నిద్రపై చాలా ప్రభావం చూపుతాయి. కొన్ని నిద్ర పట్టనీయకుండా చేస్తే.. మరికొన్ని మగతను కలగజేస్తాయి.



* పిండి పదార్థాలతో కూడిన ఆహారం.. ట్రీప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లాన్ని మెదడుకు చేరుకునేలా చేసి త్వరగా నిద్రపట్టేలా చేస్తుంది. ప్రోటీన్లతో నిండిన పదార్థాల్లోనూ ట్రీప్టోఫాన్‌ ఉంటుంది. అందువల్ల ప్రోటీన్లతో పాటు పిండి పదార్థాలనూ తీసుకోవటం నిద్రకు ఉపకరిస్తుంది.



* కడుపునిండా దండిగా ముఖ్యంగా పిండి పదార్థాలు ఎక్కువగా గల ఆహారం తిన్నప్పుడూ నిద్రమత్తుతో జోగేలా చేస్తుంది.



* నిద్ర పట్టక సతమతమయ్యేవారు సాయంత్రం వేళల్లో, పడుకునే ముందు కెఫీన్‌ గల కాఫీ వంటివి తాగకపోవటమే మంచిది. ఇవి త్వరగా నిద్ర పట్టకుండా చేస్తాయి.



* క్రీడాకారులు వాడే తక్షణ శక్తినిచ్చే పానీయాల వంటివి తాత్కాలికంగా ప్రభావం చూపొచ్చు గానీ ఇవి తరచుగా శక్తి మొత్తం హఠాత్తుగా పడిపోయేలా చేస్తాయి. ఫలితంగా మగతను కలగజేస్తాయి.



* మద్యపానం ముందు మత్తును కలిగించినా.. తరచూ నిద్ర నుంచి మేల్కొనేలా చేస్తుంది. గాఢనిద్ర పట్టకుండా అడ్డుకుంటుంది.


  • ======================


 Visit my Website - Dr.Seshagirirao.com