Pages

Labels

Blog Archive

Popular Posts

Monday, 25 March 2013

Which Oil is good for our Hair, మన జుట్టుకు సరియైన నూనె



  •  





  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



ఆరోగ్యవంతమైన శిరోజాలను అందానికి , ఆరోగ్యానికి చిహ్నం గా భావిస్తారు .శిరోజాల ప్రమాణాలను మెరుగు పరిచే మార్గాల అన్వేషకు అనేక పరిశోధనలు సాగాయి. వాతిలో ఓ సులువైన మార్గము మాడుకు , జుట్టుకుదుళ్ళకు సరైన హెయిర్ ఆయిల్ తో పోషకాలు అందించడము. అయితే ఈ నూనె ఎంపిక అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది . శిరోజాల తీరు , సువాసనలు , సీజన్‌ అనుసరించి సాగుతుంది .నూనెలు జుట్టుకు ప్రయోజనకరం గా ఉంటాయి. కొబ్బరి నూనె , బాదం , జొజోబా , నువ్వుల నూనె , ఆముదం నూనె  సహజ నూనెలు గాగా , భృంగమలక (బృంగారజ), నీలి బ్రింగడి , దర్డురోడి , ఆమ్ల మున్నగునవి  హెర్బల్ హెయిర్ ఆయిల్స్ . సహజ నూనెలను యీకలిప్టస్ , జూనిఫర్ , లెమన్‌ , శాండల్ వుడ్ , లావెండర్ , మిర్ర్ , టీట్రీ , రోజ్ మేరి , బేసిల్ , పెప్పర్ మెంట్ , వంటి ఎసెన్సియల్ పదార్ధాలతొ కలుపుకోవచ్చు . ఈ పదార్ధాలు ఔషధగుణాలతోపాటు నూనెలకు మంచి సువాసనలను కూడా ఉస్తాయి . ఇవి చాలా గాడతను కలిగిఉండి ..బాదం , అవకాడో , బర్డాక్ , కెమెల్లియ , ఆముదము , జొజొబా , కొబ్బరి , వేరుశనగ , సన్‌ఫ్లవర్ , నువ్వులనూనె  వంటి క్యారియర్ ఆయిల్స్ తో కలిసి నప్పుడు అమోఘము గా పనిచేస్తాయి.



ఏ దైనా నూనె ఎంచుకుంటున్నప్పుడు శిరోజాల నాణ్యతను , నూనె అదనపు లక్షణాలతో పాటు సాధారన ఆరోగ్యాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. . ఎందుకంటే

కొన్ని నూనెలు అందరికీ సూట్ కావు. ఉదాహరణకు కొన్ని నూనెలు కూలింగ్ గుణాలు కలిగి ఉంటాయి. జలుబు త్వరగా వచ్చేవారు ఈ రకం నూనెల్ని

వాడడం వలన మరింత త్వరగా సమస్య వస్తుంది . అందుకే విభిన్న నూనెల గురించి , వాటిలోని వివిధ ఔషధ గుణాల గురించి అవగాహన అవసరము . 

కొబ్బరి నూనె (Coconut Oil) : కొబ్బరి నూనె మాడు లోపలికి చొచ్చుకు పోయి శిరోజాల కుదుళ్ళకు  చివరి కొసలదాకా  పోషకాలందిస్తుంది. కొబ్బరి

నూనె లో యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ వైరల్ , యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. కాబట్టి శిరోజాలు , మాడు ఇన్‌ఫెక్షన్‌ నుంది ఇది రక్షిస్తుంది.

ఎసెన్సియల్ ఫాటీయాసిడ్స్ కు , వితమిన్‌ " ఇ , కె , ఐరన్‌ , ఖనిజాలకు " మంచి ఆధారము . కొబ్బరినూనెలో మెత్తబరిచే గుణము అత్యధికము

ఉంటుంది. శిరొజాల ఎదుగుదలకు , పోషకం గా ఎంతగానో సహకరిస్తుంది.
మందుల వాడకం , హార్మోనుల మార్పులు , ఒత్తిడి , కాలుష్యము వలన జుట్టు రాలిపోతున్నప్పుడు , పలుచబడుతున్నప్పుడు  కొబ్బరి నూనె వాడకం వలన

ఉపయోగము ఉంటుంది .
జుట్టు కుదుళ్ళు వాయడం , కుంచించుకు పొవడాల నుంచి శిరోజాలను కొబ్బరినూనె రక్షిస్తుంది.
చుండ్రు , మాడు ఇన్‌ఫెక్షన్‌ , పొడి జుట్టు , చివర్లు చిట్లిపోవడం , ఇతర శిరొజాల సమస్యల్ నుండి కాపాడుతుంది.
కొబ్బరినూనె ప్రభావ వంతమైన కండిషనర్ గా పనిచేస్తుంది.
డ్యామేజి అయిన శిరోజాలు తిరిగి ఎదగడానికి సహకరించే సామర్ధ్యము కలిగిఉందని నిపుణులు పేర్కోన్నారు .
ఇది మంచి క్యారియర్ ఆయిల్ కూడా.దీనికి గుణాలు కోల్పోయే కాలపరిమితి లేదు.ప్రిజర్వేటివ్ లు అవసరము లేదు.రిఫైన్‌మెంట్, ప్రోసెసింగ్ అవసరం లేదు.

మామూలుగా కొబ్బరినూనె రిఫైండ్ రకము గానే దొరుకుతుంది కావున గాఢమైన వాసన ఉండదు . ఇందుకై తలస్నానానికి ముందు , వెనుక కూడా నూనె

వాడుతుండాలి . 

జొజోబా ఆయిల్ : జొజోబామొక్క గింజల నుండి ఈ నూనెను వెలికి తీస్తారు. ఇవి ఎక్కువగా అమెరికన్‌ ఎడారులో పెరుగుతుంది. దీనిని పిగ్నట్ , కాఫీబెర్రీ,

డీర్ నట్ అని కూడా వ్యవహరిస్తారు.  అనేక శతాబ్ధాలుగా అమెరికన్లు ఈ నూనెను చర్మము , శిరోజాల సమస్యలము వాడుతున్నారు. చర్మము లోని

సెభాషియస్ గ్లాండ్స్  విడుదల చేసే సెబం తో జొజోబా ఆయిల్ సరిపోలిఉంటుంది . కాబట్టి ఇది పొడిబారిన మాడుకు  పోషకాలను అందించడము లొ

సహకరిస్తుంది . దీనిని లిక్విడ్ వ్యాక్స్ గా పేర్కొంటారు . విటమిన్‌ - ఇ,బి, లతో సహా అనేక పోషకాలను కలిగిఉంటుంది . ఇవన్నీ శిరోజాలకు

ప్రయోజనకరమే . జొజోబా ఆయిల్ హానికరమైనది కాకపోయినప్పటికీ మాడు పై మొదటిసారిగా వాటుతున్నప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడము అవసరము .

ఒక్కోసారి ఎలర్జిక్ రియాక్షన్‌ వచ్చే అవకాశము ఉంది. ఇది కూడా కొబ్బరి నూనె లాగనే దీర్ఘకాలిక మన్నిక కలిగిఉంటుంది.

ఆలివ్ ఆయిల్ : చుండ్రును నివారించడములో , శిరోజాల కండిషనింగ్ లో ఆలివ్ ఆయిల్ ఉత్తమమైనది . ఈ నూనెను మొదటిసారిగా గ్రీకులు

ఉపయోగించారని అంటారు. జుట్టు పలచబడడానికి , పురుషులలో జుట్టు రాలడానికి కారణమయ్యే " డీ హైడ్రో టెస్టోస్టిరాన్‌ " అనే హార్మోన్‌ ఏర్పడకుండా

అడ్డుకోగల ప్రధాన పదార్ధాలు ఈ నూనె లో ఉంటాయి. విటమిన్‌ -ఇ,డి. కె, నియాసిన్‌ , బయోటిన్‌ ఈ నునెలో  సమృద్ధిగా లభిస్తాయి. ఇవన్నీ శిరోజాలు

ఆరోగ్యముగా , ఒత్తుగా పెరగడానికి దోహదపడతాయి. కాలుష్యము , ఆల్కహాల్ , సిగరెట్ల వంటి వాటివలన హారి జరిగిన శిరోజాల మరమ్మత్తుకు ఆలివ్

ఆయిల్ లోని ' ఫెనాల్ ' లక్షణాలు సహకరిస్తాయి. సెబమ్‌ ఉత్పత్తి , మాడు లూబ్రికే్షన్‌ ను క్రమబద్దీకరిస్తుంది. శీతాకాలములో శిరోజాలకు చర్మానికి కూడా

బాగా మేలుచేస్తుంది.

ఆముదము : జుట్తు ఒత్తుగా , నల్లగా పెరగడానికి అత్యధికము గా సిఫార్సు చేసే నూనె ఆముదము . ఇది మాడు ఇన్‌ఫెక్షన్‌ నుండి కాపాడుతుంది . ఒమేగా

-9 ఎసెన్సియల్ ఫాటీయాసిడ్స్ , జెర్మిసైడల్ గుణాలు ఆముదములో ఉన్నాయి. కాబట్టి మాడును , శిరోజాలను మైక్రోబియల్ , ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌ లనుండి

కాపాడుతుంది. ఫ్యాటీయాసిడ్స్ శిరోజాలకు పోషణనిచ్చి , తేమను పట్టి ఉంచడము ద్వారా మాడు పొడిబారకుండా కాపాడును . ఆలివ్ ఆయిల మాదిరి ఈ

నూనె లో కూడా ఓలియిక్ యాసిద్ ఉంటుంది కావున మంచిఫలితాలకోసము ఈ రెండింటినీ కలిపి వాడుతారు . చిన్న పిల్లలకు ఆముదము తో మాడు

మసాజ్ చేస్తారు . దీని వలన ఆరోగ్యవంతమైన శిరోజాలే కాకుండా పూరిస్థాయి ఆరోగ్యము దక్కుతుంది. ఆముదము చిక్కగా ఉండి త్వరగా చొచ్చికుపోయే

గుణము కలిగి ఉంటుంది . సైనస్ ఇబ్బంది , అత్యధిక ఇంట్రాక్యులర్ ప్రెజర్ (కంటి ప్రెజర్), హై బ్లడ్ ప్రెజర్ , మలబద్దకము , అజ్జీర్ణ వ్యాధులు ఉన్నవారు

ఆముదము మాడుకు వాడకపోవడమే మంచిది .

బాదం నూనె : ఇది జిడ్డు లేని నూనె . పొడిమాడుకు పోషకాలు అందించడానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. గాఢమైన వాసనలు పడనివారికి

సరియైన ప్రత్యామ్నాయము ఇదే . కొన్ని హెయిర్ ఆయిల్స్ లా ' ఇర్రిటేషన్‌' రాని సురక్షితమైన నూనె ఇది . ఓలిక్ యాసిడ్ , లినొలిక్ యాసిడ్ ,

ప్రయోజనకరమైన  బయోప్లేవనాయిడ్స్ , విటమిన్‌ ఇ , కాల్సియం దీనిలో లబిస్తాయి. బాధం నూనె శిరోజాలకు మాడుకు చల్లదనాన్ని ఇస్తుంది .జుట్టు శీఘ్రం

గా పెరిగేందుకు దోహదపడుతుంది. బాధం (ఆల్మండ్ ) ఆయిల్ క్రమము తప్పకుండా వాడితే జుట్టురాలడము చా్లావరకు నివారించవచ్చునని ' భారత

హెర్బల్ ఆయువేద రీసెర్చ్ సెంటర్ పేర్కోంది.

నువ్వులనూనె : సింధూనాగరికత కాలం నుండి నువ్వులనూనె వాడకం ఉన్నది . దీనిలో యాంటీఆక్షిడెంట్స్ గుణాలు ఉండడము వలన తలకు మసాజ్

చేసినప్పుదు ఒత్తిడి నుంది ఉపశమనం కలుగుతుంది. యాంగ్జైటీ , నరాల బలహీనత , ఎముకల బలహీనత , బ్లడ్ సర్క్యులేషన్‌ లేమి , బలహీన

వ్యాధినిరోధక వ్యవస్థ , నిద్రలేమి , అలసట ఉన్నవారు మాడుకి నువ్వులనూనె రాయడము వలన ఉపశమనం , లాభము పొండుతారు . ఇది దుర్వాసన

రావడానికి చాలా కాలము పడుతుంది కాబట్టి హెర్బల్ హెయిర్ ఆయిల్స్ తో మంచి ద్రావకము గా నువ్వులనూనె ను వాడుతారు.

రొజ్ మేరీ ఆయిల్ : జుట్టుకుదుళ్ళను ఉద్దీప్తం చేసి జుట్టు రాలిపోవడాన్ని అరికడుతుంది.

అవకాడో ఆయిల్ : ప్రోటీన్లు , విటమిన్‌ ఎ,డి,ఇ,బి6, పోలిక్ యాసిడ్ , అమినోయాసిడ్స్ మెండుగా ఉండాయి . ఇవన్నీ శిరోజాలకు మంచిది. ఆఫ్రికన్లు ,

అమెరికన్లు దీనిని ఎక్కువగా వాడుతారు .

ఇము ఆయిల్ : ఆస్ట్రేలియా లో ఆదినుండి ఉండేవారు ఈ నూనెను ఎక్కువగా వాడెవారు . మాడుకు, జుట్టుకు మంచి పోషకాలు అందిస్తుంది. 

నీమ్‌ ఆయిల్ : మాడు దురద , ఇన్‌ఫెక్షన్‌ ల నివారణకు బాగా పనిచేస్తుంది. జుట్టు రాలడం , చుండ్రు , కళ్ళమంట , జుట్టు తెల్లబడడము , జుట్టు చివర్లు

చిట్లిపోవడము  నివారించడములో బాగా పనిచేస్తుంది. దీనిని తగిన సువాసన నూనెలతో కలిపివాడుతారు.

ఉసిరి నూనె : తాజా ఉసిరి రసము , తాజా భృంగరాజ (గుంటకలగ రాకు)రసము , పాలు సమపాళ్ళలో తీసుకొని కొద్దిగా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె

ఈ మిశ్రమములో కలిపి నీరంతా ఆవిరై నూనె మిగిలేదాకా కాయాలి . ఎండు ఉసిరిని కొబ్బరి లేదా నువ్వుల నూనె లో నానబెట్టి కూడా వాడుకో వచ్చును.

మాడుకి చల్లదనాన్ని , నిగనిగ మెరిసే గుణము , దృఢత్వాన్ని ఇస్తుంది .

అలోవెరా నూనె : బాగా ఎదిగిన పెద్ద అలోవెరా ఆకు తీసుకుని పొడవుగా చీల్చాలి. గుప్పెడు మెంతు గింజలు  లోపల పోయాలి. దారము తో రెండు పీలికలు

కట్టి బిగించాలి . 24 గంటలు ఉంఛాలి . తర్వాత అలోవెరా గుజ్జు, మెంతుగింజలు స్క్రాప్ చేసి కొబ్బరి లేదా నువ్వుల నూనె లో వేసి గోల్డెన్‌బ్రౌన్‌ రంగు

వచ్చేవరకూ కాయాలి(వేడిచేయాలి). చల్లార్చి బధ్రపరచుకోవాలి . వారానికి 2-3 సార్లు జుట్టుకి, మాడుకి రాసుకుంటే చాలా మంచిది. జుట్టును

మృదువుగాను , మెరుపులేనేలా ఉంచుతుంది.  


  • ==========================


Visit my Website - Dr.Seshagirirao...