Pages

Labels

Blog Archive

Popular Posts

Thursday, 31 October 2013

finger millets,ఫింగర్ మిల్లెట్,రాగులు,చోళ్ళు









పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



 finger millets,ఫింగర్ మిల్లెట్,రాగులు,చోళ్ళు



రుచిలో కాస్త తీపిదనం కలిగిన రాగుల్లో పోషక విలువలు అపారం. సులభంగా జీర్ణమయ్యే దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం మేలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రాగులతో చేసిన ఆహారం రోజూ తీసుకోవడం వల్ల పెద్దపేగుకి తగిన నీటి నిల్వలు అందుతాయి. రాగుల్లో తక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లూ, చక్కెర నిల్వలూ, ఎక్కువ మొత్తంలో పీచు ఉంటుంది. తరచూ రాగుల్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణప్రకియ మెరుగుపడి, మలబద్ధకం సమస్య దూరమవుతుంది. మధుమేహంతో బాధపడే వారికి రాగులు మంచి ఆహారం.



రాగుల్లో తగిన మోతాదులో లభించే మెగ్నీషియం మైగ్రెయిన్‌ తలనొప్పీ, గుండె సంబంధిత వ్యాధులకు చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది. విటమిన్‌ బీ3 శరీరంలోని కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది. వీటిల్లో అధిక మోతాదులో లభించే యాంటీ ఆక్సిడెంట్లూ, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీరాడికళ్లను బయటకు పంపించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ట్రిప్టోఫాన్‌గా పిలిచే అమినో యాసిడ్‌ రాగిలో తగు మోతాదులో లభిస్తుంది. ఇది ఆకలిని తగ్గించి వూబకాయం రాకుండా కాపాడుతుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలోని ఫైటో కెమికల్స్‌ జీర్ణ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తాయి.



రాగుల్లో ఉండే క్యాల్షియం ఎముక బలాన్ని పెంచుతుంది. ఆస్టియో పోరోసిస్‌ వంటి సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది. దీనిలో సహజంగా లభించే ఇనుము రక్త హీనతను నివారిస్తుంది. రాగితో చేసిన పదార్థాలను రోజూ తీసుకోవడం వల్ల పోషకాహార లేమి బారిన పడకుండా కాపాడుకోవచ్చు.



రాగి (Finger Millet) (ఎల్యూసీన్ కొరకానా, అమ్హరిక్ లో తోకూసో) ని ఫింగర్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అని వ్యవహరిస్తారు. రాగి వార్షిక ధాన్యపు పంట. దీనిని ముఖ్యంగా ఆఫ్రికా మరియు ఆసియాలోని మెట్టప్రాంతాలలో పండిస్తారు. రాగి స్వస్థలము ఇథియోపియాలోని ఎత్తుప్రదేశాలు అయితే నాలుగువేల సంవత్సరాలకు పూర్వము భారతదేశములో ప్రవేశపెట్టబడినది. ఇది ఎత్తు ప్రాంతాల యొక్క వాతావరణానికి సులువుగా అలవడే పంట. హిమాలయాల పర్వతసానువుల్లో 2300 మీటర్ల ఎత్తువరకు రాగిని పండిస్తారు.



Nutritional value of Finger Miller per 100g



    Protein 7.6g

    Fat 1.5g

    Carbohydrate 88g

    Calcium 370mg

    Vitamins - A: 0.48mg

    Thiamine (B1): 0.33mg

    Riboflavin (B2): 0.11mg

    Niacin: (B3) 1.2mg

    Fiber 3g




  • చిట్టి రాగులు.. గట్టి లాభాలు







చూడటానికి సన్నగా కనిపిస్తాయి గానీ రాగుల్లో క్యాల్షియం, ఐరన్‌ వంటి పోషకాలు దండిగా ఉంటాయి. ఈ చిరుధాన్యాల్లో ప్రోటీన్‌, పీచుతో పాటు ఖనిజాలు కూడా ఎక్కువే. పైగా కొవ్వు శాతం తక్కువ. మధుమేహులకు, వూబకాయులకైతే రాగులు వరదాయిని అనుకోవచ్చు. ఎందుకంటే ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. వీటిల్లో మన శరీరానికి అవసరమైన ట్రిప్టోథాన్‌, వాలైన్‌, మెథియోనైన్‌, ఐసోల్యూసిన్‌, థ్రియోనైన్‌ వంటి అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. వంద గ్రాముల రాగిపిండిని తింటే ఆ రోజుకి మనకు అవసరమైన 350 మి.గ్రా. క్యాల్షియం లభించినట్టే. అలాగే ఐరన్‌ 3.9 మి.గ్రా.. నియాసిన్‌ 1.1 మి.గ్రా. థయమిన్‌ 0.42 మి.గ్రా.. రైబోఫ్లావిన్‌ 0.19 మి.గ్రా.. కూడా అందుతాయి. ఇలాంటి పోషకాలతో కూడిన రాగులు మనకు ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తాయో చూద్దాం.

* అధిక బరువు తగ్గటానికి: రాగుల్లోని ట్రిప్టోథాన్‌ అనే అమైనో ఆమ్లం ఆకలిని తగ్గిస్తుంది. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి కాబట్టి అదనంగా శరరంలో కేలరీలు పోగుపడకుండా చూస్తాయి. ఇక వీటిల్లోని పీచు కడుపు నిండిన భావన కలిగించి, ఎక్కువగా తినకుండా చేస్తాయి. ఇవన్నీ బరువు తగ్గేందుకు తోడ్పడేవే.

* ఎముక పుష్టికి: వీటిల్లో క్యాల్షియం దండిగా ఉండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, వృద్ధులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి. పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు, వృద్ధుల్లో ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి. ఎముక క్షీణతను నివారించి విరిగే ముప్పును తగ్గిస్తాయి.

* మధుమేహం నియంత్రణకు: రాగుల్లోని ఫైటోకెమికల్స్‌ జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. దీంతో రక్తంలోకి గ్లూకోజు త్వరగా విడుదల కాదు. ఇలా రక్తంలో గ్లూకోజు స్థాయులు నియంత్రణలో ఉండేందుకు తోడ్పడతాయి.

* కొలెస్ట్రాల్‌ తగ్గేందుకు: లెసిథిన్‌, మెథియోనైన్‌ అనే అమైనో ఆమ్లాలు కాలేయంలో పోగుపడిన కొవ్వును నిర్మూలిస్తుంది. ఇక థ్రియోనైన్‌ అమైనో ఆమ్లమైతే కాలేయంలో కొవ్వు ఏర్పడకుండా చూస్తుంది.

* రక్తహీనత: రాగుల్లోని ఐరన్‌ రక్తహీనత తగ్గటానికి దోహదం చేస్తుంది.

* ఆందోళన: వీటిల్లోని ట్రిప్టోథాన్‌ అమైనో ఆమ్లం శారీరక, మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. అందువల్ల ఆందోళన, కుంగుబాటు, నిద్రలేమి వంటి సమస్యల నివారణకు తోడ్పడతాయి. కొన్నిరకాల పార్శ్వనొప్పులు తగ్గటానికీ ఉపయోగపడుతుంది.

* కండరాల మరమ్మతుకు: ఐసోల్యూసిన్‌ అమైనో ఆమ్లం కండరాల మరమ్మతుకు, రక్తం ఉత్పత్తికి, ఎముక ఏర్పడటానికి, చర్మం ఆరోగ్యం మెరుగుపడటానికి దోహదం చేస్తుంది. వాలైన్‌ అమైనో ఆమ్లం జీవక్రియ సరిగా జరగటంలో పాలుపంచుకుంటుంది. కండరాలు సమన్వయంతో పనిచేయటానికి, శరీరంలో నైట్రోజన్‌ సమతుల్యతకు తోడ్పడుతుంది.

* వృద్ధాప్యం దూరంగా: రాగులను క్రమం తప్పకుండా తింటే పోషణలోపాన్ని దూరంగా ఉంచొచ్చు. వయసుతో పాటు వచ్చే సమస్యలతో పాటు త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండానూ చూసుకోవచ్చు.


  • ==========================


Visit my Website - Dr.Seshagirirao...

Saturday, 19 October 2013

Date Fruit,ఖర్జూరం


  •  







  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.





ఖర్జూరం (Date Palm) ఎడారి ప్రాంతాల్లో పెరిగే ఒక విధమైన వృక్ష ఫలం. పామే (palm) కుటుంబానికి చెందిన ఖర్జూరం శాస్త్రీయనామం ఫీనిక్స్‌ డాక్టీలిఫెరా. అంతెత్తున ఆకాశంలోకి పెరిగే ఈ చెట్లు సుమారు 10 నుంచి 20 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయి. తాటిచెట్ల మాదిరిగానే ఆడా మగా వేర్వేరుగా ఉంటాయి. ఆడచెట్లు మాత్రమే ఫలాల్నిస్తాయి. 5-8 ఏళ్ల వయసు వచ్చేసరికి ఖర్జూర చెట్టు కాపుకొస్తుంది. ఒకప్పుడు ఇది అక్టోబరు - డిసెంబరు సమయంలో మాత్రమే దొరికేది. ఇప్పుడు ఆ దశ దాటిపోయింది. ఏ సూపర్‌ మార్కెట్టుకెళ్లినా గింజ తీసేసి ఆకర్షణీయంగా ప్యాక్‌ చేసిన విభిన్న ఖర్జూరాలు ఎప్పుడూ దొరుకుతూనే ఉన్నాయి.

Scientific classification-Kingdom:     ప్లాంటే--ivision: మాగ్నోలియోఫైటా--Class: లిలియాప్సిడా--Order:ఆరెకేల్స్--Family:పామే--Genus:ఫీనిక్స్--Species: పి. డాక్టీలిఫెరా--Binomial name
ఫీనిక్స్ డాక్టీలిఫెరాలి.

చరిత్ర

ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో కచ్చితంగా తెలియకున్నా మనిషికి పరిచయమైన తొలి ఆహారవృక్షంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఉత్తర ఆఫ్రికా లేదా ఆగ్నేయాసియా ఎడారుల్లోని ఒయాసిస్సు ప్రాంతాలే దీని స్వస్థలం అని కొందరంటారు. పర్షియన్‌ గల్ఫ్‌లో పుట్టిన ఈ చెట్టును క్రీ.పూ. సుమేరియన్లు తొలిగా పెంచారనీ తరువాత బాబిలోనియన్లూ అస్సీరియన్లూ ఈజిప్టియన్లూ మరింతగా పెంచి పోషించినట్లుగా చెబుతారు. ఆపైన అరబ్బుల ద్వారా ఉత్తర ఆఫ్రికా నుంచి స్పెయిన్‌కీ అక్కడ నుంచి కాలిఫోర్నియాకీ దీని శాఖలు విస్తరించినట్లుగా కనిపిస్తోంది. అందుకే యూదులు, ముస్లింలు, క్రైస్తవులు ఈ చెట్టును ఎంతో ముఖ్యమైనదిగా గుర్తించి గౌరవిస్తారు. శాంతికీ, న్యాయానికీ, రవాణాకీ సంకేతంగా ఖర్జూరాన్ని సుమేరియన్లు భావించేవారట. ఈ చెట్టును కేవలం పండ్ల కోసమే కాక నీడకోసం పశువుల మేతకోసం కలపకోసం ఆయుధాలు, తాళ్లకోసం సుమేరియన్లు పెంచినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

ఒకప్పుడు ఖర్జూరాన్ని అత్యధికంగా సాగుచేసిన దేశం ఇరాక్. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం ఖర్జూరాల్ని పెంచిన దేశం కూడా అదే. అందుకే అక్కడి నాణేలు, స్టాంపులు చివరకి బిల్లులమీద కూడా ఖర్జూరచెట్ల బొమ్మలు కనిపిస్తాయి. సౌదీ అరేబియా, మొరాకోల్లో కూడా దీన్ని ముఖ్యమైన సంప్రదాయ పంటగానే సాగుచేస్తున్నారు. ఉత్తర ఆఫ్రికా దేశాలైన లిబియా, టునీషియా, అల్జీరియా దేశాలు సైతం ఈ పంటను పండిస్తూ ఆయా దేశాల స్టాంపులు, కరెన్సీ నోట్లమీద ఈ చెట్టు బొమ్మను ముద్రిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని ఆలీస్‌ స్ప్రింగ్స్‌తోపాటు పశ్చిమ చైనా, పశ్చిమ భారతం, దక్షిణ పాకిస్తాన్ లలో కూడా వీటిని విరివిగా పెంచడం విశేషం. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ఏటా 11 లక్షల టన్నుల ఖర్జూరాల్ని ఉత్పత్తి చేస్తూ నంబర్‌వన్‌గా ఈజిప్టు మన్ననలందుకుంటోంది. సహారా వాసులు మూడింట రెండొంతుల ఆదాయాన్ని ఈ పంట నుంచే పొందుతున్నారు.

ఖర్జూరంలో రకాలు
పండ్లలోని తేమను బట్టి ఖర్జూరాల్ని మెత్తనివి, కాస్త ఎండినట్లుగా ఉండేవి, పూర్తిగా ఎండినట్లుగా ఉండేవి అని మూడు రకాలుగా విభజించారు. మొదటి రకంలో తేమ ఎక్కువా తీపి తక్కువా ఉంటే రెండో రకంలో తేమ తక్కువా తీపి ఎక్కువా ఉంటాయి. మూడో రకం తేమ శాతం అతి తక్కువగా ఉండి తీపి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక రంగు రుచి ఆధారంగా ఖర్జూరాలు ఎన్నో రకాలు. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఇవి పండుతున్నా కొలరాడో నదీ తీరాన ఉన్న బార్డ్‌ వ్యాలీలోని పామ్‌ స్ప్రింగ్స్‌లో పండే మెడ్‌జూల్‌ రకానికి మరేవీ సాటిరావని ప్రతీతి. ముదురురంగులో నున్నగా ఉండే ఈ ఖర్జూరాల్నే 'కింగ్‌ ఆఫ్‌ డేట్స్‌' అని కూడా అంటారు. తరువాత స్థానం గుండ్రంగా ఉండే బార్హీది. ఇది మృదువుగా తియ్యగా ఉంటుంది. దీన్ని 'హనీ బాల్‌' అని కూడా అంటారు. ఎక్కువ కాలం నిల్వ ఉండే 'డెగ్లట్‌ నూర్‌', పుడ్డింగ్‌లా కనిపించే 'ఖాద్రావి', అచ్చం తేనెలా ఉండే 'హనీ', నలుపు రంగులో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండే 'బ్లాక్‌ డేట్‌', పొడవుగా కాస్త అంబరు (amber) వర్ణంలో నమిలేటట్లుగా ఉండే 'గోల్డెన్‌ ప్రిన్సెస్‌'... ఇలా ఖర్జూరాల్లో ఎన్నెన్నో రకాలు ఉన్నాయి.

ఎండు ఖర్జూరాలు
ఏ పండయినా పండుగానే బాగుంటుంది. కానీ ఖర్జూరపండు ఎండినా రుచే. నట్‌గా మారిన ఎండు ఖర్జూరంలోని నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తియ్యగా ఉంటుంది. మెత్తని పండ్లకోసం అయితే ఇవి రంగు మారి దోరరంగులోకి రాగానే చెట్టు నుంచి తీస్తారు. అదే ఎండుఖర్జూరాల కోసం అయితే చెట్టునే బాగా ఎండనిచ్చి తెంచుతారు. కోశాక వాటిని కొంతకాలం తేమ వాతావరణంలో ఉంచి కాస్త మెత్తబడేలా చేస్తారు. వేసవిలో ఎండుఖర్జూర నీళ్లు తాగని పసిపిల్లలు అరుదే. స్వీట్లు, పుడ్డింగ్‌లు, కేకులు, డెజర్ట్‌ల తయారీలో ఖర్జూరం ఉండి తీరాల్సిందే.
పవిత్రఫలం

సంప్రదాయఫలంగానూ నీరాజనాలందుకునేది ఖర్జూరమే. రంజాన్‌ మాసం వచ్చిందంటే చాలు, పరిపుష్టికరమైన ఆ పండుతోనే ముస్లింలకు ఉపవాసదీక్ష పూర్తవుతుంది. అందుకే వారికిది లేనిదే పొద్దు గడవదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, మహమ్మద్‌ ప్రవక్తకు ఇది ఎంతో ఇష్టమైన ఆహారంగా పవిత్ర గ్రంథం, ఖోరాన్ పేర్కొంటోంది. ఆయన ఇంటికి కలపనిచ్చింది కూడా ఖర్జూర చెట్టేననీ చెబుతారు. అంతేగాక, ముస్లింల ప్రథమ మసీదు మదీనా లోని మస్జిద్ ఎ నబవీ (ప్రవక్త గారి మసీదు) నిర్మాణం కొరకు ఉపయోగించింది, ఖర్జూరపు చెట్టు కలప మరియు పై కప్పులకు ఖర్జూరపు చెట్టు ఆకులు. ఇస్లామిక్‌ దేశాల్లో ఖర్జూర వృక్షాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
శక్తి 280 kcal   1180 kJ
పిండిపదార్థాలు         75 g
- చక్కెరలు  63 g
- పీచుపదార్థాలు  8 g
కొవ్వు పదార్థాలు     0.4 g
మాంసకృత్తులు     2.5 g
నీరు     21 g
విటమిన్ సి  0.4 mg     1% శాతములు, Source: USDA పోషక విలువల డేటాబేసు

ఉపయోగాలు
ఖర్జూరం, పండుగానే కాక చెట్టుగా కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.
    లేత ఆకుల్ని కూరగా వండుకుంటారు.
    ఉత్తర ఆఫ్రికాలో ఆకుల్ని పూరికప్పులుగా వాడటమూ ఎక్కువే.
    తాటి ఆకుల మాదిరిగానే చాపలు, తడికెలు, బుట్టలు, విసనకర్రల్లోనూ వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది.
    ఎండుటాకులు చీపుళ్లుగానూ వంటచెరకుగానూ ఉపయోగపడతాయి.
    ఆకుల్లోని పీచుతో తాళ్లు, టోపీలు, నేతబట్ట... లాంటివీ అల్లుతారు.
    కరవు సమయాల్లో వీటి విత్తనాల్ని పొడి చేసి గోధుమపిండిలో కలిపి రొట్టె చేసుకుని తింటారు.
    నానబెట్టి పొడికొట్టిన విత్తులు పశువుల మేతకి ఎలానూ పనికివస్తాయి.
    సబ్బులు, సౌందర్య సాధనాల తయారీలో విత్తనాల నుంచి తీసిన తైలం వాడతారు.
    ఆక్జాలిక్‌ ఆమ్లానికి ఈ విత్తులే మంచి వనరులు.
    కాఫీ బీన్స్‌ మాదిరిగా వీటిని కాఫీపొడిలో కలపడమూ కద్దే.
    ఖర్జూర ఫలాలే కాదు, పుష్పాలూ రుచికరమైనవే. అందుకే ఆయా దేశాల మార్కెట్లలో వీటిని ప్రత్యేకంగా అమ్ముతారు.
    పూమొగ్గల్ని సలాడ్‌లలో ఎండుచేపల కూరల్లో వాడతారు.

ఖర్జూరంతో వైద్యం

    పెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్‌ చక్కగా ఉపయోగపడుతుంది.
    గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటివాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్‌ మంచి మందు.
    డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు కాండం నుంచి తీసిన జిగురును వాడతారు.
    చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటినొప్పీ తగ్గుతుంది.

ఇతర విశేషాలు

    గాలిచొరని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే ఖర్జూరపండ్లు కనీసం నెలరోజులు నిల్వ ఉంటాయి. కొన్ని పద్ధతుల ద్వారా వీటి రుచి పాడవకుండా ఏడాదిపాటు నిల్వ ఉండేలా కూడా చేస్తారు.
    ఒకవేళ మరీ ఎక్కువ ఖర్జూరాలు పండితే ప్రాసెసింగ్‌ ద్వారా వాటిని పంచదార, జామ్‌, జెల్లీ, జ్యూస్‌, సిరప్‌, వినెగర్‌గా మార్చి విక్రయిస్తున్నారు.
    బలవర్థకమైన ఆహారంలో భాగంగా ఖర్జూర సిరప్‌ను తేనెలా రోజూ కొద్దికొద్దిగా తీసుకుంటుంటారు.
    ఇస్లామిక్‌ దేశాల్లో రంజాన్‌ మాసంలో ఆల్కహాల్‌కు బదులుగా ఖర్జూరాలతో తయారుచేసిన షాంపేన్‌ లాంటి పానీయాన్ని తాగుతున్నారు.
    మొరాకోలాంటి ఆఫ్రికా దేశాల్లో ఖర్జూరాన్ని వంటల్లో విరివిగా వాడతారు.
    సహారా వాసులు గుర్రాలు, ఒంటెలు, కుక్కలకు ఆహారంగా ఎండు ఖర్జూరాల్ని వాడతారు.
    ఉత్తర నైజీరియన్లు ఖర్జూరాలకు మిర్చిని జోడించి ఓ రకమైన బీరును తయారుచేస్తారు.


మహిళలు ఖర్జూరాలను ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణు లంటున్నారు. ఎందుకంటే మన దేశంలోని 85 శాతం యుక్తవయుసున్న మహిళల్లో రక్తహీనత ఉంటుంది.

    ప్రతి 100 గ్రాములు ఖర్జూరాల్లో 0.90 మి. గ్రా ఐరన్‌ ఉంటుంది. దాంతో ఖర్జూరాలు క్రమం తప్పకుండా తినేవారికి రక్తహీనత తగ్గుతుంది. ఖర్జూరాల్లో ఉన్న పోషకాలు, అవి చేసే మేలు ఎంత అని చెప్పలేం. ఇందులో ఫ్రక్టోజ్‌, డెక్స్‌ట్రోజ్‌ అనే చక్కెర పదార్థాలు ఎక్కువుగా ఉండటం వల్ల ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు చెబుతున్నారు.
    ప్ఖర్జూరాల్లో పీచుపదార్థం (డయటరీ ఫైబర్‌) చాలా ఎక్కువ. ఖర్జూరాలు తింటే అందులో ఉన్న పీచుపదార్థాలు శరీరంలో ఉన్న చెడుకొలెస్ట్రాల్‌కు అడ్డుపడి శరీరంలో ఇంకకుండా చూస్తాయి. దాంతోపాటు తేలిగ్గా మలవిసర్జన కావడం జరుగుతుంది.
    ప్ఖర్జూరాల్లో ఉండే టాన్సిన్‌ అని పిలిచే ప్లేవనాయిడ్‌ పాలిఫీనాలిక్‌ యాంటీఆక్సిడెంట్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్లు, మంట, వాపు వంటివి కలగడాన్ని, రక్తసవ్రాలను నివారిస్తాయి. ఇందులో ఉన్న జీ-గ్జాంథిన్‌ అనే పోషకం మన కంటి రెటీనాలోకి శోషితమై కంటిని సంరక్షిస్తుంటుంది.
    ప్వయసు పెరగడం వల్ల కన్ను సామర్థ్యం తగ్గడాన్ని ఈ పోషకం నివారిస్తుంది. హైబీపీ ఉన్నవారు వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండెజబ్బులు, పక్షవాతం వంటి వాటిని నివారిస్తుంది.

Source : wikipedia.org.


  • ==============================


 Visit my Website - Dr.Seshagirirao.com

Fruits safe to Diabetics,షుగర్‌వ్మాధి ఉన్నవారు తినగలిగే పండ్లు









  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.






కొన్ని వైద్యసంస్థలు పౌష్టికాహార నిపుణులు పొందపరచిన వివిధ మార్గదర్శకాల ప్రకారం ప్రతి రోజూ మనిషి తీసుకొనే ఆహారంతో పాటు 4-5 రకాల పండ్లను తీసుకోవడం చాలా అవసంర అని. మరి ఈ ప్రశ్న మధుమేహ గ్రస్తులకు వర్థిస్తుందా అంటే, రకరకాల పండ్లను వారు తీసుకోవడం వల్ల వారి సురక్షితమా అని వివిధ రాకాల ప్రశ్నలు వారిలో కలుగజేస్తాయి. నిపుణుల ప్రకారం, మధుమేహగ్రస్తులు తీసుకొనే పండ్లు కూడా ఉన్నాయి.

కొన్ని రకాల పండ్లను తరచూ తీసుకోవడం వల్ల అవి మధుమేహగ్రస్తుల్లో చక్కెర స్థాయి నియంత్రలో ఉంటుంది. అయితే ఈ పండ్లును వారు పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. అయితే మధుమేహ గ్రస్తులు తీసుకొనే పండ్లు రోజు ఆధారంగా అంటే మెదటి రోజుకి, రెండవ రోజుకి సమానంగా ఉండేలా సరిచూసుకోవాలి. శరీరంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. కొన్ని రకాల పండ్లు ఉదా: అరటి, లిచ్చీస్‌, చిక్కో సీతాఫలం వంటి పండ్లను తీసుకోవడంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. వీటిలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. కాబట్టి మధుమేహ గ్రస్తులు తీసుకొనే కొన్ని రకాల పండ్లు గురించి తెలుసుకుందాం...



  • కివి పండు


కొన్ని పరోశోధనల ప్రకారం...కివి పండ్లు తినడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి తక్కువ అవుతుందని దృఢపరిచారు.



  • బ్లాక్‌ జామున్‌ (నేరేడు పండ్లు)


మధుమేహగ్రస్తులు షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్లో ఉంచడానికి ప్రతి రోజూ నల్లటి నేరేడు పండ్లను తీసుకోవచ్చు. తెల్లని నేరేడు పండ్లలో కూడ ఫైబర్‌ అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని కూడా తీసుకోవచ్చు.



  • వైట్‌ జామూన్‌ (తెల్ల నేరేడు పండ్లు)


ఇవికూడా నేరేడు పండ్ల జాతివే. తెల్లనేరేడు పండ్లలో కూడా ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ ను కంట్రోల్‌ చేసే శక్తి అందిస్తుంది. కాబట్టి వీటిని కూడా రోజూ తినవచ్చు.



  • స్టార్‌ ఫ్రూట్‌


నేరేడు పండ్లులాగే ఉండే ఈ స్టార్‌ ఫ్రూట్‌ మధుమేహ గ్రస్తులకు చాలా మంచిది బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ ను కంట్రోల్‌ చేస్తుంది. ఈ ఫ్రూట్స్‌ తినడంతో పాటు మధుమేహ గ్రస్తులు కొంచెం వ్యాయామం చేయాల్సి ఉంటుంది.



  • జామకాయ (గువా)


జామకాయలో అధికశాతంలో విటమిన్‌ ఎ విటమిన్‌ సి, ఫైబర్‌ ఉండటం వల్ల జామకాయ మధుమేహాన్ని నియంత్రి స్తుంది. మరియు మలబద్దకానికి మంచిది.



  • చెర్రీ


చెర్రీస్‌లో సుగర్ 20% ఉంటుంది. మధుమేహగ్రస్తులకు చెర్రీస్‌ ను ఓ మంచి స్నాక్‌ అని చెపవచ్చు. వీటిని రోజులో ఎప్పుడైపనా తినవచ్చు.



  • పీచెస్‌


ఈ ఫ్రూట్‌ చాలా మంచి టేస్ట్‌ కలిగి ఉంటుంది. అలాగే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఇందులో తక్కువగా ఉండటం వల్ల మధుమేహగ్రస్తులకు చాలా మంచిది.



  • బెర్రీస్‌


బెర్రీస్‌లో చాలా రకాలు ఉన్నాయి, స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్‌ బెర్రీ, రాస్పెబెర్రీ, క్రాన్‌ బెర్రీ, చోక్‌ బెర్రీ.. వీటిలో యాంటిఆక్సిడెంట్స్‌ అధికంగా ఉండటం వల్ల మధుమేహగ్రస్తులు నిరభ్యంతరంగా తినవచ్చు.



  • పైనాపిల్‌


పైనాపిల్‌ డైయాబెటిక్‌ పేషంట్స్‌కు చాలా మంచిది. పైనాపిల్‌ వల్ల చాలా ప్రయోజ నాలున్నాయి. యాంటీ వైరల్‌, యాంటీ ఇన్ఫమేటరీగాను క్రిమినాశనకారిగాను పనిచేసే లక్షణాలు సమౄఎద్ధిగా ఉండటం వల్ల మధుమేహగ్రస్తులకు చాలా మంచిది.



  • ============================


 Visit my Website - Dr.Seshagirirao...

Sunday, 13 October 2013

Usese of Rudraksha,రుద్రాక్షలతో ఉపయోగాలు


  •  







  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



రుద్రాక్ష అనేది రెందు పదాల కలయిక .రుద్ర అంటే శివుడు . అక్ష అంటే కళ్ళు . ఈ రుద్రాక్షను పరమశ్వుడికి సంబంధించన పవిత్రమైన గింజలుగా పరిగణిస్తారు . అనుకూలత , మంచి ఆరొగ్యాలతో అనుసంధానమైన రుద్రక్షలవల్ల అనేక ప్రయోజనాలు సమకూరుతాయని శాస్త్రీయము గా నిరూపైంచబడింది.
రుద్రుని(శివుడు) అక్షుల నుండి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారినవని అంటారు. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. ఇవి పురాణ కాలం నుండి ఉపయోగించబడుతున్నవి. ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అందరూ వీటిని ధరించువారేనని పురాణాల ద్వారా తెలియుచున్నది. ఇప్పటికీ బ్రాహ్మణులు, పూజారులు, వేదాంతులు, గురువులు లాంటివారు వీటిని ధరిస్తారు. ధరించుట వీలుకాని వారు పూజా గృహముల యందు ఉంచి పూజించుట కద్దు.



  • రుద్రాక్షలు-రకాలు


రుద్రాక్షలలో పలు రకాలు కలవు. కొన్ని ప్రత్యేకమైన అడవులలో మాత్రమే పెరిగే రుద్రాక్ష వృక్షాల నుండి సేకరించే రుద్రాక్షలు పచ్చిగా ఉన్నపుడు కోడిగుడ్డు, ఓక కాయ ఆకారం కలిగి ఉంటాయి. ఎండిన తరువాత ఇవి కుచించుకుంటూ గుండ్రముగా మారుతాయి. దీని మధ్య భాగమున కల తొడిమ ఎండి రాలిపోతుంది. అది రాలిన తరువాత రుద్రాక్ష మధ్య కాళీ ఏర్పడి దారం గుచ్చుటకు వీలు కలుగుతుంది. వీటిని ముఖ్యముగా ముఖముల సంఖ్యాపరంగా విభజిస్తారు. ఒక ముఖము నుండి పన్నెండు, పదిహేను ముఖాల వరకూ కలిగి ఉంటాయి. ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్షలు కూడా వున్నాయి. ఎక్కడైనా అత్యధికంగా లభించునవి పంచముఖ రుద్రాక్షలు. వీటిలో ఒక ముఖము కలిగిన రుద్రాక్షను ఏకముఖి అంటారు. ఇది అన్నిటిలోకీ
ప్రశస్తమయినదిగా చెపుతారు. దీనిని ధరించిన వారికి సర్వవిధాలా విజయం చేకూరునని నమ్ముతారు. అలాంటి రుద్రాక్షల వివరాలు.



  •     ఏకముఖి. (ఒక ముఖము కలిగినది)--అత్యంత శ్రేష్టమయినది. శివుని త్రినేత్రంగా, ఓం కార రూపంగా నమ్ముతారు.

  •     ద్విముఖి (రెండు ముఖములు కలిగినది)--దీనిని శివపార్వతి రూపంగా నమ్ముతారు.

  •     త్రిముఖి (మూడు ముఖములు కలిగినది)--దీనిని త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు.

  •     చతుర్ముఖి (నాలుగు ముఖాలు కలిగినవది)--నాలుగు వేదాల స్వరూపం

  •     పంచముఖి (అయిదు ముఖాలు కలిగినది)--పంచభూత స్వరూపం

  •     షట్ముఖి (ఆరు ముఖములు కలది)--కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి.

  •     సప్తముఖి (ఏడు ముఖాలు కలిగినది)--కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని ప్రజల విశ్వాసం

  •     అష్టముఖి (ఎనిమిది ముఖాలు కలిగినది)--విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.

  •     నవముఖి (తొమ్మిది ముఖాలు కలది)--నవగ్రహ స్వరూపం. భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి.

  •     దశముఖి (పది ముఖాలు కలిగినది)--దశావతార స్వరూపం. జనార్ధనుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు. 


ఇండస్ట్రియల్ స్కానింగ్ కానీ , డెంటల్ ఎక్స్ రే యంత్రంతో తీసిన ఎక్స్ రే ద్వారా నిజమైన రుద్రాక్షని గుర్తించవచ్చు


  • పూజలలో రుద్రాక్షలు


రుద్రాక్షలను 108 గాని, 54 గాని, 27 గాని బంగారము, వెండి లేదా రాగి తీగతో మాలగా తయారుచేయించి మెడలో ధరించవలెను. జప మాలగా కూడ ఉపయోగించవచ్చును.



  • వైద్యంలో రుద్రాక్షలు


రుద్రాక్షలు ధరించుట వలన  దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్మకం. రుద్రాక్షలను అన్ని వర్ణములవారు ధరించవచ్చును. రుగ్మతలు నియంత్రించడానికి , ఆరోగ్య సమస్యల పరిష్కరారానికి , శరీరములో చక్రాలను సమతుల్యపరిచేందుకు , ఆరా క్లెన్సింగ్ కు వీటిని ఉపయోగిస్తారు.

రుద్రాక్షను జీవితాన్ని పరిరక్షించే ఔషధం లేదాగింజగా భావిండము పరిపాటి .రుద్రాక్షలను ధరిందడము లేదా నీటిలోవేసి ఉంచడము ద్వారా వివిధ రూపాల్లో వాడి ప్రయోజనాలు పొందవచ్చును. నీళ్ళలో రుద్రక్షను వేసి ఆ నీరు తాగడము వల్ల శారీరక ఉష్ణోగ్రను సరిచేయవచ్చును. శరీరము నుండి విషతుల్యాల్ని వెలికి నెట్టవచ్చును. ఇది చర్మాన్ని కాంతివంతముగా ఉంచుతుంది. గుండె సంబంధిత రుగ్మతలను , రక్తపోటును , ఉదరసమస్యలు , తలనొప్పి , డయాబిటీస్ , రక్తహీనత , స్థూలకాయము , మబద్దకము మొదలైనవాటిని అరికట్టడములో రుద్రాక్షలు సహకరిస్తాయి. 


  • =========================


Visit my Website - Dr.Seshagirirao...