Pages

Labels

Popular Posts

Saturday 19 October 2013

Fruits safe to Diabetics,షుగర్‌వ్మాధి ఉన్నవారు తినగలిగే పండ్లు









  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.






కొన్ని వైద్యసంస్థలు పౌష్టికాహార నిపుణులు పొందపరచిన వివిధ మార్గదర్శకాల ప్రకారం ప్రతి రోజూ మనిషి తీసుకొనే ఆహారంతో పాటు 4-5 రకాల పండ్లను తీసుకోవడం చాలా అవసంర అని. మరి ఈ ప్రశ్న మధుమేహ గ్రస్తులకు వర్థిస్తుందా అంటే, రకరకాల పండ్లను వారు తీసుకోవడం వల్ల వారి సురక్షితమా అని వివిధ రాకాల ప్రశ్నలు వారిలో కలుగజేస్తాయి. నిపుణుల ప్రకారం, మధుమేహగ్రస్తులు తీసుకొనే పండ్లు కూడా ఉన్నాయి.

కొన్ని రకాల పండ్లను తరచూ తీసుకోవడం వల్ల అవి మధుమేహగ్రస్తుల్లో చక్కెర స్థాయి నియంత్రలో ఉంటుంది. అయితే ఈ పండ్లును వారు పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. అయితే మధుమేహ గ్రస్తులు తీసుకొనే పండ్లు రోజు ఆధారంగా అంటే మెదటి రోజుకి, రెండవ రోజుకి సమానంగా ఉండేలా సరిచూసుకోవాలి. శరీరంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. కొన్ని రకాల పండ్లు ఉదా: అరటి, లిచ్చీస్‌, చిక్కో సీతాఫలం వంటి పండ్లను తీసుకోవడంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. వీటిలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. కాబట్టి మధుమేహ గ్రస్తులు తీసుకొనే కొన్ని రకాల పండ్లు గురించి తెలుసుకుందాం...



  • కివి పండు


కొన్ని పరోశోధనల ప్రకారం...కివి పండ్లు తినడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి తక్కువ అవుతుందని దృఢపరిచారు.



  • బ్లాక్‌ జామున్‌ (నేరేడు పండ్లు)


మధుమేహగ్రస్తులు షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్లో ఉంచడానికి ప్రతి రోజూ నల్లటి నేరేడు పండ్లను తీసుకోవచ్చు. తెల్లని నేరేడు పండ్లలో కూడ ఫైబర్‌ అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని కూడా తీసుకోవచ్చు.



  • వైట్‌ జామూన్‌ (తెల్ల నేరేడు పండ్లు)


ఇవికూడా నేరేడు పండ్ల జాతివే. తెల్లనేరేడు పండ్లలో కూడా ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ ను కంట్రోల్‌ చేసే శక్తి అందిస్తుంది. కాబట్టి వీటిని కూడా రోజూ తినవచ్చు.



  • స్టార్‌ ఫ్రూట్‌


నేరేడు పండ్లులాగే ఉండే ఈ స్టార్‌ ఫ్రూట్‌ మధుమేహ గ్రస్తులకు చాలా మంచిది బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ ను కంట్రోల్‌ చేస్తుంది. ఈ ఫ్రూట్స్‌ తినడంతో పాటు మధుమేహ గ్రస్తులు కొంచెం వ్యాయామం చేయాల్సి ఉంటుంది.



  • జామకాయ (గువా)


జామకాయలో అధికశాతంలో విటమిన్‌ ఎ విటమిన్‌ సి, ఫైబర్‌ ఉండటం వల్ల జామకాయ మధుమేహాన్ని నియంత్రి స్తుంది. మరియు మలబద్దకానికి మంచిది.



  • చెర్రీ


చెర్రీస్‌లో సుగర్ 20% ఉంటుంది. మధుమేహగ్రస్తులకు చెర్రీస్‌ ను ఓ మంచి స్నాక్‌ అని చెపవచ్చు. వీటిని రోజులో ఎప్పుడైపనా తినవచ్చు.



  • పీచెస్‌


ఈ ఫ్రూట్‌ చాలా మంచి టేస్ట్‌ కలిగి ఉంటుంది. అలాగే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఇందులో తక్కువగా ఉండటం వల్ల మధుమేహగ్రస్తులకు చాలా మంచిది.



  • బెర్రీస్‌


బెర్రీస్‌లో చాలా రకాలు ఉన్నాయి, స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్‌ బెర్రీ, రాస్పెబెర్రీ, క్రాన్‌ బెర్రీ, చోక్‌ బెర్రీ.. వీటిలో యాంటిఆక్సిడెంట్స్‌ అధికంగా ఉండటం వల్ల మధుమేహగ్రస్తులు నిరభ్యంతరంగా తినవచ్చు.



  • పైనాపిల్‌


పైనాపిల్‌ డైయాబెటిక్‌ పేషంట్స్‌కు చాలా మంచిది. పైనాపిల్‌ వల్ల చాలా ప్రయోజ నాలున్నాయి. యాంటీ వైరల్‌, యాంటీ ఇన్ఫమేటరీగాను క్రిమినాశనకారిగాను పనిచేసే లక్షణాలు సమౄఎద్ధిగా ఉండటం వల్ల మధుమేహగ్రస్తులకు చాలా మంచిది.



  • ============================


 Visit my Website - Dr.Seshagirirao...