Pages

Labels

Blog Archive

Popular Posts

Thursday, 26 December 2013

Betel Nut, Areca Nut,పచ్చి వక్క


  •  





  •  




పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

వక్క - Betel Nut :--

షడ్రుచుల భోజనం అనంతరం భుక్తాయాసం తీర్చుకోవడానికి వక్కపలుకులు నోట వేసుకోవడం ఇప్పటికీ చాలామందికి అలవాటు . ఇక శుభకార్యాలకయితే ఆకు ,వక్క లేందే ఆ కార్యానికి నిండుదనమే రాదు . తాంబూలాలు మార్చుకోవడతో వివాహతంతు ప్రారంభమవుతుంది . నిత్యజీవితం లో చాలా కాలము నుండి మమేకమైపోయిన వక్క సంగతేమిటో తెలుసుకుందాం .



పచ్చి వక్క (Betel Nut, Areca Nut) అసోం ప్రజల జీవన శైళిలో ప్రధాన భాగం. కొబ్బరిచెట్టులా కనపడే ఈ చెట్టు ప్రతి ఇంట్లోను సాధారణంగా ఉంటుంది. సుమారు 20 అడుగుల ఎత్తు ఉండే ఈ చెట్టు, ప్రతి ఏటా కాపు కాస్తుంది. ఒక గెలలో 200 -300 దాకా వక్కలు ఉంటాయి. పండిన వక్కలను ఒకటి లేదా రెండు నెలలు భూమిలో పాతి పెడతారు. ఈ వక్క తిన్నప్పుడు కొంచెం కళ్ళు తిరగడం సహజం. దీనిని తమోల్ అని అసోంలో అంటారు. ఇది ప్రతి మంగళ కార్యంలోను అసోం ప్రజలు ఉపయోగిస్తారు.



వక్కలు కాసే చెట్లని పోక చెట్లని అంటారు . ప్రపంచవ్యాప్తముగా పలు దేశాలలో పోకచెట్లు సాగుచేస్తున్నారు. ఈ చెట్లు ఆగష్ట్ , నవంబర్ నెలల మధ్య కాపుకు వస్తాయి. వక్కల నుండే వక్క పొడి తయారుచేస్తారు.



అదృష్టానికి చిహ్నాలు : -- వక్కలను అదృష్టానికి ప్రతీకలుగా భావిస్తారు. ఇంటికి వచ్చిన అతిధులు వెళ్ళిపోయే సమయములో వారికి ఆకులు , వక్కలతో తాంబూలం ఇచ్చి సాగనంపడం అతిధి మర్యాదగా భావిస్తారు. ఇక కొత్తపెళ్ళికూతురుని అదృష్టము గా భావించి ఆకులు వక్కలు ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తారు.



ఆచారవ్యవహారాలలో వక్కలు :-- పూజలు , వ్రతాలులలో వక్కలు లేకుండా పూజా తంతు ప్రారంభించరు . వివాహం నిశ్చయం అయ్యాక తాంబూలము తీసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారము .వక్కలు రుచికి వగరుగా ఘాటుగా ఉంటాయి.మొట్టమొదటి సారిగా వీటిని తిన్నవారికి కొద్దిగా కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తుంది. వీటిని నములు తుంటే కొద్దిగా మత్తు వచ్చిన అనుభూతిని పొందుతారు .అందుకే దీనికి అలవాటు పడిపోతారు.



వక్కలు చెడు గుణాలు   :-


  • వక్కలలో ఆల్కలాయిడ్స్ , టానిన్లు శాతము ఎక్కువగా ఉంటాయి.ఇవి ఆరోగ్యానికి హానికరము .

  • అంతేకాకుండా తరచుగా వక్కలు - ఆకులు కలిపి తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి హానికరమని , కాన్సర్లు రావడానికి కారణం అవుతాయని నిపుణులు అంటారు. Due local irritation , 

  • అదేపనిగా నమలడము వలన 'మతిమరుపు' వచ్చే అవకాశము ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. 

  • వక్కలు , వక్కపొడి గర్భిణిలు,బాలింతలు  తీసుకోకూడదు . బిడ్డకు ,తల్లికి దుష్పరిణామాలు కలిగే ప్రమాదము ఉంది. 

  • 18 సం.లు లోపు వారు వీటిని ఎక్కువగా తీసుకోకూడదు . రక్తము విరిగిపోయే(blood dyscariasis)ప్రమాదము లేకపోలేదు. 

  • ఒక రకమైన మత్తును , హాయిని కలిస్తాయి కనుకనే వీటిని బానిసలయ్యే (adict) ప్రమాదము లేకపోలేదు. 




సుగుణాలు : అందరూ  భయపడినట్లు వక్కలు ఆరోగ్యానికి హానికరము కాదు వీటిలో సుగుణాలూ ఉన్నాయి.


  • పొట్టలో చేరిన లద్దెపురుగులు(round worms) , నులిపురుగులు(pin worms) నాశనము చేస్తాయి. 

  • నోటి దుర్వాశన ను పోగొడతాయి , 

  • దీనిలోని " ఎరికోలిన్‌ " అనే పదార్ధము మెదడును ప్రబావితం చేస్తుంది ... ఉత్సాహాన్ని కలిగిస్తుంది . హాలహాలు , కెఫిన్‌ ల తరువాత మానసిక ప్రేరేపిత పదార్ధము గా దీన్ని చెబుతారు. 

  • గుండె జబ్బులతో బాధపడేవారికి దీనిలోని " యాంటీ ఇన్‌ఫ్లమేటరీ " గుణాలు కొంతవరకు మేలు చేస్తాయి. 

  • మత్స్య కారులు ' ఆక్టోపస్ ' వలన కలిగే పుండ్ల కు మందుగా వాడుతారు.

  • సెల్యులార్ డీజనరేషన్‌ ను అడ్డుకునే శక్తి వక్కలలోని యాంటీఆక్షిడెంట్లకు ఉన్నది. 

  • స్కిజోఫ్రినియా (మానసిక వ్యాది )నుంచి విముక్తి పొందడానికి వక్కలు పనిచేస్తాయని కొన్ని పరిశోధనల వలన వెళ్ళడైనది. 


అపోహలు - వాస్తవాలు : 

అపోహ : వక్కలు నమలడం వలన మెదడు మొద్దుబారుతుందని కొందరి నమ్మకం .

వాస్తవం : చాలామందికి ఇప్పటికీ టిఫిన్‌, భోజనము చేసిన వెంటనే వక్కపొడి తినడం అలవాటు . దీనివలన జీర్ణశక్తిని , ఉత్సాహాన్ని పొందవచ్చుననేది  వాస్తవం  . అదే పనిగా రోజంతా తినడం వలన మెదడు పై కొంత చెడుప్రభావము వాస్తవమే.

అపోహ : వక్కలు లేదా వక్కపొడి తినడము వలన దంటాలు నల్లబడతాయని అంటారు .

వాస్తవం : ఇది కేవలము అపోహ మాత్రమే . దంత సంరక్షణ సరిగా ఉంటే పళ్ళ ఆరోగ్యానికి హానిలేదు.సున్నము , తమలపాకు , వక్కలతో కలిపి తింటే ఒక రకమైన రంగు పళ్ళకు వచ్చి చేతుతుంది.

అపోహ : వక్కపొడివలన క్యాన్సర్ వస్తుంది.

వాస్తవం : వక్కపొడి వలన క్యాన్సర్లు వచ్చినట్లు ఎక్కడా దాఖలాలు లేవు . క్యాన్సర్ రావడానికి అనేక కారణాలలో ఇది ఒకటి మాత్రమే. 



పోషకాలు : వక్కలు ఆరోగ్యానికి మంచివి అవునా? కాదా? అన్నవిషయం పక్కన పెడితే వీటిలో పోషకాలు ఎక్కువే :--- ప్రతి 100 గ్రాములకు ..


  • ప్రోటీన్‌ : 5.2 గ్రాములు ,

  • ఫ్యాట్ : 10.2 గ్రాములు , 

  • కార్బోహైడ్రేట్స్ : 56.7 గ్రాములు  ,

  • థైమిన్‌ : (బి1): 19.0 మి.గ్రా.

  • రైబోఫ్లేవిన్‌(బి2) : 52.0 మి.గ్రా.

  • నియాసిన్‌ (బి3) : 1.1 మి.గ్రా.

  • సోడియం : 76.0 మి.గ్రా.

  • పొటాసియం : 450 .0 మి.గ్రా.

  • కాల్సియం : 400 . 0 మి.గ్రా.

  • ఫాస్పరస్ : 89.0 మి.గ్రా. 

  • ఐరన్‌ : 4.9 మి.గ్రా.



  •  ===============================


Visit my Website - Dr.Seshagirirao...