Pages

Labels

Blog Archive

Popular Posts

Thursday, 2 January 2014

Herbal Tea,హెర్బల్ టీ


  •  





  •  




పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



 Herbal Tea,హెర్బల్ టీ



తేనీరు - Tea ఒక పానీయం. తేయాకు ను నీటిలో మరిగించి వచ్చిన ద్రావకాన్ని తేనీరు(టీ) అంటారు. మానవ దేహానికి ఉత్తేజాన్ని కల్గించే ఆహార పదార్ధాలలో టీ ప్రధమ స్థానంలో ఉంటుంది. దీనిలో పంచదార, పాలు కలుపుకొని త్రాగుతారు. నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే వరకు మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది. నిస్సత్తువగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా టీ త్రాగడానికి అత్యంత  ఉత్సాహాన్ని చూపడం జీవితంలో ఓ అంతర్భాగమైపోయింది. సగటు భారతీయుల్లో దాదాపు సగం మందికిపైగా టీ సేవిస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితం మానసిక విశ్రాంతి కోసం కాఫీ సేవించడం  అలవాటుగా ఉండేది. ఇళ్ళలో కూడా కాఫీ మాత్రమే వాడుకలో ఉండేది. ఫిల్టర్ కాఫీ బాగా వాడుకలో ఉన్న రోజుల్లో ఇన్‌స్టంట్ కాఫీలు రావడం, వాటితోపాటు పలు రకాల టీ పౌడర్లు మార్కెట్‌లోకి విడుదల కావడం, టీ కి జనసామాన్యంలో అధిక వినియోగం ఏర్పడడం, పైగా అది సామాన్య మానవుడికి అందుబాటు ధరలలో లభించడం టీ కి మరింత ప్రాధాన్యత పెరగడానికి దోహదపడింది.



కాలక్షేపానికో, తలనొప్పిగా ఉందనో, స్నేహితులకు కంపెనీ ఇవ్వడానికో టీ తాగడం మామూలే. ఎవరూ తోడులేకున్నా ఒంటరిగానే రోజుకు ఐదారు లేదా అంతకుమించి ఎక్కువ కప్పుల టీ తాగేవారున్నారు. ఇన్నిసార్లు తాగకపోయినా రోజుకు రెండు మూడు సార్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యశాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. టీవల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని, అనేక ఉపయోగాలున్నాయని వారంటున్నారు.



హెర్బల్ టీ కి ఇతర టీ కి చాలా తేడా ఉంటుంది. హెర్బల్ టీ అంటే అందులో రకరకాల వనమూలికలు కలిపి ఉంటాయి. కాబట్టి మామూలు  'టీ'కి హెర్బల్ 'టీ'కి మీరు తేడాను కనుక్కోవచ్చు. హెర్బల్ టీ రుచికరమే కాక ఇందులో అనేక ఔషధాలు కలిగివుంటాయి. హెర్బల్ టీ తీసుకోవడం వలన శరీరంలోనున్న ఎన్నో రుగ్మతలు దూరమౌతాయంటున్నారు వైద్యులు. మొక్కల యొక్క ఆకులు, వేళ్ళు, పళ్ళు, పూవులు, కాయలు ఇతర చెట్టు భాగాలు, హెర్బల్ టీ తయారీలో ఉపయోగిస్తారు.

హెర్బల్ టీ త్రాగడంవలన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతాయి. గుండెపోటునుకూడా నిరోధిస్తుందంటున్నారు వైద్యులు. దీంతో హృదయం పటిష్టంగా ఉంటుందని వారు తెలిపారు. ఇంతే కాకుండా హెర్బల్ టీ జీర్ణక్రియలో ప్రముఖ పాత్రను పోషిస్తుందని, ఇది శరీరంలోనున్న మలినాలను విసర్జించేలా చేస్తుందని వైద్యులు తెలిపారు.




  • =========================


 Visit my Website - Dr.Seshagirirao...