ఉల్లికాడల ఖరీదు తక్కువే. ఉల్లిపాయల్ని కొనలేక, తినలేక బాధపడుతున్నాం అనుకునే వాళ్లకి తక్కువ ఘాటుతో, మంచి రుచితో ఉండే ఉల్లికాడలు సరైన ప్రత్యామ్నాయం. పోషకాల పరంగా చూసినా ఇవెంతో ఉపయోగపడతాయి.
ఉల్లి కాడల్లో ఉండే కెమోఫెరాల్ అనే ఫ్లవనాయిడ్ రక్తనాళాలపై ఒత్తిడి లేకుండా, రక్తం సాఫీగా సరఫరా అయ్యేట్టు చూస్తుంది. ఉల్లికాడలను ఎక్కువగా వాడితే రక్తపోటూ, ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. వీటిల్లో ఉండే ఫోలేట్లు గుండె జబ్బులని అదుపులో ఉంచుతాయి.
కెలొరీలూ కొవ్వూ తక్కువగా... పీచు ఎక్కువగా ఉండే ఉల్లికాడల్ని తరచూ తినే వారిలో అధిక బరువు సమస్య తలెత్తదు. డైటరీ ఫైబర్ అంటే ఆహార సంబంధిత పీచు వీటి నుంచి సమృద్ధిగా అందుతుంది. అది ఆకలిని అదుపులో ఉంచుతుంది. ఉల్లికాడల్లోని గ్జియాంతిన్ అనే పదార్థం కంటిచూపుని మెరుగుపరుస్తుంది. హానికారక కిరణాల బారి నుంచి చర్మాన్ని కాపాడుతుంది. గర్భిణిగా ఉండగా తొలి మూడునెలల్లో వీటిని తరచూ తినడం వల్ల, కడుపులో బిడ్డకు ఫోలిక్ యాసిడ్ అందుతుంది. గర్భస్థ శిశువుకి వెన్నెముక సమస్యలు రాకుండా ఉంటాయి. ఆటిజం వంటి ప్రవర్తనాపరమైన సమస్యలూ రాకుండా ఉంటాయి.
ఉల్లికాడలు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. కాలేయం చుట్టూ పేరుకొనే అధిక కొవ్వు తగ్గేలా చూస్తాయి. ఉల్లికాడలు చాలా ప్రసిద్ది చెందిన కూరగాయ, ఇవి తెలుపు, పసుపు, ఎరుపుల వంటి వివిధ రకాలలో వస్తున్నాయి. ఈ లేత ఉల్లిగడ్డలు గొప్ప రుచిని, పోషకాలను కూడా పుష్కలంగా కలిగి ఉంటాయి. చాలాకాలంగా ఉల్లికాడలు చైనీస్ సాంప్రదాయ మందులలో వాడడం జరిగింది. ఉల్లిపాయ వలె ఉల్లికాడలలో కూడా సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువమోతాదులో ఉన్న సల్ఫర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ లేత ఉల్లిగాడ్డలలో కాలరీలు తక్కువగా ఉంటాయి. స్కలియన్ లో ఒకరకమైన ఈ ఉల్లికాడలను ఆకుపచ్చని ఉల్లిపాయలు అనికూడా అంటారు. ఉల్లికాడలలో విటమిన్ C, విటమిన్ B2, థయామిన్ లు సమృద్ధిగా ఉంటాయి. అది విటమిన్ A, విటమిన్ K ని కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఇవి కాపర్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, క్రోమియం, మాంగనీసు, ఫైబర్ కు మంచి మూలం. ఉల్లికాడలు క్వేర్సేటిన్ వంటి ఫ్లవోనాయిడ్స్ కి గట్టి ఆధారం.
ఉల్లికాడలలో ఆరోగ్య ప్రయోజనాలు:
గుండెకు మంచిది : ఉల్లికాడలు గుండె, రక్తనాళాలకు మంచిది. ఇది కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గిస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బ్లడ్ ప్రెజర్ ని మెరుగుపరుస్తుంది : ఈ కూరగాయలోని సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రి౦చడానికి, తగ్గించడానికి సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్ స్థాయిలు : ఉల్లికాడలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి.
మధుమేహం : ఉల్లికాడలలో ఉన్న క్రోమియం కంటెంట్ మధుమేహ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది, గ్లూకోస్ శక్తిని పెంచుతుంది. అల్లిల్ ప్రోపిల్ డిసల్ఫయిడ్ తగ్గిన బ్లడ్ షుగర్ స్థాయిలలో చాలా సహాయకారిగా కూడా ఉంటుంది.
జలుబు, జ్వరం : దీనిలో ఉన్న యాంటీ-బాక్టీరియల్ లక్షణం జలుబు, జ్వరానికి వ్యతిరేకంగా పోరాడడానికి సహాయపడుతుంది.
అరుగుదల పెరుగుతుంది : అసౌకర్య అరుగుదల నుండి ఉపశమనానికి యాంటి బాక్టీరియల్ లక్షణాలను కూడా అందిస్తుంది.
వ్యాధినిరోధక శక్తి : ఈ కూరగాయలోని విటమిన్ C వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
పెద్దప్రేగు కాన్సర్ : ఉల్లికాడలలో పెక్టిన్ (నీటిలో కరిగే కొల్లాయిడల్ కార్బోహైడ్రేట్) ముఖ్యంగా పెద్దప్రేగు కాన్సర్ అభివృద్ది అవకాశాలను తగ్గిస్తుంది.
కీళ్ళనొప్పులు, ఉబ్బసం : ఉల్లికాడలలో క్వర్సేటిన్ బాధనివారక, యాంటి హిస్టమైన్ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కీళ్ళనొప్పులు, ఉబ్బస చికిత్సకు మంచి కూరగాయ.
జీవక్రియ : స్ధూలపోషకాలు ఉండడం వల్ల ఇది జీవక్రియ నియంత్రణకు మంచి ఆహారం.
కళ్ళు : ఉల్లికాడలు కళ్ళ జబ్బులకు, కాళ్ళ సమస్యలకు మంచివి.
ముడతలను తొలగిస్తుంది : కూరగాయలలోని అల్లసిన్ చర్మానికి మంచిది, ఇది చర్మం ముడతల నుండి రక్షిస్తుంది.
- ============================
Visit my Website - Dr.Seshagirirao...