పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
Food substances to improve sex-ability, సెక్ష్ సామర్ధ్యము పెంచే ఆహారపదార్ధాలు.
సరైన ఎరెక్షన్ ,అత్యధిక పర్ఫారర్మెన్స్ కోసము కొన్ని పదారమలలు ఉంటాయి ఇంతకముందులా శృంగారంలో పాల్గొనలేకపోతున్నారా? చాలామంది అప్పుడప్పుడు ఇలాంటి అనుభవమే ఎదుర్కునే ఉంటారు. సెక్స్ మీద ఆసక్తి తగ్గడానికి మానసికపరమైన సమస్యలతో పాటు, కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. కానీ చాలామందిలో ఎటువంటి సమస్యలు కనపడదు. అయినా వారిలో ఆ విషయంలో నిస్సత్తువ ఆవరిస్తుంది. క్రమంతప్పకుండా వ్యాయామం, ఒత్తిడికి దూరంగా ఉండటంతో పాటు మీరు తీసుకునే ఆహారంలో ఈ క్రిందవి తప్పకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే ఇక మీ శక్తికి తిరుగుండదు.
గింజధాన్యాలు... బాదం, జీడిపప్పు, అక్రోట్స్ వంటి గింజలు క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల లైంగిక పటుత్వం పెరుగుతుంది. అంతేకాదు సంతాన సామర్థ్యాలను పెంచే సెలీనియం, జింక్ తో పాటు బోలెడన్ని పోషకాలు ఉంటాయి.. వీటితో పాటు మెదడులో డొపమైన్ స్థాయలు పెంచడానికి గింజ ధాన్యాలు దోహదం చేస్తాయి. డొపమైన్ సెక్స్ కోరికను పెంచడంతో సెక్స్ పట్ల ఆసక్తి పెరుగుతుంది.
కోడిగుడ్లు... రోజంతా పనిచేసి అలసిపోవడం కూడా శృంగారంపై ఆసక్తి తగ్గడానికి మరో కారణం కావచ్చు. ప్రొటీన్లు దండిగా ఉండే గుడ్లు త్వరగా అలసిపోకుండా చూస్తాయి. కోల్పోయిన శక్తిని తిరిగి పుంజుకోవడానికి తోడ్పడతాయి. స్తంభనలోపంబారిన పడుకుండా చూసే ఆమైన్ ఆమ్లాలు గుడ్లులో లభిస్తాయి రోజూ ఉదయం ఒక గుడ్డు తీసుకుంటే మీరు ఇక అందులో వేరీ గుడ్డే....
స్ట్రాబెర్రీ ; వీటి గింజల్లో జింక్ మోతాదు ఎక్కువ. వీర్యం ఉత్పత్తికి అవసరమైన పురుష హార్మోన్ టెస్టోస్టీరాన్‌ను జింక్ నియంత్రిస్తుంది. సెక్స్ కోరికనూ ఉద్దీపింపజేస్తుంది. మిగతా పండ్ల మాదిరిగా కాకుండా స్ట్రాబెర్రీలను గింజలతో పాటు తింటూ ఉంటాం కాబట్టి జింక్ కూడా దండిగా లభిస్తుందన్న మాట. స్ట్రాబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు లైంగిక అవయవాలకు రక్త సరఫరా బాగా జరిగేలా చూస్తాయి. ఫలితంగా స్తంభన సమస్యలు తలెత్తకుండా కాపాడతాయి.
కాఫీ : ఓ కప్పు కాఫీ లో లభంచేటువంటి కెఫైన్ మెటబాలిజాన్ని మెరుగు పరుస్తుంది. బ్లడ్ పంపింగ్ ను మెరుగుపరిచి ఫ్యాట్ స్టోర్స్ ను విడుదల చెయ్యడము ద్వారా ఇది రాత్రికి సరిపడా శక్తిని ఇస్తుంది.
ఆస్టర్లు : సెక్సీ రెప్యుటేషన్ లో వీటి వాడకము చెప్పుకోతగింది. మినరల్ జింక్ , విటమిన్ బి 6 , వీటిలో అధికముగ్గా లభిస్తాయి. టెస్టోస్టిరాన్ కు రెండూ కీలకము .
మిరప : దీన్ని తినగానే ముఖము ఉబ్బుతుంది. అంటే రక్తనాళాలు విస్తరిస్తాయి. ముఖములోని రక్తనాళాలే కాకుండా పెనిస్ లోని రక్త సరఫరా మెరుగవుతుంది.
ఉల్లి : ఉల్లిపాయలు , వెల్లుల్లి లోని " ఫిటోకెమికల్ ఎల్లిసిన్ " రక్తాన్ని పల్చబరిచి , రక్త సరఫరాను పెంచుతుంది . క్లాట్ లు , క్లాగ్ లు తగ్గిపోతాయి.
- ============================
Visit my Website - Dr.Seshagirirao...