మనము రోజూ వంటింటిలో ఉపయోగించే అనేక దినుసులు ...... సౌందర్య్ సంరక్షణకోసం కూడా చక్కగా ఉపయోగపడతాయి. అందులో ---
ఆల్మండ్స్ : ఆయిల్ , డ్రైస్కిన్ కలవారికి సహజముగా చర్మకాంతి మృదుత్వం పెరగడానికి ఉపయోగ పడతాయి . ఆయిల్ స్కిన్ కలవారు కొన్ని ఆల్మండ్స్ తీసుకొని నీటిలో నాబెట్టి , పై తొక్కుతీసి , పేస్టులా తయారుచేసుకోవాలి , డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు గింజల్ని అలాగే తుబ్బి , పాలు , పెరుగు లో కలిపి శరీరము పై రాసుకోవాలి . ఇక ఆల్మండ్స్ ఆయిల్ చర్మానికి , తలలోని వెంట్రుకలకూ మంచిది .
బీట్ రూట్ : వేప ఆకులు , బీట్ రూట్ కలిపి తలకు రాసుకుంటే " మాడుకు" మంచిది . వేప , బీట్రూట్ లను మిక్షీలో వేసి గుండగా అయిన తరువాత వడకట్టి రసాన్ని రోజు మార్చి రోజు తలకి రాసుకుంటే చుండ్రు తగ్గిపోతుంది .
క్యారెట్ : విటమిన్ ' ఏ" అధికము గా ఉంటే క్యారెట్ మొటిమలకు చక్కగా పనిచేస్తుంది . క్యారెట్ జ్యూస్ ని మొటిమలు , పొక్కులు , కురుపులపై పూయడం ద్వారా అతి త్వరగా నయమవుతాయి.
మెంతులు : కొన్ని మెంతుగింజలను నీటిలో వేసి కాచి , ఆ నీటిలో చేతులు కొద్దిసేపు వుంచడం ద్వారా గోళ్ళు దృఢం గా ఆరోగ్యము గా ఉంటాయి.
గుడ్లు : చర్మ సౌందర్యానికి , జుట్టు సంరక్షణ్ ,ఇంకా ఆరోగ్యరక్షణలో గుడ్డు చక్కగా పనిచేస్తుంది . రోజూ ఒక గుడ్డు తింటే మన చర్మము ఆరోగ్యము గా ఉంటుంది . గుడ్డు సొనను హెయిర్ కండిషనర్ గా వాడుతారు .
ఫిన్నల్ గింజలు : కొన్ని ఫిన్నల్ గింజలు లేదా ముక్కలను తేనె , పెరుగులతో కలిపి ముద్దగా చేసి శరీరానికి రాసుకుంటే చర్మము పై పగుళ్ళు తొలగిపోతాయి .
జలటెన్ : మేక , గొర్రె వంటి జంతువుల ఎముకల సూప్ లో 5 నిముషాలు చేతులు ఉంచడం ద్వారా గోళ్ళు మరింత దృఢముగా అవుతాయి .
తేనె : ఇది పకృతి సహజమైన మాయిశ్చరైజర్ . ఫేషియల్ ప్యాక్ లలో ప్రధానమైనది . శరీర ఆరోగ్యానికి , పోషణకు చాలా మంచిది .
ఐస్ క్యూబ్స్ : మొటిమలకు చక్కగా పనిచేస్తుంది . మొటిమలను గుర్తించిన వెంటనే ఓ ఐసు ముక్కతో 40-50 సెకన్లు మొటిమ చుట్టూ మర్ధనచేయాలి . తరువాత క్లోర్ ఆయిల్(Liquid chlorine) రాసి ఆరనివ్వాలి . మొటిమలు తగ్గుతాయి.
టొమాటో , కుకుంబర్ (దోస)రసము : వీటి రసాలు కలిపి రోజూ ముఖానికి రాసుకోవడం వలన ముఖం కాంతివంతం అవుతుంది . కళ్ళ కింద నల్ల చారలు తొలగిపోతాయి .
కేసరి రంగు(keshari refers to the saffron color used as a natural food colour and spice, and in dyes.) : చర్మాన్ని శుద్దిచేసే లక్షణాలున్నాయి .
ధాన్యాలు : ప్రతిరోజూ పెసల పిండి , మినప పిండి , శనగ పిండి వంటి వానితో ముఖము శుభ్రపరచుకోవడం వలన ముఖచర్మము కంతివంతము గా ఉంటుంది .
మైనోసిస్ : మైనోసిస్ , కొబ్బరిపాలు కలిపి తలకు రాసుకోవడం ద్వారా జుట్టు బిరుసుదనం పోతుంది . ఆతర్వాత తలస్నానము చేస్తే మరింత మృధువుగా ఉంటుంది .
వేప ఆకుల పేస్ట్ : వేపాకుల ముద్ద , నిమ్మరసము కలిపి తలకు రాసుకుని గంటసేపు ఉండనిచ్చి తలస్నానము చేస్తే చుండ్రు పోతుంది .
ఓట్స్ : ఓట్స్ ని పొడిచేసి చర్మ శుద్ధి కి ఉపయోగించవచ్చు . ఈ పొడిని రుద్దుకుని రెగ్యులర్ గా స్నానము చేయడం వల్ల శరీరానికి కాంతివంతమైన రంగు వస్తుంది .
బొప్పాయి : దీని గుజ్జు శరీరానికి రాసుకుని స్నానము చేస్తే శరీరములోని మృతకణాలు తొలగిపోతాయి .
బియ్యపు పిండి : బియ్యపు పిండితో నలుగు పెట్టి స్నానము చేస్తే చర్మము బగువుగా , కాంతివంతముగా ఉంటుంది .
నువ్వులనూనె : పొడిచర్మాలకు చక్కగాపనిచేస్తుంది . శరీరము ఈనూనె తో మర్ధనచేస్తే నున్నగా , కాంతివంతముగా తయారవుతుంది . చర్మానికి ఒకరకమైన మెరుపు వస్తుంది .
టీ బ్యాగులు : తడి టీ బ్యాగులు కళ్ళపై ఉంచుకోవడము వల్ల కళ్ళకింద నల్లని వలయాలు తగ్గుతాయి.
వెనిగర్ : 2-3 స్పూన్ల వెనిగర్ ని బకెట్ నీటిలో కలిపి తల స్నానము చేయడం ద్వారా చుండ్రు పోతుంది .
పెరుగు మాస్క్ : తేనె , ఓట్ మీల్ , పెరుగు కలిపి మాస్క్ వేసుకోవడం వల్ల జిడ్డు గా వున్నటువంటి చర్మము కాంతి తో మెరుస్తుంది .
- =========================================