Pages

Labels

Blog Archive

Popular Posts

Tuesday, 6 September 2011

Milk , పాలు









పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



  • పాలు అంటే క్షీరదాలు పుట్టగానే తల్లి నుండి తీసుకొనే ఆహారం. బిడ్డ పుట్టగానే తల్లికి ప్రకృతి సిద్దంగా ఊరేవి పాలు. తల్లి పాలు శ్రేష్ఠమైనవి, ఆరోగ్యమైనవి, వ్యాధి నిరోధక శక్తిని కలిగి శీఘ్రముగా జీర్ణం కాగలిగిన ఆహారం.


తెలుగు భాషలో పాలు అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. పాలు నామవాచకంగా పాలు మరియు పాలవంటి ద్రవాలకు ఉపయోగిస్తారు,
పాలు లేదా క్షీరము (Milk) శ్రేష్ఠమయిన బలవర్ధక ఆహారము. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి. కొద్దిగా విటమిన్ సి, ఇనుము తక్కువ. అన్ని వయసులవారూ తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్ధము. పాలను ఉత్పత్తి చేసే జంతువులు ఆవులు, గేదెలు, మేకలు రియు గొర్రెలు,ఒంటెలు . హిందువులు పవిత్రంగా పూజించే ఆవు యొక్క పాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలలోనూ వాడతారు.




  • మూడు ప్రోటీనులూ , ఆరు విటమినులూ , ఇరవై ఐదు ఖనిజాలు గల ఆవు పాలు ధారణ శక్తి కలిగి ఉంది . శ్వాస సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది . స్తన్యములను వృద్ధిచేయును . శరీరానిని కాంతిని , ఇంద్రియములకు నిర్మలత్వాన్ని ఇవ్వడములో పాలు తోడ్పడుతుంది .


రకాలు :


  • బూత్ పాలు .

  • తల్లి పాలు.

  • ఆవు పాలు

  • మేక పాలు,

  • పులి పాలు,

  • గాడిద పాలు,

  • సగ పాలు,

  • బూడిద పాలు.


పోషక విలువలు :



  • కొవ్వు పదార్దాలు 4 %

  • పిండి పదార్ధాలు ('కార్బోహైడ్రేట్‌'లు) - 4.7 %

  • మాంసకృత్తులు ('ప్రోటీన్‌'లు) - 3.3 %

  • నీరు - 88 %



  • మనిషి పాలలో 71 కిలో కేలరీలు , ఆవు పాలలో 69 కిలోకేలరీలు, గేదె పాలలో 100 కిలో కేలరీలు మరియు మేక పాలలో 66 కిలో కేలరీలు శక్తి ఉంటుంది.


100 ml ఆవు పాలలో 

  •  3.2 గ్రా. ప్రోటీన్‌, 4.1 గ్రా.ఫ్యాట్ , 4.4 గ్రా కార్బోహైడ్రేట్ , 67 కేలరీల శక్తి ఉంటాయి. 


100 మి.లీ గేదె పాలలో 


  • 4.3 గ్రా.ప్రోటీన్‌ , 6.5 గ్రా .ఫ్యాట్ , 5.0 గ్రా.కార్బోహైడ్రేట్ , 112 కేలరీల శక్తి ఉంటాయి.




పాల ఉత్పత్తులు :



  • మనం ప్రతిరోజూ తాగే టీ, కాఫీ లను పాలను ఉపయోగించి తయారుచేస్తారు.

  • పాలును తోడుపెట్టినచో పెరుగు తయారవుతుంది.

  • పెరుగును పలుచగా నీటితో బాగా కలిపితే మజ్జిగ, లస్సీ తయారవుతాయి.

  • మరిగించిన పాలు మీద, తోడుపెట్టిన పెరుగుమీద మీగడ తయారవుతుంది.

  • మజ్జిగను బాగా చిలికితే వెన్న తయారవుతుంది.

  • వెన్నను మరగబెట్టిన నెయ్యి వస్తుంది.

  • పాలుతో కోవా మొదలైన అనేక రకాల మిఠాయిలు తయారుచేస్తారు.

  • ఇంకా బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీములు, రొట్టెలు మొదలైన వాటి తయారీలో పాలను విరివిగా ఉపయోగిస్తారు.


పిల్లలకు త్రాగించే పాలు :



  • పిల్లల ఆరోగ్యానికీ, ఎదుగు దలకూ పాలు చాలా అవసరం. అయితే, పిల్లలకు ఏ పాలు ఇవ్వడం మంచిదన్న విషయాన్ని పరిశీలించాలి. ఆవు, గేదె, మేకపాలు, స్కిమ్డ్‌ మిల్క్‌ లభిస్తాయి. ఆవుపాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమయినవి. కొంతమంది, పాలు పిండగానే అలాగే త్రాగేస్తారు. ఆ పాలను గుమ్మపాలు అంటారు. పొదుగు నుంచీ పిండగానే అలాగే పచ్చిపాలను త్రాగడం మంచిది కాదు. ఆరోగ్యం మాట అటుంచి ఎన్నెన్నో అనారోగ్యాలు ఏర్పడే ప్రమాద ముంటుంది. ఆ పాలల్లో ప్రమాదకర మైన సూక్ష్మక్రిములు ఉండే అవకాశం ఎక్కువ. ఆ పాలు త్రాగిన పిల్లలకు సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌ను, వ్యాధిని కలిగిస్తాయి. ఏ పాలనయినా బాగా కాగి(వేడి చేసి) పొంగిన తర్వాతనే పిల్లలకు త్రాగించడం ఆరోగ్యకరం. పాశ్చరైజ్డ్‌ మిల్క్‌ను కనీసం పదినిముషాలయినా కాచినట్ల యితే అందులోని బాక్టీరియా నశిస్తుం ది. ఆ పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకు త్రాగించాలి. చల్లారిపోయిన పాలను, నిలవ ఉన్న పాలను పిల్లలకు త్రాగించకూడదు. చిక్కగా ఉన్న పాలల్లో నీళ్ళు కలిపి త్రాగించాలంటే పాలు కాగుతున్నప్పుడే కొంచెం నీటిని కలపాలి. వేడిపాలల్లో చన్నీళ్ళు కలిపితే, ఆ నీటి ద్వారా బాక్టీరియా పాలల్లోకి ప్రవేశించి పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పిల్లలకు పాలు పడకపోతే వాంతులు, విరేచనాలు, అజీర్తి వ్యాధులు కలుగుతాయి. పిల్లల వైద్యుని సంప్రదించి, పిల్లలకు ఏ పాలు త్రాగించాలన్నదీ తెలుసుకోవాలి. పశువులపాలు త్రాగించేటప్పుడు పశువులకు చేపువచ్చి పాలివ్వటానికి ఇంజెక్షన్‌ ఇస్తారు కొంతమంది పాలవ్యాపారస్తులు. ఆ ఇంజెక్షన్‌లోని రసాయనిక మందు పాలలో ప్రవేశిస్తుంది. పశువులకు వ్యాధులొస్తే, ఆ సంగతి తెలియక పిల్లలకు ఆ పాలను త్రాగించినట్లయితే పిల్లలకు అనారోగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా పసిబిడ్డకు త్రాగించే పాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.


ఈ రోజుల్లో, పట్టణాల్లో పశువుల పాలవాడకం తగ్గిపోయి బూత్‌పాలను ఉపయోగిస్తున్నారు. స్కిమ్డ్‌ మిల్క్‌నే అందరూ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే, ఆ పాలల్లోంచి కొవ్వు తొలగించబడు తోంది. పిల్లలకు ఆ పాలు త్రాగించడం ఆరోగ్య కరమే. ఆ పాలల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఆ పాలల్లోంచి కొవ్వు పొర మాత్రమే తొలగిపోతుంది, పోషక పదార్థాలేమీ తొలగిపోవు. ఆ పాలల్లో ఖనిజాలు అల్లాగే నిక్షిప్తమై ఉంటాయి. కొవ్వుద్వారా లభించేది ఎ,డి విటమిన్‌లు. 'ఎ' విటమిన్‌ ఆహార పదార్థా ల ద్వారా లభిస్తుంది. డి విటమిన్‌ సూర్యరశ్మి ద్వారా శరీరానికి అందు తుంది. ఆ విధంగా ఆ రెండు విటమినులను వారి శరీరానికి భర్తీ చేయవచ్చు. స్కిమ్డ్‌ మిల్క్‌లో పిల్లలకు అవసరమయ్యే కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పిల్లలు పాలు త్రాగటానికి ఇష్టపడకపోతే, ఏ రూపంలోనైనా పాలతో తయారుచేసిన పదార్థాలను ఇవ్వవచ్చు, పెరుగు, మజ్జిగ, పాయసం, పాలకోవా, జున్నులాంటి ఎన్నెన్నో పదార్థాలను పాలతో తయారు చేసి పిల్లలకు ఇవ్వవచ్చు. పిల్లల ఎదుగుదలకూ, నూతన శక్తికీ, శారీరకదృఢత్వానికీ వారికి ప్రతిరోజూ పాలను లేదా పాలతో తయారయ్యే పదార్థాలను ఇవ్వడం ఎంతో ముఖ్యం. పసిపిల్లలకు పోతపాలు వచ్చేటప్పుడు, అవి ఆవుపాలు, గేదెపాలు, మేకపాలు, బూత్‌పాలు ఏవయినా కానీ, పలుచని వస్త్రంలో చిటికెడు వాము ను వేసి మూటకట్టి, పాలను కాచేట ప్పుడు, ఆ మూటను ఆ పాల ల్లో వేసి కాచినట్లయితే పాపాయికి అరుగుదల బాగా ఉండి, అజీర్తి బాధలు కలుగవు. జీర్ణక్రియ బాగుం టుంది. ఆకలికూడా బాగా ఏర్పడుతుంది.




  • పాలు జీర్ణము అయ్యే విధానము :


పాలు జీర్ణమవడానికి ... (Rennet is a complex of enzymes that digest milk, the primary enzyme being chymosin or rennin.) రెనెట్ అనే ఎంజైం సముదాయము పాలు జీర్ణానికి మానవులలో తోడ్పడుతుంది. దీనిలో ''కైమోసిన్‌ లేదా రెన్నిన్‌'' అనే ఎంజైం ముఖ్యమైనది .



  • లైపేజ్ : కొవ్వు పదార్ధములను ,

  • ప్రొటియేజ్ : మాంసకృత్తులను ,

  • లాక్టేజ్ : పాలులో ఉన్న కార్బోదైడ్రేట్ ను లాక్టోజ్ అంటాము . . . ఇది లాక్టేజ్ అనబడే ఎంజైం వలన జీర్ణము అవుతుంది .


కైమోసిన్‌ లేదా రెనిన్‌ అనేది ఒక proteolytic enzyme. ఉదరకోశము (stomach) లో చీఫ్ కణజాలము (chief cells) ద్వారా తయారగును. ఇది పాలును జీర్ణము చేయుటలో ముఖ్య పాత్ర వహించును . కెసిన్‌ అనే పాల పోటీన్‌ ను విడగొట్టడము తో పాలు జీర్ణమగును . పుట్టి పసిపిల్లలలో 100 శాతము తయారగును. క్రమేపి రెనిన్‌ తయారీలో తగ్గుముఖం పడుతూ 12 సం.లు వయసు నాటికి ఇది పూర్తిగా తయారవడం ఆగిపోయీ దీని స్థానము లో పెప్సిన్‌(pepsin) తయారయి ... ప్రొటియోలైటిక్ ఎంజైం గాపనిచేయును . కావున పెద్దవారిలో పాలు జీర్ణము కావు . కెసిన్‌ హైడ్రోలైసేట్ బ్రేక్ డౌన్‌ అవక నిరుపయోగముగా విసర్జించబడును. పాలలో ఉన్న నీరు , నీటిలో కరిగే విటమిన్లు పెద్దవారిలో గ్రహించబడి ఊపయోగపడును.



  • " Milk is useless to adult human " a slogan given by Smt. Menaka Gandhi while she was in chair as Minister for animal husbandary and animal welfare during BJP central Govt.


పాలతో బరువు తగ్గవచ్చును :





పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇది అందరికీ తెలుగు . పాలవలన బరువు తగ్గడము కూడా సాధ్యమే ... మధ్య వయసులో పాలు తగినంత తాగుతూ , డి-విటమిన్‌ సమృద్ధిగా తీసుకునేవారు  బరువు తగ్గుతారని నిరూపించబదింది . ఇజ్రాయిల్ పరిశోధకులు భారీ కాయము కలిగిన 300 మంది మీద జరిపిన పరిశోధనా ఫలితం ఇది. వీరి వయసు 45-60 మధ్య ఉంది .  ప్రతిరోజూ  2 గ్లాసుల పాలు త్రాగడం తో పాటు పిండి పదార్ధము ఉన్న ఆహారము తక్కువగా తీసుకున్న వీరు 2 ఏళ్ళ కాలములో 5.5 కిలోల బరువు తగ్గడము గమనించారు . అదేసమయము లో ఇతర పద్దతుల ద్వారా బరువు తగ్గేందుకు ప్రయత్నించినవారు కేవలము 3 కిలోల బరువు మాత్రమే తగ్గారు . అందుకే పాలలోని కాల్సియం , విటమిన్‌ డి-బరువుతగ్గడము లో కీలక పాత్ర వహిస్తాయని పరిశోధనల ద్వారా స్పష్టమైనది .



ఎసిడిటీని తగ్గించే పాలు :



పాలు పౌష్టికాహారమన్న సంగతిని మనం తరచూ వింటుంటాము. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక్క రూపంలో పాలను తమ ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ, రోగాల్ని కుదర్చడంలోనూ పాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే పాలను ప్రకృతి సిద్ధమైన 'పరిపూర్ణ పౌష్టి కాహారం' కింద చెబుతుంటారు. పాలను మానవులు అనాది నుంచి వాడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఆవుపాలు, బర్రెపాలు, మేకపాలు మొదలైనవి. ఆవుపాలలో తల్లి పాలలో కంటే రెట్టింపు ప్రొటీన్లు ఉంటాయి. కాని చక్కెర తక్కువ ఉంటుంది. బర్రె పాలలో ఆవు పాలలో కంటే కొవ్వు అధికంగా ఉంటుంది.



ఆహార విలువలు



పాలలో ప్రొటీన్లు, కొవ్వు, కార్బోహైడ్రేట్‌లు, మనకు తెలిసిన అన్నిరకాల విటమిన్‌లు, అనేక రకాల ఖనిజ లవణాలు తదితర ఆరోగ్యాన్ని కాపాడే ఆహార విలువలన్నీ లభిస్తాయి. పాలలో లభించే ప్రొటీన్లలో శరీర నిర్మాణానికి అవసరమైన అమినో యాసిడ్స్‌ అన్నీ లభిస్తాయి.



ఒక లీటరు పాలలో ఒక మనిషికి ఒక రోజు అవసరానికి సరిపడా కాల్షియం, ఫాస్పరస్‌, పుష్కలంగా విటమిన్‌'ఎ' 'సి', మూడోవంతు ప్రొటీన్లు, ఎనిమిదో వంతు ఐరన్‌, నాలుగోవంతు, శక్తి 'బి', 'ఇ','డి' విటమిన్లు కొంత  లో కొంత లభిస్తాయి.



పాలలో లభించే కొవ్వులో 99 శాతం, ప్రొటీన్లలలో 97 శాతం, కార్బోహైడ్రేట్లలో 98 శాతం తేలికగా జీర్ణం కాదగ్గ స్థితిలో ఉంటాయి. మనం తాగిన పాలు జీర్ణం కావటానికి గంటన్నర సమయం సరిపోతుంది. పాలలోని లవణాలు, నీరు జీర్ణాశయంలో చేరుకున్న తక్షణమే అబ్జార్బ్‌ కావడం కావడం ప్రారంభిస్తాయి. కాని మిగతా ఘన పదార్థాలు, కొవ్వు మాత్రం ప్రేవులలోకి చేరుకున్న దగ్గరినుంచి అబ్జార్బ్‌ కావటం మొదలెడతాయి.



ఉపయోగాలు



మన ప్రాచీన వైద్యుడు చరకుడు  చెప్పిన దానిని బట్టి పాలు మనలో శక్తిని పెంపొందింపజేస్తాయి. జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తాయి. అలసటను పోగొడతాయి. సుదీర్ఘ జీవనాన్ని అందిస్తాయి. ఆధునిక ప్రయోగాలలో ఆ ప్రయోజనాలన్నీ ఋజువు కాబడ్డాయి. పాలు తాగే పాపాయిల నుంచి వృద్ధుల దాకా అన్ని వయసుల వారికి పనికి వచ్చే ఆహారం పాలు ఒకటేనంటే అతిశయోక్తి కాదు. అస్వస్థతతో బాధపడుతున్న వాళ్ళకు కూడా పాలు చక్కటి ఆహారం కింద ఉపకరిస్తుంది.



పాలు పడకపోవటం



కొందరి వొంటికి పాలు సరిపడవు. అలాంటి వాళ్ళకు పాలు తాగగానే కడుపులో గ్యాస్‌ ఉత్పత్తి అయి కడుపు ఉబ్బరించినట్లుగా అవుతుంది. ఇందుకు కారణం  ఏమిటంటే... పాలలో ఉన్న కార్బోహైడ్రేట్  జీర్ణం గావించే లాక్టోస్‌ అనబడే ఎంజైమ్‌ వీళ్ళలో సరిగా ఉత్పత్తి కాకపోవటం! లాక్టోస్‌ సరిగా ఉత్పత్తి కాని మనుషులకు కడుపులో గ్యాస్‌ అధికంగా ఉత్పత్తి కావటం, కడుపు ఉబ్బరించటం, కడుపులో నొప్పి, అజీర్ణం, విరోచనాలు లాంటి ఇబ్బందులు ఎదరవుతాయి.



పాలు తాగగానే లేక పాల ఉత్పత్తి పదార్థాలను తినగానే ఇలాంటి ఇబ్బంది ఏర్పడే వాళ్ళు తమకు తాము ఒక సింపుల్‌ టెస్ట్‌ ను చేసుకోవచ్చు. వీళ్ళు ఒక పది రోజుల పాటు పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవటం మానేసి పై లక్షణాలు తొలగి పోతాయేమో చూడాలి. పాలు మానేయగానే పై లక్షణాలు తొలగి పోయి, తిరిగి పాల ఉత్పత్తులను తీసుకోవటం మొదలటెటగానే మళ్ళీ ఆ లక్షణాలు మొదలైతే తమకు పాలు పడవని అర్ధం చేసుకుని పాలను మానేయాలి.



ఇలా పాలు పడని వాళ్ళు శాకాహారులైతే వాళ్ళు తమ ఆహారంలో గుడ్లు, సోయా చిక్కుళ్ళు, మిగతా పప్పు ధాన్యాల ద్వారా తమ శరీరానికి అవసరమైన పాల ద్వారా లభించని ప్రొటీన్లను పొందటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రొటీన్లు తక్కువయితే శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడి త్వరగా అతను అంటురోగాల బారినపడే అవకాశం ఉంది.



పాలలో ఔషధోపయోగాలను ఈ కింద పేర్కొనడం జరిగింది.



లావెక్కడానికి : బక్కగా బలహీనంగా ఉన్న వాళ్ళకు లావెక్కటానికి పనికివచ్చే ఆహారం పాలు! ఉండాల్సిన బరువుకంటే తక్కువ బరువున్న వాళ్ళు సరిపడా పాలు తాగటం ద్వారా వారానికి 3 నుంచి 5 పౌన్ల దాకా బరువెక్క గలుగుతారు. నిదానం మీద శరీరం బరువు ఉండాల్సిన స్థి తికి వచ్చేస్తుంది.



పాలు తాగటం వల్ల కళ్ళు తేటగా ప్రకాశవంతంగా అవుతాయి. శరీరానికి ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది. శరీరంలోని అవయవాలన్నిటిలోకి సరిపడా శక్తి  చేరుకుంటుంది.



సజావుగా రక్తప్రసరణ :  శరీరంలో రక్తప్రసరణ సరిగా లేని వాళ్ళకు పాలు అద్భుతమైన ఆహారం! పాలు తాగటంవల్ల కడుపు, ప్రేవులలోని ద్రవాంశం వృద్ధిచెంది శరీరంలో రక్తప్రసరణ సహ జసిద్ధంగా మెరుగుపడుతుంది.రక్త ప్రసరణ సరిగా లేకపోవటంవల్ల చేతులు, పాదాలు చల్లగా ఉంటాయి. రక్తప్రసరణ సజావుస్ధి తికి చేరుకున్నాక ఇవి మళ్ళీ జవాన్ని పుంజుకొని కొద్ది రోజులకే ఆ వ్యక్తి నవనవలాడే చైతన్యంతో కనిపిస్తాడు.



కడుపులో వాయువు : కడుపులో యాసిడ్‌ తయారవుతూ హైపర్‌ ఎసిడిటీతో బాధపడే వాళ్ళకు పాలు మంచి ఆహారం. పాలు జీర్ణం కావటానికి యాసిడ్‌ అధికంగా కావాల్సివస్తుంది. పాలలో ఉండే ఆల్కలైన్‌ని తయారుచేసే పదార్థాల వల్ల శరీరంలోని యాసిడ్‌ స్థితిని ప్రేరేపించే పరిస్థి తులు చాలా త్వరగా సాధారణ స్థి తికి వచ్చేస్తాయి.



నిద్రలేమి : నిద్రలేమితో బాధపడే వాళ్ళకు పాలు పరప్రసాదం లాంటివి. నిత్యం నిద్రపట్టక బాధపడే వాళ్ళు రోజూ రాత్రి పడుకోబోయే ముందు గ్లాసెడు పాలలో తేనెను కడుపుకుని తాగాతే కొన్నాళ్టికి కమ్మని నిద్రకు చేరువవుతారు!



శ్వాస సంబంధవ్యాధులు : జలుబు, గొంతు బొంగురుపోవటం, ఉబ్బసం, టాన్సిలైటిస్‌, బ్రాంకైటిస్‌ లాంటి వ్యాధులకు పాలు దివ్యౌవషధంలా పనిచేస్తాయి. గ్లాసెడు మరగ కాచిన పాలలో చిటికెడు పసుపు, కొద్దిగా మిరియాల పొడి కలుపుకుని రోజూ రాత్రుల తాగితే శ్వాసకోశ సంబంధ ఇబ్బందులకు మూడు రోజులలో సత్ఫలితం లభిస్తుంది.



చర్మవ్యాధులు : పాలపైని మీగడలో కొద్దిపాటి వినెగార్‌, చిటికెడు పసుపు కలిపి గాయాలు, పుళ్ళు, గజ్జి మొదలైన వాటిమీద పూస్తే అవి త్వరలోనే తగ్గిపోతాయి.



సౌందర్య సాధనంగా : కాస్మెటిక్స్‌లాంటి సౌందర్య సాధనాలలో కూడా పాలు చక్కగా ఉపకరిస్తాయి. రాత్రులు మరగ కాచిన గ్లాసెడు పాలలో ఒక తాజా నిమ్మకాయ రసాన్ని పిండి పది నిమిషాల తర్వాత చేతులు, మొహం, మెడ, భుజాలకు రాసుకుని ఆరబెట్టాలి. అలాగే పడుకుని మర్నాడు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుగుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే కొన్నాళ్టికి శరీరంలో మెరుపు, మృదుత్వం వస్తాయి. పచ్చిగుడ్డు సొనను పాలలో కలుపుకుని ప్రతిరోజూ ఆ మిశ్రమంతో తలంటుకంటే జుట్టు పెరగటమే కాదు. ఏరకమైన మాడుకు సంబంధించిన చర్మవ్యాధులూ ఇంక మీ దరికి చేరవు.


  • ===============================


Visit my Website - Dr.Seshagirirao