Pages

Labels

Blog Archive

Popular Posts

Thursday, 24 November 2011

ఉప్పు , Salt






  • image : courtesy with Visalandhra News paper





  • పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


మన దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనశైలి మారుతోంది. ప్యాకేజ్డ్‌, ప్రాసెస్‌ చేసిన, రెడిమేడ్‌గా దొరికే ఆహారాలను తీసుకోవడానికి అలవాటు పడుతున్నారు. ఇందులో సోడియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ప్రతీరోజు సగటున ఒక భారతీయుడు 30 గ్రాముల ఉప్పు వాడుతున్నాడు. ఇది జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సు కన్నా చాలా ఎక్కువ. రోజుకు ఆరు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు తీసుకూడదని సంస్థ సూచిస్తోంది. ఉప్పు ఎక్కువ తీసుకుంటే గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు, కడుపులో క్యాన్సర్‌, ఆస్టియోపోరొసిస్‌ కలుగుతాయి. సముద్రం నుంచి లభించే ఉప్పులో 40 శాతం సోడియం, 60 శాతం క్లోరైడ్‌ ఉంటాయి. మన శరీరంలో ఉప్పుమీద ఆధారపడని అవయవమంటూ ఏమీలేదంటే అతిశయోక్తి కాదు. మన శరీరంలో జరిగే రసాయనిక చర్యలు అన్నీ కూడా ఉప్పు మీదే ఆధారపడి ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో ఉప్పు ముఖ్యమైన పదార్థం. కండరాలు సంకోచించడంలో, నీటి నిల్వ ఉండటంలో కీలక పాత్ర వహిస్తుంది. అంతేకాక శరీరంలో జీర్ణవ్యవస్థకు అవసరమైన పోషకాలు ఉప్పులో ఉన్నాయి. శరీరంలో సోడియం తక్కువైతే డీహైడ్రేషన్‌ కలుగుతుంది. మరోవైపు సోడియం ఎక్కువ ఉండే ఉప్పు పదార్థాలు తీసుకుంటే అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. ఇక్కడో సందేహం కలుగుతుంది. మన శరీరానికి ఎంత ఉప్పు అవసరం? జాతీయ పోషకాహారం సంస్థ ప్రకారం ఒక వ్యక్తి రోజుకు ఆరు గ్రాములు మాత్రమే ఉప్పు తీసుకోవాలి. కానీ సగటున ఒక వ్యక్తి రోజులో 8 నుంచి 12 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాడు. ఉప్పు మన శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది. శరీరంలోని ఆమ్ల క్షార నిష్పత్తిని క్రమబద్దీకరించే చర్యలో సోడియం ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. సోడియం శాతం పడిపోతే హార్మోనులు పంపే సంకేతాలు శరీరంలో సరిగా వ్యాప్తికావు. కండరాలు నీరసించి మనిషి తేలికగా అలసటకూ చికాకుకూ లోనవుతాడు.




  • బహు ప్రయోజనకారి


ఉప్పు నాడీ ప్రేరేపణ ప్రసారానికి తోడ్పడుతుంది. సరైన మోతాదులో శరీరంలో ద్రవాలు నిల్వ ఉంచడానికి సహకరిస్తుంది. కండరాలు సంకోచించడానికి, వ్యాకోచించడానికి సహాయపడుతుంది. ఉప్పులో ఉండే అయోడిన్‌ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అయోడిన్‌ లోపం వల్ల థైరాయిడ్‌ సమస్యలు వస్తాయి. శరీరంలో సోడియం బాగా తగ్గితే 'లో బ్లడ్‌ ప్రెజర్‌ ' కలుగుతుంది. ఇది రక్తప్రసరణను తగ్గిస్తుంది. సోడియం ఎక్కువైతే శరీరానికి హానికరం. పాల ఉత్పత్తులు, కూరగాయలు, చేపలు, రొయ్యలు, గుడ్లలో సహజసిద్ధంగా సోడియం ఉంటుంది. ఉప్పు ఎక్కువ తీసుకున్నప్పుడు కిడ్నీలో రెనిన్‌ అనే పదార్థం ఉత్పత్తి/విడుదల అవుతుంది. రెనిన్‌ అల్డొస్టిరాన్‌ను సెక్రియేట్‌ చేస్తుంది. ఆల్డోస్టిరాన్‌ రక్తనాళాలను సంకోచింప చేస్తుంది. శరీరంలో సోడియం ఉండేలా చేస్తుంది. శరీరంలో ఎక్కువ సోడియం నిల్వ ఉంటే ద్రవాలు ఎక్కువైతాయి. రక్తనాళాలు సంకోచించినప్పుడు బిపి అధికమవుతుంది. రెనిన్‌, ఆల్డోస్టిరాన్‌ అనేది ముఖ్యమైన మెకానిజం. భోజనంలో ఉప్పు తగ్గించినప్పుడు రెనిన్‌ తక్కువ ఉత్పత్తి అవుతుంది. మందుల వల్ల రెనిన్‌ ఉత్పత్తిని తగ్గించొచ్చు. ఆల్డోస్టిరాన్‌ను బ్లాక్‌ చేయడానికి మందులు ఉన్నాయి.





  • ఎంత తీసుకోవాలి?


రోజూ ఆఫీసుకు బస్సులో ప్రయాణిస్తూ, అరమైలు దూరం నడక సాగించే సాధారణ వ్యక్తికి రోజుకు ఆరు గ్రాముల ఉప్పు అవసరం. కష్టపడి పనిచేసే కూలీకి, కార్మికునికి, క్రీడాకారునికి లేక ఇతరత్రా వ్యాయామాలు చేసే మనిషికి ఇంకాస్త ఎక్కువ అవసరం. చెమటలో 0.1 నుంచి 0.3 శాతం దాకా సోడియం క్లోరైడ్‌ ఉంటుంది. చలికాలంలో చెమట ద్వారా బయటికి పోయే ఉప్పు అంటూ ఏమీ ఉండదు. కానీ మంచి మండే వేసవిలో మాత్రం ఆఫీసుకు వెళ్లే వ్యక్తి రోజుకు 12.5 గ్రాముల దాకా ఉప్పును చమట ద్వారా విసర్జిస్తాడు. ఇదే రోజులో వ్యాయామాలు చేసినా లేక ఏడారి ప్రాంతాల్లో నివసించే వారిలో ఇది ఇంకా బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే చెమట ద్వారా శరీరం ఉప్పు కంటే నీటిని ఎక్కువ కోల్పోతుంది. దీని వల్ల బాగా చెమటలు పట్టినప్పుడు రక్తంలో ఉండాల్సిన దానికంటే ఉప్పు ఎక్కువ శాతం గానూ నీరు తక్కువ శాతంగానూ ఉండి వాటి మధ్య నిష్పత్తి దెబ్బతింటుంది. దీన్ని పసిగట్టిన మెదడులోని దప్పిక కేంద్రం నీటిని ఎక్కువ తాగమంటూ నోటికి సందేశం పంపిస్తుంది. మనకు దప్పిక అయ్యేది ఈ సందర్భంలోనే.




  • గుండెను కబలిస్తుంది


సోడియం ఎక్కువగా తీసుకుంటే రక్తంలో ద్రవాలు ఎక్కువైతాయి. ఇది రక్తపోటును పెంచుతుంది. సాధారణంగా ఈ అదనపు నీటిని శరీరం నుంచి మూత్రపిండాలు బయటికి పంపిస్తాయి. కొన్నిసార్లు మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఈ సమయంలో అదనంగా ఉన్న నీటిని సమర్థవంతంగా బయటికి పంపించలేవు. దీంతో ద్రవాలు శరీరంలోనే ఉండిపోతాయి. ఇది రక్తం పరిమాణాన్ని పెంచుతుంది. ఈ రక్తం రక్తనాళాల ద్వారా పంప్‌ అవుతుంది. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఇలా అదనంగా ఉన్న ద్రవాలతో కూడుకున్న రక్తాన్ని శరీరమంతా పంప్‌ చేయడానికి గుండె తన సైజును పెంచుకుంటుంది. ఈపరిస్థితిలో గుండెలోని కణాలు పనిచేయవు. ఎందుకంటే వీటికి అవసరమైనంత ఆక్సీజన్‌, పోషకాలు అందవు కాబట్టి. కొంతకాలానికి అదనపు రక్తపోటు వల్ల కలిగిన నష్టం తీవ్రరూపం దాల్చుతుంది. అప్పుడు ధమనులు పేలిపోవడం లేదా పూర్తిగా రక్తప్రసరణకు అడ్డుగా ఉంటాయి. ఇలాంటప్పుడు రక్తాన్ని స్వీకరించే గుండెలోని ఒక భాగం తనకు అవసరమైన ఆక్సీజన్‌, పోషకాలను పొందలేదు. దీంతో ఇది నషిస్తుంది. ఫలితంగా ఇది గుండెపోటుకు కారణం అవుతుంది. స్థూలకాయులు ఎక్కువగా ఉప్పు తింటే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అధిక రక్తపోటు ఉన్నవాళ్లు ఉప్పు తగ్గించకపోతే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముంది.




  • రక్తపోటును పెంచుతుంది


శరీరంలోకి చేరుకున్న అదనపు ఉప్పును మూత్రపిండాలు విసర్జిస్తాయి. శరీరంలో నీటికంటే ఉప్పు ఎక్కువ ఉన్నప్పుడు మెదడులోని దప్పిక కేంద్రం ప్రేరేపణకు గురై మరిన్ని నీళ్లు తాగమంటూ ప్రోత్సహిస్తుంది. అయితే ఉప్పు శాతం అధికంగా వాడడం వల్ల మూత్రపిండాలు అధికంగా ఉన్న నీటి మొత్తాన్ని విసర్జించలేకపోతాయి. అప్పుడు శరీరంలోని రక్త పరిమాణం పెరుగుతుంది. ద్రవపరిణామం పెరిగి ద్రవాన్ని ఇముడ్చుకునే ఖాళీ పెరగకపోవడంతో ఆలోపల ఒత్తిడి అధికమవుతుంది. ఈ పెరిగిన ఒత్తిడినే మనం రక్తపోటు అంటాం. అంటే ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల బిపి పెరుగుతుందన్న మాట. రక్తం శరీరంలోని అన్ని అవయవాలకు సరఫరా అవ్వడానికి బ్లడ్‌ ప్రెజర్‌ (బిపి-రక్తపోటు) అవసరం. బిపి 120/80 ఉంటే నార్మల్‌ ఉందని అర్థం. పైన ఉన్న సంఖ్య (120) సిస్టాలిక్‌ అని, కింద ఉన్న సంఖ్య (80) డయాలిస్టిక్‌ అని అంటారు. రక్తపోటు వయసును బట్టి కొంత పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మిగతా అలవాట్ల వల్ల, యాంగ్జైటీ, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్‌ వల్ల బిపి పెరిగే అవకాశముంది. బిపి పెరిగినప్పుడు వెంటనే ఏమీ అవ్వకపోవచ్చు. అయితే నెమ్మది నెమ్మదిగా శరీరంలోని కీలక అవయవాలపై ప్రభావం చూపుతుంది. బిపి ఎక్కువైనప్పుడు మెదడు, కళ్లు, గుండె, మూత్రపిండాలు ఎక్కువ ప్రభావితం అవుతాయి. భోజనంలో ఉప్పు వల్ల బిపి పెరుగుతుంది. కొంత మందిలో ధూమపానం, ఆల్కహాలు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల కూడా బిపి పెరుగుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతర కారణాల వల్ల కూడా బిపి పెరిగే అవకాశముంది. మూత్రపిండాలకు వెళ్లే రక్తనాళాలు సన్నగా ఉండడం వల్ల బిపి ఎక్కువైతుంది. కిడ్నీపైన ఉండే కొన్ని గ్రంథులు ఎక్కువగా పనిచేసినా కూడా బిపి పెరుగుతుంది. థైరాయిడ్‌ తక్కువైనా కూడా బిపి వస్తుంది. కొంత మంది గర్భం రాకుండా ఉండటానికి పిల్స్‌ తీసుకుంటారు. ఈ పిల్స్‌ వల్ల కలిగే దుష్ప్రభావాల్లో బిపి ఒకటి. పిల్స్‌తో వీరిలో బిపి పెరుగుతుంది. వేరే ఏ కారణాలు లేకుండా బిపి ఎక్కువుంటే ప్రైమరి హైపర్‌టెన్షన్‌ అంటారు. 95 శాతం మందిలో బిపికి కారణం ఏమిటనేది కనుక్కోలేం. ఇది జన్యుపరమైనవి కావొచ్చు, అలవాట్లు కావొచ్చు. తీసుకునే ఉప్పు వల్ల కూడా కావొచ్చు. ఒక్కోసారి అకస్మాత్తుగా హైబిపి వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. అకస్మాత్తుగా హైబిపి వచ్చినప్పుడు కళ్లు మసకగా కనిపించడం, కళ్లలోని నరాలు దెబ్బతినడం జరుగుతాయి. ఒక్కోసారి మెదడులోని నరాలు చిట్లే అవకాశముంది. దీన్ని సెరిబ్రల్‌ హెమరేజ్‌ అంటారు. ఈ పరిస్థితిలో మరణించే అవకాశాలెక్కువ. ఒత్తిడి వల్ల పెద్దలే కాక పిల్లల్లో కూడా బిపి వస్తోంది. ఒత్తిడి ఉన్నప్పుడు శరీరంలోని హార్మోన్లు పెరగుతాయి. మనం ఏదైనా విషయం గురించి ఆందోళన చెందినప్పుడు పల్స్‌రేటు ఎక్కువై బిపి పెరుగుతుంది. శరీరానికి మేలు చేసే హార్మోన్లు ఒత్తిడి వల్ల కీడు చేస్తాయి.




  • బిపికి జీవితాంతం మందులు


ఒక సారి రక్తపోటు వస్తే దీన్ని నయం చేయలేం. కేవలం నియంత్రిచే వీలుంది. దీని కోసం జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే బిపి మన శరీరంలోని ప్రతీ అవయవం ప్రతీక్షణం ప్రభావితమవుతుంది. మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో అన్ని సార్లు రక్తం శరీరమంతా ప్రసరిస్తుంది. 25 ఏళ్లు వచ్చినవారు బిపిని చెక్‌ చేయించుకోవాలి. కనీసం ఆరు నెలలకోసారైనా. మందులు వాడుతున్నవారు మూడు నెలలకోసారి పరీక్ష చేయించుకోవాలి. ఏడాదికోసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.బిపి ఉన్నప్పుడు వైద్యున్ని కలిసి అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. సూచించిన మందులను క్రమం తప్పకుండా జీవితాంతం వాడాలి. తరచూ బిపి చెకప్‌ చేయించకుంటూ ఉండాలి. బిపి వల్ల బ్రెయిన్‌ హెమరేజ్‌, పక్షవాతం, కళ్లలో సమస్యలు, దృష్టి దెబ్బతిని చూపుపోతుంది. గుండెపోటు, కిడ్నీ దెబ్బతినడం వల్ల కిడ్నీ సమస్యలు.




  • ఉప్పు ఎలా తగ్గించుకోవాలి ?


మనకు రోజుకు ఒక వ్యక్తికి 6 గ్రాముల ఉప్పు అవసరం. పళ్లు, కూరగాయల్లో సహజసిద్దంగా ఉప్పు ఉంటుంది. ఇది మన శరీరం పనిచేయడానికి తోడ్పడుతుంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఉప్పును తగ్గించుకోవచ్చు.




  • * నిల్వ ఉన్న, బయట దొరికే ప్రాసెస్‌ ఫుడ్స్‌ పూర్తిగా మానాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఉప్పు ఎక్కువుంటుంది.

  • * ఆహారం తినే సమయంలో ఉప్పు డబ్బా పెట్టుకోకూడదు.

  • * ఉప్పుకు బుదులు రుచికలిగించేవి, సుగంధద్రవ్యాలు, నిమ్మరసం, వెనిగర్‌, మిరియాలపొడి, ఉల్లిపాయలు వాడాలి.

  • * డబ్బాల్లో నిల్వ ఉన్న పదార్థాలకు బదులుగా తాజా పళ్లు తీసుకోవాలి.

  • * ఉప్పుతో తయారు చేసిన స్నాక్స్‌, చిప్స్‌ను బాగా తగ్గించాలి.

  • * ఉప్పు కలుపుకోకుండా మజ్జిగ తీసుకోవాలి.

  • * పొటాషియం ఎక్కువుండే అరటిపళ్లను అధికంగా తీసుకోవాలి. ఇవి శరీరంలో సోడియం స్థాయిని సమతుల్యం చేస్తాయి.

  • * అధిక బరువు ఉన్నవారు తమ ఎత్తు, వయసుకు తగ్గ బరువుండాలి.

  • * ఆల్కహాలు, ధూమపానం మానాలి.

  • * ఆహార పదార్థాల మీద అదనంగా ఉప్పు చల్లుకోవడం మానాలి.

  • * కూల్‌డ్రింక్స్‌ మానాలి.


Udates :




  • ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలంటూ కార్పొరేట్ ఆస్పత్రులు ఓ వైపు ప్రచారం చేస్తుండగా మరోవైపు డెన్నార్క్‌కు చెందిన శాస్తవ్రేత్తలు ఉప్పు పూర్తిగా తగ్గిస్తే గుండెకు సమస్యలు తప్పవని తేల్చి చెబుతున్నారు. వినడానికి వింతగా ఉన్నా, తాజా పరిశోధనలు ఉప్పు వినియోగాన్ని పూర్తిగా తగ్గించవద్దని ఘోషిస్తున్నాయి. తిండిలో లవణం లేకుండా చేస్తే గుండెకు చేటు కలుగుతుందని, ఫలితంగా హృద్రోగాలు తప్పవని డెన్మార్క్ పరిశోధకులు దండోరా వేస్తున్నారు. ఉప్పును బాగా తగ్గించడం వల్ల కొలెస్ట్రాల్‌లో 2.5 శాతం, రక్తం గడ్డ కట్టడానికి సహకరించే కొవ్వులో ఏడు శాతం పెరుగుదల సంభవించినట్లు వారు గుర్తించారు. ఉప్పు వినియోగం మానేస్తే అధిక రక్తపోటుకు కారణమయ్యే ‘అల్డోస్టెరాన్’ హార్మోన్లు శరీరంలో విడుదలవుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.



Salt History ,ఉప్పు చరిత్ర :




  • ఒకప్పుడు ఉప్పు విలువై వస్తువు... దేశాలను సంపన్నం చేసిన ధనం... సైనికులకి అదే జీతం..


అబ్బో... చెప్పుకోవాలంటే ఉప్పు గొప్ప ఒప్పుకోక తప్పనిదే! ఒకప్పుడు అది డబ్బుతో సమానం. ఇది దేశాల ఆర్థిక స్థితిగతులనే మార్చింది. 'జీతం' అనే పదం పుట్టడానికి కారణమయ్యింది. కొన్ని దేశాల్లో సైనికులకు ఉప్పునే జీతంగా ఇచ్చేవారు మరి! పురాతన కాలంలో 'తెల్ల బంగారం' అని పిలుచుకునే వారు. ఇక మన దేశంలో ఉప్పు సత్యాగ్రహం ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో గుర్తుంది కదా? బ్రిటిష్‌వారు ఉప్పుపై విధించిన పన్నుకి వ్యతిరేకంగానే గాంధీజీ దీన్ని చేపట్టారు.

ఇంతకీ ఉప్పు వాడకం ఎప్పుడు మొదలైంది? రాతి యుగంలో ఆదిమానవులు పచ్చిమాంసం తినేవారు కాబట్టి ఉప్పు అవసరమే ఉండేది కాదు. పది వేల ఏళ్ల క్రితం వ్యవసాయం మొదలుపెట్టి వరి, గోధుమ లాంటి ఆహార ధాన్యాలు పండించడం మొదలుపెట్టగానే ఉప్పదనం కావల్సివచ్చింది. ఉప్పుని మొదట చైనాలో వాడినట్టు ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 6000లో చైనాలోని యుంచెంగ్‌ అనే ఉప్పునీటి సరస్సు నుంచి ఉప్పుని తయారు చేశారని చెబుతారు. ఆసియాలో క్రీస్తు పూర్వం 4,500 నుంచి వినియోగంలో ఉన్నట్టు అంచనా. ఈజిప్టువాసులు మమ్మీలను నిలవ ఉంచేందుకు వాడేవారు.

15వ శతాబ్దంలో పోలాండ్‌ ఉప్పు వల్లే అత్యంత ధనవంతమైన దేశంగా మారింది. ఉప్పు గనుల నుంచి ఇతర దేశాలకు సరఫరా చేసి బోలెడు డబ్బు దండుకునేది. తరువాత జర్మన్లు సముద్రపు ఉప్పుని తయారు చేయడంతో అందరికీ అందుబాటులోకి వచ్చింది. రోమన్‌ చక్రవర్తులైతే సైన్యానికి కొన్నాళ్ల పాటు ఉప్పునే నెల జీతంగా ఇచ్చారు. జీతానికి వాడే Salary పదం పుట్టుకకు కారణం ఉప్పే. Salarium అనే లాటిన్‌ పదం నుంచి ఇది వచ్చింది. ఆ పదానికి అర్థం Payment in Salt.




  • మీకు తెలుసా?


* ప్రపంచ వ్యాప్తంగా 210 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉప్పు ఉత్పత్తి జరుగుతోంది.
* ఉత్పత్తిలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న దేశాలు అమెరికా, చైనా, జర్మనీ, ఇండియా.
* మన దేశంలో ఏటా 14.5 మిలియన్‌ టన్నుల ఉప్పుని ఉత్పత్తి చేస్తున్నారు.




  • conclusion :


ఉప్పు తినాలా ? వద్దా? ....
ఉప్పు తప్పనిసరిగా ఆహారములో తీసుకోవాలి . నార్మల్ గా ఏ వ్యాధులు లేనివారు రోజుకి 6(ఆరు) గ్రాములు అన్నివిధాలా మొత్తము గా తీసుకోవాలి . గుండెజబ్బులు , బి.పి. ఉన్నవారు ఇందులో సగము ... సుమారు 2.5 - 3.0 గ్రాములు వాడాలి.




  • ఉప్పులో రకాలు :


ఉప్పులో సోడియం , క్లోరైడ్ అను రెండు పదార్ధాలు ఉంటాయి.



  • కామన్‌ సాల్ట్ :


ఇది మనము కిచెన్‌ లో వాడే రకము. సముద్రపు నీటినుండి తయారుచేసి శ్ర్భ్రము చేస్తారు . కొన్ని రసాయనాలు కలిపి ఫ్రీ గా పొడుము గా ఉండేలా చేస్తారు .



  • అయోడైజ్డ్ సాల్ట్ :


కామన్‌ సాల్ట్ కు అయోడిన్‌ కలుపుతారు . ఉప్పును శుభ్రము చేసినపుడు అయోడిన్‌ పోతుంది . అయోడిన్‌ వల్ల థైరాయిడ్ వ్యాధులు వస్తాయి. అందువల్ల ఉప్పుకు అయోడిన్‌ కలిపి తయారుచేస్తారు .



  • సీ సాల్ట్ :


సముద్రము నీటినుండి తయారుచేసే ఉప్పు స్పటికాలు . దీనిలో కొద్దిగా అయోడిన్‌ , పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. పూర్వము వంటలలో దీనినే వాడేవారు .



  • రాక్ సాల్ట్ :


Halite , commonly known as rock salt, is the mineral form of sodium chloride (NaCl). Halite forms isometric crystals.
గ్రే / పింక్ రంగులో ఉంటుంది . ఇది రిఫైన్‌ చేసింది కాదు . . కాబట్టి అన్ని మినరల్స్ యదాతదం గా ఉంటాయి . ఎసిడిటీని తగ్గిస్తుంది .



  • ఎప్సమ్‌ సాల్త్ : Magnesium sulfate


దీన్ని వంటకాలలో వాడరు . మందులషాపులలో దొరుకుతుంది . స్నానము చేసే నీటిలో కలిపి వాడితే శారీక నొప్పులు తగ్గుతాయి. కండరాలను సడలిస్తుంది . చర్మము పై మృతకణాలను తొలగిస్తుంది . containing magnesium, sulfur and oxygen, with the formula MgSO4. దీన్ని విరోచనకారిగా వాడుతారు (used as a saline laxative).




  • Salt and Herat failure ,ఉప్పు-హర్ట్ ఫెయిల్యూర్




అధిక రక్తపోటు వలన ధమనుల్లో ఆర్టీరియల్ ఒత్తిడి ఏర్పడి రక్తం సంచితమవుతుంది. దీని పరిణామంగా రక్తం వెనుకు పోటేసి గుండె పంపింగ్ సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా కొద్దిసేపు ఏదైనా పని చేస్తే శ్వాసవేగం పెరుగుతుంది.. పనితో సంబంధం లేకుండా విశ్రాంతి తీసుకుంటున్నపుడు కూడా ఆయాసం రావడం జరుగుతుంది. దీని ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు కనిపిస్తాయి. ఉప్పు ఎంతవరకు అవసరం ? మన శరీరంలో సోడియం ఉత్పత్తికాదు, కాబట్టి దీనికి మనం తినే ఆహారం తాగే ద్రవ పధార్ధాలు, దుంపలు, ధాన్యాలు పప్పుదినుసులు, పండ్లు మాంసం, పాలు, మనం తినే నీటిలో కూడా సోడియం వుంటుంది. మనం వంటచేసేటపుడు కూరలతో ఉప్పు సరేసరి! వీటిని దృష్ఠిలో పెట్టుకుని ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన ప్రమాణాల ప్రకారం రోజుకు 1 టీ స్పూన్ ఉప్పు మాత్రమే తీసుకోవాలి. రక్తపోటు, గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులున్న వారు ఉప్పు తక్కువ తినాలి. మోతాదుకు మించి ఉప్పును వాడటం మంచిదికాదు. 



ఆహారంలో ఉప్పు మోతాదు తగ్గించాలనుకుంటున్నారా?  అధ్యయనాలు, పరిశోధనల ప్రకారం ఒక ఆరోగ్యకరమైన మనిషి రోజుకు 1500 మిల్లీగ్రాముల సోడియం చొప్పున వినియోగించాలి. దురదృష్టవశాత్తూ, చాలా మంది 3000 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ సోడియం వాడుతూ వుండడం వల్ల గుండె పోటు, స్ట్రోక్ లాంటి ఇతర రకాల గుండె జబ్బులు వస్తున్నాయి. కేవలం ఒక టీస్పూన్ ఉప్పులో సుమారు 2000 మిల్లీ గ్రాముల సోడియం వుంటుంది, అలాగే ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ లో దొరికే ఏ ఒక్క వస్తువులోనైనా తేలిగ్గా అంతే మోతాదు వుంటుంది. దీర్ఘ కాలం ఎక్కువ సోడియం వాడడం రక్త పోటు, ఇతర బలహీన పరచే పరిస్థితులకు సంబంధించినది కావడం వల్ల సోడియం వాడకాన్ని నియంత్రణ లో ఉంచుకునే మార్గాలు వెతకడం ఆరోగ్యానికి మంచిది. సోడియం వాడకం మితిమీరి ఎక్కువైతే అది వెంటనే కొన్ని వైద్య లక్షణాలు చూపిస్తుంది - పగిలిన, రక్తమోడుతున్న పెదాలు, కడుపులో తిప్పడం లాంటివే కాక, కొన్ని తీవ్ర సందర్భాల్లో మరణాన్ని కూడా కలిగిస్తుంది. మీరు మీ ఆహారంలో ఉప్పు మోతాదు తగ్గించాలనుకున్నా లేక తొలగించాలనుకున్నా, మీ ప్రయత్నంలో ఉపయోగపడేందుకు ఇదిగో ఈ క్రింది సూత్రాలు పాటించండి. : 1. మీ ఆహారాన్ని సహజ స్థితిలో లేదా ఉడికించిన స్థితి లో రుచి చూడడానికి అలవాటు పడ౦డి. మీ ఆహారాన్ని ఎప్పుడూ ఉప్పు కలపక ముందు రుచి చూడ౦డి. మీరు అలవాటు చొప్పున ఉప్పు వేసుకునే వారైతే, ఉప్పు కన్నా ముందు ఫోర్క్ తీసుకుని - ఉప్పు లేని ఆహారం రుచిని ఆస్వాదించడం మళ్ళీ నేర్చుకోండి. మొదట్లో చప్పగా వున్నట్టు అనిపించినా, ఆ భావన త్వరలోనే పోయి ఉప్పు ఆహార పదార్ధాల అసలు రుచిని ఎలా మరుగు పరుస్తుందో తెలుసుకుంటారు. మార్పు రావడానికి కొద్ది సమయం ఓపిక పట్టండి - ఓ రెండు మూడు నెలలకు గానీ మీ ఇంద్రియాలు ఉప్పు కోసం వెంపర్లాడడం మానవు. 2. ఆహార పదార్ధాల పై లేబుళ్ళు చదవండి, వెబ్ సైట్ లు చూసి మీరు రోజూ తినే ఆహారంలో సోడియం పరిమాణం ఎంత ఉందొ తెలుసుకోండి. మీరు తినే ఆహారంలో సోడియం పరిమాణం ఎంత వుందో తెలుసుకు౦టు౦టే ఉప్పు వాడకం తగ్గించాలని మీరు త్వరగా సమాధానపడతారు. వెచ్చాలు కొనేటప్పుడు సోడియం పరిమాణం ఎంత వుందో తెలుసుకోవడానికి లేబుళ్ళు చదవడం అలవాటు చేసుకోండి. ఇంట్లో వండుకుని తినడం 1. ఇంట్లో వంట చేసేటప్పుడు కూడా ఉప్పు వాడకం తగ్గించండి. అత్యవసరమైతే తప్ప ఉప్పు వేయడం మానేయండి. వంటకాల్లో సూచించిన దాంట్లో సగం ఉప్పే వేయండి, ఇంకా అలా సగం చేసుకుంటూ వెళ్ళండి. కుదిరితే, వంట చివర గానీ లేదా తినబోయే ముందు కానీ ఉప్పు వేయండి. ఇలా చేస్తే, ఉప్పుకి వంటకం లో కలవడానికి ఎక్కువ సమయం ఉండదు కాబట్టి కొంచెమే సరిపోతుంది. 2. తాలింపు కోసం వాడే వాటిలో సోడియం ఎంతుందో చూడండి. పంది మాంసపు ముక్కలు, రొమనో వెన్న, కొన్ని ఎంపిక చేసిన తాలింపు సామాను లాంటి చాలా పదార్ధాలు ఎక్కువగా ఉప్పుతో కూడి వుంటాయి కనుక సాధ్యమైనంత వరకు వాటిని వదిలేయండి (కెచప్, ఆవ పెట్టిన ఊరగాయ బదులు బర్గర్ మీద పాలకూర, ఉల్లి, టమాటో వాడండి). ప్రత్యేకమైన తాలింపు పాకెట్ వుండే వాటికి - ఆ పాకెట్ లో తక్కువ పరిమాణం వాడండి లేదా పూర్తిగా తగ్గించండి. ఐతే, కొద్దిగానే అయినా ఈ రుచులు, తాలింపు ఉప్పు కలపడమే నేరుగా ఉప్పు కలపడం కన్నా మంచిది. 3. ఉప్పు బదులు ఉప్పు లేని తాలింపు వాడండి. ఉప్పు నుంచి దూరంగా ఉండడానికి అనేక ఇతర ప్రత్యామ్నాయాల శ్రేణి వుంది. వాటిలో మూలికలు, సుగంధ ద్రవ్యాలు, నిమ్మకాయ, వెల్లుల్లి, తాజా కూరగాయలు, మాంసం, కూరల ఉప్పు ఒరేగానో, నిమ్మ రసం, మిరియప్పొడి, మిరపగుండ, కారపు సాస్ లేదా సాల్సా కూడా కొద్దిగా రుచిని జోడిస్తాయి. 4. ప్రాసెస్ చేసిన ఆహారాలు మానివేయండి. తాజాగా తయారైనవి, మాంసం, మంచినీటి చేప లాంటివి ఉప్పు లేకుండా వుంటాయి లేదా కొద్ది పాటి సోడియం ను కలిగి వుంటాయి, కాగా సూప్ లు, శీతలీకరించిన ఆహారం, ప్రాసెస్ చేసినవి, రెస్టారెంట్ లో తయారయ్యేవి సాధారణంగా సోడియం అధికంగా కలిగి వుంటాయి. మీకు తాజా కూరగాయలు అందుబాటులో లేకపోతే సోడియం అధికంగా వుండే కూరగాయల కన్నా సోడియం లేని, లేదా తక్కువగా వుండే డబ్బాల్లో వున్న కూరగాయలు వాడడం మంచిది. అందుకే సోడియం పరిమాణం ఎంతుందో తెలుసుకోవడానికి లేబుళ్ళు చదవడం అలవాటు చేసుకోండి. 5. ఆహార పదార్ధాల మీద నుంచి సోడియం తొలగించండి. ఉప్పు కలిసిన వాటి కన్నా పైన ఉప్పు చల్లిన పదార్ధాలు ఎంచుకోండి. ఉదాహరణకు సాల్టైన్ లు కొనేటప్పుడు ‘సాల్ట్ కలపని పైముక్కల' కొనుగోలు మానేయండి ఎందుకంటే వాటి పైన కాకుండా ఉప్పు లోపల కలిసిపోయి వుంటుంది - అందువల్ల దాన్ని తొలగించడం కుదరదు. "ఉప్పు పైన' వుండే ఉత్పత్తులు కొద్ది సోడియం పరిమాణానికి ఎక్కువ రుచిని అందిస్తాయి, కనుక ఆ కోణంలో చూసినా అవే మంచివి. 6. టేబుల్ దగ్గర కూర్చున్నపుడు మీ ఉప్పు వాడే అలవాట్లు మార్చుకోండి. సాల్ట్ షేకర్ ముట్టుకోకండి. తగ్గించేటప్పుడు కూడా మొత్తం ఒంపుకోకుండా ఒక్కసారి షేక్ చేయండి - ఇక నెమ్మదిగా ఈ అలవాటుకి దూరం జరగండి. మసాలా దినుసులతో జాగ్రత్త - సాస్ లు ఇతర టాపింగ్స్ లో ఎక్కువ పరిమాణం లో ఉప్పు ఉంటుంది. 7. ఆహారాల్లో వున్న సోడియంను తగ్గించండి. మీరు ఎక్కువ సోడియం వున్న సూప్ ల లాంటి పదార్ధాలు కొంటే దాన్ని పల్చగా తయారు చేయడం వల్ల సోడియం స్థాయి తగ్గుతుంది. ఉదాహరణకు, మీరు లేబుల్ మీద సూచించినట్టుగా సూప్ తయారు చేస్తే, దాంట్లో సోడియం పరిమాణం ఎక్కువగా వుంటుంది. దాని బదులు మీరు క్యాన్ చేసిన సూప్ ను తీసుకుని బంగాళా దుంపలు, ఆకుకూరలు, ఉల్లిపాయలు, కారెట్లు లాంటి తాజా కూరగాయలు కలపండి. అలా కాకుండా దాన్ని నేరుగా వడ్డి౦చడం వల్ల తినే ప్రతివారికీ ఎక్కువ పరిమాణంలో సోడియం అందుతుంది. 8. ఇంట్లో తినండి. వేరే వాళ్ళ ఇళ్ళలోనో, రెస్టారెంట్లలోనో తింటే ఇతరులు తయారు చేసిన పదార్ధాలలో సోడియం పరిమాణం నియంత్రించడం మనకు సాధ్యం కాకపోవచ్చు. ఇంట్లో తింటున్నాం అంటే మీ ఆహారంలో సోడియం పరిమాణం ఎంత వుందో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది.





    నిత్యం అందుబాటులో ఉండే ఉప్పు వంటలకు రుచినివ్వడమే కాదు, మరెన్నో విధాలుగానూ ఉపయోగపడుతుంది.



రోజూ నీళ్లు పోయడం వల్ల ఫ్లవర్‌ వాజు లోపల గారపడుతుంది. అలాంటప్పుడు ఉప్పు నీటిని వాజులో నింపి అరగంట నాననివ్వాలి. ఆ తరవాత బాగా గిలక్కొట్టి సబ్బు నీటితో కడిగేస్తే గార వదులుతుంది. గుమ్మాలకు వేలాడదీసే ప్లాస్టిక్‌ పూల దండలూ, ఫ్లవర్‌ వాజులపై దుమ్ము పేరుకుంటుంది కదా! దాన్ని వదిలించడానికీ ఉప్పు ఉపయోగపడుతుంది. అందుకు ఏం చేయాలంటే... పెద్ద ప్లాస్టిక్‌ కవరులో గుప్పెడు ఉప్పు వేసి అందులో ప్లాస్టిక్‌ పువ్వుల్ని ఉంచి ముడి వేసి, కవరును బాగా కదపాలి. ఉప్పు నల్లబడిందంటే దుమ్ము పోయినట్లే.



* గదులు వూడ్చే మెత్తని చీపురుని కొనగానే వాడేయకండి. బకెట్‌ వేడి నీళ్లలో కప్పు ఉప్పు వేసి దాన్లో చీపురు మునిగేలా ఉంచండి. పావు గంటయ్యాక దాన్ని బయటకు తీసి ఎండలో ఉంచండి. ఇలా చేస్తే చీపురు ఎక్కువకాలం మన్నుతుంది.



* భోజనాల బల్లపై నీటి మరకలు ఎక్కువగా పడుతుంటాయి. వాటిని వదిలించాలంటే ఉప్పే పరిష్కారం. అరకప్పు ఉప్పులో కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా చేయాలి. దీన్ని నీటి మరకలున్న చోట పూతలా రాసి కాసేపయ్యాక కడిగితే మరకలు సులువుగా పోతాయి.



* ఈ కాలంలో కిటికీ అద్దాలపై మంచు పేరుకుని మసగ్గా కనిపిస్తుంది. దానికీ ఉప్పు నీరే పరిష్కారం. ఉప్పు నీటిలో మెత్తని వస్త్రాన్ని ముంచి కిటికీ అద్దాలను తుడవాలి. ఆ వెంటనే మరో మెత్తని పొడి వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది. ఇంట్లో చీమలు బారులు తీరి ఇబ్బంది పెడుతోంటే ఆ ప్రదేశంలో ఉప్పు చల్లితే, తక్కువ సమయంలో వాటి బెడద వదులుతుంది.



* చెత్త డబ్బాల్లో పేరుకున్న మురికీ దుర్వాసనా వదలాలంటే డబ్బా అంతటా అరకప్పు ఉప్పు చల్లండి. కాసేపయ్యాక చల్లని నీరు పోస్తూ కడిగేస్తే, మురికితో పాటూ దుర్వాసన కూడా పోతుంది.



courtesy with:eenadu sukhibhava




  • ===================================


Visit my Website - Dr.Seshagirirao...