Pages

Labels

Popular Posts

Sunday 13 November 2011

బత్తాయి,sweat orange





పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


బత్తాయి ఒక తియ్యని రూటేసి కుటుంబం కు సంబంధించిన పండ్ల చెట్టు. చూడ్డానికి పెద్దసైజు నిమ్మపండులా ఉండే బత్తాయిపండు రుచిలో మాత్రం పుల్లగా కాకుండా తీయగా ఉంటుంది. అందుకే దీన్ని స్వీట్‌ లైమ్‌ అని పిలుస్తారు. పండిన బత్తాయి గుజ్జు లేత పసుపురంగులో ఉంటుంది. చాలామంది ఒలుచుకుని తిన్నప్పటికీ జ్యూస్‌ రూపంలోనే దీనికి వాడుక ఎక్కువ. అందుకే పండ్లరసం అనగానే అందరికీ ఈ పండ్లే గుర్తుకొస్తాయి.

ఆగ్నేయాసియా, దక్షిణ ఆసియా, మధ్యధరా ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే ఈ పండ్ల చెట్లని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెంచుతున్నారు. పుట్టింది ఆసియాదేశాల్లోనే అయినా క్రమంగా ఇటలీ, మధ్యధరా ప్రాంతంలో ఎక్కువగా పండించడంతో ఇటాలియన్‌ లైమ్‌, మెడిటెర్రేనియన్‌ లైమ్‌ అని కూడా పిలుస్తుంటారు. ఇరానీయులైతే తీపి నిమ్మ అంటారు.

రుచిలో ఒకేరకంగా ఉన్నప్పటికీ మధ్యధరా, వెురాకోల్లో పెరిగే బత్తాయిలు రూపంలో మాత్రం కాస్త భిన్నంగా ఉంటాయి. వెురాకో రకం తొక్క పలుచగా ఉండి పసుపుతో కూడిన నారింజవర్ణంలో మంచి వాసన కలిగి ఉంటే మధ్యధరా ప్రాంతంలో పెరిగేవి మాత్రం పులుపన్నదే లేకుండా తియ్యగా ఉంటాయి. ఇటీవల పుల్లని నారింజనీ తియ్యని బత్తాయినీ సంకరీకరించి సిట్రస్‌ బెర్గామియా అనే కొత్త రకాన్ని రూపొందించారు. ఇది తీపి-పులుపు రుచితో చూడ్డానికి నారింజపండులా ఉంటుంది.



పోషక విలువలతోపాటు ఔషధపరంగా కూడా బత్తాయిలో అనేక లాభాలున్నాయి. జలుబు, జ్వరం వంటివి వచ్చినప్పుడు త్వరగా కోలుకోవడానికి ఈ పండ్లరసాన్నే అందిస్తారు.

* విటమిన్‌-సి లోపంతో వచ్చే స్కర్వీ వ్యాధిని అరికట్టడంలో ఈ పండుని మించింది లేదు. రుచికి తియ్యగానే ఉన్నా ఇందులో విటమిన్‌-సి ఎక్కువపాళ్లలో దొరుకుతుంది.

* ఈ పండుకున్న తీపివాసన లాలాజలగ్రంథుల్ని ప్రేరేపించి లాలాజలం అధికంగా వూరేందుకు కారణమవుతుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్‌లు పిత్తరసంతోపాటు ఇతర జీర్ణరసాలూ ఆమ్లాలూ విడుదలయ్యేందుకు దోహదపడతాయి. అందువల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అంతేకాదు, ఈ రసం త్వరగా జీర్ణమై రక్తంలో వెంటనే కలిసిపోతుంది. అందుకే బెడ్‌మీద ఉన్న రోగులు కోలుకునేందుకు బత్తాయిరసాన్నే ఇస్తుంటారు. ఉదయాన్నే యోగా, జాగింగ్‌, వాకింగ్‌ చేసి వచ్చాక ఓ గ్లాసు తాజా బత్తాయిరసం తాగితే చాలు... అలసిన శరీరం వెంటనే శక్తిమంతం అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఓ గ్లాసు బత్తాయిరసం తీసుకోవడం ఎంతో మంచిదని పోషకనిపుణులు సూచించేదీ ఇందుకే.

* ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని ఆమ్లాలు పేగుల్లోని విషపూరిత పదార్థాల్ని పారదోలతాయి. అందువల్ల అజీర్తితో బాధపడేవాళ్లకి కూడా బత్తాయిరసం ఎంతో మంచిది. ఇందులో ఎక్కువగా ఉండే పొటాషియం డయేరియా, డీసెంట్రీ... వంటి వ్యాధుల్ని వెంటనే తగ్గేలా చేయడంతోబాటు బాధితులు త్వరగా కోలుకునేలా చేస్తుంది. ముఖ్యంగా కామెర్లు వచ్చినవాళ్లకు ఈ జ్యూస్‌ ఎంతో మంచిది. బత్తాయిపండు రుచి వాంతుల్ని అరికట్టి తలతిరగడాన్ని తగ్గిస్తుంది.

* ఈ జ్యూస్‌ తాగడంవల్ల చిగుళ్లనొప్పులు, గొంతుసంబంధ ఇన్ఫెక్షన్లూ త్వరగా తగ్గుముఖం పడతాయి. ప్రతిరోజూ ఈ జ్యూస్‌ తాగడంవల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. దాంతో రక్తప్రసారం చక్కగా ఉండి రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కంటిచూపు కూడా బాగుంటుంది. ఇందులోని లివోనాయిడ్‌లు వూపిరితిత్తుల్ని శుభ్రంచేయడంలోనూ రక్షించడంలోనూ కీలకపాత్ర వహిస్తాయి.

* చర్మానికీ మంచిదే. క్రమం తప్పక తీసుకోవడంవల్ల మచ్చల్ని మాయం చేసి చర్మం మెరుపుని సంతరించుకునేలా చేస్తుంది.

ఆటలాడి వచ్చిన పిల్లలకు కూడా రాగానే తాజా బత్తాయిరసాన్ని ఇస్తే దాహం తీరి స్థిమితపడతారు. దాహాన్ని తీర్చడంలో తాజా బత్తాయిరసాన్ని మించింది లేదు. చూశారుగా, ఇంకా ఆలస్యమెందుకు... అసలే ఇది బత్తాయిలు ఎక్కువగా వచ్చే సీజన్‌. రసం తీసేయండి మరి!



  • ================================
Visit my Website - Dr.Seshagirirao...