Pages

Labels

Popular Posts

Monday 18 November 2013

Adhatoda vasica or Justicia adhatoda,అడ్డసరం, మలబార్ నట్ ట్రీ


  •  







  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



అడ్డసరం, మలబార్ నట్ ట్రీ

అడ్డసరం  ఒక విధమైన ఔషధ మొక్క. దీని పండ్లు , మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .

ఈ మొక్కను మలబార్ నట్ ట్రీ, అడూస అని కూడా పిలుస్తారు. దీని శాస్ర్తీయ నామం ''అడహతోడ వాసికా నీస్''. అడ్డసరం పొలం గట్ల మీద 1-4 మీటర్ల ఎత్తువరకు పెరిగే బహువార్షిక పొద. ఈ మొక్కు సామాన్య పత్రాలు కణుపునకు రెండు చొప్పున అభిముఖంగా అమరివుండి పొడవుగా, దీర్ఘవృత్తాకారంలో దళసరిగా, పెళుసుగా ఉంటాయి. ఆకర్షనీయమైన తెల్లని పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. .

ఉపయోగాలు


  •     దీని ఆకులు, పుష్పాలు, వేర్లు, బెరడును ఔషధాల్లో విరివిగా వాడతారు. అడ్డసరం మొక్కలో వాసిసిన్, అఢతోడిక్ ఆమ్లం, సుగంధ తైలం ఉంటాయి.

  •     దగ్గు, ఆయాసం నివారణకు అడ్డసరం ఆకులు, వేర్లు అత్యంత ఉపయుక్తమయినవి. దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడే వారు, ఊపిరి అందక ఆయాస పడేవారు వేరు కషాయంలో కొద్ది పంచారం చేర్చి 15 మి.లీ చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

  •     అడ్డసరం పుష్పాలను సుఖవ్యాధుల నివారణ కు వాడతారు.

  •     ఈ మొక్కలోని అన్నిభాగాలు నులి పురుగులను నివారిస్తాయి. ఉబ్బసం ఉపశమానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

  •     అడ్డసరం ఆకుల కషాయం రోజుకు మూడుసార్లు సేవిస్తే రక్త విరేచనాలు, వాంతిలో రక్తం పడడటం, మొండి జ్వరాలు తగ్గుతాయి.

  •     గోరువెచ్చని ఆకు కషాయం చర్మానికి పూస్తే తామర, దురద, గజ్జి, దద్దుర్లు తదితర చర్మవ్యాధులు, చర్మదోషములందు అడ్డసరము (వైద్యమాత) కషాయము ను త్రాగించిన తగ్గుతాయి.

  •     నరముల రోగహరములు, పట్లు, నొప్పులు హరించును . నీళ్ళవిరేచనములు కట్టును . నేత్రరోగహరము గా పనిచేయును .

  •     అడ్డసరము ఆకులను దగ్గుకు, ఉబ్బసానికి, రక్త శ్రావ లోపాలకు, చర్మ వ్యాధులకు మందుగా వాడతారు.



source : wikipedia.org.



  • ========================


Visit my Website - Dr.Seshagirirao...