Pages

Labels

Popular Posts

Monday 18 November 2013

Glory Lilly,Gloriosa superba,అడవి నాభి


  •  





  • మూలము : వికీపెడియా .ఒఆర్జి.


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



 Glory Lilly-అడవి నాభి

అడవి నాభి గా పిలువబడే గ్లోరియోసా సుపర్బా (Gloriosa) పుష్పించే మొక్కలలో కోల్చికేసి కుటుంబానికి చెందిన ఔషధ మొక్క. ఇంగ్లీష్ లో గ్లోరీ లిల్లీ అంటారు. దేశంలోని అన్ని ప్రాంతాలలో పెరుగుతుంది.బొటానికల్ నేమ్‌ : Gloriosa superba,



ఉద్యానవనాలలో పెంచదగిన వార్షికపు మొక్క. ఇది ప్రక్కన ఉండే చెట్లను, మొక్కలను అధారంగా ప్రాకుతుంది. ఆకులు కాండానికి ఎదురుబదురుగా ఉంటాయి. ఆకు మొదలు భాగం అర్థ హృదయాకారంలో ఉండి బారుగా ఉంటుంది. ఆకుల చివరి కొసలు తీగలాగా ఉండి ప్రక్క మొక్కలను పట్టుకొనేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ మొక్క పువ్వులు అనేక రంగులతో ప్రత్యేకతతో కూడిన ఆకర్షణ కలిగి ఉంటాయి. ఈ పూవులు చెట్టు పైన కనీసం ఏడు రోజుల పాటూ ఉంటాయి. ఈ పూవులు పెద్దవిగా ఉండి వాటి ఆకర్షణ పత్రాలు సన్నగా పొడవుగా అగ్ని కీలలు వలె వంకెలు తిరిగి ఉంటాయి. వాటి పుప్పొడి కీలాగ్రాలు 13 సెంటీమీటర్ల బారుగా ఉంటాయి. ఆకర్షణ పత్రాలు పువ్వు తొడిమ వద్ద ఆకు పచ్చ రంగులో ఉండి, క్రమంగా పసుపుపచ్చ, కాషాయ రంగు, కొసలు పూర్తి ఎరుపు రంగులో ఉంటాయి. దీని వేర్లు 15 నుండి 30 సెంటి మీటర్ల బారున కారెట్ దుంపల వలె ఉండి కొసలు సన్నగా మొనదేలి ఉంటాయి. ఈ మొక్క కాండము 3 నుండి 6 మీటర్లు బారున గట్టి తీగలుగా పెరుగుతుంది.





ఉపయోగాలు

ఉపయోగపడే భాగాలు వేరు భాగాలు. ఉదర క్రిములను బైటకు కొట్టివేస్తుంది. భేది మందుగానూ, పురిటి నెప్పులను అధికం చేసేందుకు, లేదా గర్భస్రావానికి ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక వ్రణాలు, కుష్టు, శరీరపు మంటలు, పైల్స్, పొత్తి కడుపు నొప్పి, దురదలను తగ్గిస్తుంది. శరీరానికి బలవర్థకము, వీర్యవృద్ధికి దివ్యౌషధము. మలాశయములోని జిగురును హరింపజేస్తుంది. నరాల నొప్పులకు, చర్మ వ్యాధులకు పై పూతలకు ఉపయోగపడుతుంది. ఇది విషపూరితమైనది. అందుచేత ఇది తగు మోతాదులలో వైద్యుని సలహాపై వాడవలసిన ఔషధము.


వైధ్యపరంగా ఉపయోగాలు :


ఈ మొక్క విత్తనాలలో కోల్చిసిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీనిని గౌటు వ్యాధిలో విరివిగా ఉపయోగిస్తారు.  దుంపలను అల్సర్ల, పైల్స్ మరియు గనేరియా నివారణకు, గర్భస్రావానికి, పాము మరియు తేలు కాటుకు ఉపయోగిస్తారు.




  • ====================


Visit my Website - Dr.Seshagirirao...