Pages

Labels

Popular Posts

Saturday, 29 October 2011

వంగ-వంకాయ , Brinjal








పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


వంగ - వంకాయ (Brinjal) - తెలుగు దేశములో చాలా ప్రముఖమైన, విరివిగా పెంచబడుతున్న కూరగాయల రకాలలో ఒకటి. దీని చరిత్ర సరిగ్గా తెలీదు, కానీ హిందూ మత శ్రాద్ధ కర్మలందు దీనిని కూడా నిషేధించి ఉన్నందువల్ల దీనిని భారతదేశమునకు ఇతర దేశములకు వచ్చినదిగా భావింపబడుతున్నది, కానీ ఎప్పుడు ఎలా భారతదేశమునకు వచ్చినదో సరిగ్గా తెలీదు. వంకాయలు రకరకాలుగా - చిన్న వంకాయలు, పొడుగు వంకాయలు, తెల్ల వంకాయలు, ఎర్ర వంకాయలు, గుత్తి వంకాయలు - లభిస్తున్నాయి.

ఆరోగ్యకరమైన ఉపయోగాలు :
వంకాయలో ఎక్కువగగా పొటాషియం ఉంటుంది . బి.పి.తగ్గందేందు ఉపయోగపడును .
Nutritional Value of Brinjal, Medicinal value of brinjal
A 100 grams of brinjal contains the following nutritional value




  • * Total Carbohydrates – 17.8g

  • * Protein – 8g

  • * Saturated Fat – 5.2g

  • * Dietary Fiber – 4.9g

  • * Total Fat – 27.5g

  • * Cholesterol – 16mg

  • * Sugars – 11.4g

  • * Iron – 6mg

  • * Vitamin A – 6.4 mg

  • * Calcium – 525 mg

  • * Sodium – 62mg

  • * Potassium – 618mg



  • స్ప్లీన్‌ వాపు(spleenomegaly)లో వంకాయ అమోఘముగా పనిచేస్తుంది . పచ్చి వంకాయ పేస్టు కి పంచదార కలిపి పరగడుపున తినాలి .

  • వంకాయ కొలెస్టిరాల్ తగ్గించేందుకు సహకరిస్తుంది ,

  • వంకాయ , టమటోలు కలిపి వండుకొని కూర గాతింటే అజీర్ణము తగ్గి ఆకలి బాగా పుట్టించును.

  • వంకాయ ను రోస్టు చేసి తొక్కను తీసేసి కొద్దిగ ఉప్పు తో తింటే " గాస్ ట్రబుల్ , ఎసిడిటీ , కఫము తగ్గుతాయి.

  • వంకాయ ఉడకబెట్టి ... తేనె తో కలిపి సాయంతము తింటే మంచి నిద్ర వస్తుంది . నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి ఆహారవైధ్యము .

  • వంకాయ సూప్ , ఇంగువ , వెళ్ళుల్లి తో తయారుచేసి క్రమము తప్పకుండా తీసుకుంటే కడుపుబ్బరము (flatulence) జబ్బు నయమగును .

  • మధుమేహం ఉన్నవారు వంకాయ వలన అన్నము కొద్దిక తినడము వలం , దీనిలోని పీచుపదార్దము మూలాన చెక్కెర స్థాయిలు అదుపులో ఉండును .

  • కొన్ని ఆఫ్రికా దేశాలలో ఫిట్స్ వ్యాది తగ్గడానికి వాడుతున్నారు .

  • వంకాయ రసము నుండి తయారుచేసిన ఆయింట్ మెంట్లు, టించర్లు , మూలవ్యాధి(Haemorrhoids) నివారణలో వాడుతారు .

  • దీన్ని పేదవారి పోటీన్‌ (మాంసము ) గా నూట్రిషనిస్టులు భావిస్తారు .


జాగ్రత్తలు :



  • ఎసిడిటీ , కడుపులో పుండు (అల్సర్ ) ఉన్నవారు వంకాయ తినకూడదు ,

  • గర్భిణీ స్త్రీలు వంకాయ తినడము మంచిది కాదు ..ఎలర్జీలకు దారితీయును.

  • వంకాయ చాలా మందికి దురద , ఎలర్జీ ని కలిగించును .

  • శరీరముపైన పుల్లు , చర్మ వ్యాధులు ఉన్నవారు వంకాయ తినరాదు .


వంటకములు
వంకాయ వంతి కూర, పంకజం వంటి భార్య, భారతం వంటి కధ ఉండవని ఒక నానుడి. అల్లాగే వంకాయ తో వెయ్యి రకాలు అని కూడా ఒక నానుడి. వంకాయలను చప్పిడి కూరగకానీ, పులుసుపెట్టి కానీ వండి తినవచ్చును. ముదురుకాయలును, గిజరుకాయలను కారము పులుసుపెట్టి వండిననేగాని తిన బాగుండవు. ఇటువంటి కాయలను ముందు ఉడుకబెట్టి వార్చి వేసినచో అందలి గిజరు మరికొంత తగ్గును. లేత కాయలను ముందు ఉడకబెట్టకుండ పోపులోనూనెవేసి మ్రగ్గనీయవచ్చును. లేక చమురులో వేచి పైన మసాలాపొడి చల్లవచ్చును. నిడివిగనుండు నీటివంకాయలను ముచికవద్ద కొంతభాగము విడిచి క్రింది భాగమును నాలుగు లేక ఆరు చీలికలుగ దరిగి యందు మసాలా పొదిని కూరి మువ్వలేక గుత్తివంకాయగ కూడ వండి తినవచ్చును. గుండ్రని మెట్ట వంకాయను కాల్చి అల్లమును చెఏర్చి యిగురు పచ్చడిగగానీ, పులుసు పచ్చడిగ గానీ పెరుగుపచ్చడిగగానీ చేయవచ్చును. వంకాయ ముక్కలను సామాన్యపు పులుసులోనూ, మజ్జిగ పులుసులోనూ కూడ తరచు వేయుచుందురు. వంకాయ ముక్కలను వాంగీభాత్‌ మొదలను చిత్రాన్నములలో కూడా ఉపయోగింతురు. బంగాళాదుంప మొదలగు ఇతర కూరలతో కలిపి వండుటయు కలదు. వంకాయ ముక్కలను పలుచని బిళ్ళలుగ తరిగి సెనగవగైరా పిండితో చేసిన చోవిలో ముంచి చమురులో వేచి బజ్జీలుగ చేయవచ్చు.


మరింత వివరమైన వంకాయ వంటకాల కోసం ఈ క్రింది వివరములు చూడండి.

1. వంకాయ వేపుడు కూర
2. వంకాయ కారం పెట్టి కూర
3. వంకాయ పఛ్ఛి కారం కూర
4. వంకాయ ముద్ద
5. గుత్తి వంకాయ కూర
6. వంకాయ ఇగురు
7. వంకాయ పఛ్ఛి పఛ్ఛడి
8. వంకాయ బండ పఛ్ఛడి
9. వంకాయ పులుసు పఛ్చడి
10. వంకాయ టమాటో కూర
11. సాంబారు
12. వాంగీభాత్‌
13. వంకాయ పచ్చడి
14. మజ్జిగ పులుసు
15. వంకాయ బజ్జీ

ఇలా చాలా రకాలు ఛెయ్యవచ్చు.

"Brinjal ni హిందీలో 'బైంగన్' అంటారు. దాని మూలం 'బేగుణ్'- 'ఎలాంటి మంచి గుణాలూ లేనిది' అని దాని అర్థం! నిజంగానే ఆయుర్వేదం ప్రకారం వంకాయలో మనిషికి హాని చేసే గుణాలున్నై గాని, మంచి గుణం ఒక్కటీ లేదు. వంకాయ పై పరిశోధనలు చేసి, దానిలో మనకు హాని చేసేవి ఏవీ లేవని తేలితే తప్ప, నిజానికి మనం‌ ఎవ్వరమూ వంకాయను తిననే కూడదు!




  •  మూలము : English articles from --http://www.nutrition-and-you.com/




  • ============================


Visit my Website - Dr.Seshagirirao...