పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
- వంట నూనెలు :
వంటకాల తయారీకి కూక్కరు ఒక్కో తరహ నూనెలు వాడుతుంతారు. ప్రాంతాన్నిబట్టి , కుటుంబ అలవాటునుబట్టి వాడే నూనెలు మారుతాయి . ఒక్కొక్క నూనెకు ఒక్కొ ప్రత్యేకత ఉంది . ఆరోగ్యానికి మంచి , చెడు చేస్తాయి.
నూనెలు మరియు కొవ్వులు వృక్ష, జంతు సంబందిత ఉత్పత్తులు. ఇవి నీటిలో కరగవు. నూనెలను/కొవ్వులను ఫ్యాటి ఆమ్లముల గ్లిసెరొల్ ఇస్టరులు (Glycerol esters of fatty acids) అంటారు. లేదా 'triglyceredes'లేదా 'Triacylglycerols' అంటారు.
సాధారణ పరిసర ఉక్ష్ణోగ్రతవద్ద ఘన(solid)లేదా అర్దఘన(semi solid) రూపములో వున్నచో కొవ్వులని (fats),ద్రవరూపంలో వున్నచో నూనెలని(oils)అనిఅంటారు.
మూడుఫ్యాటి ఆమ్లముల ఆణువులు, ఒక గ్లిసెరొల్ అణువు సంయోగం చెందటం వలన ఓక నూనె/కొవ్వు అణువు (Triglyceride molecule) మరియు మూడు నీటి అణూవులు ఏర్పడును. కొవ్వుఆమ్లాలు,గ్లిసెరొల్ సంయోగంచెంది,నూనెగా ఎర్పడటం.మిశ్రమ ట్రైగ్లిసెరైడ్
- కొవ్వులలో (fats) లో సంతృప్త ఫ్యాటి ఆసిడ్ లు ఏక్కువ వుండటం మూలాన అవి ఘన రూపం లో వుంటాయు. నూనెలలో అసంతృప్త ఫ్యాటిఆసిడ్లు ఎక్కువ % లో వుండును. మనం వాడే వంటనూనెలలో సంతృప్త (సాచురెటెడ్) మరియు అసంతృప్త (అన్‌సాచురెటెడ్) ఫ్యాటి అమ్లములు వివిధ రేషియోలలో వుండును. ఆరోగ్యరీత్యా అసంతృప్త ఫ్యాటి ఆసిడ్ లు వున్న నూనెలను ఉపయోగించడం మంచిది. మిరిస్టిక్, లారిక్, పామిటిక్ మరియు స్టియరిక్ ఆసిడ్ లు సంతృప్త ఫ్యాటిఆసిడ్లు. ఒలిక్, లినొలిక్ మరియు లినొలెనిక్ ఆసిడ్లు అసంతృప్త ఫ్యాటి ఆమ్లములు. ఒలిక్ ఆసిడ్ లో ఒక ద్విబంధము, లినొలిక్ ఆసిడ్ లో రెండు ద్విబంధాలు మరియు లినొలెనిక్ ఆసిడ్ లో మూడు ద్విబంధాలు వుండును. ఒకటికన్న ఎక్కువ ద్విబంధాలున్న ఫ్యాటి ఆమ్లములను పాలి అన్‌సాచురెటెడ్ ఫ్యాటి ఆసిడ్లు (ప్యూఫా) అంటారు.
కొన్ని వంట నూనెలు :
- ఆవనూనె(Mustard Oil) ,
- రైస్ బ్రాన్ ఆయిల్(Rice bran oil) ,
- సన్‌ప్లవర్ ఆయిల్(సూర్యకాంతం పువ్వునూనె) ,
- సోయాబీన్ ఆయిల్ <
- ఆలివ్ ఆయిల్ ,
- వేరుశనగనూనె (Groundnut oil),
- నువ్వులనూనె (Seame oil),
- కుసుమ నూనె (Safflour oil)
- కొబ్బరి నూనె ,
- పామ్ ఆయిల్ (Pam oil)
రక్తపోటుకు 'నూనెల' కళ్లెం!
- గుండె ఆరోగ్యంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని మరోసారి రుజువైంది. నువ్వులనూనె, తవుడునూనె కలిపి వాడితే అధిక రక్తపోటు తగ్గుతున్నట్టు మనదేశంలో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అధిక రక్తపోటు బాధితులకు పక్షవాతం, గుండెజబ్బు ముప్పు ఎక్కువన్నది తెలిసిందే. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజువారీ ఆహారంలో భాగంగా సుమారు 40 గ్రాముల మేరకు నువ్వులనూనె, తవుడునూనె కలిపి తీసుకుంటే.. రక్తపోటు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ తగ్గుదల రక్తపోటు తగ్గటానికి వేసుకునే మందులతో (క్యాల్షియం ఛానెల్ బ్లాకర్స్) సమానంగా ఉండటం గమనార్హం. కేవలం మందులు వేసుకునేవారితో పోలిస్తే.. మందులతో పాటు నూనెల మిశ్రమాన్ని వాడినవారిలో రక్తపోటు రెండు రెట్లు తగ్గటం విశేషం. ఈ నూనెల మిశ్రమంతో చెడ్డ (ఎల్‌డీఎల్) కొలెస్ట్రాల్ తగ్గటంతో పాటు మంచి (హెచ్‌డీఎల్) కొలెస్ట్రాల్ పెరుగుతోందనీ పరిశోధకులు చెబుతున్నారు. నువ్వుల నూనె రక్తపోటుపై గణనీయమైన ప్రభావం చూపుతుందని, ఇది కూడా క్యాల్షియం ఛానెల్ బ్లాకర్ మందుల్లా ప్రభావం చూపుతుందని గతంలో తేలిందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ దేవరాజన్ శంకర్ పేర్కొంటున్నారు. అయితే దీనికి తవుడు నూనె కూడా తోడైతే మరింత మంచి ఫలితం కనబడుతోంది. నువ్వులనూనెలోని సీసమిన్, సీసమోల్, సీసమోలిన్.. తవుడునూనెలోని ఓరీజనోల్ అనే యాంటీఆక్సిడెంట్లు ఇందుకు దోహదం చేస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ రెండు నూనెలూ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (మంచి కొవ్వులు) కలిగున్నాయంటున్నారు.
- =================================
Visit my Website - Dr.Seshagirirao...