- How to use used lemon pieces?
వంటింట్లో ఎక్కువగా ఉపయోగించేవి నిమ్మకాయలు.. అయితే వాటిని వాడేశాక చెక్కల్ని పడేస్తుంటారు చాలామంది. వీటివల్ల ఉపయోగాలు తెలిస్తే ఎవరూ అలా చేయరు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం.
- * ఇంట్లో పురుగులు, చీమలు, ఇతర కీటకాలు ఎక్కువగా వస్తుంటే వంటింట్లో గోడలకున్న రంధ్రాల దగ్గర, కిటకీల వద్ద.. నిమ్మచెక్కలను ఉంచితే చాలు.. వాటి బెదడ దూరమవుతుంది.
- * కిచెన్‌లో పాడైపోయిన కూరగాయలు, వంటల తాలూకు చెడు వాసనలు వస్తుంటే ఇలా చేయండి. గిన్నె నిండా నీళ్లు నింపి అందులో ఈ చెక్కలను వేసి పొయ్యి మీద పెట్టాలి. నీళ్లు మరిగాక వాటి నుంచి సువాసనలు వస్తాయి. ఇల్లంతా పరిమళభరితం అవుతుంది.
- * ఫ్రిజ్, ఓవెన్ నుంచి దుర్వాసనలు వస్తుంటే.. చిన్న కప్పులో నీళ్లు పోసి ఒక నిమ్మకాయ ముక్క ఉంచితే అలాంటి సమస్యలు తక్షణమే దూరమైపోతాయి.
- పొయ్యి, బాణలి, పెనం వంటి వాటి మీద ఉప్పు చల్లి ఈ చెక్కతో రుద్ది కడగాలి. తరవాత పొడి వస్త్రంతో తుడిస్తే నూనె మరకలు వదిలిపోతాయి.
- ========================