సాధారణ జనాలకి కూడా నీలగిరి తైలంగా చేరవైన యూకలిప్టస్ ఆయిల్ సహజ సిద్దం గా ప్రకృతి ప్రసాదించిన దివ్వ ఔషధంగా చెప్తా రు. శరీరంలోని అనేక రుగ్మతలను తగ్గించేఈ యూక లిప్టస్ ఆయిల్ మహిళలకు అందాలను కూడా ఇవ్వటంలోనూ ముందుంది.
- యూకలిప్టస్ ఆయిల్ తో శరీరాన్ని మర్ధన చేయించుకుంటే శరీరాన్ని చల్లబరచి, వేడిమి ఎక్కువ కాకుండా చూస్తుంది.
- అనేక రకాల బాక్టీరియాలను సంహరించటంలో ప్రత్యేకత చూపే ఈ ఆయిల్ వల్ల శరీరం తాజా దనాన్ని సంతరించుకోవటంతో కొత్త ఉత్సాహం పుట్టు కొస్తుంది.
- సహజ సిద్దంగా మంచి సువాసనలు కలిగినది కావటంతో చర్మంపై వచ్చే పుళ్లు, యోని సంబంధిత దురద వ్యాధులకు ఉపయోగ పడుతుంది.
- ఒళ్లునొప్పులతో బాధపడేవారు బకేట్ వేడి నీళ్లలో రెండు కప్పుల యూకలిప్టస్ ఆయిల్ వేసి స్నానం చేస్తే... కీళ్ల నొప్పు లు, శారీరక నొప్పులు కనుమరుగై హాయిగా నిద్ర పడుతుంది. భుజాలు, వీపు భాగాలలో యూకలిప్టస్ ఆయిల్‌కి కొద్దిగా విటమిన్ ఇని కలిపి మర్ధన చేస్తే ఫలితాలుంటాయి.
- చర్మంపై మచ్చలు ఉండే వారు వాటిపై ఈ నూనెను రాస్తే... మచ్చలు పోవటంతో పాటు చర్మం కొత్త నిగారింపులు సంత రించుకుంటుంది.
- పురుషులు ఆఫ్టర్ షేవ్ లోషన్‌గానూ దీనిని వాడుకొంటే ముఖంపై పడే గాట్లు నుండి రక్షణ పొందటమే కాకుండా ముఖం కొత్త అందాలు సంతరించుకుంటుంది.
- శనగపిండిలో కొద్దిగా యూకలిప్టస్ ఆయుల్ వేసి శరీరానికి నలుగు పెట్టుకుంటే శరీరం పొడి బార కుండా ఉండటమే కాకుండా మెత్తగా, అందంగా తయార వుతుంది.
- =======================