సృష్టిలోని అన్ని సంపదలకన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. ఆర్ధికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆరోగ్యం ఉన్నతంగా
లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే. ఉన్నవారికీ, లేనివారికీ కావలసిన ఏకైక సంపద ఆరోగ్యం మాత్రమే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం
అన్నారు. ఆహారం విషయంలో మనం ఉండాల్సినంత జాగ్రత్తగా ఉంటున్నామో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎత్తుకు తగ్గ
బరువుతో బలంగా, శక్తిగా ఉన్నామో లేదో చూసుకోవాలి. బరువు ఎక్కువై, ఊబకాయం తెచ్చుకుంటే ఎంత కష్టమో, తక్కువై బలహీనంగా
ఉన్నా అంతే కష్టం. కనుక సమతుల్యతను కాపాడుకోవాలి. ఆహారంలో ఉండే పోషకాలు శక్తిని విడుదల చేస్తాయి. ఏదైనా అనారోగ్యంతో
బాధపడుతుంటేనో, లేక హార్మోన్ల అపసవ్యత చోటుచేసుకుంటేనో తప్పించి సాధారణంగా మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి బరువులో
హెచ్చుతగ్గులు ఉంటాయి.
ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఆహార నియమాలను పాటించాలి. తీసుకున్న ఆహారం సవ్యంగా జీర్ణమయ్యేందుకు కొంత వ్యాయామం
తప్పనిసరి. లేకుంటే బరువు విపరీతంగా పెరిగిపోతుంటుంది. కొవ్వు నిల్వలు చేరతాయి. శరీరానికి అవసరమైన శక్తి సరిగా విడుదల
కాదు. దాంతో బరువు తగ్గించుకోడానికి నానా యాతనా పడాలి. అవసరమైన కంటే ఎక్కువ ఆహారం ఎలా మంచిది కాదో, తక్కువ
తినడమూ శ్రేయస్కరం కాదు. శరీరం శుష్కించుకు పోయి, నీరసం ముంచుకొస్తుంటుంది. ఏ పనిమీదా శ్రద్ధాసక్తులు ఉండవు. ఈ దశ
ముదిరితే అసలు జీవితం మీదే ఆసక్తి నశిస్తుంది. కనుక ఏవిధంగా చూసినా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేందుకు ప్రణాళిక
వేసుకోవాలి.
మనలో చాలామంది చేసే తప్పు ఏమిటంటే, ఆహారం రుచిగా ఉంటె సరిపోతుంది అనుకుంటాం. కానీ ఆహారం శుచిగా ఉండటం అంతకంటే
ముఖ్యం. పరిశుభ్రంగా లేని పదార్ధాల వల్ల లేనిపోని జబ్బులొస్తాయి. అలాగే నిలవున్న పదార్ధాలు విషతుల్యం అయ్యి, ఫుడ్ పాయిజన్
గా మారే ప్రమాదం ఉంది. ఇక ముఖ్యమైన అంశం ఆహారంలో పోషక విలువలు ఉండాలి. కింది కనీస జాగ్రత్తలు పాటించాలి.
1. ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవడంవల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్సు అందుతాయి.
2. వీలైనంతవరకు ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోకపోవడం మంచిది.
3. రుచికి, చూపులకు బాగుంటుంది కదాని పోలిష్ పట్టిన తెల్లటి బియ్యాన్ని వాడతాం. కానీ దంపుడు బియ్యపు అన్నం ఎంతో శ్రేష్టం.
4. అన్నం కంటే ఎక్కువగా కూరలను తినడం మంచిది.
5.ఆయా సీజన్లలో దొరికే పండ్లను సేవిస్తుండాలి.
6. నీళ్ళు బాగా తాగాలి. రోజుకు నాలుగు లీటర్లకు తక్కువ కాకుండా తాగితే మంచిది.
7. ఎక్కువ నీళ్ళు తాగి, తరచుగా యూరిన్ పాస్ చేయడంవల్ల శరీరంలో చోటు చేసుకున్న మలినాలు చాలావరకూ వెళ్ళిపోతాయి.
ఫాస్ట్ ఫుడ్ అనేది చాలా త్వరగా తయారు చేసి వడ్డించగల ఆహారానికి పేరు. తక్కువ తయారీ సమయం తీసుకునే ఎలాంటి భోజనమైనా
ఫాస్ట్ ఫుడ్ అనుకోవచ్చు, కానీ సామాన్యంగా ఈ పదాన్ని ఒక రెస్టారెంట్ లేదా మునుపే వేడిచేసిన లేదా వండిన పదార్థాల దుకాణంలో
అమ్మబడే ఆహారాన్ని సూచిస్తుంది, మరియు ఇది వినియోగదారుడికి టేక్-అవుట్/టేక్-అవే గా ప్యాక్ చేసి ఇవ్వబడుతుంది. ఈ పదం
"ఫాస్ట్ ఫుడ్" అనేది ఒక నిఘంటువులో మెరియం–వెబ్‌స్టెర్‌చే 1951లో గుర్తింపబడింది.
అమ్మే దుకాణాలు నీడ లేదా కూర్చునే సదుపాయం లేని స్టాండ్లు లేదా బట్టీలు ఇంగ్లీష్ లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు అని పిలుస్తారు.
బర్గర్, పిజ్జా, వేపుడు దినుసులు, కోలా పానీయాలు, మనిషి శరీరానికి ఎక్కువ కేలరీలు కొవ్వును అందించి ప్రమాదం
తెచ్చిపెడుతున్నాయి. హామ్‌బర్గ్‌ర్‌లో 300 కేలరీలు, కొవ్వు 10 గ్రాములు వుంటుంది.మిరియం కలిపిన పిజ్జాలో 180 కేలరీలు, 7
గ్రాముల కొవ్వు వుంటుంది. 340 మిల్లీలీటర్ల కోకోకోలాలో 158 కేలరీలు, మేక్ డోనాల్డ్ సారాలో 210 కేలరీలు వుంటాయి. ఇది
ప్రమాదకరం. మిరపకాయ బజ్జీలు, పానీపూరీ, చాట్ ,ఇడ్లీ, దోసె, సమోసా, పకోడా, వంటివి అంతగా హానికారకాలుకాని ఫాస్ట్‌ఫుడ్స్
క్రిందలెక్క.
భారత దేశానికి వచ్చినట్లైతే ఒక టిఫెన్‌లో 1 ఇడ్లీకి 70 కేలరీలు, 0.2 గ్రాముల కొవ్వు, 1 దోశలో 140 కేలరీలు 5 గ్రాముల కొవ్వు,
సమోసా పేకెట్‌లో 370 కేలరీలు, 18 గ్రాముల కొవ్వు వుంటుంది. ఒక గ్లాసు లస్సీలో 140 కేలరీలు 2 గ్రాముల కొవ్వు వుంటుంది.
ఇలా ఎన్నయినా ఉదాహరణలు ఇవ్వవచ్చు.
ఆరోగ్య సమస్యలు
మెడికల్ సొసైటీ కమిటీ ఆన్ న్యూట్రిషన్ ప్రకారం, ప్రత్యేకంగా ఫాస్ట్ ఫుడ్ క్రొవ్వు పరిమాణం ఎక్కువగా కలిగి ఉంటుంది, ఫాస్ట్ ఫుడ్
తీసుకోవడానికీ - శరీర ద్రవ్యరాశి సూచిక (BMI) మరియు బరువు పెరగడానికీ దగ్గరి సంబంధం ఉంది. "ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం
వలన కెలొరీ గ్రహణం పెరుగుతుంది, బరువు పెరగడం ఎక్కువవుతుంది, మరియు మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతుంది".
క్రొవ్వు ఆమ్లాలు, ఎక్కువ కెలోరీలు మరియు తక్కువ పీచుపదార్థం , మరొక ఆరోగ్యపరమైన హాని, ఆహారం కలుషితం కావడం. ఆహారం
కలుషితమయ్యే హాని జరగడానికి అవకాశం ఎక్కువ. మాంసంతో ఎరువులు కలవడం వలన, అది సాల్మొనెల్ల మరియు ఎస్కేరిచియా కోలి
0157:H7 లతో కలుషితమవుతుంది. E. కోలి 0157:H7 అనేది అతి హీనమైన ఆహార కాలుష్యాల్లో ఒకటి. సామాన్యంగా వండని
హాంబర్గర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది, మరియు దీనికి చికిత్స కష్టం. వ్యాధినిరోధకాలు సూక్ష్మక్రిములను నిర్మూలించినప్పటికీ, అవి
హానికర క్లిష్టతలను ఉత్పన్నం చేసే విషపూరిత పదార్థాన్ని విడుదల చేస్తాయి. E. కోలి 0157:H7 కలిగిన వారిలో సుమారు 4%
హేమోలిటిక్ యూరెమిక్ సిండ్రోం లక్షణాలు చూపుతారు, మరియు ఈ సిండ్రోం వృద్ది అయిన వారిలో 5% పిల్లలు మరణిస్తారు. E. కోలి
0157:H7 అనేది అమెరికన్ పిల్లలలో మూత్రపిండాల వైఫల్యానికి ప్రధాన కారణం అయింది.
మొత్తం జనాభాలో రోజుకు సుమారు 30.3% మంది ఫాస్ట్ ఫుడ్ తిన్నట్టూ తెలిసింది. ఫాస్ట్-ఫుడ్ తీసుకోవడం పురుషులు మరియు
స్త్రీలు, అన్ని జాతులు/తెగల సమూహాలు, మరియు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. ఫాస్ట్ ఫుడ్ తీసుకున్న పిల్లలు, తీసుకోని
వారితో పోల్చినపుడు, మరింత మొత్తం క్రొవ్వు, కార్బోహైడ్రేట్లు, మరియు పంచదారచే-తియ్యనైన పానీయాలు తీసుకుంటున్నారని
తెలిసింది. ఫాస్ట్ ఫుడ్ తిన్న పిల్లలు పీచు పదార్ధం, పాలు, పళ్ళు, మరియు స్టార్చ్ లేని కూరగాయలను తక్కువగా తీసుకుంటారని కూడా
తెలిసింది. పరిశోధకులు ఈ పరీక్షా ఫలితాలను సమీక్షించిన తరువాత, పిల్లలు ఫాస్ట్ ఫుడ్ తింటే, అది వ్యక్తిగత ఆహారంపై చెడు ప్రభావం
చూపి, ఊబకాయం యొక్క అపాయాన్ని గణనీయంగా పెంచుతుందని నిశ్చయించారు.
పాస్ట్ ఫుడ్స్ చేసేవారు వాటి పోషక విలువల సమాచారం తెలియజేయడంలో బాధ్యతా రహితమైనవి మరియు మోసం చేస్తున్నాయని
మనము తెలుసుకోవాలి. ఇది ఒక వ్యసనమంగా మారినది.
పిల్లలు-ఫాస్ట్ ఫుడ్స్
సాధారణంగా రోజూ ఒకేరకమైన ఆహార పదార్థాలు తినీ, తినీ విసుగుచెంది, ఫాస్ట్ ఫుడ్స్‌పై మక్కువ చూపిస్తుంటారు పిల్లలు. ఫాస్ట్ ఫుడ్స్
తినేటప్పుడు బాగానే ఉంటాయి కానీ, పిల్లలు వీటికి అలవాటు పడ్డారంటే భవిష్యత్తులో ఎన్నో సమస్యలను ఎదుర్కో వాల్సి వస్తుంది . .
బేకరీలు, ఫాస్ట్ ఫుడ్స్ సెంటర్లలో లభించే చిప్స్, సమోసాలు ,పేస్ట్రీలు లాంటి పధార్థాలు పిల్లల నోటికి రుచిగా అన్పించి పదే పదే వాటిని
తినేందుకు ఇష్టపడతారు. ఇలా వారు రోజూ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, అవి వారి జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని కలుగజేసి,
అనేక అనర్థాలకు దారి తీస్తాయి . ఈ ఫాస్ట్ ఫుడ్స్‌కు అలవాటు పడిన పిల్లలు తరచూ అనారోగ్య సమస్యలకు గుర వడమే కాక, వారిలో
క్రమేణా ఊబకాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది . డీప్ ఫ్రై చేసే పదార్థాలలో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయనీ, వాటి
శాతం శరీరంలో అధి కమైతే భవిష్యత్తులో గుండెపోటు రావడం కూడా ఖాయం. ఫాస్ట్ ఫుడ్స్ అప్పుడప్పుడు తీసుకుంటే ఫర్వాలేదు కానీ
అదేపనిగా రోజూ తినకూడదు .ఫాస్ట్ ఫుడ్స్ కంటే పిల్ల లకు సీజనల్‌గా వచ్చే పండ్లనన్నింటినీ పిల్లలకు పెడితే మంచి పోషకవిలు వలు
చేకూరి, అన్నిట్లో చురుకుగా ఉంటారని పేర్కొంటున్నారు వారు. రోజూ క్రమం తప్పక లంచ్, డిన్నర్ తర్వాత ఒక అరటిపండును
తీసుకోవడం ఎంతో మంచిదని, ఫాస్ట్ ఫుడ్స్ కంటే పండ్లే మంచి ఆహారము .
ఈ లెక్కల్ని పరిశీలించి ప్రజలు ఇకనైనా ముతక ధాన్యాల పదార్థాల్ని సజ్జ, రాగి, పొట్టు గోధుమలు, దంపుడు బియ్యం, మొలకెత్తిన
పెసలు, శనగలు, తినడం నేర్చుకుంటే శరీర ఆరోగ్యానికి ఏ ఢోకా వుండదు. ''ఫాస్ట్‌ఫుడ్స్‌కు వీడ్కోలు, దేశీయ ముతక ధాన్యాల
పదార్థాలకు స్వాగతం''
- ======================