- పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
ఈ రోజులలో ఒత్తిడి అనే మాట ప్రతి ఒక్కరి నోటి నుంచి విని పిస్తోంది. ఒత్తిడిని తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా అధిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆహారపు అలవాట్లను కూడా ఒక దశకు వచ్చే సరికి నియంత్రణ చేయాలి.. చిన్నప్పువు ఇష్టంగా తిన్నామని… పెద్దయ్యాక కూడా వాటిని అదేలా తింటామంటే కుదరదు. ముఖ్యంగా ఆడవారి విషయంలో సమతుల ఆహారం తీసుకోవాలి . ఎక్కువశాతం ఒత్తిడికి గురయ్యే విషయంలో పురుషుల కన్నా మహిళలే ముందు వరుసలో ఉంటున్నారని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకే వైద్యుల వద్దకు వెళ్లి సైడ్‌ఎఫెక్ట్‌లు కలిగించే మందులను ఊరికే వాడుతుంటాం. మన చేతిలో ఉన్న చిన్న పాటి జాగ్రత్తలు తీసుకోము.
సహజసిద్ధంగా ఒత్తిడి శాతాన్ని తగ్గించే కొన్ని ఆహారపదార్ధాలను పరిశీలిద్దాము .
- బొప్పాయి: దీనిలో ఉండే కెరోటిన్ విషతుల్యాల్ని తొలగిస్తుంది. దీనివల్ల శరీరం, మనస్సు తేలికపడి ఒత్తిడి ఇట్టే ఒత్తిడి తగ్గిపోతుంది.
- ఆరెంజ్ : అత్యధికంగా కమలాల్లో లభించే సి విట మిన్ వల్ల ఒత్తిడి ఫలితంగా ప్రభావం చూపే హార్మో న్ల స్థాయిని తగ్గించి మేలు చేకూరుస్తుంది.
- అరటిపండు : దీనిలో ఉండే అధిక క్యాలరీలు, మెగ్నీషియం టెన్షన్‌ను సులభంగా తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో అరటిపండు ఎంతో మేలు .
- బంగాళ దుంప : జింక్, విటమిన్ సి పెరిగి రోగని రోధకశక్తి ఇనుమడించి మనస్సును దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
- చాక్లెట్ : వీటిలో సహజంగా ఉండే ఫెనిలెథిలమైన్ (పిఇఎ) ఎండార్ఫిన్ స్థాయిల్ని తొలగించి సహజసి ద్దమైన యాంటీ – డిప్రెెస్సెంట్‌గా పనిచేస్తుంది.
- యాప్రికోట్‌లోని కెరోటిన్ ఒత్తిడిని తగ్గిస్తుంది.,
- పెరుగులోని విటమిన్ బి నెర్వస్‌నెస్‌ను తగ్గిస్తుంది.
- గోధుమలో ఉండే ఐరన్ మెదడుకు ఆక్సిజన్‌ను ఇచ్చి ఒత్తిడిని, టెన్షన్‌ను నివారిస్తుంది.
- ఒమెగా3 ఫ్యాటీయాసిడ్లు అత్యధికంగా లభించే చేపలు స్ట్రెస్‌ను తగ్గిస్తాయి.
- పాలలోని ల్యాక్టోస్ మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురుకుగా ఉంచేందుకు సహకరిస్తాయి.
- =====================
Visit my Website - Dr.Seshagirirao...