పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
వర్షకాలం వానలతో పాటు ఇన్‌ఫెక్షన్లు, అలర్జీల వంటి సమస్యలనూ మోసుకొస్తుంది. అంతమాత్రాన భయపడిపోవాల్సిన పనిలేదు. ఆహారంలో చిన్న చిన్న మార్పులతో వీటి నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అన్నింటికన్నా ముందు నూనె పదార్థాలను తగ్గించటం మంచిది. మనలో చాలామంది బయట వాన పడుతుంటే ఇంట్లో వేడి వేడి పకోడీ, సమోసాల వంటివి తెగ తినేస్తుంటారు. నిజానికి వర్షకాలంలో వాతావరణంలో తేమ అధికంగా ఉండటం వల్ల మన జీర్ణక్రియ మందగిస్తుంది. కాబట్టి నూనె ఎక్కువగా గల పదార్థాలకు దూరంగా ఉండటమే మేలు. ఇక తాజా ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్లు బాగా తీసుకుంటే రోగనిరోధకశక్తి పెంపొందుతుంది. పండ్లు కూడా మంచివే. ఇవి శక్తిని అందిస్తాయి. అయితే పుచ్చకాయ వంటివి కాకుండా యాపిల్, దానిమ్మ వంటి పండ్లు తినాలి. అయితే వీటిని శుభ్రంగా కడిగాకే తీసుకోవాలి. వానకాలంలో బార్లీ, ముడిబియ్యం, ఓట్స్ తినటమూ మంచిదే. పాల పదార్థాలు సూక్ష్మక్రిముల తాకిడికి ఎక్కువగా గురయ్యే అవకాశముంది. అందువల్ల పాలకు బదులు పెరుగు తినటం మేలు. బాదంపప్పు తినటమూ మంచిదే. వానకాలంలో వాతావరణంలో తేమ అధికంగా ఉండటం వల్ల ఫంగల్, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల బెడదా ఎక్కువే. మసాలాలు శరీరంలో ఉష్ణోగ్రతను పెంచి దురద, అలర్జీలకు దారితీస్తాయి. కాబట్టి చర్మ వ్యాధులు, అలర్జీలు గలవారు ఈ కాలంలో మసాలా పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. తేమ మూలంగా చర్మం జిడ్డుగా మారుతుంది కూడా. దీంతో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు దాడి చేసే అవకాశమూ ఉంది. అందువల్ల ఇలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవటానికి దాహం వేసినా వేయకపోయినా వానకాలంలో తగినంత నీరు తాగటం తప్పనిసరి. ఈ సమయంలో నీరు కలుషితమయ్యే అవకాశమూ ఎక్కువే కాబట్టి కాచి చల్లార్చిన నీరు తాగటం అన్నివిధాలా మంచిది.
- =========================
Visit my Website - Dr.Seshagirirao.com