పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
Nuts are good for health,గింజపప్పులు ఆరోగ్యానికి ఎంతో మంచిది
గింజపప్పులను (నట్స్) తరచుగా తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయి. బాదం, జీడిపప్పు, పిస్తా, అక్రోటు (వాల్‌నట్), వేరుశనగపప్పుల్లోని అసంతృప్తకొవ్వులు గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. చేపలతో లభించే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా వీటిల్లో ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉండదు. గింజపప్పులు ఎంత ఆరోగ్యకరమైనవైనా మితంగానే తినాలి. రోజుకి ఆరేడు కన్నా (వారానికి 30 గ్రాములు) మించకుండా చూసుకోవాలి. అప్పుడే వీటితో కలిగే ప్రయోజనాలు అందుతాయి. గింజపప్పుల్లో ఖనిజాలతో ఏయే పోషకాలుంటాయో, వాటితో ఎలాంటి లాభాలున్నాయో, ఎలా తినాలో చూద్దాం.
* అసంతృప్త కొవ్వులు: ఇవి చెడ్డ కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) స్థాయులను తగ్గిస్తాయి.
* ఒమేగా 3 కొవ్వులు: రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి దోహదం చేస్తాయి. గుండె లయ తప్పటాన్ని నిరోధించి గుండెపోటు రాకుండా కాపాడతాయి.
* పీచు: ఇది కొలెస్ట్రాల్ తగ్గటానికే కాదు కడుపు నిండిన భావనా కలిగిస్తుంది. దీంతో త్వరగా ఆకలి వేయదు. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహం బారినపడకుండా నివారిస్తుంది.
* విటమిన్ ఇ: ఇదేమో రక్తనాళాల్లో పూడికలను నివారిస్తుంది. అందువల్ల గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది.
* వృక్ష సంబంధ స్టెరాల్స్: ఇవి కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గటానికి తోడ్పడతాయి.
* ఎల్-ఆర్గినైన్: ఈ ప్రోటీన్ రక్తనాళాలు సాగేలా, వదులుగా ఉండేలా చేసి లోపల అడ్డకుంలు ఏర్పడకుండా కాపాడుతుంది.
ఎలా తినాలి?
* బాదంపప్పును రాత్రిపూట నీటిలో గానీ పాలల్లో గానీ నానబెట్టి పరగడుపున తింటే శరీరం బాగా గ్రహిస్తుంది. వీటిల్లో విటమిన్- ఇ దండిగా ఉండటం వల్ల మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని పెంపొదిస్తాయి.
* జీడిపప్పును వేయించి తింటే బాగా జీర్ణమవుతుంది. వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచే జింక్ వీటిల్లో దండిగా ఉంటుంది. జీడిపప్పును ఇతర పప్పులతో కలిపి వంటలో ఉపయోగిస్తే మాంసకృత్తులన్నీ తీసుకున్నట్టవుతుంది.
* పిస్తాలో విటమిన్ ఎ, సి, బి6 ఉంటాయి కాబట్టి రోగనిరోధకశక్తినీ పెంపొదిస్తాయి. వీటిని రుచికోసం సలాడ్లు, ఐస్‌క్రీములు, తీపి పదార్థాలపై చల్లుకున్నా బాగుంటాయి.
* శరీరంలో వాపు ఉన్నప్పుడు, ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు పెరిగే సి-రియాక్టివ్ ప్రోటీన్ స్థాయులనూ అక్రోట్లు తగ్గిస్తాయి. వీటిల్లో మిగతా గింజపప్పుల్లో కన్నా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువ. అందుకే గాలికి, వెలుతురుకు గురైతే త్వరగా రంగు, రుచి మారిపోతాయి.
* వేరుశనగల్లో ఒలియెక్ కొవ్వు ఉంటుంది. మోనో అసంతృప్తకొవ్వు ఆమ్లాలూ ఎక్కువే. అందువల్ల వీటిని తరచుగా తీసుకుంటే గుండె జబ్బుల బారినపడకుండా కాపాడతాయి.
- ========================
Visit my Website - Dr.Seshagirirao...