ఎదిగే పిల్లల కోసం కావలసిన ఆరు కీలకమైన విటమిన్లు
విటమిన్ ఎ: చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఎముక బలానికీ, కంటి చూపు మెరుగుపడేందుకూ తోడ్పడుతుంది. ఇందుకోసం
- చీజ్,
- క్యారెట్,
- పాలూ,
- గుడ్లూ
వాళ్లకి అందించాలి.
బి విటమిన్లూ: మొత్తం శరీర పనితీరు బాగుండి చురుగ్గా ఉండాలంటే అన్ని రకాల బి విటమిన్లూ అందేట్టు చూడాలి.
- మాంసం,
- చేపలూ,
- సోయా,
- బీన్స్
వంటివి ఇవ్వడం వల్ల బి విటమిన్లు అందుతాయి.
కండర పుష్టికి: శారీరక దృఢత్వానికీ, అందమైన చర్మానికీ విటమిన్ సి చాలా అవసరం.
- టొమాటోలూ,
- తాజా కాయగూరలూ,
- విటమిన్ సి అందించే పుల్లని పండ్లూ అందించడం వల్ల విటమిన్ సి లభిస్తుంది.
ఎముక బలానికి: ఎముకలు బలంగా ఉండాలంటే ఆహారంలో క్యాల్షియం ఉండాలి. ఇది సమృద్ధిగా అందాలంటే విటమిన్ డి అందాలి. ఇందుకోసం
- పాలూ,
- పాల ఉత్పత్తులతోపాటూ ఉదయం వేళ సూర్యరశ్మి పిల్లలకు అందేట్టు జాగ్రత్త తీసుకోవాలి.
ఇనుము లోపం లేకుండా: ఇది రక్తం వృద్ధి చెందేట్టు చేస్తుంది. ఇందుకోసం
- పాలకూర,
- ఎండుద్రాక్ష,
- బీన్స్ వంటివి తరచూ తీసుకోవాలి.
- ==========================
Visit my Website - Dr.Seshagirirao...