స్పిరులినా అంటే...........స్పిరులినా అనేది చారిత్రకంగా ఏనాటి నుంచో వాడుకలో ఉన్న ఆకుపచ్చటి ఆహారం. భూమిపై మొక్కల ఆవిర్భావానికి సంబంధించి వాటి తొలి రూపంగా దీన్ని భావిస్తారు. ఆదిమకాలంలో మనిషి ఆహారంలో ఇది భాగంగా ఉండింది. శతాబ్దాలు గా కూడా ఇది మనిషి ఆహార వనరుగా ఉపయోగపడుతూనే ఉంది. ఇప్పటికీ ఎన్నో దేశాల్లో దీన్ని ప్రజలు తమ ఆహారంలో భాగంగా చేసుకున్నారు. ఆఫ్రికాలో కరువు కాటకాలు నెలకొన్న సందర్భాల్లో కొన్ని దేశాల ప్రజలు తమకు అవసరమైన పోషకాల కోసం ప్రధానంగా స్పిరులినా పైనే ఆధారపడ్డారు.
స్పిరులినాకు ఎందుకింత ప్రత్యేకత
స్పిరులినా పోషకాల పుట్ట లాంటిది. మహిళకు ప్రతి దశలోనూ అవసరమైన సూక్ష్మపోషకాలను ఇది అందిస్తుంది. ప్రపంచం లోనే పోషకాలు సమృద్ధిగా గల ఆహారవనరుల్లో ఇది కూడా ఒకటిగా గుర్తింపు పొందింది.
ప్రొటీన్లలో సంపన్నం
ఐరన్‌కు చక్కటి వనరు
సూక్ష్మపోషకాలతో శక్తివంతం
స్పిరులినాలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్ లోపంతో వచ్చే అనీమియా (రక్తహీనత)తో బాధపడేవారికి రోజుకు 1-2 గ్రాముల స్పిరులినా ఎంతగానో తోడ్పడుతుంది. శాకా హారులకు, ఆహారం నుంచి ఐరన్ పొందడం కష్టమవుతుంది. పాలకూర లాంటి వాటిల్లో ఐరన్ ఎక్కువగా ఉన్న ప్పటికీ, స్పిరులినా ద్వారానే దాని కంటే ఎక్కువగా ఐరన్ శరీరానికి అందుతుంది. ఇందుకు కారణం పాలకూరలో ఐరన్ శరీరానికి అందకుండా నిరోధించే ఆక్సలేట్ లాంటివి ఉంటాయి.
స్పిరులినాలో బెటా కరొటెన్ (ప్రో విటమిన్ ఎ) పుష్కలంగా ఉంటుంది. ఒక గ్రాము స్పిరులినా 2ఎంజీల బెటా కరొటెన్‌ను అందిస్తుంది. ఒక వ్యక్తి రోజువారీ అవసరాలకు సరిపడా బెటా కరొటెన్‌ను ఇది అందించ గలుగుతుంది. సాధారణవిధానాల్లో దీన్ని పొందడం కష్టమవుతుంది.
స్పిరులినాతో ఎన్నెన్నో ప్రయోజనాలు
స్పిరులినాతో పలు ప్రయోజనాలున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది.
రోగ నిరోధకత, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.
కెమోథెరపీ, రేడియేషన్ థెరపీ చేయిం చుకున్న వారిలో తెల్లరక్తకణాలపై గుణాత్మక ప్రభావాన్ని కనబరుస్తుంది.
కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో తోడ్పడుతుంది.
ఐరన్ లోపంతో ఏర్పడే రక్తహీనతను ఎదుర్కొంటుంది.
నరాల సంబంధిత నష్టాన్ని నివారిస్తుంది.
కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఆరోగ్యదాయక గర్భధారణకు అండగా...
గర్భం దాల్చిన 7వ నెల నుంచి ప్రసవం అయ్యేదాకా స్పిరులినా తీసుకుంటే, విటమిన్ ఎ స్థాయి పెరగడంతో పాటు ఆరోగ్యదా యక శిశు జననానికి తోడ్ప డుతుంది. గర్భధారణ అనంతరం మూడో త్రైమాసికం నుంచి స్పిరులినా తీసుకుంటే తల్లిపాలు కూడా చక్కగా పడుతాయి.ప్రత్యేకించి గర్భధారణ కాలంలో బీఎంఐ ని మెరుగ్గా నిర్వహిం చుకునేందుకు తోడ్పడుతుంది. స్పిరులినా పోషకాలు, యాంటీఆక్సిడెంట్స్, ఫైటోపిగ్మెంట్స్‌ను సమృద్ధిగా కలిగి ఉన్నందున సౌందర్యసాధనాల రంగంలో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. స్పిరులినాను ఫేస్ ప్యాక్‌గా లేదా హెయిర్ కండీషనర్‌గా ఉపయోగించి నప్పుడు చర్మానికి, వెంట్రుకలను పోషకాలను అందించి వాటిని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.
స్పిరులినా సహజ అనుబంధ ఆహారం. ఔషధం కాదు. దీనికి అలవాటు పడడం అంటూ ఉండదు. దీన్ని రోజుకు సుమారు గా 2 గ్రాముల వరకు తీసుకోవచ్చు. స్పిరులినాతో గరిష్ఠస్థాయిలో ప్రయో జనాలు పొందేందుకు దీన్ని కనీసం 6 -8 వారా ల పాటు ఉపయోగించాల్సి ఉంటుంది. నిర్దిష్ట కాలం పాటు దీన్ని వాడాలనే పరిమితులంటూ ఏవీ లేవు. కోరుకున్నంత కాలం కూడా దీన్ని వాడవచ్చు. స్పిరులినా మార్కెట్లో కాప్సుల్ లేదా మాత్రల రూపంలో లభ్య మవుతుంది. నాణ్యమైన ఉత్పాదనను ఎంచుకోవడం ముఖ్యం. ప్యారీ స్పిరులినా లాంటి బ్రాండు అనేకం అందుబాటులో ఉన్నాయి.
స్పిరులినా మహిళల ఆరోగ్యానికి ఆవశ్యకమైన అనుబంధ ఆహారం-భారతీయ మహిళ ఆరోగ్యం, సంక్షేమం నేటికీ ఆందోళన కలిగించేవిగానే ఉన్నాయి. భారతీయ మహిళల్లో 36 % మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. మరో 55% మంది రక్తహీనతతో బాధ పడుతున్నారు. ప్రస్తుత, భవిష్యత్తు తరాలకు మధ్య వారధిగా ఉంటున్న నేపథ్యంలో మహిళ పోష కాహారం ఎంతో కీలక ప్రాధాన్యం సంతరిం చుకుంది. ఆమె పోష కాహార స్థాయిలో ఏ చిన్నపాటి లోపం ఉన్నా కూడా అది తీవ్ర పరిణా మాలకు దారి తీస్తుంది.
-పోషకాహార లోపంతో బాధపడే బాలికలు పోషకాహార లోపం ఉన్న తల్లులుగా మారి పోషకాహార లోపంతో ఉండే పిల్లలకు జన్మనిస్తారు. చివరకు ఇదొక విషవల యంగా మారుతుంది. తగినంత పోషకాహారం లభించకపోతే అది ఆ రోజుకు వారికి కావాల్సిన శక్తిని వారు పొందలేకపోతారు. అంతేగాకుండా రక్తహీనత (ఎనీమియా), రోగనిరోధకత తక్కువ గా ఉండడం, ఎముకల్లో ఖనిజ లోపాలకు, చిన్న వయస్సు లోనే వయస్సు పైబడినట్లుగా మారి పోవడం లాంటివాటికి గురి అవుతారు. ఎంతో మంది మహిళలు తమ ఆహారాన్ని పిండిపదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు వంటి స్థూల పోషకాల తోనే సరిపుచ్చుకుంటారు. సూక్ష్మ పోషకాల అవసరాన్ని వారు గుర్తించరు. వాటిపై అవగాహన ఉండదు. నిజానికి ఆరోగ్యానికి కీలకమైన వాటిలో సూక్ష్మ పోషకాలు కూడా ఎంతో ముఖ్యం.
శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు అవసరమైన విటమిన్లు, మినరల్స్, పలు యాంటీఆక్సిడెంట్స్ ఈ సూక్ష్మపోషకాల కిందకు వస్తాయి. సూక్ష్మపోషకాల లోపం మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కనబరుస్తుంది. ఈ సమస్యను గనుక పట్టించుకోకుంటే, అది జాతి సామాజిక ఆర్థికాభి వృద్ధిపై ఎంతో ప్రభావం కనబరుస్తుంది. ఇవే గాకుండా, విటమిన్ ఎ, ఐర న్, అయోడిన్, ఫోలేట్ లాంటివి చిన్నారుల జీవన అవకాశాల ను, మహిళల ఆరోగ్యాన్ని, విద్యా పరమైన విజయాలను, సంతాన సామర్థ్యాన్ని, రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తాయి.
అందుకు మహిళ జీవితంలో ప్రతి దశలోనూ పోషకా లపై తగు శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యం. యుక్త వయస్సుకు రావడం అనేది ఆమెలో ఐరన్ లోపాన్ని పెంచుతుంది. గర్భం, పాలు ఇవ్వాల్సి రావడం ఆమెకు కావాల్సిన కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అవసరాలను మరింత పెంచుతాయి. అవి తీరాలంటే సంపూర్ణ సమతుల్యాహారం తీసుకోవాల్సి ఉంటుంది. స్పిరులినా అనేది పోషకాహార సప్లిమెంట్‌కు అత్యుత్తమ ఎంపిక మాత్రమే గాకుండా మహిళల పోషకాల అవసరాలను అత్యుత్తమంగా తీర్చే మార్గం.
- courtesy with : డాక్టర్ ఆర్.ఎజ్‌హిల్ అరాసన్
- ============================
- Visit my Website - Dr.Seshagirirao...