Pages

Labels

Blog Archive

Popular Posts

Sunday, 11 December 2011

Apricot , అప్రికాట్



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

ఆప్రికాట్ ఒక డ్రై ఫ్రూట్ , ఇతర డ్రైఫ్రూట్స్ తో పోలిస్తే దీనిలో క్యాలరీస్ తక్కువ . దీని శాస్త్రీయ నామము -Prunus armeniaca . ఇది సుమారు 8-10 మీ. ఎత్తు పెరిగే చెట్టు ,దీని మొదులు 40 సె.మీ వ్యాసము కలిగి పువ్వులు పింక్ రంగులోఉండును . పండ్లు 1.5 -2.5 సెం.మీ. ఉంది పసుపు లేదా ఆరెంజ్ రంగులో ఉండి ఒకే గింజ కలిగి ఉండును . మొదట ఇది ఆర్మేనియా దేశములో కనుగొనబడి క్రమేపీ ఇతర దేశాలకు వ్యాపించినది .

పచ్చి అప్రికాట్ పండులో పోషక పదార్ధములు 100 గ్రాములో:
  • శక్తి : 201 కేలరీస్ ,
  • కార్బోహైడ్రేట్లు : 11 గ్రా.
  • సుగర్స్ : 9 గ్రా .
  • ఫైబర్ : 2 గ్రా.
  • ఫాట్ : 0.4 గ్రా .
  • పోటీన్‌ : 1.4 గ్రా .
  • విటమిన్‌ ' ఎ ' : 12% ,
  • బీటాకెరటీన్‌ : 10% ,
  • విటమిన్‌ ' సి " : 12% ,
  • ఐరన్‌ : 3% ,
Apricots, dried Nutritional value per 100 g (3.5 oz)

  • Energy-------- 1,009 kJ (241 kcal)
  • Carbohydrates- 63 g
  • - Sugars------ 53 g
  • - Dietary fibre- 7 g
  • Fat------------ 0.5 g
  • Protein-------- 3.4 g
  • Vitamin A equiv-. 180 μg (23%)
  • - beta-carotene- 2163 μg (20%)
  • Vitamin C------- 1 mg (1%)
  • Iron------------ 2.7 mg (21%)

వైద్యములో దీని ఉపయోగాలు :

  • ఈ ఫలము మధుమేహ రోగులకు మేలుచేస్తుంది .
  • తీపిపదార్ధాలు తినాలనే కోఇకను తగ్గిస్తుంది .
  • దీనిలోని రసాయనాలు శరీరములో ఉన్నటువంటి చెక్కెరలను నియంత్రిస్తాయి .
  • అప్రికాట్ లోని బీటా కెరోటిన్‌ కంటికి , రోమాలకు, చర్మానికి , మేలుచేస్తుంది . ఒకటి , రెండు అప్రికాట్లను తింటే శరీరానికి కావాలసిన దినవారి విటమిన్‌ 'ఎ' సగము లభైస్తుంది .
  • గుండెసంబంధిత వ్యాధులను నిరోధిసంచే గుణము దీనిలో ఉంది.
  • మలబద్దకాన్ని ఆపుతుంది.
  • క్యాన్‌సర్ చికిత్స లో దీనిని వాడుదురు .
  • రక్తలేమితో బాధపడేవారికి ఇది మేలుచేస్తుంది.
  • కొవ్వులు లేని తక్కువస్థాయి పిండిపదార్ద్ధాలుకలిగీం ఈ ఫలము ఆరోగ్యానికి మంచిది .

  • ============================
Visit my Website - Dr.Seshagirirao...