Pages

Labels

Blog Archive

Popular Posts

Saturday, 10 December 2011

పప్పులతో గ్యాస్‌, Gas production with dals



  • పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


బఠానీలు, అలసందలు, రాజ్మా, శెనగలు, కందుల వంటి వివిధ చిక్కుడు జాతి, పప్పు ధాన్యాలు తినటానికి చాలామంది వెనకాడుతుంటారు. వీటితో కడుపుబ్బరం, గ్యాస్‌ వంటి ఇబ్బందులుంటాయని భయపడుతుంటారు. కానీ వీటన్నింటితో గ్యాస్‌ సమస్యలుండవని పరిశోధకులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ చిక్కుడుజాతి గింజలు, పప్పులపై ప్రజలు లేనిపోని అపోహలు పెంచుకోవటం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు కూడా.పప్పులతో గ్యాస్‌...అంతంతే


  • చిక్కుళ్లు, పప్పుల మూలంగా కడుపుబ్బటం, గ్యాస్‌ సమస్యల గురించి తాజాగా అమెరికాలో మూడు అధ్యయనాలు జరిగాయి. వీటిలో గుర్తించిన విషయం ఏమంటే- ఈ చిక్కుడు జాతి పప్పులు తీసుకున్న వారిలో 3-11% మంది మాత్రమే కడుపుబ్బరంతో బాధపడ్డారు. పైగా వీటిని తిన్న అందరిలోనూ ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌తో పాటు మొత్తం కొలెస్ట్రాల్‌లోనూ తగ్గుదల కనిపించటం విశేషం. ఈ రకంగా వీటితో గుండె జబ్బుల ముప్పు కూడా కొంత తగ్గుముఖం పడుతోంది. కాబట్టి చిక్కుడుజాతి గింజలు, పప్పులు తింటే తొలిదశలో కొందరికి కొంత గ్యాస్‌ సమస్య ఎదురైనా.. నెమ్మదిగా అదే సర్దుకుంటుందనే విషయాన్ని అందరూ గుర్తించాలని, గ్యాస్‌ సమస్యలను అతిగా వూహించుకోవద్దని ఈ అధ్యయన కర్తలు సూచిస్తున్నారు. నిజానికి ప్రోటీన్లు, పీచు, విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉండే పప్పులను వారంలో నాలుగైదు మార్త్లెనా తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.


ఇంతకీ చిక్కుడు జాతి గింజలు ఎందుకు కడుపుబ్బరం కలిగిస్తాయి? వీటిల్లో పీచు, ఆర్లిగోసాక్రైడ్లు దండిగా ఉంటాయి. ఈ పిండి పదార్థాలు జీర్ణం కావటానికి పేగుల్లోని ఎంజైమ్‌లు సరిపోవు. పేగుల్లోని బ్యాక్టీరియా ఇవి పులిసిపోయేలా చేసి, జీర్ణం చేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా కొంత గ్యాస్‌ ఉత్పత్తి అవుతుంది!


  • ఆహారం తీసుకోవడం లోనూ, ఆహార పదార్థాలను ఎన్నుకోవడంలోనూ సరైన అవగాహన వుంటే శారీరక సౌందర్యం, ఆరోగ్యం బాగుంటాయి. స్థూలకాయం ఏర్పడకుండా, పొట్ట ఎత్తుగా పెరగ కుండా, శరీరంలో కొవ్వు పేరుకోకుండా, తగిన ఆహారాన్ని తీసుకుంటూ, ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించాలి. జీర్ణక్రియ సవ్యంగా జరగటానికి మేలైన ఆహార పదార్థాలను తీసుకోవటమే కాకుండా ప్రతి రోజూ కొంత సమయం వ్యాయామం కూడా చేయాలి. ఎక్కువగా ఉపవాసాలు చేయకూడదు. వారానికి ఒక్క రోజు ఘన పదార్థాలను మానేసి, ద్రవ పదార్థాలను తీసుకోవచ్చు. వారానికి ఒక పూట ఉపవాసం చేయవచ్చు.

ఉదరభాగంలో కొవ్వు చేరకుండా జాగ్రత్తపడాలి. తక్కువ కేలరీలు లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మలబద్దకం ఏర్పడకుండా చూసుకోవాలి. ఆహార పదార్థాల్లో వెల్లుల్లి, అల్లం, పిప్పరమెంటు లాంటివి వాడటం వల్ల ఉదరంలో గ్యాస్‌ ఏర్పడకుండా చేస్తుంది. కడుపు ఉబ్బరం ఏర్పడకుండా నివారిస్తుంది. ఆహారంలో తప్పనిసరిగా పీచు పదార్థాలు, ఆకుకూరలు వుండేలా చూసుకోవాలి. క్యాబేజీ, పచ్చి ఉల్లి పాయలు, బీన్స్‌, పచ్చి బఠాణీలు లాంటివి గ్యాస్‌ ఏర్పడేందుకు కారణమవుతాయి. అందువల్ల, వాటి వాడకాన్ని తగ్గించాలి. కాఫీ, టీ లాంటి పానీయాలను ఎక్కువ సార్లు తీసుకో కూడదు. అందువల్ల ఉదరంలో గ్యాస్‌ ఏర్పడటమేకాక ఆకలిని తగ్గిస్తుంది. శీతలపానీయాలు కూడా ఆరోగ్యానికి మంచిదికాదు.

  • ఆహార నియమాలను పాటించడం, సరైన ఆహార పదార్థాలను తీసుకోవడం, శారీరక శ్రమ చేయడం వల్ల అజీర్ణ సమస్య ఏర్పడదని తెలుసుకోవాలి. కొన్ని రకాల పప్పులు కూడా అజీర్ణ వ్యాధికి, గ్యాస్‌ ఉత్పత్తికి కారణమవుతాయి. వాటిని తక్కువగా తీసుకోవడమే మంచిది. సెనగపప్పు, సెనగ పిండి, వేరుశెనగ పప్పు లాంటివి ఆహార పదార్థాల్లో తగ్గించడం వల్ల అజీర్ణం అనే సమస్య ఏర్పడదు, గ్యాస్‌ ఉత్పత్తి అవదు .
  • ===============================
Visit my Website - Dr.Seshagirirao...