- image : courtesy with Eenadu news paper
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
పండ్లల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు దండిగా ఉంటాయి. శక్తినివ్వటంతో పాటు వీటితో పీచు కూడా లభిస్తుంది. కాబట్టి రోజూ పండ్లు తినటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే జామపండు తింటే జలుబు చేస్తుందని, అరటిపండు తింటే దగ్గు ఎక్కువవుతుందని.. ఇలా ఎంతోమంది రకరకాలుగా అపోహ పడుతుంటారు. వీటిల్లోని నిజానిజాలేంటో ఓసారి చూద్దాం.
- రోజూ ఒక ఆపిల్ తినే అలవాటు--డాక్టర్‌కు దూరంగా ఉంచుతుంది.
ఒక్క ఆపిల్ మాత్రమే కాదు. అన్ని పండ్లల్లోనూ విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, పీచు వంటివి ఉంటాయి. ఎలాంటి పండు తిన్నా డాక్టర్‌కి దూరంగా ఉండొచ్చు. అయితే రోజూ తినాలన్నదే ప్రధానమని గుర్తుంచుకోవాలి.
- జలుబు చేసినప్పుడు జామపండు తింటే--అది మరింత తీవ్రమవుతుంది.
జామపండులో విటమిన్ సి, ఖనిజాలు దండిగా ఉంటాయి. రోగ నిరోధకశక్తిని పెంపొందించే ఇతర పోషకాలూ నిండి ఉంటాయి. అందువల్ల జలుబు, దగ్గుతో పోరాడటంలో జామపండ్లు మనకు తోడ్పడతాయి.
- బాగా మగ్గిన పండ్లు హాని చేస్తాయి.
రంగు, ఆకారం మారనంతవరకు నిరభ్యంతరంగా అన్ని పండ్లను తినొచ్చు. చెడిపోయినవి తింటే మాత్రం ఇబ్బందులు కలగొచ్చు. అంతేగానీ బాగా మగ్గిన పండ్లను తింటే ఎలాంటి హానీ కలగదు.
- మధుమేహులు పండ్లు తినరాదు.
మధుమేహులు పూర్తిగా పండ్లకు దూరంగా ఉండాల్సిన పనిలేదు. వాళ్లు కూడా రోజూ మితంగా తినొచ్చు. అయితే చక్కెరల శాతం ఎక్కువగా ఉండే అరటి, మామిడి, సీతాఫలం, పనసపండు వంటి వాటికి దూరంగా ఉండాలి.
- పండ్లు తింటే దంతక్షయానికి దారితీస్తుంది.
యాపిల్, నారింజ వంటివి దంతాలు శుభ్రంగా ఉండేందుకు తోడ్పడతాయి. అయితే పండ్లు తిన్నాక నోటిని సరిగా శుభ్రం చేసుకోవటం మరవరాదు. లేకపోతే దంతక్షయం ఏర్పడొచ్చు.
పండ్లల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి-వీలైనని ఎక్కువగా తినాలి.
మామూలు చక్కెరలతో పాటు పండ్లల్లో కేలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కొన్ని పండ్లలో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ వాటిని మితంగానే తినాలి. చక్కెర మితిమీరితే కేలరీల మోతాదూ మించిపోవటానికి దారితీస్తుంది. ఇది బరువు పెరగటానికి దోహదం చేస్తుంది.
- పండ్లను పడుకునే ముందు తింటేనే మంచిదా?.
ఉదయం, సాయంత్రం వేళల్లో మన శరీరానికి గ్లూకోజు, శక్తి అవసరాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో పండ్లను తినటం మంచిది. పడుకునే ముందు తింటే అప్పటికే భోజనం చేసి ఉంటాం కాబట్టి శరీరంలో మరకొన్ని కేలరీలు పోగవుతాయి. ఇది బరువు పెరగటానికి దారితీస్తుంది.
- ============================
Visit my Website -
Dr.Seshagirirao...