Pages

Labels

Blog Archive

Popular Posts

Tuesday, 3 January 2012

గులాబీ-ఔషధాలు , Rose and medical use



  • image : courtesy with Andhraprabha news paper.

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

  • గులాబీ(Rose) :
పుష్పాల్లో రాజసాన్ని ఒలికించే పుష్పంగా గులాబీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఔషధ గుణాలనే కాదు... తన సొగసులతో ఇటు భక్తినీ, ప్రేమసాగరాలనీ దాటించ గల సత్తా గులాబీ సొంతం అంటే ఆశ్చర్యం కలగక మానదు.

  • చరిత్ర
అందానికీ మరియు ప్రతీకాత్మకమైన చరిత్రకు గులాబీ గుర్తించ బడుతుంది.పురాతన గ్రీకులు మరియు రోమన్లు గులాబీలను వారి ప్రేమ దేవతలైన ఆఫ్రొడైట్ మరియు వీనస్ ల గుర్తుగా భావించే వారు. రోమ్ లో రహస్య లేదా వ్యక్తిగత చర్చలు జరిగే గదుల ద్వారాల వద్ద నాటు గులాబీలను ఉంచేవారు.సబ్ రోసా , లేదా "అండర్ ది రోజ్", అనే మాటలకు రహస్యంగా ఉంచడం అనే అర్ధం రోమన్ల ఈ అభ్యాసం వలన ఏర్పడిందే. ప్రారంభ క్రిస్టియన్లు గులాబీ ఐదు రేకలను క్రీస్తు యొక్క ఐదు గాయాలుగా గుర్తించే వారు. ఈ విధమైన వ్యాఖ్యానానికి తోడు వారి నాయకులు, రోమన్లతో మరియు విగ్రహారాధనతో దానికున్న సంబంధాల వలన దానిని ఉపయోగించ డానికి అనుమానించారు.క్రైస్తవ అమర వీరుల రక్తానికి చిహ్నంగా ఎర్ర గులాబీని గుర్తిస్తారు.కన్య మేరీకి గుర్తుగా కూడా తరువాత గులాబీలు స్వీకరించ బడ్డాయి. చైనాలో నిరంతరం వికసించే గులాబీల ప్రవేశానంతరం 1800 లో గులాబీ సంస్కృతి యూరోప్ లో ప్రవేశించింది. పువ్వు ఆకారం, పరిమాణం, వాసన మరియు ముళ్ళు లేకుండా ఉండటం అనే లక్షణాల కొరకు అనేక వేల రకాల గులాబీలు ప్రస్తుతం అభివృద్ధి చేయబడ్డాయి.

వృక్ష శాస్త్రవేత్తలు 'రోజ్‌ కె' అనే శాస్త్రీయనా మంతో పిలిచే ఈ పుష్పం ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలకి పలురం గుల్లో పూస్తూ అనేక పేర్లతో పిలవబడు తోంది. తెలుగులో గులాబీ అనీ, ఇంగ్లీష్‌లో రోజ్‌ అనీ, హిందీ-మరాఠీ-గుజరాతీల్లో గులాబ్‌ అనీ, బెంగాలీలో -గొలాప్‌ అనీ, తమిళంలో -గొలిపð అని, కన్నడంలో గులాపి అని లాటిన్‌లో- రోజా సెంటిఫో లియా అని, అరబికలో- బర్డ్‌ ఇ అహ్మర్‌ అని, పర్షియన్లు - గుల్‌ ఇ సుర్జ్‌ అని ముఖ్యంగా పిలుస్తారు. 100 కు పైగా జాతులు కలిగి అనేక రంగులలో లభించే గులాబి , రోసాసీ కుటుంబానికి చెందినది, అన్ని కాలాలలో లభించే ఈ పూపొద లేదా తీగ రోసా జాతికి చెందినది.కాండంపై పదునైన ముళ్ళను కలిగి ఉండే ఈ జాతి తిన్నని పొదలు

ఈ గులాబీలు ఎక్కువగా పింక, పసుపు, ఎరుపు, తెలుపు, రంగుల్లో మరిమళ భరి తంగా అందరికీ అందుబాటులో ఉం టాయి. ప్రస్తుతం వీటిని మరిన్ని హంగులు తీర్చిదిద్దే ప్రయత్నంలో హైబ్రీడ్‌ గులాబీల ప్రయోగాలు నిరంతరంగా జరుగుతు న్నాయి. అయితే ఈ హైబ్రీడ్‌ గులాబీలు కంటికి ఇంపుగా అత్యంత మనోహరంగా కనిపించినా గుభాళింపు అంతంతమాత్రం గానే ఉంటాయి. కాండాలకి ఉండే చిన్న రెమ్మల్లో వంపు తిరిగిన రంపపు పళ్ళ ఆకా రంలో ముళ్ళు ఉంటాయి. అందుకే ఎగ బ్రాకే కీటకాల నుంచి ఇవి రక్షణ పొందు తుంటాయి. ఈ రోజుల్లో గులాబీల తోటల పెంపకం ముమ్మరంగా జరుగు తోంది. ఇది అన్ని రకాల నేలలకి అనువుగా ఎదిగే గుణం ఉండటం మూలంగా మంచి లాభసాటిగా వ్యవ సాయంగా తోటల పెంపకందారు లకి ఎంతో ఆదాయాన్ని తెచ్చిపెడు తోంది. గులాబీలతో తయారయ్యే అనేక ఉత్పత్తులకి వీటి సరఫరా ద్వారా మంచి గిరాకీ ఏర్పడి తోటల పెంప కందారులకి ఎంతో ఊరట కలిగిస్తోంది.

  • గులాబీలో ఔషధగుణాలు
  • గులాబీ పువ్వుల నుండి ఆవిరి ద్వారా తీయబడిన నూనె, గులాబీ అత్తరుని పరిమళ ద్రవ్యాలలో కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. గులాబీ నూనె నుండి తయారయ్యే రోజ్ వాటర్ను ఆసియా మరియు మధ్య ప్రాక్ దేశాల వంటలలో విరివిగా వాడుతున్నారు.గులాబీ రేకుల సారం నుండి తీసిన గులాబీ సిరప్కి ఫ్రాన్స్ ప్రసిద్ధి చెందింది. యునైటెడ్ స్టేట్స్ లో ఫ్రెంచ్ గులాబీ సిరప్ ని గులాబీ స్కోన్ తయారీకి వాడతారు.
  • గులాబీ పండ్లు వాటిలోసి విటమిన్ కొరకు జామ్, జెల్లీ, మరియు మర్మలాడ్, మరియు టీ తయారు చేయడంలో వాడబడుతున్నాయి. వాటిని దంచి వడగట్టి గులాబీ పండ్ల రసాన్ని తయారు చేస్తారు.గులాబీ పండ్ల నుండి తయారయ్యే గులాబీ పండు గింజ నూనెను, చర్మ మరియు సౌందర్య సంబంధ ఉత్పత్తులలో వాడతారు.
  • గులాబీ పువ్వులు అనేక రుగ్మతల్ని నయం చేసే గుణాలు కలిగి వున్నాయి. ముఖ్యంగా ఇందులో మారిక యాసిడ్‌, టానిక యాసి డ్‌లు పుష్కలంగా ఉండటం చేత వీటి నుండి లభ్యమయ్యే తైలాలు ఆయుర్వేద పరంగా కొన్ని రుగ్మతలకి మంచి ఉపశమనాన్నిస్తు న్నాయని ఆయు ర్వేద వైద్యనిపుణులు వక్కాణిస్తున్నారు.
  • గులాబీ రెక్కల నుండి తీసిన రసంతో గులా బ్‌-జల్‌ని తయారుచేస్తారు. ఇది కంటి జ బ్బులకి దివ్యౌషధంగా వినియోగిస్తున్నారు.
  • ప్రతిరోజు భోజనానంతరం చాలామందికి ఒక్కపొడి వేసుకునే అలవాటు ఉంటుంది. అంతకన్నా గులాబీ రేకుల్ని నమిలితే జీర్ణప్రక్రియ సులభంగా అవుతుంది.
  • చీముపట్టి బాధపెట్టే పుళ్ళ మీద గులాబీ పొడి చల్లితే యాంటీబయాటికలా పనిచేయ డమే కాకుండా తొందరగా వాటిని నివారిస్తుంది.
  • గులాబీలతో తయారుచేసే గుల్కండ్‌ జలు బుని తక్షణం నివారిస్తుంది. అదీకాక కోల్డ్‌ టానికలాే కూడా ఉపయోగపడు తుంది.
  • వేసవి తాపం తీర్చుకునేందుకు కేవలం 10 గ్రాముల లోపు ద్రవాన్ని ఒక్కసారి మాత్రమే తీసుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది.
  • గర్భిణులు దీనిని రెండువెూ తాదులుగా తీసుకుంటే వారిలోని ఉష్ణం తగ్గుముఖం పడుతుంది.
  • రోజూ రెండు గ్రాముల గులాబీ రసం తీసు కుంటే పిత్తాశయ వికారాలు తగ్గి ఆరోగ్యం యథాస్థాయికి చేరుతుంది.
  • గులాబీ రేకులు, బాదంపపðపాలు కలిపి రోజూ ఉదయాన్నే తీసుకుంటే రక్తపోటు తగ్గిపోతుంది.
  • శరీర దుర్గంధంతో బాధపడేవారు గులాబీ రేకుల రసాన్ని కొన్ని రోజులపాటు శరీరా నికి మర్ధనా చేస్తే చమటని తగ్గించి దుర్గంధాన్ని నివారిస్తుంది.
  • గులాబీ రేకుల్ని కొబ్బరి నూనెతో కలిపి వేడిచేసి చల్లారిన తర్వాత తిలకంగా పెట్టు కుంటే మెదడు చల్లబడట మేకాక జ్ఞాప కశక్తి పెరుగు తుంది.
  • గులాబీలని హృద్రో గులు ఉన్న ప్రదేశంలో ఉంచితే వాటినుంచి వచ్చే పరిమళం రోగాన్ని ఉపశ మింప చేస్తుంది.

  • ఆధ్యాత్మిక రంగంలో
ప్రతి మంగళవారం 11 గులాబీలు ఆంజనేయ స్వామి చెంత ఉంచితే కోరిన కోరికలు నెర వేరతాయని, సమస్యలు తొలగిపోతాయని ప్రతీతి.
నిండు పున్నమినాడు బేలా పుష్పాలతో పాటు గులాబీలను కూడా చేర్చి సరస్సులో గానీ, చెఱువులో గాని వేసి ఇష్టదైవాన్ని ప్రార్ధించుకుంటే తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయని దైవజ్ఞులు చెప్తారు.

  • ఇక సౌందర్య సాధనాల్లో
గులాబీల హం గామా అంతా ఇంతా కాదు. అన్ని రకాల సౌందర్యపోషక ఉత్పత్తుల్లో గులాబీలు లేని ఉత్పత్తి లేదంటే అతిశయోక్తి అంతకన్నా కాదు. సెంట్ల తయారీలో కూడా గులాబీ అగ్రగామి అన్న విషయం అందరికీ విధి తమే. వాడిపోయినా, వాడిగా ఉన్నా గులాబీ తన రాజసాన్ని మాత్రం కోల్పోదు. దాని గుణాలు ఎన్నటికీ వాడిపోవు.
  • ===============================
Visit my Website - Dr.Seshagirirao...MBBS