పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం
మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
Ginger Tea,అల్లం టీ---కావలిసినపదార్ధాలు :
- పాలు : రెండు గ్లాసులు
- పంచదార : రెండు స్పూన్ లు
- టీపొడి : ఒక స్పూన్
- యాలుక్కాయ : ఒకటి
- అల్లం ముక్క : అంగుళం ముక్క
- నీళ్ళు : ఒక గ్లాసు
తయారు చేయు విధానం :
స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి దానిలో పాలు, నీళ్ళు, పంచదార, టీపొడి వేసి మరగ బెట్టాలి. మరుగుతుండగా అల్లం చిదగకొట్టి వెయ్యాలి, అలాగే యాలుక్కాయ కూడా చిదిపి వెయ్యాలి. ఇప్పుడు బాగా మరిగించి స్టవ్ ఆపి, కప్పులోకి వడకట్టి తాగాలి, అంతే అల్లంటీ రెడి.
ఉపయోగాలు :
- అల్లం టీ ఉదయం తాగితే రోజంతా హుషారుగా ఉంచుతుంది.
- అల్లం టీ ని సేవించడం ద్వారా గర్భణీలకు ఎంతో మేలు చేకూరుతుందట. వేవిళ్లకు చెక్ పెట్టడంలో అల్లం టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది.
- ఇంకా తెల్లవారున సాధారణ టీలో అల్లం బిస్కెట్లు తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
- ఛాతిలో మంట, అజీర్ణం వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే అల్లం ' టీ ' తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
- అలాగే అల్లం టీని సేవించడం ద్వారా మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు దరిచేరవు.
- మోకాళ్ల వాపులు కూడా అల్లం ' టీ ' రోజూ తీసుకుంటే తగ్గిపోతాయి. అలాగే ఏ అనారోగ్యంతో బాధపడేవారు అల్లం టీని సేవిస్తే ఉపశమనం లభిస్తుంది.
- జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం'' టీ '' తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు రోజుకు మూడుసార్లు అల్లంతో తయారైన హెర్బల్ టీని తాగచ్చు. అయితే రోజులో నాలుగు సార్లకు మించి అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. మరీ ముఖ్యంగా కడుపులో అల్సర్ ఉన్న వాళ్లు అసలు తాగకూడదు.అల్లం టీ తాగినప్పుడు ఆహ్లాదంగా అనిపించుకుండా కడుపులో వికారం కాని మరే సైడ్ఎఫెక్ట్ కనిపించినా అల్సర్ వంటి సమస్యలున్నాయేమోనని డాక్టర్‌ని సంప్రదించడం అవసరం.
- ఆస్తమా, దగ్గులకు చెక్ పెట్టాలంటే అల్లం ' టీ ' రోజూ తేనెతో కలిపి తీసుకోవాలి.
- అల్లం టీని సేవించడం ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. యాంటియోక్సిడెంట్స్ కలిగివున్న అల్లం టీని రోజూ ఒక కప్పు తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. మానసిక ఒత్తిడిని మాయం చేసే అల్లం టీ, మానసికోల్లాసాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
- నీరసంగా ఉన్నప్పుడు అల్లం టీ త్రాగాలి. దానివల్ల నూతనోత్సహం వస్తుంది.
- అల్లం ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. చలి ప్రభావం వల్ల తలెత్తే సమస్యలను ఇది అదుపులో ఉంచుతుంది. కొందరికి ప్రయాణాలు పడవు. కడుపులో వికారంగా ఉండటం, వాంతులవడం వంటి సమస్యలు వేధిస్తాయి. అలాంటప్పుడు ముందుగా ఓ కప్పు అల్లం టీ తాగి చూడండి. ఉత్సాహం వచ్చేస్తుంది. వికారంలాంటివి బాధించవు. కాస్త ఎక్కువగా తిన్నప్పుడు భుక్తాయాసం బాధ పెడుతుంది. దాన్నుంచి బయట పడాలంటే.. కప్పు అల్లం టీ తాగితే సరిపోతుంది. తరచూ ఈ టీ తాగడం వల్ల కండరాలూ, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజుకో కప్పు చొప్పున తాగితే... శ్వాసకోశ సంబంధ సమస్యలు అదుపులో ఉంటాయి. రక్త ప్రసరణ నియంత్రణలో ఉంటుంది. అల్లంలో ఉండే ఖనిజ లవణాలు గుండెకు మేలు చేస్తాయి. హృదయ కవాటాల్లో రక్త సరఫరా సక్రమంగా ఉండటానికి దోహదపడతాయి. హృద్రోగాలూ దూరంగా ఉంటాయి. నెలసరి సమస్యలూ అదుపులోకి వస్తాయి. టీ తాగడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికశాతం అందుతాయి. రోగనిరోధక శక్తి పెరిగి, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిలో ఉండే అరోమా గుణాలు మెదడును ఉత్తేజితం చేస్తాయి.
- =======================
Visit my Website - Dr.Seshagirirao...