పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
బెండకాయ ఆరోగ్యకర ఉపయోగాలు :
- బెండకాయలోని మ్యూకస్ వంటి పదార్ధము కడుపులో మంటనుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పీచు , విటమిన్ ' సి ' దీనిలో చాలా ఎక్కువ . మ్యూకస్ పదార్ధము గాస్ట్రిక్ సమస్యలను , ఎసిడిటీ కి చక్కని పరిష్కారము . దీనిలోగల డయూరిటిక్ లక్షణాలవల్ల యూనరీ ట్రాక్ట్ ఇంఫెక్షన్ ను నయము చేయడములో సహకరిస్తుంది. బెండకాయ డికాక్షన్ తాగితే జ్వరము తగ్గుతుంది. చిన్న చిన్న ముక్కలు గా కోసి నీటిలో మరిగించి చల్లారేక తాగితే టెంపరేచర్ తగ్గును . చెక్కెర (డయాబిటీస్ ) నియంత్రణలోనూ సుగుణం చూపుతుంది. బెండకాయ నిలువుగా చీల్చి రెండు సగాల్ని గ్లాసు నీటిలో రాత్రంతా ఉంచి , మరునాటి ఉదయము ముక్కలు తీసివేసి ఆ నీటిని త్రాగాలి. ఇలా రెండు వారాలు పాటు త్రాగితే సుగర్ స్థాయిలు తగ్గుతాయి. దీనిలో ఉండే పెక్టిన్ .. బ్లడ్ కొలెస్టిరాల్ ను తగ్గించును.
అమెరికా ఖండమందలి ఉష్ణ ప్రదేశములు బెండకు (Okra, Lady Finger) జన్మ స్థానము అని ఒక అభిప్రాయం ఉంది. బెండ వార్షిక కూరగాయ పంట. ఉష్ణ సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనిని పండిస్తారు. లేత బెండకాయలను కూరగా వండుతారు. బెండకాయల్లో ఎ, బి, సి విటమిన్లు, పలు పోషక పదార్థాలతోపాటు అయోడిన్ ఎక్కువగా ఉన్నందువల్ల గాయిటర్ వ్యాధి రాకుండా చేస్తుంది. బెండకాయలను కూరగాయగా, సలాడ్‌గా ఎండబెట్టి వరుగులను తయారుచేయడంలో వాడతారు. బెండ Lady's finger - Abelmoschus esculentus, N.O. Malvaceae. అని శాస్త్రీయ నామము.
బెండ మొక్క సామాన్యముగా 1 నుండి రెండు మీటర్లు ఎత్తు పెరుగును. అనుకూల పరిస్తితులలఓ నాలుగు మీటల వరకూ పెరుగును. మొక్క యందలి లేత భాగములందు
బిరుసుగా ఉండు నూగు ఉండును. పై అంచులయందు తాళ పత్ర వైఖరి చీలి సంయుక్తమౌగా ఉండును. అండాశయము ఐదు అరలు కలిగి ఉండును. కీలము కొన ఐదుగా చీలి నిడివిగ ఉండును. కాయము ఐదు గదులు కలిగి ఉండును. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క వరుస గింజలు ఉండును. ఎండిన వెనుక కాయ పై నుండి క్రిందికి క్రమముగా ఐదు (అప్పుడప్పుడూ 10) భాగములుగ పగులు ఉండును. గింజలు చిన్న కందిగింఝలంతేసి యుండును. గ్రామునకు 12 -15 తూగును. నీల వర్ణముతో కూడిన ధూమ్రవర్ణము కలిగి బొడ్డు వద్ద మాత్రము తెల్లగ ఉండును.
బెండకాయలో
- 90 శాతం నీరు,
- 6.4 శాతం పిండి పదార్థాలు,
- 1.9 శాతం మాంసకృత్తులు,
- 0.2 శాతం కొవ్వుపదార్థాలు,
- 1.2 శాతం పీచు,
- 0.7 శాతం ఖనిజలవణాలు ఉండి,
- 33 కిలో కేలరీలు శక్తిని ఇస్తాయి.
- 66 మి.గ్రా. సున్నం,
- 56 మి.గ్రా. భాస్వరం,
- 0.30 మి.గ్రా. ఇనుము ఉన్నాయి.
- 52 మైక్రోగ్రాములు కెరోటిన్ ,
- 0.07 మి.గ్రా. థయమిన్,
- 0.1 మి.గ్రా. రైబోఫ్లేవిన్,
- 0.6 మి.గ్రా. నియసిన్,
- 105 మైక్రో గ్రాములు పోలిక్ ఆమ్లం ,
- 13 మి.గ్రా.లు 'సి' విటమిను ఉన్నాయి.
ఇవేగాక సూక్ష్మధాతువులైన
- మెగ్నీషియం (53 మి.గ్రా.),
- సోడియం (6.9 మి.గ్రా.),
- పొటాషియం (103 మి.గ్రా.),
- రాగి (113 మి.గ్రా.),
- మాంగనీస్ (149 మి.గ్రా.),
- జింక్ (417 మి.గ్రా.) లాంటి సూక్ష్మ పరిమాణంలో ఉంటాయి.
పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
- శక్తి 30 kcal----- 150 kJ
- పిండిపదార్థాలు----- 7.6 g
- - పీచుపదార్థాలు---- 3.2 g
- కొవ్వు పదార్థాలు ----0.1 g
- మాంసకృత్తులు -----2.0 g
- ఫోలేట్----------- (Vit. B9) 87.8 μg 22%
- విటమిన్ సి------- 21 mg 35%
- కాల్షియమ్-------- 75 mg 8%
- మెగ్నీషియమ్----- 57 mg 15%
- Vitamin A---- (660 IU)
రకాలు :
సాధారణ రకాలు = బెండలో హైబ్రిడ్ (సంకర) రకాలకు దీటుగా సాధారణ రకాలు దిగుబడినిస్తాయి. పూసా సవాన, పూసా ముఖమలి, పంజాబ్ పద్మిన ,అర్క అనామిక, అర్క అభయ, కో-1, ఎం.డి.యు-1, గుజరాత్ బెండ-1,హర్భజన్,పర్భని క్రాంతి, పి-7, పి-8.
సంకరజాతి రకాలు = శంఖు రోగాన్ని తట్టుకునే రకాలు- వర,విజయ,విశాల్,నాథ్‌శోభ, ప్రియ, సుప్రియ,మహికో హైబ్రిడ్ నెం. 1, 6, 7, 8.
మిగిలిన రకాలు = ఐశ్వర్య మిస్టిక,ఎస్-008, ఎస్-040, ఎస్-073.
ఎగుమతి రకాలు = ఎగుమతికి కాయలు లేతగా, ఆకుపచ్చగా 6-8 సెం.మీ. పొడవుతో ఉండాలి. పంజాబ్ పద్మిని, వర్ష, విశాల్, నాథ్‌శోభ,
ఉప జాతులు= పెద్ద బెండ - ఇది చాల అచోట్ల సాగునందున్న రకము. మొక్క పెద్దదిగా పెరుగును . కాపు ప్రారంభించుట కొంచెము ఆలస్యము. కాయ పలుకలు తీరి లేబసిమి వర్ణము కలిగి 12 - 18 సెంమీ పొడవుండును. ఏడాకుల బెండ, నున్న బెండ, పొడుగు బెండ, ఎర్ర బెండ,
వంటలు : బెండ పైత్యాన్ని తగ్గిస్తుందని, వాతాన్ని నివారిస్తుందని, వీర్య వృద్ధిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. బెండకాయలో జిగురు ఉండటంవల్ల విరివిగా అన్ని వంటలలో వీటిని వాడటం కుదరకపోయినా ఆంధ్రప్రదేశ్‌లో బెండకాయను చాలా ఎక్కువగా వంటలలో వాడతారు. బెండకాయ వేపుడు, బెండకాయ కుర్మా, బెండకాయ కూరు, బెండకాయ పచ్చడి, బెండకాయ ఒరుగులు, బెండకాయల సాంబారు, బెండకాయ పులుసు, బెండకాయ కూర.
సామెతలు-- బెండకాయలు ముదిరినా బ్రహ్మచారులు ముదిరినా ఎందుకు పనికిరారు అని సామెత. సూచన--ముదిరిన బెండకాయలు చివర్లు వంచితే త్వరగా పుటుక్కున తెగవు, అవి వేలాడబడతాయి, అదే లేత బెండకాయలు అయితే చివర్లు పుటుక్కున విరుగుతాయి.
మూలము : వికీపెడియా వెబ్ సైట్ .
- =========================
Visit my Website - Dr.Seshagirirao...