Pages

Labels

Popular Posts

Friday, 19 April 2013

Nutrients of Hair nourishment,జుట్టుకు పోషణకు పోషకాలు



  •  





  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.







    జుట్టు ఆరోగ్యంగా లేదంటే ఒత్తిడి, వాతావరణం, హార్మోన్లలో మార్పుల గురించే ఆలోచిస్తాం. కానీ ఆహార పరంగా నిర్లక్ష్యం చేస్తే కొన్ని పోషకాలు కూడా అలాంటి సమస్యల్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు జుట్టుకు ఎదురయ్యే సమస్యల్ని గమనించుకుని కొన్నిరకాల పోషకాలు అందేలా చూసుకోవాలి.



* కురులు చిట్లిపోయి, ఎదుగుదల తక్కువగా ఉంటే మాంసకృత్తులు లోపించినట్లేనని అర్థం. ఎందుకంటే జుట్టు కణాలు పరిణతి చెందాక వాటిల్లో కెరొటిన్‌ అనే ప్రొటీన్‌ నిండుతుంది. దీనివల్లే జుట్టు ఎదుగుదల బాగుంటుంది. అందుకే ప్రొటీన్లు ఎక్కువుండే లోఫ్యాట్‌ చీజ్‌, బీన్స్‌, గుడ్లు, పాలు, పెరుగు, సోయాపాలు, నట్స్‌, గింజలు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.



* తల దువ్వుకునేప్పుడు జుట్టు రాలడం సహజం. అయితే ఇది మరీ ఎక్కువగా ఉంటే జింక్‌ లోపం ఉండొచ్చని సందేహించాలి. జింక్‌ జుట్టు ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తుంది. సాధారణంగా ఈ లోపం ఉన్నప్పుడు ముందు జుట్టు పలుచగా మారి తరవాత రాలడం మొదలవుతుంది. నువ్వులూ, గుమ్మడి గింజలూ, పుచ్చకాయ గింజలూ, డార్క్‌ చాక్లెట్‌, పల్లీలు లాంటి వాటిల్లో జింక్‌ పుష్కలంగా లభిస్తుంది.



* తలంతా దురద పుట్టి, పొట్టుగా రాలుతుంది కొన్నిసార్లు. తలలో సహజ నూనెలు తగ్గి పొడిబారినప్పుడే ఇలాంటి సమస్య ఎదురవుతుంది దాన్ని తగ్గించుకోవాలంటే ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ పోషకాలను నట్స్‌, సాల్మన్‌ తరహా చేపలు, అవిసె గింజలు, గుడ్ల నుంచి పొందవచ్చు.



* జుట్టు నల్లగా నిగనిగలాడుతూ కనిపించేందుకు తలలో ఉండే మెలనిన్‌ కారణం. దీని ఉత్పాదకత తగినంత ఉండాలంటే 'బి' విటమిన్ల లోపం ఎదురవకుండా చూసుకోవాలి. ఆకుకూరలూ, తృణధాన్యాలూ, గుడ్లూ, మాంసాహారం ఎక్కువగా తింటే 'బి' విటమిన్లు బాగా అందుతాయి. 'సిలికా' అనే ఖనిజ లవణం జుట్టుకు తేమను అందించి, వెంట్రుకల్ని దృఢంగా ఉంచుతుంది. యాపిల్స్‌, కమలా ఫలాలు, ఎండుద్రాక్ష, ఉల్లిపాయలు, క్యారెట్లు, ఓట్స్‌, శుద్ధిచేయని గింజలు, పప్పులు, నట్స్‌, పీచు ఎక్కువగా ఉండే పదార్థాలన్నీ సిలికాను అందిస్తాయి.




  • Top 5 Food for Healthy hair : 


కురులు అందముగా , ఆరోగ్యముగా ఉండాలంటే మన తలని క్లీన్‌ గా ఉంచుకోవాలి. షాంపో ,కండిషనర్ వాడి ప్రతిరోజూ శుబ్రము చేసుకోవాలి. తలకి సరియైన నూనె రాస్తూఉండాలి  దీనికి తోడు మంచి సమతుల్యమైన ఆహాము తీసుకోవాలి. ఖనిజ లవణాలైన ,,, ఐరన్‌ , కాల్సియం , పొటాషియం , సెలీనియం , మగ్నీషియం తోపాటు ప్రొటీన్‌ ఫుడ్ అవసరము .

1. హోల్ గ్రైయిన్స్ :

2.. విటమిన్‌ 'C ఫుడ్స్ ,

3. బ్రౌన్‌ రైస్ ,

4. పప్పులు ,

5.కాల్సియం రిచ్ ఫుడ్స్ ,









  • =====================


Visit my Website - Dr.Seshagirirao...