Pages

Labels

Popular Posts

Tuesday, 23 April 2013

preparation of body lotion for smooth skin,శరీరం మృదువుగా ఉండడానికి బాడీలోషన్‌


  •  







  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.







శరీరం మృదువుగా ఉండాలంటే మంచి బాడీ లోషన్‌ రాసుకోవాల్సిందే. అలాగని ఎంతో ఖర్చుపెట్టి వాటిని కొనాల్సిన పని లేదు. ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.

* మూడు టేబుల్‌ స్పూన్ల రోజ్‌ వాటర్‌కి, ఒక స్పూను గ్లిజరిన్‌, రెండు టీ స్పూనుల నిమ్మరసం కలపండి. ఆ మిశ్రమాన్ని చిన్న సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. అసరమైనప్పుడు తీసి వాడుకుంటూ ఉంటే, చర్మం పొడి బారకుండా, మృదువుగా ఉంటుంది.



* కప్పు రోజ్‌ వాటర్‌లో టీ స్పూను బొరాక్స్‌ పొడినీ, రెండు టీ స్పూన్ల వేడి చేసిన ఆలివ్‌ ఆయిల్‌ని బాగా కలపండి. మార్కెట్లో లావెండర్‌ వాటర్‌ దొరుకుతుంది. దీనిని పై మిశ్రమంలో కలిపి బాగా గిలక్కొట్టండి. కాసేపయ్యాక వాడుకోవచ్చు.



* సబ్బుని చిన్న చిన్న ముక్కల్లా చెక్కుకొని, మూడు టీ స్పూన్ల నిండా దాన్ని తీసుకోవాలి. దానిని పావు కప్పు నీళ్లలో కలిపి వేడి చేసి, నాలుగు స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌నీ, టీ స్పూను గ్లిజరిన్‌నీ దాన్లో వేసి బాగా కలపాలి. తయారైన మిశ్రమాన్ని ముఖ వర్ఛస్సుకు రాసుకోవచ్చు.



Hints for bright skin,చర్మకాంతికి సూచనలు :

కొందరి చర్మం మృదువుగా ఉన్నా.. మోచేతులు, మోకాళ్ల దగ్గర మాత్రం నల్లగా, బరకగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే కొన్ని నియమాలు పాటించాలి.
* తులసి ఆకులను మెత్తగా చేసి అందులో అరచెంచా పాలమీగడ, చిటికెడు పసుపు కలిపి రాత్రిపూట మోచేతులూ, మోకాళ్లకూ మర్దన చేసుకోవాలి. మర్నాడు చల్లటి నీళ్లతో శుభ్రపరచుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
* సగానికి కోసిన నిమ్మచెక్కలతో మోచేతులకు మర్దన చేసుకోవాలి. ఇలా రెండు మూడు రోజులకోసారి చేస్తుంటే నలుపు క్రమంగా తగ్గిపోతుంది. అలానే తేనెలో పంచదార కలిపి నల్లగా ఉన్న చోట రుద్దుకోవాలి.
* పెరుగులో నాలుగు చుక్కల వెనిగర్‌ కలిపి.. చేతులకు రాసుకోవాలి. తరవాత గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయాలి. పులిసిన పెరుగు కూడా బాగా పని చేస్తుంది.
* గోరువెచ్చటి కొబ్బరి నూనెలో చెంచా నిమ్మరసం కలిపి చేతులకు రాసుకోవాలి. తరవాత వేణ్నీళ్లలో తడిపిన టవల్‌ని చుట్టుకోవాలి. వారానికోసారి ఇలా చేయడం వల్ల సమస్య క్రమంగా తగ్గుతుంది. అలాగే మూడు చెంచాల సెనగపిండిలో కాస్త పెరుగు కలిపి పూతలా వేసుకోవాలి. ఆరాక నీళ్లతో కడిగేసుకోవాలి. అలానే కలబంద గుజ్జు రాసుకున్నా సమస్య దూరమవుతుంది


  • =======================


 Visit my Website - Dr.Seshagirirao...